- రాజధాని ప్రతిపాదన చూసి నవ్వుకుంటున్నారు
- సొంత పార్టీ వారే ఆయనను వ్యతిరేకిస్తున్నారు
- అమరావతి ఆంధ్రుల ఆత్మగౌరవ చిహ్నం
- సమాచార మంత్రి కొలుసు పార్థసారథి
అమరావతి(చైతన్యరథం): ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం అనుభవించిన చీకటి రోజులను, రాజధాని విషయంలో జగన్‌రెడ్డి చేసిన చారిత్రక తప్పిదాలను ఎండగడుతూ సమాచార మంత్రి కొలుసు పార్థసారథి కౌంటర్ ఇచ్చారు. టీడీపీ కేంద్ర కార్యాల యంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్‌రెడ్డి వైఖరిని, అమరావతి ప్రాముఖ్యతను వివరించారు. “గ్రామాల్లో ఒక సం ప్రదాయం ఉంటుంది.. శుభకార్యాల సమయంలో అమంగళక రమైన పేర్లు పలకకూడదని భావిస్తారు. నేడు రాష్ట్ర ప్రజలకు ‘జగన’ అనే పేరు కూడా అలాంటిదే. రాష్ట్రానికి రాజధాని అనేది ఒక గొప్ప సంబరం లాంటిది. కానీ జగన్ ఆ సంతోష సమయం లో కంటిలో నలుసులా, ‘రాష్ట్రానికి పట్టిన చీడపీడలా తయార య్యారని మండిపడ్డారు. రాజకీయ పక్షాలన్నీ అమరావతికి మద్దతు తెలుపుతుంటే..వైసీపీ మాత్రం పార్లమెంటులో వాకౌట్ చేసి రాష్ట్ర ప్రయోజనాలకు గండి కొట్టిందని ధ్వజమెత్తారు.
అబద్ధాల పునాదుల మీద ‘వికేంద్రీకరణ’ డ్రామా
2019-24 మధ్య జగన్ చెప్పిన ‘అభివృద్ధి వికేంద్రీకరణ’ అనేది ఒక శుద్ధ అబద్ధమని స్పష్టం చేశారు. అసెంబ్లీ సాక్షిగా అమరావతికి మద్దతు ప్రకటించి అధికారంలోకి వచ్చాక సూట్‌కేసు రాజకీయాలు చేస్తూ రాజధాని విషయంలో మూడు ముక్కలాట ఆడారని ఎద్దేవా చేశారు. తన తప్పులను ఒప్పుకునే అలవాటు జగన్‌కు లేదని, ప్రజల అభిప్రాయాలను గౌరవించకుండా తన ఆలోచనలనే కార్యకర్తలపై రుద్దే నియంతలా వ్యవహరించారని మండిపడ్డారు. రాజధాని పేరును ‘మావిగన’గా మార్చాలని చూడ టం ఆయన ‘తుగ్లక’ పాలనకు నిదర్శనమని ధ్వజమెత్తారు.
ప్రజల ఆశల వారథి అమరావతి..ఆదాయ మార్గం
రాష్ట్ర విభజన తర్వాత అన్యాయంగా రోడ్డున పడ్డ ఆంధ్రులకు అమరావతి ఒక ఆత్మగౌరవ ప్రతీక అని మంత్రి పేర్కొన్నారు. ఏ నాయకుడూ చేయలేని సాహసాన్ని చంద్రబాబు చేశారు. కేవలం ఒక పిలుపుతో రైతులు తమ విలువైన భూములను రాజధాని కోసం ఇచ్చారని గుర్తు చేశారు. హైదరాబాద్ నేడు లక్షల కోట్ల ఆదాయాన్ని ఇస్తోంది. అమ రావతి కూడా అదే స్థాయిలో అభివృద్ధి చెందితే ఏటా వచ్చే 4-5 లక్షల కోట్ల ఆదాయంతో రాష్ట్రంలోని అన్ని మూలలను అభివృద్ధి చేయవచ్చని వివరించారు. అమరావతి అనేది ఒక ‘సెల్ఫ్ ఫైనా న్సింగ్ ప్రాజెక్ట’ అని, ఇక్కడ పెట్టే పెట్టుబడి రాష్ట్ర భవిష్యత్తుకు గ్యారెంటీ అని స్పష్టం చేశారు. గత 20 నెలల కూటమి పాలనలో రాష్ట్రం పురోగతి బాట పట్టిందని మంత్రి వివరించారు. వైసీపీ తేలేకపోయిన వేల కోట్ల రూపాయల నిధుల ను కూటమి ప్రభుత్వం కేంద్రం నుంచి సాధించిందని, వాటిని ప్రజల సంక్షేమం కోసం వెచ్చిస్తున్నామని చెప్పారు.
నాలుగు జోన్ల అభివృద్ధి
రాష్ట్రాన్ని నాలుగు జోన్లుగా విభజించి కర్నూలుకు కారిడార్, ప్రకాశం-నెల్లూరు జిల్లాలకు పోర్టులు, రిఫైనరీలను తీసుకు వస్తు న్నాం. ఇక ఐటీ ఇండస్ట్రీకి కేరాఫ్‌గా విశాఖను తీర్చుదిద్దుతున్నాం. డేటా సెంటర్, సాఫ్ట్‌వేర్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. అమరావతిని ప్రపంచ నగరాలతో పోటీ పడేలా నిర్మిస్తున్నామని వివరించారు. పెట్టుబడిదారులు వసతులు, కనెక్టివిటీ ఉన్న చోటకే వస్తారు. జగన్ లాగా ‘చెట్టు కింద కూర్చుని చర్చలు జరపండి’ అంటే ఎవరూ రారని మంత్రి ఎద్దేవా చేశారు. రాజధాని చట్టంపై తన వ్యాఖ్యలను వైసీపీ నేతలు వక్రీకరిస్తున్నారని, అబద్ధాలతో ప్రజలను నమ్మించే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించారు. అప్పులు తెచ్చినా, సంపద సృష్టించి వాటిని తీర్చే సత్తా ఒక్క చంద్ర బాబుకే ఉందని పునరుద్ఘాటించారు. “జగన్ ఇకనైనా అబద్ధాలు ఆపాలి. వైసీపీ కార్యకర్తలు కూడా వాస్తవాలను గ్రహించాలి. అభివృద్ధికి అడ్డుపడే వారిని ప్రజలు ఎన్నటికీ క్షమించరని హితవుపలికారు.
















