చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

ఎక్లాట్‌ రాక విజయవాడకు గర్వకారణం

మంత్రి నారా లోకేష్‌ స్పష్టీకరణ

by చైతన్యరధం
Jul 20, 2025 at 6:05am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
ఎక్లాట్‌ రాక విజయవాడకు గర్వకారణం
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • మెడికల్‌ కోడిరగ్‌లో అపార అనుభవం, నైపుణ్యం కంపెనీ సొంతం
  • ఏపీలో నగరాలన్నీ డిజిటల్‌ గ్రోత్‌ ఇంజన్లుగా ఎదగాలి
  • చంద్రబాబు బ్రాండ్‌ వల్లే రాష్ట్రానికి కంపెనీలు
  • మంత్రి నారా లోకేష్‌ స్పష్టీకరణ
  • గన్నవరం మేధా హైటెక్‌ సిటీలో ఎక్లాట్‌ హెల్త్‌ సొల్యూషన్స్‌ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి
  • ప్రస్తుతం 300, ఏడాదిలోగా మరో వెయ్యి ఉద్యోగాలు కల్పించనున్న సంస్థ

విజయవాడ (చైతన్యరథం): ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి నగరం డిజిటల్‌ గ్రోత్‌ ఇంజన్‌గా ఎదగాలని కోరుకుంటున్నామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌ ఉద్ఘాటించారు. వైద్య సాంకేతికత, సేవల రంగంలో ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన ఎక్లాట్‌  హెల్త్‌ సొల్యూషన్స్‌ సంస్థ విజయవాడ గన్నవరం సమీపంలో కేసరపల్లిలోని మేధా హైటెక్‌ సిటీ భవనంలో నూతనంగా ఏర్పాటుచేసిన కార్యాలయాన్ని మంత్రి నారా లోకేష్‌ శనివారం రిబ్బన్‌ కట్‌ చేసి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేశారు. అంతకుముందు మేధ టవర్స్‌ ప్రాంగణానికి చేరుకున్న మంత్రి నారా లోకేష్‌కు నిర్వాహకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ప్రాంగణంలో మంత్రి లోకేష్‌ మొక్కను నాటారు.
ఆరోగ్య సంరక్షణలో అమెరికాలోనే అతిపెద్ద వ్యవస్థను ఎక్లాట్‌ హెల్త్‌ సొల్యూషన్స్‌ కంపెనీ కలిగి ఉంది. రెవెన్యూ, డేటా అనలటిక్స్‌, ఏఐ ఆధారిత క్లినికల్‌ డాక్యుమెంటేషన్‌ సొల్యుషన్స్‌లో ఈ కంపెనీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. మెడికల్‌ కోడిరగ్‌, బిల్లింగ్‌, ఆడిటింగ్‌, క్లినికల్‌ డాక్యుమెంటేషన్‌, హెచ్‌సీసీ కోడిరగ్‌, సాఫ్ట్‌వేర్‌ ఆధారిత పరిష్కారాల్లో ఎక్లాట్‌ హెల్త్‌ సొల్యూషన్స్‌ సంస్థకు నైపుణ్యం ఉంది. 2008లో కార్తీక్‌ పొల్సాని ఈ సంస్థను స్థాపించారు. స్నేహ పొల్సాని నేతృత్వంలో మరింత వేగంగా కంపెనీ తన కార్యకలాపాలను విస్తరిస్తోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 3వేలకు పైగా నిపుణులను నియమించుకున్న ఈ సంస్థ మనదేశంలోని హైదరాబాద్‌, కరీంనగర్‌, లక్నో, ముంబై నగరాల్లో కంపెనీ తన కార్యకలాపాలను విస్తరించింది. విజయవాడలోని మేధ ఐటీ పార్క్‌లో 25వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నూతన కార్యాలయాన్ని ఏర్పాటుచేశారు. స్థాపించిన రెండు నెలల్లోనే 300కు పైగా ఉద్యోగ నియామకాలు చేపట్టారు. వచ్చే ఏడాదిలోగా మరో వెయ్యి మందికి ఉద్యోగాలు కల్పించనున్నారు.

