చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

జగన్‌ సినిమా అయిపోయింది ..ఇక మిగిలింది వంద రోజులే

గుడుపల్లి బహిరంగ సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు

చైతన్యరధం by చైతన్యరధం
December 29, 2023
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
జగన్‌ సినిమా అయిపోయింది ..ఇక మిగిలింది వంద రోజులే
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ఒక్క ఛాన్స్‌ అంటూ రాష్ట్రాన్ని ముంచాడు, దోచాడు
  • ఎమ్మెల్యేలకు దొంగ పనులు నేర్పించింది జగన్‌ కాదా
  • ఐదేళ్లలో వైసీపీ నేతలు తిన్నది కక్కిస్తా, అరాచకం అణచివేస్తా
  • కుప్పంలో లక్ష ఓట్ల మెజార్టీయే లక్ష్యం
  • అధికారంలోకి వచ్చిన ఏడాదిలో హంద్రీనీవా పూర్తి
  • సూపర్‌సిక్స్‌ హామీలు అమలు చేస్తాం
  • గుడుపల్లి బహిరంగ సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు

గుడుపల్లి/కుప్పం: ఉపాధి హామీ పథకం వైసీపీ నేతలు, కార్యకర్తలకు మేత పథకంగా మారిందని, పనులు చేయకుండా బిల్లులు మార్చుకున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. వైసీపీ నేతలు తిన్నదంతా కక్కించి అరాచకాన్ని అణచివేస్తానని అన్నారు. హంద్రీనీవా కాలువను శ్రీశైలం నుండి రామకుప్పం దాకా తెస్తే…ఐదేళ్లుగా దాన్ని జగన్‌ పూర్తి చేయలేదని, టీడీపీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే పూర్తి చేసి నీళ్లందిస్తానని హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో కుప్పంలో లక్ష ఓట్ల మెజార్టీయే లక్ష్యంగా పని చేయాలన్నారు. జగన్‌ రెడ్డి సినిమా అయిపోయింది ఇక మిగిలింది వంద రోజులే అన్నారు. పేదరిక నిర్మూలనే తన లక్ష్యమన్నారు. కుప్పం నియోజకవర్గంలో మూడు రోజుల పర్యటనలో భాగంగా మొదటి రోజు గురువారం గుడుపల్లిలో నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ నేను ఎప్పుడు వచ్చినా గుడిపల్లి వాసులు అఖండ స్వాగతం పలుకుతారన్నారు. ఆత్మీయుడిగా, కుటుంబ సభ్యుడిగా చూస్తూ ఆదరిస్తునారు. కుప్పం ప్రజలు నన్ను 35 ఏళ్లుగా దీవిస్తున్నారు..మళ్లీ నీవెంటే ఉంటాం అంటూ ఘనస్వాగతం పలుకుతున్నారు. నేనెప్పుడూ మీ మంచే కోరుకుంటాను. నాకు కుప్పం..నా సొంత గ్రామం, కుటుంబం లాంటింది. అందులోనూ గుడుపల్లి గుండెకాయలాంటిది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా గుడుపల్లి ప్రజలు 95 శాతం ఓట్లు టీడీపీకే వేస్తారు. అందుకే ఏ మాత్రం అనుమానం లేకుండా చెప్తున్నా…వచ్చే ఎన్నికల్లో లక్ష మెజార్టీతో గెలువబోతున్నాం. గుడుపల్లిలోని ఓట్లన్నీ ఈసారి టీడీపీకే పడాలి. సీఎం అవ్వడానికి ఇక్కడి రాలేదు..ఎమ్మెల్యేగా పిలుపించుకోవాలని రాలేదు..ఈ ఐదేళ్ల వైసీపీ పాలన చూశారు..నా పాలన చూశారు..పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇప్పుడు? మీ దయ వల్ల ఎక్కువ సార్లు నేనే సీఎం అయ్యాను, ప్రతిపక్ష నాయకుడిగానూ ఉన్నాను…నాదే రికార్డు. అలాంటి నాకే రక్షణ లేదంటే.. ఏంటీ అరాచకం..ఏంటీ నియంతృత్వం? కుప్పంలో రౌడీఇజం పెరిగింది. వైసీపీ సినిమా అయిపోయింది..ఇక వంద రోజులే మిగిలాయి. వైసీపీ నేతలు వంద కంటే ఎక్కువ తప్పులు చేశారు..మిడిసి పడొద్దని హెచ్చరిస్తున్నా. మీరు చేసిన అవినీతి అంతా కక్కిస్తా..అరాచకాలు అణచివేస్తా. కుప్పంలో మళ్లీ ప్రజాస్వామ్యం అంటే ఏంటో చూపిస్తా. పోలీసులకు కూడా ఇక్కడ నేనే దిక్కు. ఐదేళ్లలో మీతో తప్పుడు పనులు చేయించాడు తప్ప మీకేమీ చేయలేదు ఈ మహానుభావుడు. మీరు కూడా మనసు చంపుకుని పనిచేశారు..మీ పిల్లలు, రాష్ట్రంలోని ప్రజలకు మేలు జరగాలంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి పోలీసులు ముందుకు రావాలని చంద్రబాబు పిలుపు ఇచ్చారు.

మళ్లీ మంచి రోజులు వస్తాయి
నేను ఇక్కడికి రాకముందు కుప్పం ను వెనకబడిన నియోజకవర్గంగా పిలిచేవారు. అందుకే దీన్ని ఎంపిక చేసుకుని మీకు వెలుగు తీసుకొస్తే అదే నాకు తృప్తి అని ఇక్కడికి వచ్చా. మన ప్రభుత్వం ఉన్నప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఈ ప్రభుత్వం వచ్చాక ఒక్కటైనా చేసిందా? ప్రతి ఇంటికి రెండు ఆవులుంటే ఆదాయం వస్తుందంటే నన్ను ఎగతాళి చేశారు. అందుకే సబ్సిడీలో ఆవులు అందించి ఆదాయం వచ్చేలా చేసి చూపించా. ఇప్పుడు కుప్పంలో రోజుకు 3 లక్షల లీటర్ల పాలు వస్తున్నాయి..10 లక్షల లీటర్ల ఉత్పత్తి లక్ష్యంగా ఈ సారి చేస్తా. పాడి పరిశ్రమ అభివృద్ధి చేసి మీ జీవితాల్లో వెలుగులు నింపుతాను. సూపర్‌ 6 హామీలు అమలు చేసే బాధ్యత నాది. నా అభివృద్ధికి ప్రధాన కారకులు ఆడబిడ్డలు. మహాలక్ష్మీ పథకం కింద ప్రతి బిడ్డకు రూ.15 వేలు అందిస్తా. దీపం పథకం ద్వారా మళ్లీ 3 గ్యాస్‌ సిలిండర్లు అందిస్తాను. నెలకు రూ.15 వందలు మహిళల అకౌంట్లో వేసే బాధ్యత తీసుకుంటా. ఆంక్షలు లేకుండా అందరికీ ఇస్తాం. మహిళలు గౌరవంగా తిరగడం కోసం ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తాను. జగన్‌ ఏటా జాబ్‌ కేలండర్‌ అని మోసం చేశాడు. ఈ ముఖ్యమంత్రి ఉంటే భవిష్యత్తులో ఉద్యోగాలు వస్తాయా.? ఒక్క డీఎస్సీ అయినా నిర్వహించారా? మన నియోజకవర్గానికి వవ్చిన పరిశ్రమలు కూడా పారిపోయాయి. ఉద్యోగాల కోసం బెంగళూరుకు వెళ్లాల్సి వస్తోంది. నేను ఇక్కడికి ఇంజనీరింగ్‌, మెడికల్‌ కాలేజీలు తీసుకొచ్చాను. యువతకు ఉద్యోగాల కోసం ప్రణాళికలు రూపొందిస్తే ఈ ప్రభుత్వం వచ్చి నాశనం చేసింది. ఉద్యోగం వచ్చే వరకూ నిరుద్యోగ భృతి కింద ప్రతి ఒక్కరికీ రూ.3 వేల అందిస్తాను. 20 లక్షల ఉద్యోగాలు అందించే బాధ్యత టీడీపీది. వంద రోజులు మీరు కష్టపడి రోడ్డుమీదకు వచ్చి పని చేయండి. మళ్లీ మంచి రోజులు వస్తాయి. ప్రజల్లో మార్పు తీసుకురండి. మీ జీవితంలో మార్పు తీసుకొచ్చే బాధ్యత టీడీపీ – జనసేన ప్రభుత్వం తీసుకుంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు.

ఒక్క ఛాన్స్‌ అంటూ నాశనం చేశాడు
ఒక్క ఛాన్స్‌ అని రాష్ట్రాన్ని నాశనం చేశాడు..మళ్లీ పొరపాటున వస్తే గంజాయి తినిపిస్తాడు. భూములు, గనులు దోచేశాడు. రైతులకు కూడా వ్యవసాయం లాభసాటి కావాలి. నేనొచ్చాక తొలి ఏడాదిలోనే హంద్రీనీవా పూర్తి చేసి నీళ్లు తీసుకొస్తా. నీళ్లు ఇస్తే కష్టపడి పనిచేసి బంగారం పండిరచే శక్తి, తెలివితేటలు రైతులకు ఉన్నాయి. నేను గ్రీన్‌ హౌస్‌ విధానం తెస్తే దాన్ని పనికిమాలిన సీఎం నాశనం చేశాడు. ఒక్క గ్రీన్‌ హౌస్‌ కైనా రుణం ఇచ్చాడా..సబ్సిడీ ఇచ్చాడా? గతంలో హెక్టారుకు నేను రూ.16 వేలు రాయితీగా ఇచ్చాను. దాన్ని కూడా రద్దు చేశాడు. అందుకే ఒక్కో రైతుకు ఏడాదికి పెట్టుబడి కింద రూ.20 వేలు అందించే బాధ్యత తీసుకుంటా. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టొద్దని నేనంటే..ఈ సీఎం మీటర్లు పెట్టి రైతులకు ఉరేస్తున్నాడు. సోలార్‌ ప్యానల్లతో మీ మోటార్ల దగ్గరే విద్యుత్‌ ఉత్పత్తి చేసి మీ విద్యుత్‌ మీరే వినియోగించుకోవచ్చు. అవసరం అయితే విక్రయించుకునే విధంగానూ చర్యలు తీసుకుంటాను. కుప్పం వెనకబడిన వర్గాలకు చెందిన నియోజకవర్గం. 35 ఏళ్లుగా నన్ను మీరు ఆదరిస్తున్నారు. అందుకే మీ కోసం అట్రాసిటీ చట్టం తీసుకొస్తా. మిమ్మల్ని ఎవరైనా అవమానిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. త్వరంలో జయహో బీసీ సభ పెట్టి బీసీలకు ఏం చేస్తామో కూడా ప్రకటిస్తాం. ఎన్టీఆర్‌ సుజల స్రవంతి ద్వారా రూ.2 లకే నీళ్లు ఇస్తే..దానికి వైసీపీ వాళ్లు రంగులు వేసుకుని నీళ్లివ్వకుండా సర్వనాశనం చేశారు. ఇంటింటికీ నీరు అందిస్తా..ఆడ బిడ్డలకు శ్రమలేకుండా చేస్తా. మోస పూరిత నవరత్నాలు ఇస్తున్నాడు. పది రూపాయలు ఇచ్చి వంద లాగుతున్నాడు. మీ ఆదాయం పెరగాలి. ఖర్చు తగ్గాలి. దానికి విరుద్ధంగా ఇప్పుడు మీ పరిస్థితి మారిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రతి ఒక్కరి ఆదాయాన్ని రెండిరతలు చేస్తాం
పెట్రోల్‌, డీజల్‌, నిత్యవసర ధరలన్నీ పెరిగాయి. చెత్త పన్ను, ఇంటిపన్ను పెంచాడు. ఆటోవాళ్లకు పది వేలు ఇచ్చి రూ.50 వేలు ఫైన్లు ద్వారా లాగుతున్నాడు. రాష్ట్రంలో సంపద సృష్టిస్తే ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగితే సంక్షేమ కార్యక్రమాలు అందుతాయి. అంగన్వాడీలు, పారిశుద్ధ్య కార్మికులు, వాలంటీర్లు రోడ్డు మీదకు వచ్చారు. అందుకే మళ్లీ హామీ ఇస్తున్నా. ఆదాయం పెంచి సంక్షేమాన్ని అందిస్తాం. పేదరిక నిర్మూలన చేయాలన్నది నా లక్ష్యం. నిరుపేదలకు అండగా ఉండి మీ ఆదాయాన్ని పెంచుతా. ఆదాయం – సంపద పీపీపీ మోడల్‌ ద్వారా వస్తుంది. పేదలు ఇంట్లో ఎంత మంది ఉన్నారు..ఆదాయం ఎంత..ఆదాయం పెంచాలంటే ఏం చేయాలో కూడా ఆలోచించి అమలు చేస్తాం. సబ్సిడీలు కల్పించి దీర్ఘ కాలంలో ప్రతి ఒక్కరి ఆదాయాన్ని రెండిరతలు చేసే బాధ్యత తీసుకుంటాం. ప్రతి ఇంటికి ఒక ప్రణాళిక రూపొందించి ఆర్థికంగా పైకి తీసుకొస్తాం. అది కుప్పం నుండే ప్రారంభిస్తాం. కుప్పం నాకొక స్ఫూర్తి. ఏ కార్యక్రమం అయినా ఇక్కడి నుండే చేపట్టా. జన్మభూమి కార్యక్రమం కూడా ఇక్కడ మొదలుపెట్టిన తర్వాత రాష్ట్రంలో అమలు చేశాను. ధర్మరాజు దేవాలయానికి రూ.66 లక్షలు, కురుబ భవనానికి రూ.55 లక్షలిస్తే వాటిని రద్దు చేశారు. బీసీ రెసిడెన్షియల్‌ స్కూల్‌ కు రూ.25 కోట్లు ఇస్తే దాన్ని నిలిపేశారు. మైక్రో ఇరిగేషన్‌ కు డబ్బులివ్వడం లేదు. గుడిపల్లిలో పరిశ్రమలు తెచ్చి ఉద్యోగాలు అందించే బాధ్యత తీసుకుంటాం. గుడుపల్లిలో మినీ మార్కెట్‌ ఏర్పాటు చేస్తా. కుప్పంలో ఐదేళ్లలో ఒక్క తట్ట మట్టయినా వేశారా.? టీడీపీ హయాంలో ఐదేళ్లలో రాష్ట్రంలో 24 వేల కి.మీ రోడ్లు వేశాం. ప్రతి ఊరిలో ఎల్‌ఈడీ దీపాలు ఏర్పాటు చేశాం. అవి ఇప్పుడు వెలుగుతున్నాయో లేదో తెలీదు. మండల కాంప్లెక్స్‌ కు రూ.3 కోట్లు ఇస్తే దాన్ని రాకుండా చేశారు. నేనొచ్చాక పూర్తి చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు.

రౌడీల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది టీడీపీ
కుప్పంలో రౌడీయిజం పెరుగుతోంది. ఒక పక్క దాడులు..మరో పక్క కేసులు, కబ్జాలు చేస్తున్నారు. అక్రమమైనింగ్‌ కు పాల్పడుతున్నారు. ఇంతటి అరాచకాలు ఎప్పుడైనా చూశారా? కుప్పంకు ఉన్న పేరు ప్రశాంతమైన ప్రాంతం అని. దాడులు జరగని ప్రదేశం కుప్పం. కానీ ఇప్పుడు ఊరికొక ఆంబోతు తయారయ్యారు. హత్యలు చేసే వాళ్లు ్ల..ఆ విధంగానే హతమారిపోతారు. ముఠా కక్షలను నిర్మూలించింది టీడీపీనే. రౌడీల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది టీడీపీనే. కొంత మంది రౌడీలకు పోలీసులు వత్తాసు పలుకుతున్నరు. యథారాజా తథా ప్రజా అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

మార్చాల్సింది జగన్‌నే..
ఎమ్మెల్యేలకు దొంగ పనులు నేర్పించింది జగన్‌ కాదా? జగన్‌ సహకరించకపోతే ఇక్కడి వైసీపీ ఇంఛార్జ్‌ కు దోపిడీ చేసే ధైర్యం ఉంటుందా? మైనింగ్‌ చేసే మంత్రికి టికెట్‌ నిరాకరించగలవా? పెద్దిరెడ్డి కంటే ఎక్కువ మైనింగ్‌ ఎవరన్నా చేశారా? నీ మనుషులు అయితే ప్రోత్సహించి..అమాయకులకు మాత్రం టికెట్లు ఇవ్వకుండా తొలగిస్తావా? మరి వైసీపీ ఎమ్మెల్యేల తప్పులకు ఎవరు కారణం..జగన్‌ కాదా? మార్చాల్సింది ఎవర్ని జగన్‌…నిన్నే. మజ్జిగ నీళ్లు మనకు..మీగడ పెరుగు ఆయనకు. ఇసుక, మద్యం, భూములు, సెటిల్‌ మెంట్లు, గ్రానైట్‌ ద్వారా దోచుకుంటున్నారు. అరాచక శక్తులకు అంతమొందించాలంటే ఇంటికొకరు బయటకు రావాలి. మెడ మీద కత్తిపెట్టి మీ ప్రాణం తీస్తా ఆస్తి రాసివ్వు అని రాయించుకుంటున్నారు. బతికుంటే బలుసాకు తిని బతకొచ్చు అని భయపడి ఆస్తులు రాసి జనం పారిపోతున్నారు. అంగన్వాడీలకు 2 సార్లు నేను జీతాలు పెంచా. చిరుద్యోగులకు న్యాయం చేసే బాధ్యత టీడీపీ తీసుకుంటుంది. 1వ తేదీన ఉద్యోగులకు జీతాలు రావడం లేదు. టీడీపీ హయాంలో మొదటి తారీకునే జీతం ఇచ్చాను. క్రీడా ప్రాంగణాలు లేవుగానీ..కానీ ఆడుదాం అంధ్రా అంట. దోచుకుందాం..దాచుకుందాం అని ఆడుకుంటే వీళ్లకు సరిగా సరిపోయేది. గుడుపల్లిలో రూ.2 కోట్లతో మినీ స్టేడియం నిర్మిస్తా. కుప్పంను దేశంలోనే అగ్ర స్థానంలో నిలిపే బాద్యత నాది. కొండలు బద్దలు కొట్టే యువత ఉంది..ఉద్యోగాలు తెస్తాం..సంపంద పెంచుతాం. వంద రోజులు నా కోసం, సమాజం కోసం పని చేయండి..లక్ష ఓట్ల మెజార్టీతో కుప్పంలో ఈ సారి టీడీపీ గెలవాలి. ఇక్కడికి వచ్చే వైసీపీ వారు..వాళ్ల నియోజకవర్గాలు చూసుకోవాలి..వాళ్ల నియోజకవర్గంలోనే వాళ్లను భూస్థాపితం చేస్తా. ప్రజలతో ఆడుకోవాలని చూస్తే ఊరుకోరు. ప్రజలు తిరగబడతారు..నడ్డి విరగ్గొడతారు. ఇక్కడి గనులు దోచుకున్న పుంగనూరు పుడిరగు బస్సులు కూడా లేకుండా చేశారు. ఇక్కడికి మళ్లీ గతంలో మాదిరిగానే బస్సు సౌకర్యం కల్పిస్తాను. బస్సులు కూడా సక్రమంగా రావాలంటే వైసీపీని చిత్తుగా ఓడిరచాలి. గతంలో ఆడబిడ్డలను చదివించాలంటే కొంత వెనక్కి తగ్గేవారు. 33 శాతం కాలేజీల్లో రిజర్వేషన్‌ కల్పించా. మహిళల కోసం డ్వాక్రా సంఘాలు కూడా టీడీపీ నే తీసుకొచ్చింది. ఆడబిడ్డలను చదివిస్తే సమాజం బాగుపడుతుంది. వచ్చే ఎన్నికల్లో లక్ష ఓట్ల మెజార్టీనే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పని చేయాలి..మిమ్మల్ని ఆదుకునే బాధ్యత నాది అని చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు.

Tags: అమలుఅరాచకఎమ్మెల్యేలుఒక్క ఛాన్స్‌కుప్పంగుడుపల్లిజగన్‌ సినిమా అయిపోయిందిటీడీపీ అధినేతతిన్నది కక్కిస్తానారా చంద్రబాబు నాయుడు మళ్లీ మంచి రోజులు వస్తాయిబహిరంగ సభమార్చాల్సింది జగన్‌నేరౌడీలులక్ష ఓట్ల మెజార్టీయే లక్ష్యంవైసీపీ నేతలుసూపర్‌సిక్స్‌హంద్రీనీవాహామీలు
Previous Post

నానాటికీ దిగజారుతున్న డీజీపీ తీరు

Next Post

చైతన్యరధం ఈ పేపర్ 28-12-2023

Next Post
చైతన్యరధం ఈ పేపర్ 28-12-2023

చైతన్యరధం ఈ పేపర్ 28-12-2023

[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.