చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

అనంతసాగరం బహిరంగ సభలో నారా లోకేష్

by చైతన్యరధం
Jun 17, 2023 at 12:40pm
in ఆంధ్రప్రదేశ్, తాజా సంఘటనలు
nara lokesh

Nara Lokesh at Ananthasagaram public meeting

Share on FacebookShare on TwitterShare on Whatsapp

సింహపురి లో యువగళం గర్జన మొదలైంది. ఆత్మకూరు లో ఎంట్రీ అదుర్స్. ఆత్మకూరు ప్రజలకు ఆత్మాభిమానం ఎక్కువ. ధర్మం వైపు నిలబడతారు. దానం చేసే గుణం ఇక్కడి ప్రజలకు ఉంది. రాజులు ఏలిన నేల ఆత్మకూరు. నెల్లూరు జిల్లా కు జీవనాడి ఆత్మకూరు. జిల్లా మొత్తానికి సాగు, తాగు నీరు అందించే సోమశిల జలాశయం ఉంది ఇక్కడే. అలఘనాథుని దేవాలయం, ఏఎస్ పేట దర్గా ఉన్న పుణ్య భూమి ఆత్మకూరు. స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు గారు సోమశిల, కండలేరు ప్రాజెక్టులను నిర్మించి లక్షల ఎకరాలకు సాగునీరు అందించారు. ఘన చరిత్ర ఉన్న ఆత్మకూరు నేల పై పాదయాత్ర చెయ్యడం నా అదృష్టం. యువగళం..మనగళం..ప్రజాబలం.

రాయలసీమ జిల్లాల్లో నేను అడుగుపెట్టిన తరువాత వైసిపి నేతలు గజగజా వణికారు. నెల్లూరు జిల్లాలో అడుగుపెట్టక ముందే వైసిపి నేతలు ప్యాంట్లు తడుపుకున్నారు. నేను జనవరి లోనే చెప్పా నెల్లూరు జిల్లా నుండే మార్పు మొదలు అవుతుంది అని సింహపురి లో మార్పు మొదలైంది. జగన్ పనైపోయింది. యువగళాన్ని అడ్డుకోవడానికి జగన్ అడ్డదారులు తొక్కాడు. జిఓ.1 తెచ్చాడు. మడిచి ఎక్కడ పెట్టుకుంటావో పెట్టుకో అని చెప్పా. తగ్గేదే లేదు. యువగళానికి వస్తున్న జనాన్ని చూసి జగన్ కి ఫ్రస్ట్రేషన్ వచ్చింది. నాలుగు టివిలు పగలు గొట్టాడు. ఇక ఏమి చెయ్యలేక కోడికత్తి బ్యాచ్ ని పంపి కోడిగుడ్డు వేయించాడు.. క్లైమోర్ మైన్లకే భయపడని కుటుంబం మాది కోడికత్తి బ్యాచ్ కి భయపడతామా. కోడిగుడ్డు విసిరిన కోడికత్తి బ్యాచ్ కి మన వాళ్లు మొఖం మీద ఆమ్లెట్లు వేసి పంపారు.

సంబంధితవార్తలు

ప్రలోభాలకు దిగజారినా ఓటమిని తప్పించుకోలేవ్ జగన్ రెడ్డీ – ఆచంట సునీత మీడియా సమావేశం.

పోలవరం నిధులు దారి మళ్ళించి చరిత్రహీనుడిగా మిగిలిపోయిన జగన్ రెడ్డి – దేవినేని ఉమ మీడియా సమావేశం.

గ్రూప్ -1 లో మీ అక్రమాలు ఆధారాలతో సహా రుజువైనా ఇంకా బుకాయింపులతో ఎవరిని మోసం చేస్తారు సవాంగ్ గారూ ?

