- దావోస్ పర్యటన ముగించుకుని ఏపీకి రాక
- గన్నవరం విమానాశ్రయంలో ఘనస్వాగతం
- పెద్దఎత్తున తరలివచ్చిన యువత, నాయకులు
విజయవాడ(చైతన్యరథం): దావోస్ పర్యటన విజయవంతంగా ముగించుకొని రాష్ట్రానికి చేరుకున్న మంత్రి నారా లోకేష్కు యువత ఘనస్వాగతం పలికింది. ముందుగా గన్నవరం విమానాశ్ర యానికి చేరుకున్న లోకేష్కు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీని వాసరావు, టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయానికి పెద్దఎత్తున చేరుకున్న యువత ప్లకార్డులు చేతబూని ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రానికి పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన కోసం చేసిన కృషిని కొనియాడారు. ప్రతిఒక్కరిని ఆప్యాయంగా పలకరించి వారితో కలిసి లోకేష్ ఫొటోలు దిగారు. పార్టీ కార్యకర్తల నుంచి అర్జీలు స్వీకరించారు.















