- వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్యానికి సహకరించాలి
- ప్రభుత్వం మంచి పనిచేస్తే ప్రజలు కలిసి వస్తారు
- రోడ్ డాక్టర్ పేరుతో జీరో పాత్ హోల్ మిషన్
- జూలై నెలలో 10.70 శాతం వృద్ధి నమోదు
- ఎల్‌నినోను సమర్థవంతంగా అధిగమించాలి
- ఆర్టీజీఎస్ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి(చైతన్యరథం): ప్రతిఒక్కరి భాగస్వామ్యంతో పార్టనర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్ కార్యక్రమాన్ని చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. మంగళవారం సచివాలయంలోని ఆర్టీజీఎస్ నుంచి వివిధ శాఖలపై ముఖ్యమంత్రి సమీక్షించారు. పార్టనర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్ కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగు లు, ప్రజలు అంతా భాగస్వామ్యం కావాలి. ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత సులభంగా అందిస్తే జాతి నిర్మాణానికి సహక రించినట్టే. ప్రతి ఉద్యోగి.. ప్రతి అధికారి వికసిత్ భారత్, స్వర్ణాం ధ్ర లక్ష్య సాధనకు సహకరించాలని సూచించారు. పార్టనర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్ అనేది ప్రతిఒక్కరూ బాధ్యతగా తీసుకుని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి. రోడ్ డాక్టర్ పేరుతో జీరో పాత్ హోల్ మిష న్ టేకప్ చేయాలి. గుంతలు పడిన రోడ్లను వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. ఇప్పటికే కొన్ని చోట్ల ప్రయోగాత్మకంగా చేస్తున్నారు..దీన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలుచేయాలని సూచించారు. ప్రభుత్వం మంచి పనిచేస్తే ప్రజలు భాగస్వాములు అవుతారనడా నికి భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవానికి వచ్చిన స్పందనే నిదర్శనం. అలాగే వాస్తవాలను ప్రజలకు వివరించగలిగితే ప్రభు త్వానికి ప్రజలే అండగా నిలుస్తారు. దీనికి కర్నూలులో డీఎస్సీ-2025 టీచర్లు చేపట్టిన కార్యక్రమమే ప్రత్యక్ష ఉదాహరణ. నెల వారీ ఆర్థిక ప్రగతి నివేదికపై సమీక్షించాం. జూలై నెలలో 10.70 శాతం వృద్ధిని నమోదు చేయగలిగాం. ఎల్‌నినో ప్రభావం ఇప్పటి నుంచి ఎక్కువగా ఉండనుంది. ఇప్పుడే అసలు సమస్యలు ఎదుర య్యే ప్రమాదం ఉందని, వీటిని అధిగమించాలని సూచించారు. ఈ సమీక్షలో సీఎస్ సాయిప్రసాద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.