జగన్ ఒక ఫెయిల్డ్ సీఎం. ఈ మాట ఎందుకు అంటునాన్నో ఒకే ఒక్క ఉదాహరణ చెబుతా. బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాల్ గారు. ఆయన పేషీలో సిబ్బందికి 7 నెలలుగా జీతాలు ఇవ్వలేదు. సిబ్బందికి మండింది. ఏకంగా మంత్రి పేషీకి తాళాలు వేసి వెళ్లిపోయారు. వాళ్ళకి జీతాలు ఎక్కడి నుండి రావాలో తెలుసా? బీసీ కార్పొరేషన్, కాపు కార్పొరేషన్. అంటే ఇక్కడ సీఎం ఫెయిల్, బీసీ శాఖ మంత్రి ఫెయిల్, ప్రభుత్వం ఫెయిల్, బీసీ కార్పొరేషన్ ఫెయిల్, కాపు కార్పొరేషన్ ఫెయిల్. చంద్రబాబు గారు కట్టిన సచివాలయం కూర్చోవడం చేతగాని వాళ్లు మూడు రాజధానులు కడతాం అని బిల్డప్ ఇస్తారు.

జగన్ విశాఖ ను క్రైం క్యాపిటల్ చేసాడని అమిత్ షా గారు అన్నారు. మంత్రులంతా రోడ్డు మీదకి వచ్చి మొరిగారు. ఇప్పుడు ఎం జరిగింది? అమిత్ షా గారు మాట్లాడింది నిజం అని తేలింది. ఎంపీ సత్యనారాయణ కొడుకు, భార్య, ఆడిటర్ జివి ని ఒక గ్యాంగ్ కిడ్నాప్ చేసింది. భూకబ్జాల వాటాల్లో తేడా వచ్చింది అందుకే ఈ కిడ్నాప్ జరిగింది. కిడ్నాప్ స్కెచ్ వేసింది జగన్ సొంత జిల్లా, సొంత వాళ్లే మనుషులే. జగన్ ది కన్నింగ్ బుద్ది. తల్లి, చెల్లితో పాటు నమ్మి ఓటేసిన అందరిని మోసం చేసాడు. అందుకే కన్నింగ్ జగన్ అని పేరు పెట్టా. సీఎం ఇంట్లో వాళ్ల‌కి ర‌క్ష‌ణ లేదు. జ‌గ‌న్ ఇంటి ప‌క్కనున్న మ‌హిళ‌ల‌కి భ‌ద్ర‌త లేదు. సీఎం నియోజ‌క‌వ‌ర్గంలో స్త్రీలపై దాడులు ఆపేవారే లేరు.

రాష్ట్రంలో వేలాది మంది మ‌హిళ‌ల‌పై అఘాయిత్యాలు జ‌రుగుతుంటే తాడేప‌ల్లి ప్యాలెస్‌లో కన్నింగ్ జగన్ హ్యాపీగా పబ్జి ఆడుకున్నాడు. నెల్లూరు జిల్లాలో పట్టపగలే యువతిపై గ్యాంగ్ రేప్ కి పాల్పడ్డారు. గన్ కంటే ముందు వస్తాడ‌ని బిల్డ‌ప్ ఇచ్చుకున్న‌ జగన్ ఎక్కడ? త‌న బిడ్డ‌ని బ‌తికించుకునేందుకు ఆత్మహత్యకు యత్నించింది తల్లి ఆరుద్ర. ఆ త‌ల్లిని ఆదుకోవాల్సిన ముఖ్య‌మంత్రి.. ఆమె పై పిచ్చిదనే ముద్ర వేసి పిచ్చాసుప‌త్రిలో చేర్పించ‌డం దారుణం. ఆ తల్లికి టిడిపి అండగా ఉంటుంది. పులివెందుల నియోజకవర్గం సింహాద్రిపురం మండలంలో ద‌ళితుడైన కృష్ణయ్యని అత్యంత దారుణంగా చంపేస్తే… ముఖ్య‌మంత్రి ఏం చేస్తున్నారు? డిజిటల్ బోర్డు మీద చేత్తో చెరిపే మేధావి కన్నింగ్ జగన్ ప్రభుత్వ స్కూళ్ల లో విద్యార్థులు పెరిగారు అని చెబుతున్నాడు. 2022-23 లో 47,40,421 విద్యార్థుల‌కి విద్యాకానుక కిట్లు పంపిణీ చేశారు. 2023-24 లో 43,10,165 కిట్లు విద్యార్థుల‌కి ఇచ్చారు. 4 ల‌క్ష‌ల 30 వేల మంది విద్యార్థులు త‌గ్గారు. మ‌రి కన్నింగ్ జగన్ చెప్పిన పెరిగిన విద్యార్థులు ఎక్క‌డ వున్నారో? కన్నింగ్ జగన్ ప్రజలకు కరెంట్ షాక్ ఇస్తున్నాడు.