విజయవాడకు గర్వకారణం
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో మంత్రి నారా లోకేష్‌ మాట్లాడుతూ.. విజయవాడలో మెడికల్‌ కోడిరగ్‌ కంపెనీ ఎక్లాట్‌ హెల్త్‌ సొల్యూషన్స్‌ నూతన కార్యాలయాన్ని ప్రారంభించడాన్ని ఎంతో గౌరవంగా భావిస్తున్నానన్నారు. విజయవాడ నగరానికి ఇది ఎంతో గర్వకారణం కానుంది. అంతర్జాతీయ ఐటీ రంగంలో ఏపీ ఎదుగుతున్న తీరుకు ఇది నిదర్శనంగా నిలుస్తుంది. ముందుగా సంస్థ స్థాపకులు కార్తిక్‌ పోల్సాని, స్నేహ పోల్సానికి హృదయపూర్వక అభినందనలు. అందరూ మెగా నగరాలపై దృష్టి సారించగా.. మీరు చిన్న నగరాలపై నమ్మకం ఉంచారు. కొద్దిమందితో ప్రారంభమైన ఈ సంస్థ, ప్రస్తుతం 3500 మందికి పైగా ఉద్యోగులను కలిగి ఉంది. కరీంనగర్‌ను ఒక రిస్క్‌గా కాకుండా అవకాశంగా చూసి విజయవంతమయ్యారు. ఇప్పుడు అదే దృఢ సంకల్పంతో విజయవాడకు వచ్చారు. ఇది కేవలం కంపెనీ ప్రారంభం మాత్రమే కాదు.. ఎంతోమంది కలల ప్రారంభం. డిజిటల్‌ సాధికారతకు నాందిగా మంత్రి లోకేష్‌ అభివర్ణించారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 02-05-2026

కార్మికులకు లేబర్ అడ్డాలు

చైతన్యరధం ఈ పేపర్ 01-05-2026

అభివృద్ధి వికేంద్రీకరణ మా నినాదం
ప్రారంభ దశలోనే ఎక్లాట్‌ సంస్థ 300 ఉద్యోగాలు కల్పించడం సంతోషంగా ఉంది. ఏడాదిలో వెయ్యి ఉద్యోగాలకు విస్తరించాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నారు. విశాఖపట్నంను ప్రపంచ స్థాయి ఐటీ కేంద్రంగా అభివృద్ధి చేస్తాం. తిరుపతి, కాకినాడ, అనంతపురం, రాజమహేంద్రవరం, కర్నూలు, నెల్లూరు వంటి నగరాలు కూడా డిజిటల్‌ వృద్ధికి హబ్‌లుగా మారాలి. ఒకే రాజధాని అమరావతి, అభివృద్ధి వికేంద్రీకరణ మా నినాదం. అనంతపూర్‌కు కియాను తీసుకువచ్చాం. రెన్యూవబుల్‌ ఎనర్జీ సంస్థలు కర్నూలు, అనంతపురానికి తీసుకువస్తున్నాం. కడప, చిత్తూరుకు ఎలక్ట్రానిక్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ కంపెనీలు వచ్చాయి. నెల్లూరుకు ఎల్జీ, డైకిన్‌ కంపెనీలు వచ్చాయి. క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ ు అమరావతి కేంద్రం కానుంది. ఆసియాలోనే మొదటి 156 క్యూబిట్‌ క్వాంటమ్‌ కంప్యూటర్‌ అమరావతిలో ఏర్పాటుకానుంది. ఉత్తరాంధ్రలో ఫార్మా, గోదావరి జిల్లాల్లో ఆక్వాను అభివృద్ధి చేస్తాం. ఉత్తరాంధ్రకు ఇండియాలోనే అతిపెద్ద స్టీల్‌ కంపెనీ ఆర్సెల్లర్‌ మిట్టల్‌ రానుంది. మనకు దార్శనిక నాయకుడు చంద్రబాబు ఉండటం వరం. 20 ఏళ్ల ముందు జరిగేదాన్ని ఆయన ఇప్పుడు ఆలోచిస్తారని మంత్రి లోకేష్‌ అన్నారు.

చంద్రబాబు బ్రాండ్‌ వల్లే కంపెనీల రాక
ఏపీలో భవిష్యత్‌లో విస్తృత అవకాశాలు రానున్నాయి. చాలామంది అడుగుతారు. కర్ణాటకకు బెంగళూరు ఉంది, తెలంగాణకు హైదరాబాద్‌, తమిళనాడుకు చెన్నై, ఆంధ్రప్రదేశ్‌కు ఏముందని అడుగుతారు. నా సమాధానం ఒకటే.. మాకు చంద్రబాబు బ్రాండ్‌ ఉందని చెబుతాను. నేడు ఏపీకి అనేక కంపెనీలు వస్తున్నాయంటే చంద్రబాబు బ్రాండే కారణం. చిత్తూరు జిల్లా జీడి నెల్లూరులో నేను యువగళం పాదయాత్ర చేస్తున్నప్పుడు బడ్డీకొట్టు నడుపుకునే ఓ మహిళను కలిశాను. ఆమె భర్త మద్యానికి బానిసై చనిపోయాడు. తన ఇద్దరు పిల్లలను కష్టపడి చదివిస్తున్నారు. ప్రభుత్వం ఏం చేయాలని ఆమెను అడిగితే చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు కల్పించాలని అడిగారు. ఆ ప్రభావంతోనే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చాం. ఇప్పటికే 10 లక్షల ఉద్యోగాల కల్పనకు ఎంవోయూలు కుదుర్చుకున్నాం. స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ విధానాల వల్లే ఇదంతా సాధ్యమవుతోంది. యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషిచేస్తోందని మంత్రి లోకేష్‌ తెలిపారు.

విజయం కోసం నిరంతరం శ్రమించాలి
విజయానికి దగ్గరి దారులు లేవు. అందుకు యువత నిరంతరం శ్రమించాలి. నేను నా జీవితంలో కష్టమైన మార్గాన్ని ఎంచుకున్నా. టీడీపీ ఎప్పుడూ గెలవని మంగళగిరి నియోజకవర్గం నుంచి 2019లో పోటీచేసి 5300 ఓట్ల తేడాతో ఓడిపోయాను. మొదటి రోజు ఎంతో బాధపడ్డాను. తర్వాత ఐదేళ్ల పాటు శ్రమించి ప్రజల మనసు గెలుచుకున్నా. 2024 ఎన్నికల్లో ఏపీలోనే మూడో అత్యధిక మెజార్టీతో విజయం సాధించాను. జీవింతంలో అనేక ఇబ్బందులు, కష్టాలు ఉంటాయి. వాటన్నింటినీ అధిగమించాలని మంత్రి లోకేష్‌ పిలుపు ఇచ్చారు.

మహిళలను కించపరిచే మాటలు మానుకోవాలి
మహిళలను కించపరిచే విధంగా చాలా మంది మాట్లాడతారు. ఆ పదాలకు ఫుల్‌ స్టాప్‌ పెట్టాలి. మన ఇంటి నుంచే మార్పు మొదలుకావాలి. గాజులు తొడుక్కున్నావా, చీర కట్టుకున్నావా, ఆడపిల్లలాగా ఏడవద్దు, అమ్మాయిలాగా ప్రవర్తించవద్దు అనే మాటలు ఎప్పుడు విన్నా నాకు బాధ కలుగుతుంది. దీనికి ఫుల్‌స్టాప్‌ పెట్టాల్సిన బాధ్యత ఇక్కడున్న మహిళలందరిపైనా ఉంది. ఇంట్లో ఎవరైనా ఈ పదాలు వాడితే వద్దని గట్టిగా చెప్పాలి. ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం మా అమ్మ. హెరిటేజ్‌ కంపెనీని మహిళలైన మా అమ్మ, బ్రాహ్మణి సమంవంతంగా నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరిలో ఆ శక్తి ఉంటుంది. ఈ రోజు నా క్రెడిట్‌ బిల్లు బ్రాహ్మణి చెల్లిస్తున్నారు. కార్తీక్‌ పొల్సాని, స్నేహ పొల్సానికి అభినందనలు. ఎక్కడున్నా తెలుగు ఆంత్రపెన్యూర్స్‌ను ప్రోత్సహిస్తామని మంత్రి లోకేష్‌ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎక్లాట్‌ హెల్త్‌ సొల్యూషన్స్‌ సంస్థ వ్యవస్థాపకులు, సీఈవో కార్తీక్‌ పొల్సాని, సీవోవో స్నేహ పొల్సాని, ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌ శ్రీకాంత్‌ గుర్రం, మోహిత్‌ శ్రీవాస్తవ, విజయవాడ బ్రాంచ్‌ డీజీఎం సురేష్‌ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు యార్లగడ్డ వెంకట్రావు, వర్ల కుమార్‌ రాజా, తదితరులు పాల్గొన్నారు.

Previous Post

స్వచ్ఛాంధ్రతోనే స్వర్ణాంధ్ర

Next Post

చైతన్యరధం ఈ పేపర్ 20-07-2025

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 02-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 02-05-2026

కార్యకర్త
@ May 2, 2026
కార్మికులకు లేబర్ అడ్డాలు
ఆంధ్రప్రదేశ్

కార్మికులకు లేబర్ అడ్డాలు

చైతన్యరధం
@ May 2, 2026
చైతన్యరధం ఈ పేపర్ 01-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 01-05-2026

కార్యకర్త
@ May 1, 2026
నడకలేదు, పరుగులే!
ఆంధ్రప్రదేశ్

నడకలేదు, పరుగులే!

చైతన్యరధం
@ May 1, 2026
చరిత్ర సృష్టించడానికి మేం రెడీ
ఆంధ్రప్రదేశ్

చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చైతన్యరధం
@ May 1, 2026
ఈ అవార్డు.. సమష్టి విజయం
ఆంధ్రప్రదేశ్

ఈ అవార్డు.. సమష్టి విజయం

చైతన్యరధం
@ May 1, 2026
అధ్యయన కేంద్రాలుగా వర్శిటీలు
ఆంధ్రప్రదేశ్

అధ్యయన కేంద్రాలుగా వర్శిటీలు

చైతన్యరధం
@ May 1, 2026
పసుపు జెండా పౌరుషం తగ్గలేదు
ఆంధ్రప్రదేశ్

వైసీపీ దుష్టప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టండి

చైతన్యరధం
@ May 1, 2026
Load More

ముఖ్య వార్తలు

కార్మికులకు లేబర్ అడ్డాలు

కార్మికులకు లేబర్ అడ్డాలు

చైతన్యరధం
@ May 2, 2026
చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చైతన్యరధం
@ May 1, 2026
పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

చైతన్యరధం
@ April 30, 2026
నూతన ఆవిష్కరణలకు వర్సిటీలు వేదిక

నూతన ఆవిష్కరణలకు వర్సిటీలు వేదిక

చైతన్యరధం
@ April 28, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

కార్మికులకు లేబర్ అడ్డాలు

కార్మికులకు లేబర్ అడ్డాలు

చైతన్యరధం
@ May 2, 2026
నడకలేదు, పరుగులే!

నడకలేదు, పరుగులే!

చైతన్యరధం
@ May 1, 2026
చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చైతన్యరధం
@ May 1, 2026
ఈ అవార్డు.. సమష్టి విజయం

ఈ అవార్డు.. సమష్టి విజయం

చైతన్యరధం
@ May 1, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist