చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home చైతన్యరధం

ఆ భూములు వెనక్కి

ఉరవకొండ సభలో యువనేత లోకేష్‌ హెచ్చరిక

by చైతన్యరధం
Mar 11, 2024 at 7:59am
in చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు, రాయలసీమ
ఆ భూములు వెనక్కి
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • నాలెడ్జ్‌ హబ్‌, సైన్స్‌ సిటీ పేరిట 17వేల ఎకరాల సేకరణ
  • పరిశ్రమలూ రాలేదు.. ఉద్యోగాలూ కల్పించలేదు
  • వేలకోట్ల భూదందాకు వైసీపీ సర్కారు విశ్వప్రయత్నం
  • అధికారంలోకి వచ్చాక భూములు వెనక్కి తీసుకుంటాం
  • ఉరవకొండ సభలో యువనేత లోకేష్‌ హెచ్చరిక

ఉరవకొండ (చైతన్యరథం): వైఎస్‌ హయాలో లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌ పేరుతో 8844 ఎకరాలు భూసేకరణ చేపట్టారు. సైన్స్‌ సిటీ పేరుతో 8వేల ఎకరాలు భూసేకరించారు. దాదాపు 17వేల ఎకరాలు భూసేకరణ చేపట్టినా ఒక్క పరిశ్రమ రాలేదు. కంపెనీ రాలేదు. ఒక్కరికీ ఉద్యోగం దక్కలేదు. ఇదీ వైసీపీ ప్రభుత్వ నిర్వాకం. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ఆ భూములను వెనక్కి తీసుకుంటాం. పరిశ్రమల ద్వారా ఉద్యోగాలు, ఉపాధి కల్పించే బాధ్యత తీసుకుంటామని యవనేత నారా లోకేష్‌ ప్రజలకు హామీ ఇచ్చారు. వైసీపీ హయాంలో ఎక్కడ చూసినా భూదందా, ఇసుక దందా తప్ప పాలన ఎక్కడుందని లోకేష్‌ ప్రశ్నించారు.
లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌ కోసం సేకరించిన భూముల విలువ పదివేల కోట్లు ఉంటుందని, ఆ భూమిని సీఎం మేనమామ రవీంద్రనాథ్‌ రెడ్డి 500 కోట్లకు కొట్టేయాలని ఎత్తుగడ వేశారన్నారు. ఎవరైతే భూములు తీసుకుని జగన్‌ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారో ఆ కంపెనీ దివాలా తీసిందని యువనేత వ్యాఖ్యానించారు. ఆదివారం ఉదయం ఉరవకొండలో నిర్వహించిన శంఖారావం సభలో లోకేష్‌ మాట్లాడుతూ `నేడు దేశంలో ఎక్కడ చూసినా అనంత కియా కార్లే కనిపిస్తున్నాయన్నారు. చెన్నకేశవస్వామి దేవాలయమున్న పుణ్యభూమి ఉమ్మడి అనంత అంటూ.. రాళ్లిస్తే రత్నాలు చేయగల గొప్ప వ్యక్తులు పుట్టిన నేలగా అభివర్ణించారు. కష్టాన్ని నమ్ముకున్న అనంత వాసుల తెగువను ప్రశంసిస్తూ.. ఎత్తిన పసుపు జెండా దించకుండా తెలుగుదేశానికి కావలి కాస్తున్న పసుపు సైన్యానికి పేరుపేరునా నమస్కారాలు ప్రకటించారు. భారీగా హాజరైన పార్టీ శ్రేణులు, ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ `పంట పొలాల్లో వాడే పురుగు మందులకంటే ప్రమాదకరమైన నాసిరకం మద్యాన్ని అమ్ముతూ రాష్ట్ర ప్రజల ఆరోగ్యంతో జగన్‌ చెలగాటమాడుతున్నారని లోకేష్‌ దుయ్యబట్టారు.