మే నెల కరెంట్ బిల్లు పట్టుకుంటే షాక్ కొట్టిందా? నిన్న ఒక మహిళ వచ్చి టిడిపి హయాంలో రూ.300 కరెంట్ బిల్లు వస్తే జగన్ ప్రభుత్వంలో రూ.1200 కరెంట్ బిల్లు వచ్చింది అని చెప్పింది. ఒక్క మే నెలలో జగన్ బాదుడు ఎంతో తెలుసా? రూ.11,300 కోట్లు. ఒక సారి ట్రూ అప్ ఛార్జీలు, రెండు సార్లు అడ్జెస్ట్మెంట్ ఛార్జీలు పెంచాడు. సీఎం గా ప్రమాణస్వీకారం చేస్తూ విద్యుత్ బిల్లులు తగ్గించేస్తా అన్నాడు. ఇప్పుడు వందల్లో బిల్లు వచ్చే వారికి వేలల్లో వస్తుంది. వైసిపి ఫ్యాన్ పర్మినెంట్ గా స్విచ్ ఆఫ్ చెయ్యండి మీపై పడిన భారం తగ్గుతుంది. కన్నింగ్ జగన్ కి ఒక జబ్బు ఉంది. మైథోమానియా సిండ్రోమ్(mythomania syndrome) తో జగన్ బాధపడుతున్నాడు. ఈ జబ్బు లక్షణాలు ఏంటో తెలుసా? ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు అబద్దాలు చెప్పడం ఈ జబ్బు లక్షణం. మైథోమానియా సిండ్రోమ్ వలనే జగన్ నేను పేదవాడ్ని అంటూ పదే పదే అబద్దం చెబుతున్నాడు. లక్ష కోట్లు ఆస్తి ఉన్నా, లక్ష రూపాయల చెప్పులు వేసుకొని తిరుగుతున్నా, వెయ్యి రూపాయల వాటర్ బాటిల్ తాగుతున్నా పేదవాడ్ని అంటూ అబద్దం చెబుతాడు.

బెంగుళూరు లో ప్యాలస్, హైదరాబాద్ లో ప్యాలస్, తాడేపల్లి లో ప్యాలస్, ఇడుపులపాయలో ప్యాలస్, ఇప్పుడు వైజాగ్ లో మరో ప్యాలస్ కడుతున్నాడు. ఇన్ని ప్యాలస్ లు ఉన్నా పేదవాడ్ని అని చెబుతాడు. సిమెంట్ కంపెనీలు, పవర్ ప్లాంట్లు, సొంత టివి, ఛానల్ ఉన్నా పేదవాడ్ని అని చెబుతాడు. మైథోమానియా సిండ్రోమ్ వలన జగన్ అబద్దాలు చెబుతూ అబద్దంలోనే బ్రతికేస్తాడు. కన్నింగ్ జగన్ కట్టింగ్ అండ్ ఫిట్టింగ్ మాస్టర్. ఫిట్టింగ్ ఎలా ఉంటుందో చెబుతా. కన్నింగ్ జగన్ కి రెండు బటన్స్ ఉంటాయి. ఒకటి బ్లూ బటన్. రెండోవది రెడ్ బటన్. బ్లూ బటన్ నొక్కగానే మీ అకౌంట్ లో 10 రూపాయలు పడుతుంది. రెడ్ బటన్ నొక్కగానే మీ అకౌంట్ నుండి 100 రూపాయలు పోతుంది. అది ఎలాగో మీకు చెబుతా.

విద్యుత్ ఛార్జీలు 9 సార్లు బాదుడే బాదుడు, ఆర్టీసీ బస్ ఛార్జీలు 3 సార్లు బాదుడే బాదుడు, ఇంటి పన్ను బాదుడే బాదుడు, చెత్త పన్ను బాదుడే బాదుడు. పెట్రోల్, డీజిల్ ధరలు బాదుడే బాదుడు, నిత్యావసర సరుకుల ధరలు బాదుడే బాదుడు. మీకు ఇంకో ప్రమాదం కూడా ఉంది త్వరలోనే వాలంటీర్ వాసు మీ ఇంటికి వస్తాడు. మీరు పీల్చే గాలిపై కూడా పన్నేస్తాడు. కన్నింగ్ జగన్ కి దమ్ముంటే ఇంటికి స్టిక్కర్ కాదు కరెంట్ బిల్లుకి, బస్సు టికెట్ మీద, పెట్రోల్, డీజిల్ బిల్లు మీద, చెత్త పన్ను మీద, ఇంటి పన్ను మీదా స్టిక్కర్ వెయ్యాలి. కన్నింగ్ జగన్ కట్టింగ్ మాస్టర్. అది ఎలాగో చెబుతాను. అన్న క్యాంటిన్ కట్, పండుగ కానుక కట్, పెళ్లి కానుక కట్, చంద్రన్న భీమా కట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కట్, ఫీజు రీయింబర్స్మెంట్ కట్, 6 లక్షల పెన్షన్లు కట్, డ్రిప్ ఇరిగేషన్ కట్. 100 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన మొదటి సీఎం ఈ కన్నింగ్ జగన్. కన్నింగ్ జగన్ మహిళల్ని నమ్మించి ముంచేసాడు.

సంపూర్ణ మద్యపాన నిషేధం తర్వాతే ఓట్లు అడుగుతా అన్నాడు. ఇప్పుడు ఎం మొఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నాడు. 45 ఏళ్లకే బీసీ, ఎస్సి, ఎస్టీ మహిళలకు పెన్షన్ అన్నాడు. ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మ ఒడి ఇస్తా అని మోసం చేసాడు. కష్టాలు చూసాను…కన్నీళ్లు తుడుస్తాను. భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించాం. మహాశక్తి పథకం కింద… 1) ఆడబిడ్డ నిధి:- 18 ఏళ్లు నిండిన మహిళలకు – నెలకు రూ.1500 అంటే ఏడాదికి రూ.18 వేలు, 5 ఏళ్లకు రూ.90 వేలు. 2) తల్లికి వందనం:- ప్రతి తల్లికి ఏడాదికి రూ.15 వేలు. ఇద్దరు పిల్లలు ఉంటే రూ.30 వేలు, ముగ్గురు ఉంటే రూ.45 వేలు.3) దీపం పథకం:- ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం 4) ఉచిత ప్రయాణం:- మహిళలకు ఆర్టీసి బస్సులో ఉచిత ప్రయాణం.

కన్నింగ్ జగన్ యువత ని చీట్ చేసాడు. జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, 2.30 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు, ప్రతి ఏటా 6,500 పోలీసు ఉద్యోగాలు ఇవ్వలేదు, గ్రూప్2 లేదు, డిఎస్సి లేదు. ఉన్న అంబేద్కర్ స్టడీ సర్కిల్స్, బీసీ స్టడీ సర్కిల్స్ మూసేసాడు. జిఓ77 తీసుకొచ్చి ఉన్నత విద్య చదువుతున్న వారికీ ఫీజు రీయింబర్స్మెంట్ పధకం రద్దు చేసాడు. యువగళాన్ని విన్నాం. ప్రభుత్వ, ప్రైవేట్, స్వయం ఉపాధి ద్వారా 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. నిరుద్యోగ యువతకు యువగళం నిధి కింద నెలకు రూ.3000 ఇస్తాం. మొదటి వంద రోజుల్లోనే నిరుద్యోగ భృతి ఇస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏడాది నోటిఫికేషన్ ఇస్తాం. అన్ని జిల్లాల్లో స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేస్తాం. కన్నింగ్ జగన్ రైతులు లేని రాజ్యం తెస్తున్నాడు. కన్నింగ్ జగన్ పరిపాలనలో నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులతో రైతులు నష్టపోతున్నారు. రైతుల ఆత్మహత్యల్లో ఏపీ నంబర్ 3, కౌలు రైతుల ఆత్మహత్యల్లో నంబర్ 2.రైతుల్ని ఆదుకోకపోగా ఇప్పుడు మీటర్లు పెడుతున్నాడు. మీటర్లు రైతులకు ఉరితాళ్లు. రైతుల బాధలు చూసాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నదాతకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తాం. కన్నింగ్ జగన్ ఉద్యోగస్తులను వేధిస్తున్నాడు.

వారంలో సీపీఎస్ రద్దు చేస్తా అని 200 వారాలు దాటినా సీపీఎస్ రద్దు చెయ్యలేదు. జీతం ఒకటో తారీఖున వచ్చే దిక్కు లేదు. పోలీసులకు 4 సరెండర్స్, 8 టిఎ, డీఏలు పెండింగ్ పెట్టాడు. ఆఖరికి జిపిఎఫ్ డబ్బులు కూడా లేపేశారు. మెడికల్ బిల్లులు కూడా ఇవ్వడం లేదు. పోలీసులు దాచుకున్న జిపిఎఫ్ డబ్బు సైతం కొట్టేసాడు. నేను ప్రతి రోజూ మాట్లాడుతుంటే భయపడి కొంత బకాయి తీర్చాడు. ఇంకా రావాల్సింది చాలా ఉంది.ఆఖరికి పెన్షనర్లకు పెన్షన్ ఇవ్వలేని చెత్త ప్రభుత్వం ఇది. బీసీలు పడుతున్న కష్టాలు నేను చూసాను. 26 వేల అక్రమ కేసులు, నిధులు, కుర్చీలు లేని కార్పొరేషన్లు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఉపకులాల వారీగా దామాషా ప్రకారం నిధులు, బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాం. డాక్టర్ సుధాకర్ దగ్గర నుండి డాక్టర్ అచ్చెన్న వరకూ జగన్ పాలనలో దళితుల్ని ఎలా చంపారో చూసారు. దళితుల్ని చంపడానికి జగన్ వైసిపి నాయకులకు స్పెషల్ లైసెన్స్ ఇచ్చాడు. 27 దళిత సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసాడు.

టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే దళితులను వేధించిన వారిని కఠినంగా శిక్షిస్తాం. జగన్ రద్దు చేసిన 27 దళిత సంక్షేమ కార్యక్రమాలను తిరిగి ప్రారంభిస్తాం. జగన్ పాలనలో మైనార్టీలను చిత్ర హింసలకు గురిచేసాడు. అబ్దుల్ సలాం, కరీముల్లా, ఇబ్రహీం, మిస్బా, హాజిరా. ఇలా ఎంతో మంది బాధితులు. మైనార్టీలకు ఉన్న అన్ని సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసాడు. దుల్హన్, విదేశీ విద్య, రంజాన్ తోఫా, ఇమామ్, మౌజమ్ లకు గౌరవ వేతనం, మసీదుల అభివృద్ధి కి నిధులు కూడా ఇవ్వడం లేదు. బిజేపి తో పొత్తు లో ఉన్నా టిడిపి హయాంలో మైనార్టీల పై ఒక్క దాడి జరగలేదు. అప్పుడే అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసాం.టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పాత పధకాలు అమలు చెయ్యడంతో పాటు, ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తాం. రెడ్డి సోదరులు కూడా ఆలోచించాలి.

2019 ఎన్నికల్లో మీరు ఎంతో కష్టపడి డబ్బు ఖర్చు చేసి జగన్ ని గెలిపించుకున్నారు. ఇప్పుడు మీకు కనీస గౌరవం అయినా ఉందా. నాడు-నేడు అన్ని సామాజిక వర్గాలకు సమాన గౌరవం ఇచ్చింది ఒక్క టిడిపి మాత్రమే. ఆత్మకూరు ని అద్భుతంగా అభివృద్ధి చేస్తారని మీరు వైసిపి ని భారీ మెజారిటీ తో గెలిపించారు. మీరు నమ్మి గెలిపించిన వైసిపి ఆత్మకూరు కి చేసింది గుండుసున్నా. ఆత్మకూరు లో అభివృద్ధి నిల్లు…వైసిపి నేతల అవినీతి ఫుల్లు. పెన్నా నదిని ఏటిఎస్ (ఎనీ టైం స్యాండ్) లా మార్చుకున్నారు వైసిపి నేతలు. విపరీతంగా ఇసుక ను దోచేస్తున్నారు. ఇసుక ఇక్కడ దొరకదు ఇతర రాష్ట్రాలకు వెళ్తుంది. ఎమ్మెల్యే వ్యక్తిగత సిబ్బంది మంటూ కొంత మంది గ్రావెల్ అక్రమ రవాణా చేస్తున్నారు.

ఏకంగా నాడు- నేడు పనుల కోసం వచ్చిన మెటీరియల్ తో వైసిపి నాయకులు ఇళ్లు నిర్మించుకుంటున్నారు. చనిపోయిన గౌతమ్ రెడ్డి గారికి, ఆత్మకూరు నియోజకవర్గానికి తీరని అన్యాయం చేసాడు జగన్. సెంచురీ ప్లై వుడ్ కంపెనీని ఆత్మకూరు కి తీసుకొస్తే జగన్ దానిని ఎత్తుకుపోయాడు. గౌతమ్ రెడ్డి ఆత్మకు శాంతి లేకుండా చేశాడు జగన్.అవగాహన లేని సీఎం, హాఫ్ నాలెడ్జ్ ఇరిగేషన్ మంత్రి కారణంగా సోమశిల డ్యామ్ ప్రమాదంలో పడింది. పబ్లిసిటీ పిచ్చితో 78 టిఎంసి ఫుల్ కెపాసిటీ నింపి డ్రోన్ షాట్స్ తీసి బిల్డప్ ఇవ్వాలని చూసారు. ఆ దెబ్బకి సోమశిల గేట్లు ప్రమాదంలో పడి పరిస్థితి డేంజర్ గా మారింది. జగన్ ది ఎంత చెత్త పాలనో చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. రూ.300 కరెంట్ వైరు కొనలేక. జనరేటర్ లో డీజిల్ అయిపోయి టైం కి గేట్లు ఎత్తలేకపోయారు. ఎమర్జెన్సీ లో రాంగ్ డైరెక్షన్ లో గేట్లు ఎత్తడంతో డ్యామ్ దెబ్బతింది. వంద కోట్లకు పైగా నష్టం జరిగింది.

నివార్ తుఫాను టైం లో జగన్ పిచ్చి చేష్టలతో ఒకేసారి 8 లక్షల క్యూసెక్కుల నీళ్లు కిందకి వదిలారు. దీనితో ఆత్మకూరు, కోవూరు, నెల్లూరు సిటి ,నెల్లూరు రూరల్ నియోజకవర్గాలు మునిగిపోయాయి. పంటలు, ఇళ్లు మునిగిపోయి 2 వేల కోట్ల నష్టం కలిగింది. ఇప్పటి వరకూ రూపాయి నష్ట పరిహారం ఇవ్వలేదు. సోమశిల డ్యాంకు రిపేర్లు చెయ్యలేదు. ఆత్మకూరు బై ఎలక్షన్ లో మంత్రులంతా ప్రచారం చేసారు. వందల హామీలు ఇచ్చారు. ఇప్పుడు ఆత్మకూరు ని అనాధగా వదిలేసారు. పేరుకే విక్రమ్ రెడ్డి ఎమ్మెల్యే కానీ రిమోట్ బంధువు వెంకటేశ్వర రెడ్డి దగ్గర ఉంది. కాంట్రాక్టులు, ఇసుక దందా, ఎర్రచందనం స్మగ్లింగ్, అక్రమ లే అవుట్లు, మైనింగ్ డీల్స్ అన్ని నెల్లూరు లోని ఒక గెస్ట్ హౌస్ కేంద్రంగా వెంకటేశ్వర రెడ్డి సిండికేట్ సెటిల్ చేస్తుంది. ఆత్మకూరు కి జగన్ అనేక హామీలు ఇచ్చాడు. ఇచ్చిన ఒక్క హామీ నెరవేరలేదు. సరే సీఎం గా ఇచ్చిన హామీ అయినా నిలబెట్టుకున్నాడా అంటే అదీ లేదు సంఘం బ్యారేజ్ ప్రారంభోత్సవానికి వచ్చిన జగన్ ఆత్మకూరు కి రూ.85 కోట్లు మంజూరు చేసినట్టు ప్రకటించారు.

12 ఇరిగేషన్ పనుల కోసం రూ.40 కోట్లు, 20 గ్రామాల్లో రోడ్లు వెయ్యడానికి రూ.14 కోట్లు, సంఘం బ్యారేజ్ నుండి నేషనల్ హైవే వరకూ రోడ్డు వెయ్యడానికి 15 కోట్లు, సంఘంలో తాగునీటి కోసం 4 కోట్లు. ఇందులో ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదు. 9 ఎన్నికల్లో కేవలం రెండు సార్లే టిడిపి ని గెలిపించినా ఆత్మకూరు ని అభివృద్ధి చేసాం. సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి చేసింది టిడిపి. సాగు, తాగునీటి ప్రాజెక్టులు నిర్మించింది టిడిపి. టిడ్కో ఇళ్లు కట్టింది, రోడ్లు వేసింది టిడిపి. కానీ మీరు పాలిచ్చే ఆవుని వద్దనుకొని తన్నే దున్నపోతుని తెచ్చుకున్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన తరువాత సోమశిల హై లెవల్ కెనాల్ యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి సాగునీరు అందిస్తాం. ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది లేక రోగులు ఇబ్బంది పడుతున్నారు. టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే సిబ్బందిని పెంచి కావాల్సిన వసతులు ఏర్పాటు చేస్తాం. ట్రోమా కేర్ సెంటర్ ఏర్పాటు చేస్తాం.

పరిశ్రమలు తీసుకొచ్చి మెట్ట ప్రాంతమైన ఆత్మకూరు ని అభివృద్ధి చేస్తాం. యువతకు స్థానికంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. నియోజకవర్గంలో రోడ్లు అద్వానంగా ఉన్నాయి. డ్రైనేజ్ వ్యవస్థ బాలేదు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే రోడ్లు వేస్తాం. డ్రైనేజ్ ఏర్పాటు చేస్తాం. వాటర్ గ్రిడ్ పథకం ద్వారా ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తాగునీరు అందిస్తాం. పత్తి, మిర్చి, పొగాకు, పసుపు, వరి, జామాయిల్, హార్టీ కల్చర్ రైతులు పడుతున్న ఇబ్బందులు నాకు తెలుసు. టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే పెట్టుబడి తగ్గించి గిట్టుబాటు ధర కల్పిస్తాం. టిడిపి హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను పూర్తిచెయ్యలేని చెత్త ప్రభుత్వం ఇది. టిడిపి అధికారంలోకి వచ్చిన టిడ్కో ఇళ్లు పూర్తి చేసి ఇస్తాం. టిడిపి కార్యకర్తల ను కిరాతకంగా హత్య చేసారు, అక్రమ కేసులు పెట్టి వేధించారు. ఎవ్వరిని వదిలి పెట్టను వడ్డీతో సహా చెల్లిస్తా. టిడిపి కార్యకర్తల్ని గుండెల్లో పెట్టుకుంటా. టిడిపి నాయకుల్ని, కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టిన వారు ఆత్మకూరు లో ఉన్నా, అమెరికా లో ఉన్నా పట్టుకొచ్చి లోపలేస్తా.

Tags: Ananthasagaram public meetingLatest Political Newslokeshlokesh yatralokesh yuvagalamNara lokeshnara lokesh padayatraNara lokesh yuvagalamnara lokesh yuvagalam padayatraTelugu Desam Partyyuvagalamyuvagalam lokeshyuvagalam nara lokesh padayatrayuvagalam padayatrayuvagalam yatra
Previous Post

అనంతసాగరం బహిరంగ సభలో ఆనం రామనారాయణ రెడ్డి

Next Post

LIVE : Day-129: వెంకటగిరి నియోజ‌క‌వర్గంలో యువగళం సారధి నారా లోకేష్ యువ‌గ‌ళం పాద‌యాత్ర.

మరిన్ని వార్తలు

లోకేష్‌ను కలిసిన క్రికెటర్ జాంటీ రోడ్స్
ఆంధ్రప్రదేశ్

లోకేష్‌ను కలిసిన క్రికెటర్ జాంటీ రోడ్స్

చైతన్యరధం
@ June 17, 2026
బీసీలపై కక్షగట్టిన గొడ్డలి పార్టీ
ఆంధ్రప్రదేశ్

బీసీలపై కక్షగట్టిన గొడ్డలి పార్టీ

చైతన్యరధం
@ June 17, 2026
పుంగనూర టీడీపీ నేతలతో లోకేష్ భేటీ
ఆంధ్రప్రదేశ్

పుంగనూర టీడీపీ నేతలతో లోకేష్ భేటీ

చైతన్యరధం
@ June 17, 2026
మంత్రి లోకేష్ ప్రజాదర్బార్
ఆంధ్రప్రదేశ్

మంత్రి లోకేష్ ప్రజాదర్బార్

చైతన్యరధం
@ June 17, 2026
జూలై మూడో వారంలో తల్లికి వందనం
ఆంధ్రప్రదేశ్

జూలై మూడో వారంలో తల్లికి వందనం

చైతన్యరధం
@ June 17, 2026
అవకాశాలకు వేదిక అమరావతి
ఆంధ్రప్రదేశ్

అవకాశాలకు వేదిక అమరావతి

చైతన్యరధం
@ June 17, 2026
25 నుంచి ఇంటింటికీ తెలుగుదేశం
ఆంధ్రప్రదేశ్

25 నుంచి ఇంటింటికీ తెలుగుదేశం

చైతన్యరధం
@ June 17, 2026
సెమీకండక్టర్ల తయారీకి ఏపీ గమ్యస్థానం
ఆంధ్రప్రదేశ్

సెమీకండక్టర్ల తయారీకి ఏపీ గమ్యస్థానం

చైతన్యరధం
@ June 17, 2026
Load More

ముఖ్య వార్తలు

సింగపూర్ ప్రధానితో సీఎం చంద్రబాబు భేటీ

సింగపూర్ ప్రధానితో సీఎం చంద్రబాబు భేటీ

చైతన్యరధం
@ June 16, 2026
డిజిటల్ గవర్నెన్స్‌లో గూగుల్ భాగస్వామ్యం

డిజిటల్ గవర్నెన్స్‌లో గూగుల్ భాగస్వామ్యం

చైతన్యరధం
@ June 16, 2026
అమరావతిలో సింగపూర్ నేషనల్ వర్సిటీ క్యాంపస్

అమరావతిలో సింగపూర్ నేషనల్ వర్సిటీ క్యాంపస్

చైతన్యరధం
@ June 16, 2026
డబుల్ ఇంజిన్ సర్కార్‌తో అభివృద్ధిలో పరుగులు

డబుల్ ఇంజిన్ సర్కార్‌తో అభివృద్ధిలో పరుగులు

చైతన్యరధం
@ June 15, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

లోకేష్‌ను కలిసిన క్రికెటర్ జాంటీ రోడ్స్

లోకేష్‌ను కలిసిన క్రికెటర్ జాంటీ రోడ్స్

చైతన్యరధం
@ June 17, 2026
బీసీలపై కక్షగట్టిన గొడ్డలి పార్టీ

బీసీలపై కక్షగట్టిన గొడ్డలి పార్టీ

చైతన్యరధం
@ June 17, 2026
పుంగనూర టీడీపీ నేతలతో లోకేష్ భేటీ

పుంగనూర టీడీపీ నేతలతో లోకేష్ భేటీ

చైతన్యరధం
@ June 17, 2026
మంత్రి లోకేష్ ప్రజాదర్బార్

మంత్రి లోకేష్ ప్రజాదర్బార్

చైతన్యరధం
@ June 17, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist