డైవర్షన్ రాజకీయాలు వైసీపీ ముష్కర మూకలకు కొత్త కాదు. ఐదేళ్ల దుష్పరిపాలనతో ఆంధ్రా గోబెల్స్‌గా ఖ్యాతి తెచ్చుకున్న జగన్ అండ్ కో.. సుపరిపాలనతో దూసుకుపోతున్న కూటమిపై బురద రాజకీయాలకు పాల్పడుతూనే ఉంది. అందులో భాగమే `వైసీపీ ప్రభుత్వం పాల్పడిన కల్తీ నెయ్యి ఘట్టంలోకి హెరిటేజ్‌ను లాగడం. తమకంటిన బురదను ఎదుటివాళ్లకూ అంటించి.. మానసిక ఆనందం పొందే పైశాచికత్వానికి పరాకాష్ట ఘట్టమిది. మండలిలో ఉధతంగా సాగుతోన్న కల్తీ నెయ్యి ఘట్టంపై చర్చను పక్కదోవ పట్టించేందుకు `ఇటు హెరిటేజ్‌పైన, అటు మంత్రి లోకేష్‌పైన అప్రస్తుత వ్యాఖ్యలు, అనుచిత విమర్శలకు తెగబడుతోంది వైసీపీ. మంత్రి నారా లోకేష్ కొలంబో పర్యటనపై వైసీపీ సాగించిన దుష్ప్రచారం అలాంటి బురద రాజకీయాల్లో భాగమే. నేడో రేపో ప్రజల ముందుకొచ్చి `పచ్చి అబద్ధాలను పల్లపర్చే ప్రయత్నంలో వైసీపీ జగన్ ఉన్న నేపథ్యంలో `హెరిటేజ్ ఫుడ్స్ సచ్చీలతపై ఫ్యాక్ట్ షీట్ ఇది.
ఇండాపూర్ డెయిరీకి నెయ్యిని హెరిటేజ్ సరఫరా చేయలేదు.
అమూల్, దొడ్ల డెయిరీలతోపాటు హెరిటేజ్ కూడా పాల ఉత్పత్తులు ఇండాపూర్‌నుంచి కొనుగోలు చేసింది.
లడ్డూ ప్రసాదంలో నెయ్యి కుంభకోణాన్ని డైవర్ట్ చేయడానికే హెరిటేజ్‌పై నిరాధార నిందులు.
హెరిటేజ్‌పై నిరాధార నిందలు వేస్తున్న సాక్షి మీడియాపై చర్యలు తీసుకోవాలి.
ఏ ప్రభుత్వానికి హెరిటేజ్ నెయ్యి సరఫరా చేయలేదు.
ఏ ఇతర కంపెనీలకూ నెయ్యి సరఫరా చేయలేదు.
హెరిటేజ్ నేరుగా మార్కెట్లో వినియోగదారులకు నెయ్యి అమ్ముతున్నది.
హెరిటేజ్ ఇండాపూర్ డెయిరీతోగానీ, ఇతర ఏ సంస్థతోగానీ నెయ్యి తయారీ లేదా సరఫరా కోసం ఒప్పందాలు లేవు.
హెరిటేజ్ ప్రత్యక్షంగాగానీ, పరోక్షంగాగానీ టీటీడీకి నెయ్యి సరఫరాలో ఎలాంటి పాత్ర లేదు.
హెరిటేజ్ ఇండాపూర్‌నుంచి కొనుగోలుదారే గానీ, ఇండాపూర్‌కు ఉత్పత్తులు అమ్మే సంస్థ కాదు.
ఇండాపూర్ ద్వారా హెరిటేజ్ టీటీడీకి నెయ్యి సరఫరా జరిగిందని వైసీపీ చేసే ఆరోపణలు అబద్దాలు మాత్రమే.
టీటీడీ లడ్డూ ప్రసాదంలో నెయ్యి కల్తీ కుంభకోణంలో వైసీపీ నేతల పాత్రపై ప్రజాదృష్టి మళ్లించడానికే హెరిటేజ్‌పై అబద్దాల దాడి చేస్తున్నారు.
ఇండాపూర్ డెయిరీ ప్రకటన
తమ సంస్థకు హెరిటేజ్ ఎటువంటి యాజమాన్య లేదా నిర్వహణ సంబంధాలు లేవని ప్రకటన చేసింది.
బీ2బి సరఫరాదారుగా ఇండాపూర్ ఉన్నదని పేర్కొన్నారు.
ఇండాపూర్‌నుంచి హెరిటేజ్ యుహెచ్‌టి పాలు, ఎసఎంపి, పన్నీరువంటివి కొనుగోలు చేస్తున్నదేగాని అమ్మడం లేదు.
ఇండాపూర్ డెయిరీ స్వతంత్ర సంస్థ.
పాల ఉత్పత్తుల్లో ఇండాపూర్ దేశంలోనే మొదటి 5 అతి పెద్ద డెయిరీలలో ఒకటిగా ఉన్నది.
పాల ఉత్పత్తుల ఎగుమతుల్లో దేశంలో 2వ స్థానంలో ఉన్నది.
ఇండాపూర్ రష్యా, మధ్యప్రాచ్యం, ఆగ్నేయ ఆసియా దేశాలకు ఎగుమతులు చేస్తున్నది.
అలాగే దేశంలో ఇండాపూర్ డెయిరీ తమ ఉత్పత్తుల్ని అమూల్, మదర్ డెయిరీ, బ్రిటానియా, దొడ్ల డెయిరీ, హెరిటేజ్ సంస్థలకు పాల ఉత్పత్తుల్ని అమ్ముతున్నది.
ఇండాపూర్ ఆధ్యాత్మిక సంస్థలైన పతంజలి, శ్రీ వేదసత్య, షిర్డీసాయి, స్వర్ణ దేవాలయాలకు నెయ్యి సరఫరా చేస్తున్నది.
అలాగే డీమార్ట్, జొమాటోవంటి సంస్థలకు పాల ఉత్పత్తులకు సరఫరా చేస్తున్నది.
హెరిటేజ్ ఇండాపూర్ డెయిరీకి కొనుగోలుదారేగానీ, సరఫరాదారు కాదనేది వాస్తవం.
హెరిటేజ్ ప్రత్యక్షంగాగానీ, పరోక్షంగాగానీ టీటీడీ నెయ్యి సరఫరాలో ఎలాంటి పాత్ర లేదనేది వాస్తవం.
టీటీడీ లడ్డూ ప్రసాదాల్లో వైసీపీ నేతల కుంభకోణాల నుండి ప్రజాదృష్టి మళ్లించడానికే హెరిటేజ్‌పై నిరాధార నిందలు వేస్తున్నారు.
ఈ దుర్మార్గ వైసీపీ ప్రచారాల్ని ప్రజలు నిరసిస్తారు. వైసీపీ టీటీడీ నెయ్యి కల్తీ మహాపాపాల నుండి తప్పించుకోలేరు.
నేడు నెయ్యి కొనుగోలులో నాణ్యత- పారదర్శకతకు పెద్దపీట
నేడు 62శాతం ఆవు నెయ్యి నందిని డెయిరీ టీటీడీ సరఫరా చేస్తున్నది.
మదర్ డెయిరీకి 2 టెండర్లు, ఇండాపూర్‌కు 2 టెండర్లు, సంగంకు 1 టెండర్ మాత్రమే దక్కింది.
ఎఫఎసఎసఏఐ, ఎన్‌డీడీబీ పరీక్షల్లో ఉత్తీర్ణత అయినవాటికే నెయ్యి సరఫరా ఆర్డర్లు.
ఎన్‌డీడీబీ నిపుణుల సూచనల ప్రకారం నెయ్యి ధర టెండర్లు కేటాయింపులు జరిగాయి.