జగన్‌కు సవాల్‌..
ఈ సందర్భంగా జగన్‌కు ఛాలెంజ్‌ విసుర్తూ.. ‘డేట్‌, టైం నువ్వు ఫిక్స్‌ చెయ్‌. నీ బూమ్‌ బూమ్‌ షాపు వద్దకు వెళ్దాం. ప్రజలు ఏం అనుకుంటున్నారో విందాం. నువ్వు సిద్ధమా?’ అని జగన్‌ను నిలదీశారు. నాసిరకం మద్యం తాగి ముగ్గురు చనిపోయారని అనకాపల్లిలో ఓ మహిళ ఆవేదనను గుర్తు చేస్తూ, జే-బ్రాండ్‌ మద్యం విషంకంటే దారుణమని ఆందోళన వ్యక్తం చేశారు. జగన్‌ను కటింగ్‌, ఫిట్టింగ్‌ మాస్టర్‌గా అభివర్ణిస్తూ.. కరెంట్‌ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు, ఇంటిపన్ను, చెత్తపన్ను, నిత్యావసర ధరలు పెంచి జనాన్ని జగన్‌ బాదడే బాదుడని దుయ్యబట్టారు. అన్న క్యాంటీన్‌, పెళ్లికానుకలు, పండుగ కానుకలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, డ్రిప్‌ ఇరిగేషన్‌, 6 లక్షల మంది వృద్ధులకు పెన్షన్‌ను కట్‌ చేసి.. జగన్‌ కటింగ్‌ బాబాయ్‌ అవతారమెత్తాడన్నారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 23-03-2026

చైతన్యరధం ఈ పేపర్ 22-03-2026

రంజాన్‌వేళ ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న మంత్రి లోకేష్

మీకోసం సూపర్‌ `6
ప్రజల కష్టాలు చూసి చంద్రబాబు, పవన్‌ సూపర్‌ 6 హామీలు ప్రకటించారన్నారు. టీడీపీ-జనసేన ప్రభుత్వం ఏర్పడిన ఐదేళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలిస్తామని, అప్పటివరకూ ప్రతి నెలా రూ.3వేలు నిరుద్యోగ భృతి కల్పిస్తామన్నారు. స్కూల్‌కు వెళ్లే ప్రతి విద్యార్థి తల్లిదండ్రులకు ఏడాదికి రూ.15వేలు ఇస్తాం. ఇద్దరుంటే 30వేలు, ముగ్గురుంటే రూ.45 వేలు ఇస్తామన్నారు. రైతు ఆత్మహత్యలు నివారణకు ప్రతి ఏటా రూ.20వేలు ఆర్థిక సాయం చేసి ఆదుకుంటామన్నారు. ప్రతి ఇంటింకి ఏడాదికి 3 గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని, 18 నుంచి 59 ఏళ్ల మహిళలకు ప్రతి నెల రూ.15 వందల చొప్పున, ఏడాదికి రూ.18వేలు, ఐదేళ్లలో రూ.90 వేలు మీకు అందించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ హక్కు కల్పిస్తామన్నారు.

డిక్లరేషన్‌తో బీసీల ప్రాభవం
26వేల మంది బీసీలపై అక్రమ కేసులు, 300మంది బీసీలను పొట్టనబెట్టుకోవడం తప్ప.. ఐదేళ్లలో బీసీలకు వైసీపీ చేసిందేమిటని ప్రశ్నించారు? చంద్రయ్య, జాలయ్య, అమర్‌నాథ్‌గౌడ్‌లాంటి వారిని చంపేశారు. బీసీ సబ్‌ప్లాన్‌ నిధులు రూ.75వేల కోట్లను దారిమళ్లించారన్నారు. వెనుకబడిన వర్గాల సముద్ధరణకు టీడీపీ-జనసేన బీసీ డిక్లరేషన్‌ ప్రకటించిందన్నారు. 50 ఏళ్లు నిండిన బీసీలకు నెలకు 4వేల పెన్షన్‌ ఇస్తామని, బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తామని, బీసీలకు ఐదేళ్లలో లక్షా 50వేల కోట్లు ఖర్చు చేస్తామన్నారు. స్థానిక సంస్థల్లో వైసీపీ సర్కారు కోతపెట్టిన పదిశాతం రిజర్వేషన్లు పునరుద్ధరిస్తామన్నారు. బీసీ సాధికారత కోసం రూ.పదివేల కోట్లు ఖర్చుచేస్తామని, ఆదరణ కింద రూ.5వేల కోట్లు పనిముట్ల కోసం ఖర్చుపెడతామన్నారు.

చంద్రన్న బీమా కింద రూ.10 లక్షలు, పెళ్లి కానుక కింద బీసీలకు రూ.లక్ష అందిస్తామని, బీసీలకు పర్మినెంట్‌ క్యాస్ట్‌ సర్టిఫికెట్లు, పెండిరగ్‌లో ఉన్న బీసీ భవనాల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. అన్న ఎన్టీఆర్‌ను ఎమ్మెల్యేగా చేసి, ముఖ్యమంత్రిని చేసిన జిల్లా అనంతపురం. మామయ్య హరికృష్ణను, మీ అందరి బాలయ్య, నాకు ముద్దుల మామయ్య బాలకృష్ణను రెండుసార్లు గెలిపించారని గుర్తు చేశారు. అందుకే డబుల్‌ ప్రేమతో ఐదేళ్లలో అనంతను టీడీపీ ఎంతో అభివృద్ధి చేసిందన్నారు.

అక్కడ కిమ్‌! ఇక్కడ జిమ్‌!!
ఉరవకొండ (చైతన్యరథం): వైసీపీ నేత జగన్‌ను ఉత్తర కొరియా నియంత కిమ్‌తో పోలుస్తూ.. యువనేత నారా లోకేష్‌ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఉత్తర కొరియాకు ఓ నియంతున్నాడు. పేరు కిమ్‌. ఆంధ్రలోనూ ఓ నియంతున్నాడు. పేరు జిమ్‌. ఆకారాలు వేరేమోగానీ, ఆలోచనలు, దుర్మార్గాలూ సేమ్‌ టు సేమ్‌ `అని యువనేత లోకేష్‌ చమత్కరించారు. ఉత్తరకొరియాలో కిమ్‌కు 17 ప్యాలెస్‌లుంటే, ఇక్కడ జగన్‌కు 6 ప్యాలెస్‌లున్నాయన్నారు. కిమ్‌.. తన సొంత బాబాయిని లేపేశాడు. సొంత అన్ననీ లేపేశాడు. ఆంధ్రా జిమ్‌ జగన్‌ కూడా అంతే. సొంత బాబాయిని లేపేశాడు. సొంత తల్లి, చెల్లినీ మెడపట్టుకుని బయటకు గెంటేశాడు. కిమ్‌ వీడియో గేమ్‌లు ఆడతాడు. జగన్‌ పబ్‌జీ ఆడతాడు. కిమ్‌ దొంగ నోట్లు, మాదకద్రవ్యాలతో దోచుకుంటాడు. జగన్‌ దొంగనోట్లు, డ్రగ్స్‌, నాసిరకం మందు విక్రయాలతో దోచుకుంటాడు. నార్త్‌ కొరియాలో కిమ్‌ 340మందిని చంపేశాడు.

ఆంధ్రా జిమ్‌ వేలాదిమందిని జైళ్లలో కుక్కాడు. ఆంధ్రా కిమ్‌ ఎస్సీ, ఎస్టీలను ఊచకోత కోశాడు. అనేకమందిని పొట్టనబెట్టుకున్నాడు. దళిత డాక్టర్‌ సుధాకర్‌ను హింసించి ఎలా చనిపోయేలా చేశాడో చూశాం. హామీ నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేసిన అంగన్‌వాడీలను కొట్టి జైలుకు పంపడం జగన్‌కే చెల్లిందని దుయ్యబట్టారు. నార్త్‌ కొరియాలో కిమ్‌ తనను ప్రశ్నిస్తే సంక్షేమ పథకాలు కోసేస్తాడు. ఏపీ జిమ్‌ కూడా అంతే. సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టినా జైలుకు పంపిస్తాడు ఆంధ్రా జిమ్‌ అన్నారు. నాపై 22 కేసులు పెట్టారు. ఈ జిమ్‌ ఎవరో అర్థమైందా రాజా.. జగన్‌! అని లోకేష్‌ ఎద్దేవా చేశారు.

Previous Post

మేనిఫెస్టో పేరుతో మరో మోసానికి సిద్ధమైన జగన్‌

Next Post

‘సిద్ధం’ సభ కోసం వైసీపీ అరాచకం

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 23-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 23-03-2026

కార్యకర్త
@ March 23, 2026
చైతన్యరధం ఈ పేపర్ 22-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 22-03-2026

కార్యకర్త
@ March 22, 2026
రంజాన్‌వేళ ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న మంత్రి లోకేష్
ఆంధ్రప్రదేశ్

రంజాన్‌వేళ ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న మంత్రి లోకేష్

చైతన్యరధం
@ March 22, 2026
ప్రజా నాయకుడు.. శ్రీవారి సేవకుడు
ఆంధ్రప్రదేశ్

ప్రజా నాయకుడు.. శ్రీవారి సేవకుడు

చైతన్యరధం
@ March 22, 2026
శ్రీవారి పాదసన్నిధిలో..
ఆంధ్రప్రదేశ్

శ్రీవారి పాదసన్నిధిలో..

చైతన్యరధం
@ March 22, 2026
మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి
ఆంధ్రప్రదేశ్

మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి

చైతన్యరధం
@ March 22, 2026
శ్రీవారి పాదసన్నిధిలో చంద్రబాబు కుటుంబం
ఆంధ్రప్రదేశ్

శ్రీవారి పాదసన్నిధిలో చంద్రబాబు కుటుంబం

చైతన్యరధం
@ March 22, 2026
భక్తుల నమ్మకాన్ని కాపాడాలి…
ఆంధ్రప్రదేశ్

భక్తుల నమ్మకాన్ని కాపాడాలి…

చైతన్యరధం
@ March 22, 2026
Load More

ముఖ్య వార్తలు

పంట నష్టంపై రెండురోజుల్లో నివేదిక

పంట నష్టంపై రెండురోజుల్లో నివేదిక

చైతన్యరధం
@ March 21, 2026
మాట ఇచ్చాం… అమలు చేశాం!

మాట ఇచ్చాం… అమలు చేశాం!

చైతన్యరధం
@ March 20, 2026
అగ్రస్థానం.. నా సంకల్పం

అగ్రస్థానం.. నా సంకల్పం

చైతన్యరధం
@ March 20, 2026
పోలవరం నిర్వాసితులను గుండెల్లో పెట్టుకుంటాం

పోలవరం నిర్వాసితులను గుండెల్లో పెట్టుకుంటాం

చైతన్యరధం
@ March 19, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

రంజాన్‌వేళ ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న మంత్రి లోకేష్

రంజాన్‌వేళ ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న మంత్రి లోకేష్

చైతన్యరధం
@ March 22, 2026
ప్రజా నాయకుడు.. శ్రీవారి సేవకుడు

ప్రజా నాయకుడు.. శ్రీవారి సేవకుడు

చైతన్యరధం
@ March 22, 2026
మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి

మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి

చైతన్యరధం
@ March 22, 2026
శ్రీవారి పాదసన్నిధిలో చంద్రబాబు కుటుంబం

శ్రీవారి పాదసన్నిధిలో చంద్రబాబు కుటుంబం

చైతన్యరధం
@ March 22, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist