చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

ఎమ్సీలకు మాస్టర్ ప్లాన్

వ్యవసాయ శాఖపై సమీక్షలో సీఎం చంద్రబాబు

by చైతన్యరధం
Oct 10, 2025 at 6:00am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
ఎమ్సీలకు మాస్టర్ ప్లాన్
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • మార్కెట్ కమిటీల్లో మౌలిక సదుపాయాల కల్పన
  • రైతుసేవా కేంద్రాలను పునర్వ్యవస్థీకరించండి
  • భూసారం పెంపుతో లాభసాటిగా సేంద్రీయ సాగు
  • రాష్ట్రంలో రైతు బజార్లను ఆధునీకరించండి
  • రైతుకు లాభం.. ప్రజలకు ప్రయోజనం కల్పించాలి
  • వ్యవసాయ శాఖపై సమీక్షలో సీఎం చంద్రబాబు

అమరావతి (చైతన్య రథం): రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు మాస్టర్ ప్లాన్ రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈమేరకు రాష్ట్రంలోని 218 మార్కెట్ కమిటీల స్థలాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గురువారం
సచివాలయంలో వ్యవసాయశాఖ, అనుబంధ రంగాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. సేద్యం మంత్రి కె అచ్చెన్నాయుడు, వ్యవసాయ అనుబంధ కార్పొరేషన్ ఛైర్మన్లు, ఉన్నతాధికారులు సమావేశానికి హజరయ్యారు. ఖరీఫ్ సాగు, రబీ  ప్రణాళిక, ధాన్యం కొనుగోళ్లు తదితర అంశాలపై సమీక్ష జరిగింది. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో గ్రాస్ వాల్యూ అడిషన్పై సీఎం దిశా నిర్దేశం చేశారు. అలాగే ఈనెల 11న ప్రధాని మోదీ ప్రారంభించనున్న పీఎం ధన్ ధాన్య కృషి యోజనపైనా సమీక్షలో చర్చించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. “రైతులకు లాభం రావాలి. వినియోగదారునికి ప్రయోజనం కలగాలి. ఈ విషయంలో వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలు సమన్వయంతో పని చేయాలి. రైతు బజార్లను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలి. పత్తికొండలో ఇటీవలికాలంలో టమాటో పంటకు ధర తగ్గింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ పంటను రైతు బజార్లకు తరలించి.. వినియోగదారులకు అందించేలా చర్యలు తీసుకోవాలి. కోల్డ్ చైన్లాంటి వ్యవస్థలను ఉపయోగించుకుని టమాటో పంటలకు ధర తగ్గకుండా చూసుకోవాలి. రైతు బజార్లను ఆధునీకరించాలి. అర్బన్ ప్రాంతాల్లో రైతు బజార్ల ఆధునికీకరణకు భూమి ఎంతవరకు అవసరమవుతుందో అంచనా వేయాలి. రైతు బజార్లకు అనుసంధానంగా మొబైల్ రైతు బజార్లను ఏర్పాటుచేసే అంశాన్ని పరిశీలించండి. మార్కెట్ కమిటీలను, రైతు బజార్లను అనుసంధానించే కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. దీనిద్వారా నిధుల సమీకరణ చేపట్టి… వ్యవసాయ మౌలిక సదుపాయాల కల్పన జరిగేలా చర్యలు తీసుకోవాలి. వ్యవసాయ మార్కెట్ కమిటీల పరిధిలో ఖాళీగావున్న స్థలాలను సద్వినియోగం చేసుకుంటూ కోల్డ్ చైన్, అగ్రి ప్రాసెసింగ్ వంటి మౌలిక సదుపాయాలను కల్పించాలి” అని సీఎం ఆదేశించారు.

