- వారి సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం
- మంత్రి గుమ్మడి సంధ్యారాణి
మంగళగిరి(చైతన్యరథం): తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆదివా రం మీడియా సమావేశం నిర్వహించారు. అంగన్వాడీ సిబ్బంది 10 డిమాండ్లలో తొమ్మిది కోర్కెలను ప్రభుత్వం ఇప్పటికే పరిష్కరించింది. అంగన్వాడీ డిమాండ్లపై ప్రభుత్వం సమగ్రంగా పరిశీలన చేస్తుందని తెలిపారు. గతంలో మీరు 40 రోజులు ధర్నా చేస్తే జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ చంద్రబాబు నాయక త్వంలో అంగన్‌వాడీల సమస్యలను పరిష్కరిస్తాం. అంగన్‌వాడీలకు జీతాలు పెంచి మీకు భరోసా ఇచ్చిన ఘనత చంద్రబాబుదేనని తెలిపారు. 5000 అంగన్‌వాడీ కేంద్రాలను మినీ నుంచి మెయిన్ గా ఉన్నతీకరించాం. వాటిల్లో సౌకర్యాలు కల్పించాం. 56 వేల మొబైల్ ఫోన్ల పంపిణీ చేశాం. యాప్‌లు తగ్గించే కార్యక్రమం అమలు చేశాం. ఉద్యోగులకు గ్రాట్యుటీ చెల్లించాం. వేసవిలో 15 రోజులు సెలవులు ఇచ్చాం. ఆట వస్తువులు, పాఠాలు చెప్పడానికి వీలుగా చార్టులు, ఇండక్షన్ స్టవ్, నాణ్యమైన వంట పాత్రలు ఇచ్చాం. చనిపోయిన వారికి మట్టి ఖర్చులు రూ.15,000 వేలు ఇస్తున్నాం.
రాష్ట్రం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, చంద్ర బాబు ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేసిందని తెలిపారు. ధర్నాలు సమస్యలకు పరిష్కారాలు కాదని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకోవాలని సూచిం చారు. అంగన్వాడీ కార్యకర్తల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. గత ప్రభుత్వ కాలంలో అంగన్వాడీలకు కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే పెంపు ఇచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా, సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి జీతా ల సమస్యపై పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎవరైనా ప్రలోభపెట్టినా రోడ్డుపైకి రాకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ధర్నాలు, ఆందోళనలు విరమించి ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. అంగన్వాడీ సమస్యలపై సానుకూలంగా స్పందిస్తున్నదని స్పష్టం చేశారు.













