- పంటలు, ఇళ్లు, రహదారులు దెబ్బతిన్నాయి
- హోం మంత్రి అమిత్‌షాకు నష్ట తీవ్రతను వివరించాం
- సహాయక చర్యల్లో సాంకేతికతతో సత్ఫలితాలు సాధించాం
- ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించటమే లక్ష్యంగా పనిచేశాం
- రహదారులపై చెట్ల తొలగింపు, విద్యుత్ పునరుద్ధరణ
- అధికార యంత్రాంగం, సిబ్బంది వేగంగా స్పందించారు
- మూడురోజుల్లో ఏడు సమీక్షలతో నిరంతరం పర్యవేక్షించాం
- మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం
- బాధితులైన ప్రతిఒక్కరికీ నేటి నుంచే పరిహారం పంపిణీ
- సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు విశ్రయించేది లేదు
- పై నుంచి కిందిస్థాయి వరకు రాత్రింబవళ్లు పనిచేస్తున్నారు
- రెస్క్యూ, రిలీఫ్ కార్యక్రమాలు పూర్తిస్థాయిలో కొనసాగుతాయి
- ఆర్టీజీఎస్లో మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు
అమరావతి(చైతన్యరథం): అర్నబ్ తుఫాన్ ప్రభావాన్ని ముందు గానే అంచనా వేస్తూ మూడురోజుల్లో ఏడు సమీక్షలు నిర్వహించి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం ద్వారా ప్రాణ, ఆస్తి నష్టాన్ని గణనీయంగా తగ్గించగలిగామని ముఖ్యమంత్రి చంద్రబా బు తెలిపారు. రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ ద్వారా తుఫాను గమనాన్ని నిరంతరం పర్యవేక్షించడంతో పాటు, జిల్లా కలెక్టర్లు, క్షేత్రస్థాయి అధికారులకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించా మని చెప్పారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితు లు నెలకొనే వరకు ప్రభుత్వం విశ్రాంతి తీసుకోదని స్పష్టం చేశారు. రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ నుంచి నిర్వహించిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. తుఫాను కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలకు అత్యంత ప్రాధాన్యమిచ్చామని తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యద ర్శి నుంచి స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాల వరకు అధికా రులు, సిబ్బంది రాత్రింబవళ్లు పనిచేశారని పేర్కొన్నారు.
లోతట్టు ప్రాంతాల ప్రజలను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు, షెల్టర్ క్యాంపులకు తరలించడంతో పాటు, వారికి అవసరమైన సదుపా యాలు కల్పించామని చెప్పారు. రెస్క్యూ, రిలీఫ్ కార్యక్రమాలు పూర్తిస్థాయిలో కొనసాగుతున్నాయని సీఎం తెలిపారు. పంట నష్టాన్ని మినహాయించి, ఇతర నష్టాలకు సంబంధించి అర్హులైన బాధితులకు గురువారం నుంచే ఆర్థిక సాయం అందించేలా చర్య లు చేపడతామని చెప్పారు. ఈ అంశంపై గురువారం వర్చు వల్ క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని వెల్లడిం చారు. తుఫాన్ వల్ల జరిగిన నష్టంపై ప్రాథమిక అంచనాలను కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తామని తెలిపారు. ఈ మేరకు కేంద్రానికి లేఖ రాయడంతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో ఫోన్లో మాట్లాడి తుఫాను తీవ్రత, రాష్ట్రంపై దాని ప్రభావాన్ని వివరించిన ట్లు చెప్పారు. కొబ్బరి, ఇతర ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లిం దని, సమగ్ర నష్ట నివేదికను కూడా త్వరలోనే కేంద్రానికి పంపిస్తామని వెల్లడించారు.
సాంకేతికతతో కచ్చితమైన అంచనాలు
తుఫాన్ ప్రభావంతో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేల కూలాయని, పలు ప్రాంతాల్లో ఆస్తి నష్టం జరిగిందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 15 వేల విద్యుత్ స్తంభాలు కూలిపోయినట్లు తెలిపారు. కోనసీమ, పశ్చిమగోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు మినహా మిగతా జిల్లాల్లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించామని పేర్కొన్నా రు. ఈ రెండు జిల్లాల్లోనూ ఎల్లుండి సాయంత్రానికి విద్యుత్ సరఫరాను పూర్తిస్థాయిలో పునరుద్ధరిస్తామని వెల్లడించా రు. రాష్ట్ర రహదారులు, రహదారులపై రాకపోకలను బుధవారం రాత్రికే పునరుద్ధరణకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ప్రభావిత ప్రాంతా ల్లో తాగునీరు, పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని చెప్పారు.
అత్యవసర పరిస్థితుల్లో ఆహారం, ఔషధాలు అందించేందుకు డ్రోన్లను కూడా సిద్ధం చేశామని వివ రించారు. గతంలో తుఫాను హెచ్చరికలు వచ్చినప్పుడు శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాల్సి వచ్చే దని సీఎం గుర్తుచేశారు. ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం అందుబా టులోకి రావడంతో తుఫాను ప్రభావం ఏయే ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుందో ముందుగానే గుర్తించి అక్కడే అధికార యంత్రాంగాన్ని మోహరిస్తున్నామని వివరించారు. ప్రిడిక్షన్, యాక్యురెసీ, క్షేత్ర స్థాయిలో అప్రమత్తత అనే విధానాలతో విపత్తును ఎదుర్కొంటున్నా మని తెలిపారు. ఐఎండీ సమాచారం, ఉపగ్రహ ఛాయాచిత్రాలను ఎప్పటికప్పుడు విశ్లేషిస్తూ తుఫాన్ గమనాన్ని అంచనా వేశామని చెప్పారు. సముద్రంలో నెలకొన్న వివిధ వాతావరణ పరిస్థితుల కారణంగా తుఫాన్ ఏపీ తీరంపై సుమారు 10 గంటల పాటు నిలిచిపోయిందని, తీరం దాటే సమయంలో గరిష్ఠంగా గంటకు 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయని వెల్లడించారు. సుమారు 30 వేల మంది క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బందితో టెలి కాన్ఫరెన్స్‌ల ద్వారా నిరంతరం సమన్వయం చేసుకున్నామని తెలిపారు.
మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం
తుఫాన్ ప్రభావంతో విశాఖపట్నంలో విద్యుత్‌పై చెట్టు కూలిన ఘటనలో ఇద్దరు, అనకాపల్లిలో ఒకరు, కోనసీమలో ఒకరు, భీమ వరంలో మరొకరు ప్రాణాలు కోల్పోయారని ముఖ్యమంత్రి తెలిపా రు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం అంది స్తామని ప్రకటించారు. తుఫాన్ కారణంగా ఇళ్లు, పంటలు, దుకా ణాలు, ఇతర ఆస్తులు నష్టపోయిన వారిని ఆదుకునేందుకు ప్రభు త్వం చర్యలు చేపట్టిందని తెలిపారు.
మత్స్యకారులకు, చేపల చెరువులకు సాయం
చేనేత వర్గాలకు రూ.25 వేలు, దెబ్బతిన్న వలల మరమ్మతు లకు రూ.5 వేలు, కొత్త వలల కొనుగోలుకు రూ.10 వేలు, వలలతో సహా పూర్తిగా దెబ్బతిన్న మోటారు లేని పడవలకు రూ.27 వేలు, వలలతో సహా పూర్తిగా దెబ్బతిన్న ఫిషింగ్ బోట్లకు రూ.25 వేలు, చేపల చెరువుల పునరుద్ధరణకు రూ.17 వేలు, దెబ్బతిన్న షెడ్లకు రూ.25 వేలు అందజేస్తామని తెలిపారు. ఆవు మృతిచెందితే రూ.50 వేలు, గేదె మృతికి రూ.40 వేలు, దూడ మృతికి రూ.25 వేలు, గొర్రె, మేక మృతికి రూ.7,500, కోళ్లు మృతిచెందితే ఒక్కోదానికి రూ.100 చొప్పున పరిహారం, కోళ్లకు సంబంధించి ఒక్కో లబ్ధిదారుకు గరిష్ఠంగా రూ.10 వేల సాయం అందజేయనున్నారు. అలాగే దెబ్బతిన్న క్యాటరింగ్ షెడ్లకు రూ.5 వేలు, బ్యాటరీ షెడ్ల నష్టానికి రూ. 500 అందజేస్తామని చెప్పారు.
పలు పంటలకు నష్టం ఆధారంగా హెక్టారుకు రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు పరిహారం అందజేయనున్నట్లు వివరించారు. అరటి, పసుపు, యామ్ వంటి పంటలకు హెక్టారుకు రూ.35 వేల సాయం, తమలపాకుల తోటలకు హెక్టారుకు రూ.75 వేలు, మిరప, బొప్పాయి, టమాటా, ఉల్లి పంటలకు హెక్టారుకు రూ.25 వేల నుంచి రూ.35 వేలు, మామిడి, నిమ్మ, దానిమ్మ, సపోటా, జీడిమామిడి తోటలకు హెక్టారుకు రూ.35 వేలు, కాఫీ, డ్రాగన్ ఫ్రూట్ తోటలకు హెక్టారుకు రూ.35 వేలు, కూరగాయలు, పుచ్చకాయలు, నర్సరీలకు హెక్టారుకు రూ.25 వేల పరిహారం, టపియోకా పంటకు హెక్టారుకు రూ.10 వేలు, ఆయిల్ పామ్, కొబ్బరి చెట్ల నష్టానికి ఒక్కో చెట్టుకు రూ.15 వేలు పరిహారం అందజేయనున్నారు. పంటలు, వృత్తులు, ఆస్తు ల నష్టాలకు పరిహారం అందించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పరిహారం పంపిణీలో పారదర్శకత పాటించాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
ముంపు ప్రాంతాల్లో వారికి సాయం
ముంపు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరిన బాధితులకు 25 కిలోల బియ్యం అందించాలని ఆదేశించినట్లు చెప్పారు. చేనేత కార్మికులు, మత్స్యకారులకు 50 కిలోల బియ్యంతో పాటు కిలో చొప్పున ఉల్లి, వంటనూనె, కందిపప్పు అందిస్తామని ప్రకటిం చారు. షెల్టర్ క్యాంపుల్లో ఆశ్రయం పొందిన వారికి రూ.1,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. ఉద్యాన పంటలకు సంబంధించి అరటి పంటకు హెక్టారుకు రూ.35,000, టమాటాకు రూ.25,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. పత్తి, చెరకు తదితర పంటలకు హెక్టారుకు రూ.25,000 చొప్పున సాయం అందించే అంశాన్ని వెల్లడించారు. ఇతర పంటలకు నష్టం కేటగి రీల వారీగా పరిహారం అందిస్తామని చెప్పారు. వ్యవసాయ, ఉద్యాన పంటల నష్టాన్ని ఎన్యుమరేషన్ ద్వారా అంచనా వేసి రైతులను ఆదుకుంటామని తెలిపారు.
ప్రభావిత ప్రాంతంలో క్షేత్రస్థాయి పర్యటన
అర్నబ్ తుఫాను కారణంగా రాష్ట్రంలో వర్షపాతం పెరిగిం దని సీఎం తెలిపారు. రాష్ట్ర సగటు లోటు వర్షపాతం 39 శాతం నుంచి 27 శాతానికి తగ్గిందని చెప్పారు. విశాఖపట్నంలో 21 సెంటీమీటర్లు, విజయనగరంలో 18 సెంటీమీటర్లు, శ్రీకాకుళం జిల్లాలో 14 సెంటీమీటర్లు, కృష్ణా జిల్లాలో 9 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైందని వివరించారు. శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయని పేర్కొ న్నారు. వర్షపు నీటిని సమర్థంగా వినియోగించుకు నేందుకు ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేశామని, ఏ చెరువును నింపా లి, ఏ రిజర్వాయర్‌లోకి నీటిని మళ్లించాలన్న అంశాలపై కార్యా చరణ రూపొందించామని తెలిపారు. ముందస్తు చర్యలు, కాలువల్లో అడ్డంకులను తొలగించడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా ఒక్క చెరువుకు కూడా గండి పడలేదని చెప్పారు. శ్రీకాకుళం, మన్యం జిల్లాల్లో మరికొంత వర్షం కురిసే అవకాశం ఉన్నందున అక్కడి ప్రజలను అప్రమత్తం చేశామని వెల్లడించారు.
గత మూడు రోజులుగా నిరంతరం పనిచేసిన అధికారులు, జిల్లా కలెక్టర్లు, క్షేత్రస్థాయి సిబ్బందిని ముఖ్యమంత్రి అభినందించారు. తాను, అధికారులు, సిబ్బంది రాత్రంతా నిద్ర లేకుండా ప్రజలకు సేవలందించామని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన సూచనలను పాటిస్తూ ప్రజలు కూడా పూర్తిస్థాయిలో సహకరించారని పేర్కొ న్నారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు అధికారులు క్షేత్రస్థాయిలోనే ఉండి సహాయక చర్యలను కొనసాగించాలని సూచించారు. గురువారం స్వయం గా ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి నష్టాన్ని పరిశీలిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. బాధితులకు వేగంగా సహాయం అందించి, ప్రజల్లో భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