ఎరువుల వినియోగం తగ్గించేలా రైతుల్లో అవగాహన
“రైతు సేవా కేంద్రాలను పునర్వ్యవస్థీకరించేలా వ్యవసాయ శాఖ చర్యలు తీసుకోవాలి. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై ఆధారపడిన రైతులకు సేవలందించేలా రైతుసేవా కేంద్రాలను తీర్చిదిద్దాలి. రైతులకు వివిధ రకాల ప్రభుత్వ సేవలు అందించే విషయంలో రైతుసేవా కేంద్రాలే కీలక పాత్ర పోషించాలి. ఎక్కువ యూరియా వేస్తే ఎక్కువ పంట వస్తుందని..ఆదాయం వస్తుందని రసాయన ఎరువులు, పురుగు మందులు ఎక్కువ వాడేస్తున్నారు. తద్వారా భూసారం క్షీణించడంతోపాటు వ్యాధులు సంక్రమిస్తున్నాయి. రసాయన ఎరువులు అధికంగా ఉపయోగించిన ఉత్పత్తుల వినియోగం కారణంగా ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. మంచి పోషక విలువలు అందించటం ద్వారా భూసారం పెంచాలి. దాని ద్వారా ఉత్పాదకత పెంచాలి. 2026 ఖరీఫ్ సీజన్లో సేంద్రీయ సాగు పెంచేలా, ఎరువుల వినియోగం తగ్గించేలా రైతుల్లో అవగాహన పెంచాలి. ప్రకృతి సేద్యం ద్వారా పర్యావరణంతోపాటు ఆరోగ్య పరంగా, ఆర్ధికంగా కలిగే ప్రయోజనాలను రైతులకు వివరించాలి. ఎలాంటి మార్పులు జరగాలన్నా… క్షేత్రస్థాయిలో ఉండేవారికి పూర్తిస్థాయి అవగాహన ఉండేలా చూడాలి. భూసారం పెంచే పోషకాల విషయంలో లోపాలను సవరించి తదుపరి ప్రణాళికలు చేసుకోవాలి. దశలవారీగా రసాయన ఎరువుల వినియోగం తగ్గించాలి” అని సీఎం సూచించారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 08-05-2026

చైతన్యరధం ఈ పేపర్ 07-05-2026

ఎకోసిస్టమ్‌కు ఊతమిచ్చే

రబీ సీజన్ కు పక్కా ప్రణాళిక
“రబీ సీజన్ కోసం 23 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని సమీక్షలో అధికారులు వివరించారు. ఇప్పటికే జిల్లాలకు 41 వేల మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేశామన్నారు. పోర్టుల్లో 79,527 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలున్నాయన్నారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ..“రబీ సాగు కోసం భూసార పరీక్షలు నిర్వహించి… డేటా ప్రకారం మైక్రో న్యూట్రియంట్స్ వేసుకునేలా రైతును ప్రోత్సహించండి. వచ్చే సీజను భూసార పరీక్షలపై ఓ ప్రామాణిక విధానాన్ని రూపొందించండి. దుకాణాలు, రైతుసేవా కేంద్రాల వారీగా రికార్డులు నవీకరణ చేపట్టాలి. భూసార పరీక్షల రిపోర్టుల ఆధారంగా ఎకరాకు ఎంత ఎరువు వినియోగించాలో రైతులకు దిశా నిర్దేశం చేయాలి. యూరియా ఎవరు తీసుకున్నారనే విషయాన్ని పూర్తిస్థాయిలో రికార్డులు నిర్వహించాలి. రైతులు, కౌలు రైతులకు ఎంత యూరియా సరఫరా చేశారన్న అంశంపై రికార్డులు పక్కాగా ఉండాలి. సాగు విస్తీర్ణం ప్రకారం ఎరువుల సరఫరా జరగాలి. యూరియాను డైవర్ట్ చేసిన ఉదంతాలు ఇటీవల కాలంలో చూశాం. ఆధార్ ఆథంటికేషన్ చేసి ఎరువులసరఫరా జరగాలి. ఈ ఏడాది 90.91 లక్షల మెట్రిక్ టన్నులమేర పంట ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది. 51 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ లక్ష్యం. ఇది గత ఏడాదితో పోలిస్తే 44 శాతం అధికం. టార్పాలిన్లు రైతులకు అందుబాటులో ఉంచాలి” అని చంద్రబాబు చెప్పారు.

ధన-ధాన్య కృషీ యోజన కింద రైతులకు కలిగే లాభాలపై అధ్యయనం
“హెడ్డీ బర్లీ పొగాకును రైతులు తక్కువ ధరకే అమ్ముకోకుండా చూడాలి. ప్రభుత్వం కొనుగోలు చేసిన పొగాకుకు రైతులకు రూ.96 కోట్లు చెల్లింపు చేశాం. హెల్దీ బర్లీ పొగాకు పంటకు మార్కెట్ ఉండేలా చూడాలి. దీనికోసం పంటను కూడా అవసరమైన మేరకు నియంత్రించుకోవాల్సిన అవసరముంది. నాలుగు జిల్లాల్లో పొగాకుకు క్రాప్ హాలిడే ప్రకటించండి. త్వరలో ప్రధాని ప్రారంభించబోయే ధన-ధాన్య కృషీ యోజన కింద ఏ పంటకు ఎక్కువ లాభం వస్తుందో చూసుకుని ఆ పంటలను ప్రోత్సహించాలి. పప్పు దినుసుల విషయంలో వందశాతం కొనుగోళ్లు చేస్తామని కేంద్రం చెబుతోంది. ఈ పథకంపై పూర్తిస్థాయిలో  అధ్యయనం చేయాలి. రైతులకు ఎంతవరకు లబ్ది చేకూరుతుందో చూడండి. గతంలో ఏపీకంటే కర్ణాటకలో సెరీకల్చర్ సాగు తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు కర్ణాటక రాష్ట్రం… ఏపీకంటే 8 రెట్లు అధికంగా సెరీకల్చర్ రంగంలో ఉత్పత్తి చేస్తోంది. ఎందుకు ఈ స్థాయిలో గ్యాప్ వచ్చిందో విశ్లేషించండి. సిల్క్ ఉత్పత్తికి సంబంధించి యంత్రాలను ఎంఎస్ఎంఈలో పెట్టి.. వాటిని సబ్సిడీమీద సరఫరా చేసేలా చూడండి. బిల్ గేట్స్ ఫౌండేషన్తో అగ్రిటెక్పై కూడా పని చేస్తున్నాం. సెరీ కల్చర్ విషయంలో బిల్ గేట్స్ ఫౌండేషన్ సహకారం తీసుకోండి. పట్టు పురుగుల సాగు ఉండేచోట ఇతర పంటల సాగులో ఎరువుల వినియోగం తక్కువగా ఉండేలా చూడండి. వ్యవసాయ -సెరీకల్చర్ శాఖలు సమన్వయంతో పని చేయాలి. ప్రతీ పంటపైనా వ్యవసాయ విశ్వవిద్యాలయాలు అధ్యయనం చేయాలి. రైతులకు వచ్చే పంట ఆదాయం, ఇతర ప్రత్యామ్నాయాలపై రీ-ఓరియంటేషన్ జరగాలి” అని ముఖ్యమంత్రి సూచించారు.

ప్రత్యామ్నాయ పంటల సాగు దిశగా ప్రొత్సాహం
“ఉల్లి, టొమాటో, మిర్చి, మామిడి పంటల విషయంలో సాగు ఖర్చులు ఎంతవరకు ఉన్నాయో ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకోవాలి. ఆయా పంటలకు ధరలు తగ్గకుండా ప్రణాళికలు చేసుకోవాలి. టేబుల్ వెరైటీతోపాటు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు పంపితే అసలు ధరలు పడిపోయి నష్టం వాటిల్లే అవకాశం ఉండదు. స్థానిక అవసరాలు, ఎగుమతులు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు ఎంతమేర పంపించాలన్న దానిపై ముందస్తు ప్రణాళికలు ఉండాలి. అరటి పంటకు దేశీయంగానూ, విదేశాల్లోనూ పెద్దఎత్తున వినియోగం ఉంది. ఉద్యాన పంటలను దేశీయ మార్కెట్టుతోపాటు ఎగుమతులు చేసేందుకు, లాజిస్టిక్స్ సవాళ్లు లేకుండా చూసుకోవాలి. వ్యవసాయ రంగంలో అనుబంధ ఉత్పత్తులుగా వచ్చే పుట్టగొడుగుల సాగును పెద్దఎత్తున ప్రోత్సహించాలి. సర్క్యులర్ ఎకానమీలోకి పుట్ట గొడుగుల సాగును తీసుకురావాలి. రాష్ట్రంలో ఉన్న ఆవుల విసర్జితాలతో జీవామృతం తయారు చేసి ప్రకృతి వ్యవసాయానికి అనుసంధానించాలి. ఆవు పేడను దుబాయ్ దేశంలో ఖర్జూరపంటకు ఎరువుగా వినియోగిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయంలో కూలీల వ్యయం తగ్గేందుకు ఉన్న అవకాశాలు పరిశీలించాలి. ప్లాంటేషన్, హార్వెస్టింగ్ మేనేజ్మెంట్ అనేదే పకృతి సేద్యంలో కీలకం. కాఫీ గింజలకు సోకిన బెరిబోరర్ తెగులు నివారణకు జీవామృతం వినియోగించాలి” అని ముఖ్యమంత్రి చెప్పారు.

జీలుగ, పట్టు ఉత్పత్తులను పరిశీలించిన సీఎం
సమీక్ష సమావేశంలో జీలుగు ఉత్పత్తులను సీఎం చంద్రబాబు పరిశీలించారు. గిరిజన ప్రాంతాల్లో తయారు చేసిన జీలుగు బెల్లాన్ని ముఖ్యమంత్రి రుచి చూశారు. అరకు కాఫీ తరహాలోనే జీలుగు ఉత్పత్తులను ప్రోత్సహించాలని సీఎం ఆదేశించారు. అటవీ ప్రాంతంలో వెదురు ఉత్పత్తుల విషయంలో దృష్టి సారించాలన్నారు. గిరిజన రైతులకు ఎక్కువ ఆదాయం లభించేందుకు ఉన్న అవకాశాలు పరిశీలించాలని సీఎం సూచించారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి వివిధ పంటలకు సంబంధించిన మద్దతు ధరలు ప్రకటిస్తూ ముఖ్యమంత్రి పోస్టర్ రిలీజ్ చేశారు. నాణ్యమైన పట్టుగూళ్లతో తయారు చేసిన ఉత్పత్తులను సీఎం చంద్రబాబు పరిశీలించారు. పట్టుగూళ్లతో తయారు చేసిన వస్త్రాలను, బొకేలను రాష్ట్రానికి వచ్చిన అతిథులకు అందించే దిశగా ఆలోచన చేయాలని సీఎం సూచించారు. పట్టుగూళ్లతో తయారు చేసిన బోకేను మంత్రి అచ్చెన్నాయుడు అందించి.. మల్బరీ పట్టు వస్త్రాన్ని సీఎం చంద్రబాబుకు బహూకరించారు.

 

 

Previous Post

చైతన్యరధం ఈ పేపర్ 09-10-2025

Next Post

ఓంక్యాప్ ద్వారా..లక్ష బ్లూకాలర్ ఉద్యోగాలు

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 08-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 08-05-2026

కార్యకర్త
@ May 8, 2026
చైతన్యరధం ఈ పేపర్ 07-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 07-05-2026

కార్యకర్త
@ May 7, 2026
ఆంధ్రప్రదేశ్

ఎకోసిస్టమ్‌కు ఊతమిచ్చే

చైతన్యరధం
@ May 7, 2026
వేగంగా విత్తన సరఫరా
ఆంధ్రప్రదేశ్

వేగంగా విత్తన సరఫరా

చైతన్యరధం
@ May 7, 2026
సీవీడ్ ఆదాయంపై ఎకనామిక్ మోడల్
ఆంధ్రప్రదేశ్

సీవీడ్ ఆదాయంపై ఎకనామిక్ మోడల్

చైతన్యరధం
@ May 7, 2026
భారీ పెట్టుబడులకు ఎసఐపీబీ ఓకే
ఆంధ్రప్రదేశ్

భారీ పెట్టుబడులకు ఎసఐపీబీ ఓకే

చైతన్యరధం
@ May 7, 2026
అతుకులు లేని జాతీయజెండా
ఆంధ్రప్రదేశ్

అతుకులు లేని జాతీయజెండా

చైతన్యరధం
@ May 7, 2026
డేటా సెంటర్ పరికరాల తయారీలో దేశం అగ్రగామిగా నిలవాలి
ఆంధ్రప్రదేశ్

డేటా సెంటర్ పరికరాల తయారీలో దేశం అగ్రగామిగా నిలవాలి

చైతన్యరధం
@ May 7, 2026
Load More

ముఖ్య వార్తలు

రాష్ట్రానికి తరగని ఆస్తిగా ఇనుప ఖనిజం నిల్వలు

రాష్ట్రానికి తరగని ఆస్తిగా ఇనుప ఖనిజం నిల్వలు

చైతన్యరధం
@ May 6, 2026
కార్మికులకు లేబర్ అడ్డాలు

కార్మికులకు లేబర్ అడ్డాలు

చైతన్యరధం
@ May 2, 2026
చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చైతన్యరధం
@ May 1, 2026
పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

చైతన్యరధం
@ April 30, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ఎకోసిస్టమ్‌కు ఊతమిచ్చే

చైతన్యరధం
@ May 7, 2026
వేగంగా విత్తన సరఫరా

వేగంగా విత్తన సరఫరా

చైతన్యరధం
@ May 7, 2026
సీవీడ్ ఆదాయంపై ఎకనామిక్ మోడల్

సీవీడ్ ఆదాయంపై ఎకనామిక్ మోడల్

చైతన్యరధం
@ May 7, 2026
భారీ పెట్టుబడులకు ఎసఐపీబీ ఓకే

భారీ పెట్టుబడులకు ఎసఐపీబీ ఓకే

చైతన్యరధం
@ May 7, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist