- కేంద్రాల్లో మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి
- ఏళ్ల తరబడి ఉన్న గ్రాట్యుటీ సమస్యను పరిష్కరించాం
- సాధ్యమైనంత త్వరలోనే వారికి వేతనాల పెంపు
- అదనంగా 5,000 మంది సహాయకుల భర్తీకి చర్యలు
- హోంమంత్రి వంగలపూడి అనిత, బీసీ జనార్దన్‌రెడ్డి
అమరావతి(చైతన్యరథం): అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు, చిరు ఉద్యోగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని హోంమంత్రి వంగలపూడి అనిత, మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా చరిత్రలోనే తొలి సారిగా రెండు సార్లు అంగన్వాడీ వేతనాలు పెంచిన ఘనత తెలు గుదేశం ప్రభుత్వానికి, సీఎం చంద్రబాబుకే దక్కుతుందని పేర్కొ న్నారు. ఎన్నికల్లో అంగన్వాడీలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడానికి కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీ కేంద్రాల మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో తాగునీటి సౌకర్యాలు, మరు గుదొడ్ల నిర్మాణానికి రూ.86.68 లక్షలు విడుదల చేసి ఒక్కో కేంద్రానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించినట్లు వెల్లడించారు. అంగన్వాడీలకు ప్రతినెలా ఒకటో తేదీననే వేతనాలు అందేలా చర్యలు తీసుకుని, జీతాల ఆలస్యానికి శాశ్వతంగా చెక్ పెట్టామని చెప్పారు. రాష్ట్రంలో 58,204 మంది అంగన్వాడీ వర్కర్లు, సూప ర్‌వైజర్లు, బ్లాక్ కోఆర్డినేటర్లకు రూ.75 కోట్ల వ్యయంతో 5జీ స్మార్ట్ ఫోన్లు అందజేసినట్లు తెలిపారు. ఈ స్మార్ట్‌ఫోన్ల ద్వారా గర్భి ణులు, బాలింతలు, చిన్నారులకు మరింత వేగంగా, సమర్థవంతంగా సేవలు అందుతున్నాయని పేర్కొన్నారు.
అంగన్వాడీ కేంద్రాల్లో వసతులు
కూటమి పాలనలో అంగన్వాడీ కేంద్రాల హాజరు శాతం 70 నుంచి 96 శాతానికి పెరిగిందని తెలిపారు. ఏళ్ల తరబడి అంగ న్వాడీలు ఎదురుచూసిన గ్రాట్యుటీ సమస్యను కూడా ప్రభుత్వం పరిష్కరించిందని, 2025 ఆంధ్రప్రదేశ్ బడ్జెట్‌లో రూ.20 కోట్లు కేటాయించి అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లోనే గ్రాట్యుటీ చెల్లింపులకు చర్యలు ప్రారంభించినట్లు వెల్లడించారు. అంగన్వాడీ కేంద్రాలకు టీవీలు, ఆర్‌వో యంత్రాలు, టాయిలెట్ సౌకర్యాలు కల్పించడంతో పాటు టీచర్లు, ఆయాలకు వేసవిలో 15 రోజుల సెలవులు మంజూరు చేసినట్లు చెప్పారు. చిన్నారుల అభివృద్ధికి ఆట వస్తువులు, పాఠ్య చార్టులు, ఇండక్షన్ స్టవ్‌లు, నాణ్యమైన వంట పాత్రలు అందజేసినట్లు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 5,000 మినీ అంగన్వాడీ కేంద్రాలను పూర్తిస్థాయి కేంద్రాలుగా అప్‌గ్రేడ్ చేస్తున్నామని, మినీ అంగన్వాడీ కార్యకర్తలకు టీచర్‌గా పదోన్నతి కల్పించి పూర్తిస్థాయి వేతనాలు అందించనున్నట్లు తెలి పారు.
అదనంగా 5,000 మంది అంగన్వాడీ సహాయకులను నియమించనున్నట్లు చెప్పారు. అంగన్వాడీలు ప్రతిపాదించిన 9 డిమాండ్లను ఇప్పటికే పరిష్కరించామని, వేతనాల పెంపు అంశాన్ని కూడా సాధ్యమైనంత త్వరగా అమలు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పటికీ ఉద్యోగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రాధా న్యత ఇస్తుందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక రంగా న్ని దెబ్బతీసి వెళ్లిందని మండిపడ్డారు. వారు చేసిన అప్పులకు రాష్ట్రానికి వస్తున్న ఆదాయంతో పాటు మరిన్ని అప్పులు తెచ్చి వడ్డీ లు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొన్నదని విమర్శించారు. అయిన ప్పటికీ ప్రతినెలా ఒకటో తేదీననే వేతనాలు చెల్లిస్తూ ఉద్యోగులకు భరోసాగా నిలుస్తున్నది కూటమి ప్రభుత్వమేనని తెలిపారు.













