- గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పారిశ్రామిక ప్రాజెక్టులు
- రాష్ట్రంలో డిఫెన్స్ ప్రాజెక్టులు జాతికి గర్వకారణం
- గ్రీన్ అమ్మోనియా, లిథియం బ్యాటరీలు, రోబోటిక్స్
- వంటి రంగాల్లో పెట్టుబడులపై దృష్టిసారించాలి
- ఎస్ఐపీబీ బోర్డు సమావేశంలో సీఎం చంద్రబాబు
- 5.2,08,406 పెట్టుబడులకు ఆమోదం
- 25 ప్రాజెక్టుల ద్వారా 21,627 మందికి ఉద్యోగాలు
అమరావతి(చైతన్యరథం): ఈ ఏడాది డిసెంబరు నుంచి పారిశ్రా మిక ప్రోత్సాహకాలను ఎస్క్రో ఖాతాలో వేసేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందించేందుకు ఎస్క్రో ఖాతాలను అనుసంధానించాలని సీఎం సూచించారు. పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ఇన్సెంటివ్లు తప్పనిసరి అయినా ఎంతవరకూ ఆ ప్రోత్సాహకా లను ఇవ్వగలమన్న అంశంపై దృష్టి సారించాలని దిశానిర్దేశం చేశారు. గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందేలా పారిశ్రామిక ప్రాజెక్టులను ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసేలా ప్రణాళికలు ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 20వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం అయింది. పరిశ్రమలు, ఇంధనం, ఐటీ ఎలక్ట్రాని క్స్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో మొత్తం 25 ప్రాజెక్టులకు సంబం ధించి రూ.2,08,406 కోట్ల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలకు ఎస్ఐపీబీ ఆమోదాన్ని తెలిపింది. తద్వారా 21,627 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలను కల్పించనున్నారు. ఇప్పటివరకూ జరిగిన 20 ఎస్ఐపీబీ సమావేశాల ద్వారా 363 ప్రతిపాదనల ద్వారా రూ.13.78 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించింది. ఈ పెట్టుబడుల ద్వారా 10.86 లక్షల మందికి ఉద్యోగాలు రానున్నా యి.
డేటా సెంటర్లపై అపోహలు తొలగించాలి
గ్రీన్ అమ్మోనియాతో పాటు లిథియం బ్యాటరీలు, రోబోటిక్స్ రంగాల్లో పెట్టుబడులపై దృష్టి సారించాలని సీఎం అధికారులకు సూచించారు. ఈ రంగంలో పరిశ్రమల్ని ప్రోత్సహించేలా ఏం చేయాలన్న దానిపై అధ్యయనం చేయాలని నిర్దేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు అవుతున్న పారిశ్రామిక ప్రాజెక్టుల గురించి ప్రజలకు వివరించి అవగాహన కల్పించాలని సూచించారు. కొందరు పనిగట్టుకుని కాలుష్యకారకాలంటూ దుష్ప్రచారం చేస్తు న్నారని అసత్యాలను నమ్మించి అభివృద్ధిని అడ్డుకుంటున్నారని తెలిపారు. ఉత్తరాంధ్రలో ఏర్పాటు అవుతున్న డేటా సెంటర్లన్నింటి కీ 3.5 టీఎంసీల నీరు సరిపోతుందని తెలిపారు. డేటా సెంటర్లపై ఉన్న అపోహలను తొలగించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉండా లని స్పష్టం చేశారు. కొందరు రాజకీయ నిరుద్యోగులు సామాజిక మాధ్యమాల ద్వారా ఫేక్ ప్రచారాన్ని చేస్తున్నారని మండిపడ్డారు.
పోలవరం ఎడమ కాలువ ద్వారా గ్రావిటీపై విశాఖలోని పరిశ్రమ లకు పుష్కలంగా నీటిని తీసుకెళతామని స్పష్టం చేశారు. వస్తున్న పరిశ్రమల ద్వారా రాష్ట్రంలోని ఎకోసిస్టమ్కు ఎంత విలువ జోడిస్తు న్నామన్న అంశాన్ని విశ్లేషించాలని సూచించారు. ఏపీకి వచ్చే పర్యాటకులను ఆకట్టుకునేలా ఆతిథ్య రంగంలో వస్తున్న హోటల్ భవనాలు ప్రత్యేక నిర్మాణాలుగా ఉండేట్టు చూడాలని ఆదేశించారు.
సెప్టెంబరు నాటికి 175 ఎంఎస్ఎంఈ పార్కులు
రాష్ట్రంలో ఏర్పాటవుతున్న రక్షణ రంగ ప్రాజెక్టులన్నీ జాతికి గర్వకారణమేనని స్పష్టం చేశారు. పుట్టపర్తి సమీపంలో డిఫెన్స్, హిందుపూర్ సమీపంలో ఏరో స్పేస్ ప్రాజెక్టులు రావాలని నిర్దే శించారు. మూలపేట పోర్టు డిసెంబరులో ప్రారంభించేలా నిర్మా ణం పూర్తి చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో లాజిస్టిక్స్, ఆధునిక వేర్ హౌసింగ్, కోల్డ్ చైన్ ప్రాజెక్టులను అనుసంధా నించాలని సూచించారు. రాయలసీమలో పండే ఉద్యాన ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్లకు వెళ్లేలా రోడ్ రైల్, పోర్టు కనెక్టివిటీ ఉండాలని స్పష్టం చేశారు. గత ఏడాది నుంచి కుదుర్చుకున్న పెట్టుబడి ఒప్పందాలు, ఎస్ఐపీబీలో అనుమతి పొందిన ప్రాజెక్టు లు వేగంగా పూర్తి అయ్యేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ ఏడాది సెప్టెంబరు నాటికి మిగిలిన 37 ఎంఎస్ఎంఈ పార్కులను కూడా పూర్తి చేసి 175 నియోజకవర్గాల్లో పారిశ్రామిక వాడలు అందుబాటులోకి తీసుకు రావాలని పేర్కొన్నారు. వన్ ఫ్యామిలీ- వన్ ఎంటర్ప్రెన్యూర్ కార్యక్రమాన్ని కూడా పెద్దఎత్తున చేపట్టాలని నిర్దేశించారు.















