చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

ప్రిజనరీ నోట విజన్‌ మాటా!

ప్రజలను ఆదుకునేందుకే సూపర్‌`6

చైతన్యరధం by చైతన్యరధం
March 8, 2024
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
ప్రిజనరీ నోట విజన్‌ మాటా!
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • లక్ష కోట్లు దోచిన దొంగ దృష్టి దోపిడీపైనే..
  • దోపిడీదారులకు అభివృద్ధి విజన్‌ ఉంటుందా
  • బాబాయ్‌ని లేపేసిందెవరో చెప్పాలి
  • తల్లి, చెల్లిని తరిమేసినవాడు మహిళలకు న్యాయం చేస్తాడా
  • ప్రజలను ఆదుకునేందుకే సూపర్‌`6

హిందూపూర్‌(చైతన్యరథం): ప్రిజనరీ జగన్‌ నోట విజన్‌ అనేమాట వినటం ప్రపంచంలో ఎనిమిదో వింత గా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ఎద్దేవా చేశారు. లక్ష కోట్లు దోచేసి, అక్రమ ఆస్తుల కేసులు, అవినీతి కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చినవాళ్లకు అభివృద్ధి విజన్‌ ఉంటుందా అని ప్రశ్నించారు. శ్రీసత్య సాయి జిల్లా హిందూపూర్‌లో గురువారం జరిగిన శంఖారావం సభలో యువనేత లోకేష్‌ మాట్లాడుతూ ఉమ్మడి అనంతపురం సభ అదిరిపోయిందన్నారు. లేపాక్షి వీరభద్ర ఆలయం, సుగూరు ఆంజనేయస్వామి ఆలయం, పుట్టపర్తిలో భగవాన్‌ సత్యసాయి నిలయం ఉన్న పుణ్యభూమి ఈఅనంతపురం.ప్రపంచంలోనే అతి పెద్ద,పవిత్రమైన తిమ్మమ్మ మర్రిమానుఉన్న పుణ్యభూమి అనంతపురం. కష్టాన్ని నమ్ముకున్న వారు అనంతపురం ప్రజలు. వీరికి మంచిచేస్తే పైకి తీసుకెళ్తారు. తప్పుచేస్తే ఇదే గడ్డపై పాతేసే శక్తి అనంతపురానికి ఉంది.ఇంతటి చరిత్రఉన్న అనంతపురం గడ్డపై రెండోసారి పర్యటిస్తుం డటం తన అదృష్టంగా భావిస్తున్నానని లోకేష్‌ అన్నారు.

ఎనిమిదో వింత
విశాఖకు వెళ్లిన జగన్‌ తనకు విజన్‌ ఉంది అంటు న్నాడు. ఇదిమనం నమ్మాలా? ప్రపంచంలో 7 వింతలు ఉన్నాయి. జగన్‌ మాటను 8వ వింతగా చెప్పుకోవచ్చు. ప్రిజనరీ జగన్‌కు విజన్‌ ఉందంటా? జైలుకు వెళ్లిన వాళ్లకు విజన్‌ ఉంటుందా? మద్యం ద్వారా ఎలా సంపాదించాలి? క్వారీల్లో ఎలా డబ్బులు సంపాదిం చాలి… ఇసుకలో ఎలా డబ్బులు లేపేయాలనే ఆలోచన ఉంటుంది. గనులు, సెంటుపట్టా భూమల్లో ఎలా డబ్బులు దోచేయాలనే విజన్‌ ఉన్న వ్యక్తి జగన్‌రెడ్డి. మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడారు. విశాఖలో మూడు పనులు మాత్రం చేశారు. మొదటిది రూ.500కోట్ల ఖర్చుతో ప్యాలెస్‌ కట్టుకున్నా డు. అందులో బాత్‌రూమ్‌ ఖర్చు రూ.25 లక్షలు. ఇక విశాఖలో బస్‌షెల్టర్లు కట్టారు. గట్టిగా గాలి వస్తే కూలి పోతున్నాయి. చివరగా విశాఖ తీరంలో ఫ్లోటింగ్‌ బ్రిడ్జి కడితే వారంలోనే అది కొట్టుకుపోయింది. ఇప్పుడు ఏకంగా విశాఖకు పరిశ్రమలు తీసుకువస్తాను, విజన్‌ ఉందని చెబుతున్నాడని లోకేష్‌ దుయ్యబట్టారు.

100 సంక్షేమ పథకాలు రద్దు
సైకో జగన్‌ అద్భుతమైన కటింగ్‌, ఫిటింగ్‌ మాస్టర్‌. బల్లపైన బులుగు బటన్‌. బల్ల కింద రెడ్‌ బటన్‌. బల్ల పైన బటన్‌ నొక్కి రూ.10 జనం అకౌంట్‌లో వేసి రెడ్‌ బటన్‌తో రూ.100 లాగేస్తారు. కరెంట్‌ ఛార్జీలు 9సార్లు పెంచి బాదుడే బాదుడు. ఆర్టీసీ ఛార్జీలు మూడు సార్లు పెంచి బాదుడే బాదుడు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు, గ్యాస్‌ ధరలు, క్వార్టర్‌ బాటిల్‌, ఇంటి పన్ను, చెత్తపన్ను పెంచి బాదుడే బాదుడు. ఇక కటింగ్‌ మాస్టర్‌..అన్న క్యాంటీన్‌ కట్‌, పెళ్లికానుకలు కట్‌, పండుగ కానుకలు, చంద్రన్న బీమా, డ్రిప్‌ ఇరిగేషన్‌, 6 లక్షల మంది వృద్ధులకు పెన్ష న్‌ కట్‌. 100సంక్షేమ పథకాలు కట్‌చేసిన ఏకైక ముఖ్య మంత్రి ఈ సైకో జగన్‌రెడ్డి అని లోకేష్‌ దుయ్యబట్టారు.

సూపర్‌`6 హామీలు
పవనన్న, చంద్రబాబు కలిసి బాబు సూపర్‌-6 హామీలు ప్రకటించారు. మొదటిది నిరుద్యోగ యువతీ, యువకులకు ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు మనం కల్పిస్తాం. ఉద్యోగాలు వచ్చే వరకు ప్రతినెల రూ.3వేలు నిరుద్యోగ భృతి కల్పిస్తాం. అమ్మక వందనం కింద స్కూల్‌కు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15వేలు ఇస్తాం. ఇంట్లో ముగ్గురుంటే రూ.45 వేలు వస్తాయి. ప్రతిరైతుకు ఆర్థికసాయం కోసం ఏడాదికి రూ.20వేలు మన ప్రభుత్వం ఇస్తుంది. ప్రతి ఇంటికి ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తాం.మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే సౌకర్యం కూడా మన ప్రభు త్వం కల్పిస్తుంది. ఇక 18 నుంచి 59 ఏళ్ల మహిళలకు నెలకు రూ.1500 చొప్పున ఏడాదికి రూ.18వేలు, ఐదేళ్లలో రూ.90 వేలు ఇస్తామని లోకేష్‌ వివరించారు.

టీడీపీ పాలనలోనే అనంత అభివృద్ధి
ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజలు విశ్వవిఖ్యాత ఎన్టీఆర్‌ దగ్గరి నుంచి చంద్రబాబు వరకు ఎంతో ప్రేమ చూపిచారు, అందుకే టీడీపీ ఐదేళ్ల పాలనలో చంద్ర బాబు ఎంతో అభివృద్ధి చేశారు. కరవు జిల్లాలో ఏకంగా కార్లు తయారుచేసే పరిశ్రమ తీసుకువచ్చిన విజనరీ చంద్రబాబునాయుడు.కియా అనుబంధ సంస్థల ద్వారా 50వేల మందికి ఉద్యోగాలు కల్పించారు. ఐదేళ్లలో లక్షా 30వేల మంది రైతులకు 90శాతం సబ్సిడీ ద్వారా డ్రిప్‌ ఇరిగేషన్‌ కూడా అందించాం. అనంతను హార్టి కల్చర్‌ హబ్‌గా తీర్చిదిద్దాం. కరవు వస్తే రైతులను ఆదుకునేందుకు ట్యాంకర్ల ద్వారా నీరు అందించి పంటలను కాపాడాం.ఒకే సంవత్సరం ఇన్‌పుట్‌ సబ్సిడీ ద్వారా రూ.2వేల కోట్లు రైతులకు అందజేశాం. జిల్లా లో రోడ్లు, బ్రిడ్జిలు, సాగునీటి పథకాలు వచ్చాయంటే దానికి కారణం తెలుగుదేశంపార్టీ. హంద్రీ-నీవా ప్రాజె క్టు ఫేజ్‌-2, హెచ్‌ఎల్‌సీ హైలెవల్‌ మెయిన్‌ కెనాల్‌, మిడ్‌పెన్నా సౌత్‌ కెనాల్‌, గుంతకల్లు బ్రాంచ్‌ కెనాల్‌, ధర్మవరం బ్రాంచ్‌ కెనాల్‌ పనులు చేసింది మన తెలుగుదేశం పార్టీ.

హామీలు గాలికొదిలేసిన జగన్‌
2019లో పాలిచ్చే ఆవును కాదని తన్నే దున్నపోతు ను తెచ్చుకున్నారు. అనంతపురం జీవనాడిగా ఉన్న డ్రిప్‌ ఇరిగిషేన్‌ పథకాన్ని ఈ సైకో జగన్‌ రద్దు చేశాడు. 50ఏళ్లలో ఎప్పుడూ చూడని కరవు అనంతపురం జిల్లా లో ఉంది. అలాంటి దరిద్రపు పాదం ఈ జగన్‌రెడ్డిది. రైతులకు కనీసం ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వడానికి కూడా జగన్‌రెడ్డికి చేతులు రాలేదు. పట్టు రైతులను ఆదు కుంటానని హామీ ఇచ్చిన జగన్‌రెడ్డి గాలికి వదిలేశాడు. రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తా మని చెప్పి ఒక్క రూపాయి ఇవ్వలేదు. పండిరచిన పంటలకు గిట్టుబాటు ధర కూడా లేదు. మన ప్రభుత్వ హయాంలో దాదాపు 15లక్షల ఎకరాల్లో వేరుశనగ సాగు చేసే వాళ్లు. ఈ ప్రభుత్వం పంట కొనుగోలు చేయకపోవటంతో నేడు మూడు లక్షల ఎకరాలకు పడి పోయింది. హంద్రీనీవా ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేస్తామని చెప్పి తట్టమట్టి కూడా వేయలేదు. హెచ్‌ఎల్‌ సీని ఆధునీకరిస్తామని చెప్పి రూపాయి ఖర్చుపెట్టలేదు. టీడీపీ హయాంలో జీడిపల్లి-పేరూరు ప్రాజెక్టును ప్రారంభిస్తే జగన్‌రెడ్డి వెళ్లి మళ్లీ శిలాఫలకాలు వేశాడు. ఎక్కడ చూసినా శిలాఫలకాలు దిష్టిబొమ్మల్లా కనిపిస్తు న్నాయి. ఆనాడు రూ.840 కోట్ల రూపాయలతో మెగా డ్రిప్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టును ఈ ప్రాంతానికి తీసుకు వచ్చాం. సైకో జగన్‌ నేడు దానిని రద్దు చేశాడని లోకేష్‌ విమర్శించారు.

టీడీపీ కంచుకోట హిందూపూర్‌
టీడీపీకి కంచుకోట అంటే గుర్తుకువచ్చే మొదటి నియోజకవర్గం హిందూపూర్‌.మా కుటుంబాన్ని ఆశీర్వ దించింది, దీవించింది హిందూపూర్‌ నియోజకవర్గం. ఆనాడు అన్న ఎన్టీఆర్‌ని ఎమ్మెల్యేగా గెలిపించి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా పంపించిన ఘనత హిందూ పూర్‌ నియోజకవర్గానికి దక్కుతుంది. మా మావయ్య హరికృష్ణని కూడా శాసనసభకు పంపించిన నియోజక వర్గం హిందూపూర్‌. రెండో మామయ్య నందమూరి బాలకృష్ణని రెండుసార్లు శాసనసభకు పంపించిన ఘన త ఈ హిందూపూర్‌ది. టీడీపీ హయాంలో హిందూ పూర్‌ను పెద్దఎత్తున అభివృద్ధి చేశాం.ఆనాడు బాలకృష్ణ రూ.2వేల కోట్లు ఖర్చుపెట్టి అనేక అభివృద్ధి కార్య క్రమాలు మన నియోజకవర్గంలో చేశారు. గొల్లపల్లి రిజర్వాయర్‌ నుంచి పైప్‌లైన్‌ వేసి హిందూపూర్‌ పట్ట ణానికి తాగునీరు అందించిన వ్యక్తి బాలయ్య బాబు. పంటకుంటలు తవ్వారు. సీసీ రోడ్లు వేశారు. ఆసుపత్రు లు అప్‌గ్రేడ్‌ చేశారు. తాగునీటి ట్యాంక్‌లు ఏర్పాటు చేశారు. పాడిపరిశ్రమను ప్రోత్సహించారు. నేను పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు బాలయ్య బాబు నుంచి కాగితం రావడమే ఆలస్యం.. వెంటనే సంతకం పెట్టి శాంక్షన్‌ చేసే పంపేవాడ్ని. ఇక ఇరిగేషన్‌ శాఖ నుంచి కూడా అనేక ప్రాజెక్టులు తీసుకువచ్చాం. టిడ్కో కింద 2800 ఇళ్లు కట్టించిన ఘనత బాలయ్యది. బీసీ సోదరులకు, ఎస్సీ, ఎస్టీ సోదరులకు పెద్ద సంఖ్యలో రుణాలు ఇచ్చామని లోకేష్‌ చెప్పారు.

పాపాల పెద్దిరెడ్డిని తరిమికొట్టాలి
కానీ మా జిల్లా నుంచి ఒకడొచ్చాడు. వాడి పేరు పాపాల పెద్దిరెడ్డి. మా సొంత జిల్లా చిత్తూరును క్యాన్సర్‌ లా తినేస్తున్నాడు. అక్కడ నేను పాదయాత్ర చేసేప్పుడు ఎక్కడికి వెళ్లినా పిఎల్‌ఆర్‌ పేరుతో టిప్పర్లు కనిపించేవి. ఆ టిప్పర్లను ఎవరూ ఆపరు. ప్రతి టిప్పర్‌ లో ఇసుక, మద్యం నిండుగా వెల్లేవి. ఏకంగా గ్రావెల్‌ కూడా తోలేస్తున్నారు. మన నియోజకవర్గానికి రానిస్తే క్యాన్సర్‌ గడ్డలా తినేస్తారు. చిత్తూరు ప్రజలు ఇప్పటికే గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడకు వస్తే తరిమితరిమి కొట్టాలనిలోకేష్‌ పిలుపునిచ్చారు.

ప్రాజెక్ట్‌లు పూర్తి చేస్తాం
ఇక మన నియోజకవర్గానికి కొన్ని సమస్యలు ఉన్నాయి. మన ప్రభుత్వం వచ్చాక పెండిరగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు అన్ని పూర్తిచేస్తాం. పట్టణంలో ట్రాఫిక్‌ సమస్య, రోడ్లు మెరుగుపరుస్తాం. భూగర్భ డ్రైనేజీ నిర్మిస్తాం. ఇళ్లు లేనివారికి ఇళ్లు కట్టిస్తాం, హిందూపురాన్ని మోడల్‌ పట్టణంగా తీర్చిదిద్దుతాం, లేపాక్షిలో పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకువచ్చి స్థానికులకు ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తామని లోకేష్‌ హామీ ఇచ్చారు.

రా.. కదలిరా అంటే చాలు
టీడీపీ బలం టీడీపీ కార్యకర్తలు. నాయకులు పార్టీ మారి వెళ్లినా కార్యకర్తలు అండగా నిలబడ్డారు. వైకాపా కార్యకర్తలకు ఊపు రావాలంటే బూమ్‌ బూమ్‌, ప్రెసిడెంట్‌ మెడల్‌, ఆంధ్రా గోల్డ్‌ కావాలి. మనకి మాత్రం చంద్రబాబు రా.. కదలిరా.. అనే పిలుపు చాలు.. పరిగెత్తుకుంటూ వస్తారు. 2014లో కార్యకర్తల కోసం సంక్షేమ నిధి ఏర్పాటుచేశాం. ప్రమాదంలో కార్యకర్తలు చనిపోతే వారి కుటుంబాలకు 2 లక్షల బీమా అందజేసి ఆదుకున్నాం. ఇందుకు 100 కోట్లు ఖర్చుపెట్టాం. పిల్లలను చదివించలేకపోతే వారిని దత్తత తీసుకుని చదివిస్తోంది నా తల్లి భువనేశ్వరమ్మ. అది కార్యకర్తల పట్ల మా చిత్తశుద్ధి. నాకు అక్కచెల్లెళ్లు లేరు, అన్నాదమ్ములు లేరు. అన్న ఎన్టీఆర్‌ 60 లక్షల మంది అక్కాచెల్లెళ్లు, అన్నాదమ్ములను ఇచ్చారు. మిమ్మల్ని నా గుండెల్లో పెట్టుకుని కాపాడతానని లోకేష్‌ అన్నారు.

వడ్డీతో చెల్లిస్తాం
2019 నుంచి మనపై అనేక కేసులు పెట్టారు. నాపై 22 కేసులు పెట్టారు. హత్యాయత్నం కేసు కూడా ఉంది, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారు. ఏమీ చేయలేకపోయారు. ఎవరిపైన ఎక్కువ కేసులు ఉన్నాయో వారికి అంతపెద్ద నామినేటెడ్‌ పదవులు ఇస్తాం. చట్టాన్ని ఉల్లంఘించి ఇబ్బంది పెట్టిన అధికారులను వదిలిపెట్టను. వారి పేర్లు ఎర్ర పుస్తకంలో ఉన్నాయి. సుప్రీంకోర్టులో కూడా దీనిపై చర్చ జరిగింది. నేను చెప్పిన దాంట్లో తప్పేముంది. మొదట జైలుకెళ్లేది పాపాల పెద్దిరెడ్డి. ఎన్టీఆర్‌ మన దేవుడు, చంద్రబాబు మన రాముడు. కానీ వైకాపా వాళ్ల విషయంలో మాత్రం లోకేష్‌ మూర్ఖుడు. వడ్డీతో సహా చెల్లిస్తామని లోకేష్‌ హెచ్చరించారు.
సభ అనంతరం రాబోయే ఎన్నికలను ఎదుర్కోవడం, బాబు సూపర్‌ సిక్స్‌ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై కేడర్‌కు యువనేత దిశా నిర్దేశం చేశారు. బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం అమలులో మెరుగైన పనితీరు కనబర్చిన కార్యక్రర్తలకు ప్రశంసాపత్రాలు అందజేశారు.

బాబాయ్‌ని లేపేసింది ఎవరు?
ఒక ప్రశ్న అడుగుతాను. దానికి నాలుగు సమాధానాలు ఇస్తాను. ఏది సరైనదో చెప్పాలి. బాబాయిని లేపేసింది ఎవరు? 1. జగన్‌రెడ్డి, 2. అవినాష్‌రెడ్డి, 3. భాస్కర్‌రెడ్డి, 4. పైనున్న ముగ్గురు. నాలుగో సమాధానం సరైనది. ముందు గుండెపోటు అన్నారు. తర్వాత శవానికి కుట్లు వేసి హడావుడిగా అంత్యక్రియలు చేయాలని చూశారు. చంద్రబాబు చేతిలో గొడ్డలితో ఫొటో సృష్టించి, నారాసుర రక్త చరిత్ర అని సాక్షి దినపత్రికలో రాయించారు. అబద్ధం ప్రపంచం చుట్టి తిరిగివచ్చింది. కానీ ఈ రోజు నిజం బయటకు వచ్చింది. వివేకా కూతురు, జగన్‌ చెల్లి సునీత నిజాలు బయటకు చెప్పారు. హంతకులు పాలకులు అయ్యారని, జగన్‌ కు ఓటు వేయవద్దని కూడా సునీత పిలుపునిచ్చారు. విలువలు, విశ్వసనీయత, మాట తప్పను, మడమ తిప్పను అనే మా అన్నవి అన్నీ అబద్ధాలే అని చెప్పారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉండాలంటే జగన్‌ ను ఓడిరచాలని కూడా చెప్పారు. అవినాష్‌ రెడ్డిని అరెస్ట్‌ చేసేందుకు సీబీఐ వస్తే జగన్‌రెడ్డి అడ్డం పడ్డారని ఆమె చెప్పారు. వీటన్నింటికి జగన్‌ రెడ్డి సమాధానం చెప్పాలి. ఆమెకు న్యాయం జరగాలి. రెండు నెలలు ఓపిక పడితే మేం న్యాయం చేస్తాం. వివేకా హత్య కేసు దోషులను అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లో మేం జైలుకు పంపిస్తాం. తల్లి, చెల్లిని జగన్‌ రెడ్డి మెడ పట్టుకుని బయటకు గెంటేశారు. మరో చెల్లెమ్మ…అన్న విడిచిన బాణం. పాపం ఆమెను కూడా మెడ పట్టి గెంటేశారు. తల్లి, చెల్లికి న్యాయం చేయలేని జగన్‌రెడ్డి మనకు న్యాయం చేస్తాడా అని రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మలు ఆలోచించాలని లోకేష్‌ హితవు పలికారు.

బాలయ్య సొంత నిధులతో..
లేపాక్షి ఉత్సవాలు, కోవిడ్‌ సమయంలో 3 కోట్ల 50 లక్షల సొంత నిధులతో వెంటిలేటర్లు, కిట్‌లు పంపిణీ చేసిన వ్యక్తి మన బాలయ్య. అన్న క్యాంటీన్లు కూడా మళ్లీ ప్రారంభించారు. ఆరోగ్య రథం, బసవతారకం క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ బస్సు కూడా మన నియోజకవర్గానికి అనేక సార్లు తీసుకువచ్చారు. బ్రాహ్మణి దగ్గర నుంచి సీఎస్‌ఆర్‌ ఫండ్లు మొత్తం హిందూపూర్‌ నియోజక వర్గానికి ఖర్చుపెట్టారు. మన బాలయ్య బాబు నీతి, నిజాయతీగా పరిపాలన అందించారు. ఆయన హ్యాట్రిక్‌ కొట్టడం ఖాయం. అందుకే ప్రజలందరినీ కోరుతున్నా. ఏపీలోనే ఎవరికి రాని భారీ మెజార్టీతో బాలయ్య బాబుని గెలిపించి శాసనసభకు పంపించాలని కోరుతున్నా. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూపూర్‌ కు చేసిందేమిటి? సంవత్సరానికో ఇంఛార్జ్‌ వస్తాడు, వెళ్తాడు. ఇసుక, గ్రావెల్‌ లో డబ్బులు దొబ్బుతారు, వెళ్తారు. వైసీపీ నాయకులు ఆనాడు హిందూపూర్‌ ను జిల్లా కేంద్రం చేస్తానన్నారు, హిందూపురానికి మెడికల్‌ కాలేజీ తీసుకువస్తానన్నారు, అవేమీ రాలేదని లోకేష్‌ విమర్శించారు.

Previous Post

జగన్ సర్కార్ అరాచకంపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ “శంఖారావం” – పెనుకొండ నియోజకవర్గం.

Next Post

పొత్తు పొడుపు దిశగా…

Next Post
పొత్తు పొడుపు దిశగా…

పొత్తు పొడుపు దిశగా...

[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.