- ఏర్పాటు చేయాలని యాక్సెంచర్కు మంత్రి లోకేష్ వినతి
- సంస్థ సీఎస్ఓ మనీష్ శర్మతో దావోస్ లో భేటీ
దావోస్/స్విట్జర్లాండ్ (చైతన్యరథం): టెక్నాలజీ, డిజిటల్, కన్సల్టింగ్ సేవల్లో అంతర్జాతీయంగా ప్రసిద్ది చెందిన యాక్సెంచర్ (Accenture) సంస్థ చీఫ్ స్ట్రాటజీ అండ్ సర్వీస్ ఆఫీసర్ మనీష్ శర్మతో రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ దావోస్లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నంలో మౌలిక సదుపాయాలు, ప్రతిభ లభ్యత, పెరుగుతున్న సాంకేతిక పర్యావరణ వ్యవస్థను ఉపయోగించుకుని ఏఐ, క్లౌడ్, డిజిటల్ కార్యకలాపాలపై దృష్టి సారించడానికి విశాఖలో గ్లోబల్ డెలివరీ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. యువతను భవిష్యత్తుకు సిద్ధం చేసే డిజిటల్ టాలెంట్ పైప్ లైన్ ను నిర్మించడం, యాక్సెంచర్కు అవసరమైన వర్క్ ఫోర్స్ తయరీ, ఆంధ్రప్రదేశ్లో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు ఫ్యూచర్ రైట్ స్కిల్స్ నెట్వర్క్ (FRSN) ద్వారా సహకారం అందించండి. క్వాంటం కంప్యూటింగ్ అప్లికేషన్లు, ఎకోసిస్టమ్ డెవలప్మెంట్ తో పాటు స్టార్టప్ లకు మద్దతు ఇచ్చేందుకు అమరావతి క్వాంటం వ్యాలీలో భాగస్వామ్యం వహించండి.
జెన్ ఏఐ, ఎక్స్ ఆర్, బ్లాక్ చైన్ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతికలపై దృష్టి సారించిన యాక్సెంచర్ ఇన్నోవేషన్ ల్యాబ్ను రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (RTIH)తో అనుసంధానించి సహ ఆవిష్కరణలపై దృష్టిసారించాలని మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. మంత్రి లోకేష్ ప్రతిపాదనలపై యాక్సెంచర్ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ మనీష్ శర్మ మాట్లాడుతూ… తమ సంస్థ 2023లో బెంగుళూరులో ఒక జనరేటివ్ ఏఐ స్టూడియోను ప్రారంభించిందన్నారు. ఇది రాబోయే మూడేళ్లలో ఏఐపై ప్రపంచవ్యాప్తంగా 3 బిలియన్ డాలర్ల పెట్టుబడిలో భాగమన్నారు. యాక్సెంచర్ సంస్థ ఏఐ, డిజిటల్ టాలెంట్ అభివృద్ధిపై గణనీయంగా పెట్టుబడులు పెడుతోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 80వేల ఏఐ ఫోకస్డ్ ప్రొఫెషనల్స్ను తయారు చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో అధికభాగం భారత్ పైనే దృష్టి పెట్టామని చెప్పారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై సంస్థ ఉన్నతస్థాయి బృందంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
















