అమరావతి (చైతన్య రథం): భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్ ఘన నివాళి అర్పించారు. ఈమేరకు ఎక్స్‌లో పోస్టు పెడుతూ.. “పేద, బడుగు బలహీనవర్గాల శ్రేయస్సు, దేశ అభివృద్ధికి జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బీఆర్ అంబేద్కర్. సమాజంలో అంటరానితనం నిర్మూలన, వివక్షపై అలుపెరుగని పోరాటం చేశారు. భారత రాజ్యాంగం ద్వారా అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు కల్పించిన ఘనత ఆయనకే దక్కుతుంది. భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా దేశానికి వారు అందించిన సేవలను స్మరించుకుందాం” అని మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు.
















