- దేశంలోనే తొలిసారి మహిళలకు ఆస్తిలో సమానహక్కు
- ఆయన స్ఫూర్తితో సీఎం చంద్రబాబు పాలన
- సమగ్ర ప్రణాళికతో ఆదర్శ నియోజకవర్గంగా కుప్పం
- పెద్దఎత్తున పరిశ్రమల రాకతో కుప్పానికి మహర్ధశ
- మూడోరోజు కుప్పం పర్యటనలో నారా భువనేశ్వరి
- రామకుప్పం, మణేంద్రంలో విగ్రహాల ఆవిష్కరణ
- భారీగా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలు
కుప్పం(చైతన్యరథం): సమాజమే దేవాలయం – ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో ఎన్టీఆర్ తెలుగుదేశం స్థాపించారు.. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు..విగ్రహాలను ఆవిష్కరించడం తన అదృష్టంగా భావిస్తున్నానని ఎన్టీఆర్ మెమోరి యల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి పేర్కొన్నారు. కుప్పం నియోజకవర్గంలో నాలుగురోజుల పర్యటనలో భాగంగా మూడో రోజు భువనేశ్వరి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా శాంతిపురం మండలం శివపురంలోని నివాసంలో స్థానిక నేతలతో నారా భువనేశ్వరి బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ నిర్వహించారు. అనంతరం శాంతిపురంలో అన్న క్యాంటీన్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఐటీడీపీ కార్యకర్త రవి కుటుంబ సభ్యులను నారా భువనేశ్వరి పరామర్శించారు. రామకుప్పం, మణేంద్రంలో ఎన్టీఆర్ విగ్రహాలను ఆవిష్కరించారు. రామకుప్పం లో శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రామకుప్పం మండ లం బల్ల గ్రామంలో మహిళలతో సమావేశమయ్యారు. ఆ తర్వాత రామకుప్పంలో టీడీపీ కార్యకర్త ముజాహిద్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. సంక్షేమ కార్యక్రమాలు అందుతున్న తీరు ను అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి రామకుప్పం మండలం గోవిందపల్లి గ్రామానికి వెళ్లి ఇటీవల మరణిం చిన టీడీపీ కార్యకర్త ఆనంద్ కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. పార్టీ అండగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు.
ఎన్టీఆర్ హయాంలో మహిళాభ్యున్నతికి బాటలు
కుప్పం నియోజకవర్గం రామకుప్పంలో ఎన్టీఆర్ కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమానికి కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. దీంతో కిలోమీటరు మేర వారితో పాటే భువనేశ్వరి కలిసి నడిచారు. విగ్రహావిష్కరణ అనంతరం భువనేశ్వరి మాట్లాడు తూ సమాజమే దేవాలయం – ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో ఎన్టీఆర్ తెలుగుదేశం స్థాపించారు. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం నా అదృష్టంగా భావి స్తున్నాను. పేదల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేశారు. పేదలకు పట్టె డన్నం పెట్టేందుకు రూ.2కే కిలో బియ్యం పథకం ప్రవేశపెట్టిన మహనీయుడు ఎన్టీఆర్. పురుషులతో సమానంగా మహిళలకు ఆస్తిలో హక్కు కల్పించారు. రిజర్వేషన్లు కల్పించారు. ప్రత్యేకంగా మహిళల కోసం పద్మావతి మహిళా యూనివర్సిటీ స్థాపించారు. ఎన్టీఆర్ స్పూర్తితో ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన సాగిస్తున్నా రు. డ్వాక్రా స్థాపించి మహిళల ఆర్థిక అభ్యున్నతికి బాటలు వేశా రు. పేదలకు పట్టెడన్నం పెట్టాలనే ఉద్దేశంతో అన్న క్యాంటీన్లు ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. పరిశ్రమల రాకతో కుప్పానికి మహర్దశ పట్టబోతోందని, అన్ని రంగాల్లో నియోజకవర్గాన్ని అభివృ ద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ధిష్ట ప్రణాళికలు రూపొందించారని తెలిపారు. అనంతరం రామకుప్పంలో అంబేద్క ర్ విగ్రహానికి భువనేశ్వరి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కుప్పం అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక
రామకుప్పం మండలం బల్ల గ్రామంలో పర్యటించిన నారా భువనేశ్వరి మహిళలతో సమావేశమయ్యారు. ఎన్టీఆర్ స్పూర్తితో చంద్రబాబు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని చెప్పారు. సీఎం చంద్రబాబు స్వర్ణాంధ్ర, స్వర్ణ కుప్పం లక్ష్యంగా ముందుకు వెళుతున్నారు. పేదల ఆకలి తీర్చేందుకు రాష్ట్రవ్యాప్తం గా అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. పేదల సొంతింటి కల నెరవేరుస్తున్నారు. యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రానికి పెద్దఎత్తున పెట్టుబ డులు రావడం చంద్రబాబు సమర్థ నాయకత్వానికి నిదర్శ నం. విశాఖలో గూగుల్ డేటా సెంటర్, అనకాపల్లి జిల్లాలో అతిపెద్ద స్టీల్ ప్లాంట్ ఏర్పాటవుతున్నాయి. చంద్రబాబును 8 సార్లు ఎమ్మెల్యే గా గెలిపించిన కుప్పం ప్రజలకు రుణపడి ఉంటాం. కుప్పానికి పరిశ్రమల రాకతో స్థానికంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తల్లికి వంద నం కింద కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అందరికీ ఆర్థిక సాయం చేస్తున్నారు. దీపం పథకం ద్వారా మహిళలకు ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తున్నారు. పేదలకు ఆరోగ్య భరోసా కల్పించేందుకు సంజీవని ప్రాజెక్టు తెచ్చారు. ఇళ్లపై సోలా ర్ ప్యానెల్స్, చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాలు ఏర్పాటు చేస్తు న్నారు. హంద్రీనీవా ద్వారా కృష్ణా జలాలను కుప్పానికి తీసుకొచ్చా రు. డ్వాక్రా స్థాపించి మహిళలకు ఆర్థిక భద్రత కల్పించారు. కుప్పంలో ఎలీప్ సంస్థలో శిక్షణ తీసుకుంటున్న మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతున్నారు. చంద్రబాబుకి ప్రజలే ముఖ్యమని, సాయం కోసం వచ్చిన వారు ఏ పార్టీ అని ఆలోచించ రని, అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుం టారని తెలిపారు.












