అమరావతి (చైతన్య రథం): తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. ఈమేరకు ఎక్స్ వేదికపై పోస్టు పెడుతూ.. “రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం కూటమి పక్షాల ఐక్యతకు మీరు అందిస్తున్న సహకారం అభినందనీయం. నాకున్న అనుభవానికి తోడుగా ఉత్తమ ఆకాంక్షలు, ఆదర్శాలు కలిగిన మీవంటి ప్రజానేతలు కలిసివస్తే రాష్ట్రానికి, దేశానికి ఎంతటి మేలు జరుగుతుందో గత 20 నెలల పాలన ఒక నిదర్శనం. కూటమి ఐక్యతాస్ఫూర్తి ఇలాగే పదికాలాలు కొనసాగాలని కోరుకుంటున్నా” అని చంద్రబాబు పేర్కొన్నారు.
పవనన్నకు కతజ్ఞతలు తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన జనసేన అధ్యక్షులు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్ ధన్యవాదాలు తెలిపారు. “ఎక్స”లో పోస్టు పెడుతూ.. “రాష్ట్ర అభివృద్ధి, ప్రజాసంక్షేమం కోసం కూటమి స్ఫూర్తి వివరించిన పవనన్నకు తెలుగుదేశం తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను” అని పేర్కొన్నారు.












