చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

నూరుశాతం నాణ్యత, సంతృప్తి

ప్రభుత్వ పథకాల అమలు తీరుపై సీఎం సమీక్ష

by చైతన్యరధం
Mar 11, 2025 at 6:15am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
నూరుశాతం నాణ్యత, సంతృప్తి
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ప్రభుత్వ సేవల్లో ప్రజలకు అందాల్సిందిదే
  • యంత్రాంగం తీరుపై ఎక్కడా ఫిర్యాదులు రాకూడదు
  • వర్క్‌ ఫ్రం హోంపై సర్వే నివేదిక ఆధారంగా నూతన పాలసీ
  • ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడి
  • ప్రభుత్వ పథకాల అమలు తీరుపై సీఎం సమీక్ష
  • ప్రజాభిప్రాయ సేకరణ ఆధారంగా మార్గనిర్దేశనం
  • 16 శాఖలపై పాజిటివ్‌ పబ్లిక్‌ పర్సెప్షన్‌ స్టడీ

అమరావతి (చైతన్య రథం): ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సేవల్లో నూరుశాతం నాణ్యత కనిపించాలని, లబ్ధిదారుల నుంచి పూర్తిస్థాయిలో సంతృప్తి వ్యక్తం కావాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. ప్రభుత్వ సేవల్లో నాణ్యత పెంచడం, ప్రజలు సంతృప్తి చెందేలా కార్యక్రమాలు అమలుచేయడంపై అన్ని స్థాయిల్లో దృష్టిపెట్టాలని సీఎం ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు, కార్యక్రమాల నిర్వహణను ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం సమీక్షించారు. వివిధ పథకాల అమల్లో లబ్ధిదారుల నుంచి సేకరించిన సమాచారం సమీక్షకు ప్రామాణికంగా తీసుకున్నారు. ప్రతివారం నాలుగు శాఖలను సమీక్షిస్తున్న సీఎం చంద్రబాబు… ఈ వారం రెవెన్యూ సర్వీసులు, ఆసుపత్రుల్లో సేవలు, దేవాలయాలు, మునిసిపల్‌ శాఖలోని సేవల్లో వచ్చిన రిపోర్టులపై సమీక్ష జరిపారు. పదేపదే ఫిర్యాదులు వస్తున్న విభాగాల్లో బాధ్యులను గుర్తించి మార్పు వచ్చేలా చూడాలని సీఎం ఆదేశించారు. కిందిస్థాయి ఉద్యోగులు, అధికారులకు ఉన్నతాధికారులు కౌన్సిలింగ్‌ నిర్వహించడం ద్వారా సేవలు మెరుగుపరచాలన్నారు. ప్రభుత్వ శాఖల్లో అవినీతిని ఏమాత్రం సహించవద్దని ఆదేశించారు. కరెప్షన్‌ ఒక జబ్బులాంటిదని, పూర్తిగా నివారించాల్సిందేనని సీఎం పేర్కొన్నారు.

మెరుగుపడిన ఆసుపత్రి సేవలు
ఆసుపత్రుల్లో అందించే సేవలపై రోగులనుంచి ప్రభుత్వం అభిప్రాయాలు సేకరించింది. డాక్టర్‌లు ఆసుపత్రిలో అందుబాటులో ఉంటున్నారా? అన్న ప్రశ్నకు 68.6 శాతంమంది ఉంటున్నట్టు సమాధానమిచ్చారు. డాక్టర్ల ప్రవర్తనపై 71.7 శాతం, సిబ్బంది ప్రవర్తనపై 65.6 శాతం సంతృప్తి వ్యక్తం చేశారు. డాక్టర్‌లు రాసిచ్చిన మందులు ఆసుపత్రిలో ఇస్తున్నారా? ప్రభుత్వ ఆసుపత్రిలో పరిశుభ్రత ఎలా ఉంది? అన్న ప్రశ్నల నుంచి కూడా ప్రభుత్వం అభిప్రాయాలు తీసుకుంది. ఈ విభాగంలో 65శాతం వరకు సంతృప్తి వ్యక్తంచేయగా.. దీన్ని మరింత మెరుగుపర్చాలని సీఎం సూచించారు. గత నివేదికలతో పోల్చుకుంటే సేవలు కొంత మెరుగుపడినట్లు చెప్పారు.

సంబంధితవార్తలు

రెవిన్యూ.. సమూల ప్రక్షాళన

రామాయపట్నం పోర్టు తొలిదశ పనుల కాలపరిమితి పొడిగింపు

దీపం లబ్దిదారులకు పీఎన్జీ వినియోగంపై అవగాహన

చెత్త సేకరణ
అదేవిధంగా మున్సిపల్‌ సేవలపైనా అభిప్రాయాలు సేకరించారు. మీ నుంచి రోజూ చెత్త సేకరిస్తున్నారా? మీ పరిసర ప్రాంతాల్లో చెత్త కుప్పలను 24 గంటల్లోపు తొలగిస్తున్నారా? అనే అంశాలపై 67శాతం ఔనన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. పలు ప్రాంతాల్లో సిబ్బంది కొరత కారణంగా ఇబ్బందులున్నాయని.. వాటిని పరిష్కరిస్తున్నామని ముఖ్యమంత్రికి అధికారులు వివరణ ఇచ్చారు.

రెవెన్యూ సేవలు
రెవెన్యూ సేవలకు సంబంధించి మీ పాసుపుస్తకం దరఖాస్తుపై రుసుము కాకుండా ఏవైనా అదనపు ఛార్జీలు తీసుకుంటున్నారా? అన్న ప్రశ్నకు ఔనని 24.95 శాతంమంది, మీ అర్జీ గురించి గ్రామ రెవెన్యూ అధికారి విచారణ కొరకు నోటీసు ఇచ్చారా? అన్న ప్రశ్నకు ఇచ్చారని 40.61 శాతం మంది, మీ అర్జీ గురించి గ్రామ రెవెన్యూ అధికారి క్షేత్రస్థాయిలో విచారణ జరిపారా? అన్న ప్రశ్నకు జరిపారని 63.33 శాతం మంది సమాధానమిచ్చారు. అదేవిధంగా మీ సర్వే దరఖాస్తుపై దరఖాస్తు రుసుము కాకుండా అదనపు ఛార్జీలు తీసుకున్నారా? అన్న ప్రశ్నకు 22.04 శాతం మంది ఔనని, మీ భూమి సర్వే చేయడానికి మీకు విచారణ తేదీ, సమయం తెలుపుతూ నోటీసు జారీ చేశారా? అన్న ప్రశ్నకు ఔనని 59.80 శాతం మంది, మీకు ఇచ్చిన నోటీసు ప్రకారం సర్వేయర్‌ మీ భూమిని సర్వే చేశారా? అన్న ప్రశ్నకు ఔనని 56.51 శాతంమంది సమాధానమిచ్చారు. రెవెన్యూ సేవల్లో మార్పు కనిపించాలని సీఎం అధికారులకు సూచించారు. ఈ విభాగంలో మార్పు చూపిస్తే ప్రజల్లో సానుకూలత వ్యక్తమవుతుందని… ఆమేరకు అధికారులు పనిచేయాలని సీఎం అన్నారు.

భక్తుల పట్ల మర్యాదగా వ్యవహరించాలి
దేవాలయాల్లో దర్శనం, వసతులు, పరిశుభ్రత వంటి వివిధ అంశాలపై భక్తుల అభిప్రాయాలనూ ప్రభుత్వం తీసుకుంది. దర్శనం మీరు భావించిన సమయంలో జరిగిందా? అన్న ప్రశ్నకు 70 శాతం ఔనని, దేవాలయాల్లో మౌలిక వసుతుల, తాగునీరు, వాష్‌ రూమ్‌లు, వెయిటింగ్‌ ఏరియా, రవాణా సౌకర్యాలపై 63 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రసాదం తాజాగా, రుచిగా ఉందా? అన్న ప్రశ్నకు 81శాతంమంది ఔనని సమాధానమిచ్చారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ… దేవాలయాల్లో భక్తులపట్ల మర్యాదగా, సౌమ్యంగా వ్యవహరించాలని సిబ్బందికి సూచించారు. దేవాలయాల్లో దేవుని సేవకు వాలంటీర్ల విధానాన్ని అమలు చేయాలని…. క్యూలైన్ల నిర్వహణతో పాటు పలు సేవల్లో పనిచేసేందుకు వాలంటీర్లు సిద్ధంగా ఉంటారని… స్వచ్ఛందంగా వచ్చే వారిని సేవలకు ఉపయోగించుకోవాలని సూచించారు. దేవునిసేవలో పని చేసేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తారు. వారికి సరైన శిక్షణ, అవగాహన కల్పించి దేవాలయ సేవలకు వినియోగించుకోవాలన్నారు. రాష్ట్రంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో తరహా పూజలు, జాతరలు జరుగుతాయని, వాటికి అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు. జాతరలు, ఇతర వేడుకల సందర్భాల్లో అందరికీ వసతి ఇవ్వలేని సమయంలో టెంట్లు ఏర్పాటు చేసి భక్తులకు సౌకర్యాలు కల్పించాలని సూచించారు.

వర్క్‌ ఫ్రం హోంపై సర్వే
రాష్ట్రంలో వర్క్‌ ఫ్రం హోంను ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తోంది. వర్క్‌ ఫ్రం హోంతోపాటు నైబర్‌ హుడ్‌ వర్కింగ్‌, కో వర్కింగ్‌ విధానాలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇంటినుంచే పని విధానంలో వసతులు, అవకాశాలు కల్పించడం, శిక్షణ అందించడం ద్వారా పెద్దఎత్తున అవకాశాలు సృష్టించాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. ఇందులో భాగంగా ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది వర్క్‌ ఫ్రం హోంపై సర్వే నిర్వహిస్తున్నారు. 2.68 కోట్లమందిని సర్వే చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో ఇప్పటి వరకు 82.06 లక్షలమందిని సర్వే చేశారు. వీరిలో 1.72 లక్షల మంది వర్క్‌ ఫ్రం హోం విధానంలో పని చేస్తున్నట్టు వివరించారు. వర్క్‌ ఫ్రం హోం విధానంలో పని చేయడానికి తాము సిద్ధంగా ఉన్నా.. తగిన అవకాశాలు లేవని, అటువంటి ఉపాధి కల్పిస్తే తాము కూడా వర్క్‌ ఫ్రం హోం విధానంలో పనిచేస్తామని 20.43 లక్షల మంది తెలిపారు. సర్వే చేసిన వారిలో ఇంటర్‌ కంటే తక్కువ చదివిన వారు 9.05 లక్షలమంది ఉండగా, డిప్లొమా, ఆపై చదువులు చదివిన వారు 10.73 లక్షల మంది ఉన్నారు.

ఆయా గ్రామాల్లో వర్క్‌ ఫ్రం హోం సెంటర్లు, పనిస్టేషన్‌ సెంటర్‌ల ఏర్పాటుకున్న భవనాలపైనా సర్వే నిర్వహిస్తున్నారు. విద్యార్హతలు ఉండి, పని చేసే సామర్థం ఉన్నవారికి ట్రైనింగ్‌ ఇవ్వడం ద్వారా ఇంటి వద్ద నుంచి పనిచేసే అవకాశాలు కల్పించేందుకు ఆయా సంస్థలతో మాట్లాడాలని సీఎం అధికారులకు సూచించారు. అనంతరం మనమిత్ర ద్వారా అందుతున్న వాట్సాప్‌ సర్వీసులపైనా సీఎం సమీక్ష చేశారు. ప్రస్తుతం 200 రకాల సేవలు వాట్సాప్‌ ద్వారా అందుతున్నాయని అధికారులు వివరించారు. డిజిటల్‌ లిటరసీ ట్రైనింగ్‌ జరగాలని, అన్ని సేవలు ఆన్లైన్‌లో ఇస్తున్నారనే సమాచారం ప్రజలకు చేరాలని సీఎం అన్నారు. తద్వారా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పని, అవినీతిని నివారించవచ్చని సీఎం అన్నారు. డ్రోన్‌ సేవలను విస్తృతంగా ఉపయోగించుకునే విధానంపైనా అధికారులు దృష్టిపెట్టాలని సీఎం సూచించారు. పోలీసు విభాగంలో రాత్రి గస్తీ విధుల్లో సిబ్బందిని తగ్గించి డ్రోన్‌ ద్వారా పర్యవేక్షించే పరిస్థితి రావాలన్నారు. అదే విధంగా పారిశుధ్య పనుల్లో కూడా డ్రోన్‌ వాడకాన్ని మెరుగుపరచాలని సూచించారు. టెక్నాలజీ సాయంతో ఎఫెక్టివ్‌గా పనిచేసి మంచి ఫలితాలు సాధించే అవకాశాలు ఉన్నప్పుడు వాటిని పూర్తిగా వినియోగించుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు.

Previous Post

ప్రకృతి సేద్యం అట్‌ ఏపీ

Next Post

నేరమే అధికారమైంది జగన్‌ పాలనలోనే..

మరిన్ని వార్తలు

రెవిన్యూ.. సమూల ప్రక్షాళన
ఆంధ్రప్రదేశ్

రెవిన్యూ.. సమూల ప్రక్షాళన

చైతన్యరధం
@ April 11, 2026
రామాయపట్నం పోర్టు తొలిదశ పనుల కాలపరిమితి పొడిగింపు
ఆంధ్రప్రదేశ్

రామాయపట్నం పోర్టు తొలిదశ పనుల కాలపరిమితి పొడిగింపు

చైతన్యరధం
@ April 11, 2026
దీపం లబ్దిదారులకు పీఎన్జీ వినియోగంపై అవగాహన
ఆంధ్రప్రదేశ్

దీపం లబ్దిదారులకు పీఎన్జీ వినియోగంపై అవగాహన

చైతన్యరధం
@ April 11, 2026
ఎంతమంది సైకోలు వచ్చినా అమరావతి ఆగదు
ఆంధ్రప్రదేశ్

ప్రపంచ సాంకేతిక పటంలో ఏపీకి నవశకం

చైతన్యరధం
@ April 11, 2026
చైతన్యరధం ఈ పేపర్ 11-04-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 11-04-2026

కార్యకర్త
@ April 11, 2026
బెంగళూరులో మంత్రి లోకేష్ పర్యటన
ఆంధ్రప్రదేశ్

బెంగళూరులో మంత్రి లోకేష్ పర్యటన

చైతన్యరధం
@ April 11, 2026
సవాళ్లకు ఎదురెళ్లండి!
ఆంధ్రప్రదేశ్

సవాళ్లకు ఎదురెళ్లండి!

చైతన్యరధం
@ April 11, 2026
క్రిమినల్స్‌ను ఉపేక్షించం
ఆంధ్రప్రదేశ్

క్రిమినల్స్‌ను ఉపేక్షించం

చైతన్యరధం
@ April 11, 2026
Load More

ముఖ్య వార్తలు

క్రిమినల్స్‌ను ఉపేక్షించం

క్రిమినల్స్‌ను ఉపేక్షించం

చైతన్యరధం
@ April 11, 2026
ఎంతమంది సైకోలు వచ్చినా అమరావతి ఆగదు

ఎంతమంది సైకోలు వచ్చినా అమరావతి ఆగదు

చైతన్యరధం
@ April 10, 2026
భూములకు భద్రత..రైతుకు భరోసా

భూములకు భద్రత..రైతుకు భరోసా

చైతన్యరధం
@ April 10, 2026
మార్చి నాటికి 1.12 కోట్ల పట్టాదారు పాస్‌పుస్తకాలు

మార్చి నాటికి 1.12 కోట్ల పట్టాదారు పాస్‌పుస్తకాలు

చైతన్యరధం
@ April 9, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

రెవిన్యూ.. సమూల ప్రక్షాళన

రెవిన్యూ.. సమూల ప్రక్షాళన

చైతన్యరధం
@ April 11, 2026
రామాయపట్నం పోర్టు తొలిదశ పనుల కాలపరిమితి పొడిగింపు

రామాయపట్నం పోర్టు తొలిదశ పనుల కాలపరిమితి పొడిగింపు

చైతన్యరధం
@ April 11, 2026
దీపం లబ్దిదారులకు పీఎన్జీ వినియోగంపై అవగాహన

దీపం లబ్దిదారులకు పీఎన్జీ వినియోగంపై అవగాహన

చైతన్యరధం
@ April 11, 2026
ఎంతమంది సైకోలు వచ్చినా అమరావతి ఆగదు

ప్రపంచ సాంకేతిక పటంలో ఏపీకి నవశకం

చైతన్యరధం
@ April 11, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist