- కళాకారుల మనోభావాలు దెబ్బతీసేలా జగన్ భజన బృందం వ్యాఖ్యలు
- ఏపీ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ
మంగళగిరి (చైతన్యరథం): శాసనసభ వేదికగా నిర్వహించిన ‘ఆటవిడుపు’ కార్యక్రమంపై కొందరు వ్యక్తులు చేస్తున్న విమర్శలు అత్యంత దురదృష్టకరమని, కళాకారుల మనోభావాలను దెబ్బతీసేవిగా ఉన్నాయని ఏపీ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ అన్నారు. కళామతల్లిని నమ్ముకుని బతికే బిడ్డలుగా ఆ వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మంగళగిరి లోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో సొమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏ రాష్ట్రంలో కళలు విలసిల్లుతాయో ఆ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని మన పెద్దలు చెప్పారన్నారు. ‘శ్రీకృష్ణదేవరాయలు, భోజరాజు వంటి మహానుభావులు కళలను పోషించి చరిత్రలో నిలిచిపోయారు. మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, అటల్ బిహారీ వాజపేయి, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు వంటి హేమాహేమీలు స్వయంగా కళాకారులు, కవిత్వ ప్రియులు. మరి అటువంటి కళలను ‘పనికిమాలిన చర్య’ అని విమర్శించడం మీ అజ్ఞానానికి నిదర్శనం కాదా? మొహానికి రంగు వేసుకుని నటించడం నేరమా? మాట్లాడటానికి కూడా మేకప్ వేసుకునే మీరు, కళాకారుల వేషధారణను హేళన చేయడం హాస్యాస్పదం.
రంగు వేసుకోవడం అంటే అది కేవలం అలంకారం కాదు, అది ఒక సంస్కృతిని, ఒక భావాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం. కళ ఏ ఒక్కరి సొత్తూ కాదు. రాజ్యాంగంలో ఎక్కడైనా నాయకులు కళా ప్రదర్శన చేయకూడదని ఉందా? ప్రజల కోసం నిరంతరం శ్రమించే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, స్పీకర్ అయ్యన్నపాత్రుడు. వారు తమ ఒత్తిడిని పక్కన పెట్టి ఒక సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొంటే… దానిపై విషం చిమ్మడం మీ సంకుచిత మనస్తత్వాన్ని సూచిస్తోంది. మాట్లాడటానికి ఏ అంశం లేకనే ఇలాంటి సున్నితమైన విషయాలపై బురదజల్లుతున్నారు’ అన్నారు. ‘ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను చూడండి. ఒకటో తారీకున పెన్షన్‌దారుల ఇంటికి వెళ్లి అడగండి.. బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్న మహిళలను అడగండి.. ‘తల్లికి వందనం’ పొందుతున్న విద్యార్థుల తల్లిదండ్రులను అడగండి.. అప్పుడు తెలుస్తుంది ఈ ప్రభుత్వం ఏం చేసిందో.. కళ అనేది దైవదత్తం.. అది భగవంతుడు ఇచ్చిన ప్రసాదం. అది ప్రతి ఒక్కరికీ అబ్బదు. అటువంటి పవిత్రమైన కళను, కళాకారులను అడ్డంపెట్టుకుని రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్న కొందరు వ్యక్తుల తీరును చూస్తుంటే అసహ్యం వేస్తోంది. నిన్నటివరకు ఒక మాట, నేడు మరో మాట మాట్లాడుతూ ఊసరవెల్లిలా రంగులు మార్చే మీరా కళల గురించి మాట్లాడేది? ప్రపంచమే ఒక నాటక రంగం అని షేక్‌స్పియర్ చెప్పారు.
మనందరం పాత్రధారులమే. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ స్థాపించిన పార్టీలో, ప్రజా ప్రతినిధులు కళా ప్రదర్శన చేస్తే తప్పేమిటి? సత్యహరిశ్చంద్ర నాటకం చూసే కదా మహాత్మా గాంధీ ‘అబద్ధం ఆడకూడదు’ అని నిర్ణయించుకున్నారు. గాంధీజీ నాటకం చూడటం కూడా తప్పేనా? కళా ప్రదర్శన చూసి మురిసిపోవటం, నవ్వటం దుర్మార్గమా? నవ్వడానికి శవాలు కావాలా మీకు? మనుషులన్నాక ఎమోషన్స్ ఉండవా? ముఖ్యమంత్రి, మంత్రులు మనసు విప్పి నవ్వితే మీకు ఎందుÅ£ంత కడుపుమంట? కరోనా కష్టకాలంలో కళాకారులు కన్నీళ్లతో అర్థించినా ఆనాడు పట్టించుకోని పాలకుల గురించి మీరు ఎందుకు మాట్లాడలేదు? చంద్రబాబునాయుడు వచ్చాక, గత ప్రభుత్వం పెట్టిన 10కోట్ల రూపాయల బకాయిలను తీర్చి కళాకారుల కడుపు నింపారు. ఆ విషయం మీకు తెలుసా? సాంస్కతిక శాఖలోకి వెళ్లి లెక్కలు చూసుకోండి. లబ్ధిదారులను అడగండి నిజం తెలుస్తుంది.’ అన్నారు.
‘పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్‌కల్యాణ్ పల్లెటూర్లలో వేస్తున్న రోడ్ల గురించి అడగండి. గత ప్రభుత్వంలో గుంతల రోడ్ల మీద మీ నోరేందుకు లేవలేదు? ఒకటో తారీకTన పెన్షన్ ఇంటికి వస్తుంటే, బస్సుల్లో ఆడబిడ్డలు ఉచితంగా వెళ్తుంటే.. ఆ సంతోషం మీకు కనిపించడం లేదా? న్యాయశాస్త్రం చదివానని చెప్పుకునే జడ శ్రావణ్‌కుమార్ ఇలా ప్రతి మూడు నెలలకొకసారి పార్టీలు మారుస్తూ ‘చింతామణి’ వేషాలు వేయడం సంస్కారమా? మీ మాటలకు విలువ పోయింది. నిన్న రాజు అన్న నోటితోనే ఇవాళ ఛీ అనడం మీ వ్యక్తిత్వానికే మచ్చ’ అని విమర్శించారు. ‘కళాకారులు మౌనంగా రోదిస్తారు. కానీ ఆ మౌన రోదన, ఆ ఉసురు మీకు పవర్ ఫుల్‌గా తగులుతుంది. ఇప్పటికైనా మీ మైండ్ సెట్ మార్చుకోండి. కళాకారులను, కళారూపాలను అవమానించడం ఆపండి. లేదంటే ఆ నటరాజు శాపం మిమ్మల్ని వెంటాడుతుంది. వీలైతే క్షమాపణ చెప్పండి, లేకపోయినా కళాకారులమైన మేము మిమ్మల్ని క్షమించేస్తాం.. ఎందుకంటే మాది సున్నితమైన మనసు’ అన్నారు. రాష్ట్రాన్ని సుభిక్షంగా పరిపాలిస్తున్న నాయకులపై, వారి సంస్కారవంతమైన కార్యక్రమాలపై విమర్శలు మానుకోవాలని హితవు పలుకుతున్నాం. కళాకారుడు సున్నిత మనస్కుడు, కానీ తన వృత్తిని, గౌరవాన్ని కించపరిస్తే సహించే ప్రసక్తే లేదన్నారు.














