చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

జగన్‌ హయాంలో ప్రతి స్కీమూ ఒక స్కామే!

అన్ని ప్రాజెక్ట్‌ల్లోనూ అవినీతే: సోమిరెడ్డి

by చైతన్యరధం
Oct 27, 2023 at 12:04pm
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
జగన్‌ హయాంలో ప్రతి స్కీమూ ఒక స్కామే!
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • కుంభకోణాలన్నీ బయటకొస్తే.. ఈ ముఖ్యమంత్రి జీవితకాలం జైల్లోనే
  • షిరిడీసాయి సంస్థకు కట్టబెట్టిన ట్రాన్స్‌ ఫార్మర్ల టెండర్లలో భారీ కుంభకోణం
  • తెలంగాణ కన్నా ఒక్కో ట్రాన్స్‌ ఫార్మర్‌ ను 200, 300 శాతం అధిక ధరకు ఏపీ ఎందుకు కొంటోంది
  • కుంభకోణాలన్నీ బయటకొస్తే.. ఈ ముఖ్యమంత్రి జీవితకాలం జైల్లోనే
  • షిరిడీసాయి సంస్థకు కట్టబెట్టిన ట్రాన్స్‌ఫార్మర్ల టెండర్లలో భారీ కుంభకోణం
  • తెలంగాణ కన్నా ఒక్కో ట్రాన్స్‌ఫార్మర్‌ను 200, 300 శాతం అధిక ధరకు ఏపీ ఎందుకు కొంటోంది
  • టీడీపీ హయాంతో పోలిస్తే, నేడు ట్రాన్స్‌ఫార్మర్‌ ధర ఊహించని విధంగా ఎందుకు పెరిగింది?
  • బ్లాక్‌ లిస్ట్‌ లో ఉండాల్సిన షిరిడీసాయి సంస్థకు భారీ కాంట్రాక్టులు కట్టబెట్టడం వెనకున్న మతలబు ఏమిటి
  • గతంలో స్మార్ట్‌ మీటర్ల కుంభకోణంపై నిజాలు నిగ్గుతేల్చడానికి హైకోర్టులో పిల్‌ వేశాను..
  • త్వరలోనే ట్రాన్స్‌ఫార్మర్ల కుంభకోణంపై జగన్‌ రెడ్డి బాగోతాన్ని ప్రజల ముందు ఉంచుతాం.

 

అమరావతి: అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ జగన్మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రతి స్కీమ్‌ ఒక స్కామేనని, ప్రతి ప్రాజెక్ట్‌లోనూ అవినీతేనని టీడీపీ పొలిట్‌బ్యూరోసభ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆరో పించారు. షిరిడీసాయి ఎలక్ట్రికల్స్‌ సంస్థకు కట్టబెట్టిన ట్రాన్స్‌ఫార్మర్ల టెండర్లలో భారీ కుంభకోణం జరిగిందన్నారు. విద్యుత్‌ రంగానికి సంబంధించి స్మార్ట్‌ మీటర్ల కుంభకోణంపై నిజాలు నిగ్గుతేల్చడానికి హైకోర్టులో పిల్‌ వేశాను.. త్వరలోనే ట్రాన్‌ఫార్మర్ల కుంభ కోణంపై కూడా న్యాయస్థానాల్ని ఆశ్రయించి, జగన్‌రెడ్డి బాగోతాన్ని ప్రజల ముందు ఉంచుతానని స్పష్టం చేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో గురువారం సోమిరెడ్డి.. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన ట్రాన్స్‌ ఫార్మర్ల స్కామ్‌ను పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా విలేకరులకు వివరిస్తూ కుంభకోణాలన్నీ బయట కొస్తే.. ఈ ముఖ్యమంత్రి జీవితకాలం జైల్లోనే ఉంటారన్నారు.

సంబంధితవార్తలు

తెలంగాణ ప్రజలు నిలువునా తొక్కేసినా..మీ అహంకారం తగ్గలేదు

తెలుగుజాతి ఉన్నంతవరకూ నిలిచి ఉంటుంది

తీర ప్రాంతంపై జగన్‌ కళ్లు..

జగన్మోహన్‌రెడ్డికి ఇద్దరు దత్తపుత్రులు.. వారిలో ఒకరు అరబిందో సంస్థ యాజమాన్యమైతే, మరొకరు షిరిడీసాయి ఎలక్ట్రికల్స్‌ సంస్థ యజమాని. ఈ రెండు సంస్థలకు పుట్టిన విషపుత్రికే ఇండోసోల్‌ సోలార్‌ సంస్థ. ఇండోసోల్‌ సోలార్‌ సంస్థ వయస్సు కేవలం 18 నెలలు మాత్రమే. ఆ సంస్థను దత్తత తీసుకున్న ముఖ్య మంత్రి అందుకు బహుమతిగా రూ.75,706 కోట్ల విలువైన ప్రాజెక్టులు కట్టబెట్టాడు. గతంలో షిరిడీసాయి ఎలక్ట్రికల్స్‌ సంస్థ స్మార్ట్‌ మీటర్ల కుంభకోణాన్ని బయట పెట్టామని, ఇప్పుడు ట్రాన్స్‌ఫార్మర్ల కుంభకోణం గురిం చి వివరాలు వెల్లడిస్తున్నానని సోమిరెడ్డి చెప్పారు.

జగనన్‌ హయాంలో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్ల ధరలు 300 శాతానికి పైగా ఎందుకు పెరిగాయి?

టీడీపీ హయాంలో 25కేవీ ట్రాన్స్‌ఫార్మర్‌ ధర రూ.58,569 అయితే, నేడు జగన్‌ ప్రభుత్వంలో ఆ ధర రూ.1,78,800గా ఉంది. రూ.1,20,230 మేర ధర పెరిగింది.. అంటే కేవలం నాలుగేళ్లలో దాదాపు 305 శాతం ధర పెరిగింది.

63 కేవీ ట్రాన్స్‌ఫార్మర్‌ ధర టీడీపీ  ప్రభుత్వంలో రూ.89,892 ఉంటే, నేడు జగన్‌ రెడ్డి హయాంలో రూ.2,81,000కు పెరిగింది. రూ.1,91,108 మేర ధర పెరిగింది.. అంటే దాదాపు 312 శాతం పెరిగింది.

100 కేవీ ట్రాన్స్‌ఫార్మర్‌ ధర చంద్రబాబు హయాం లో రూ.1,20,311 ఉంటే, జగన్‌ హయాంలో రూ.3,58,000లు. రూ.2,37,689లు పెరిగింది.. అంటే 297.56 శాతం పెరిగింది.

160 కేవీ ట్రాన్స్‌ఫార్మర్‌ ధర టీడీపీ ప్రభుత్వంలో రూ.2,00,790 ఉంటే, జగన్‌ హయాంలో దాని ధర రూ.6,36,000లకు పెరిగింది. పెరిగిన మొత్తం రూ.4,35,210. పెరిగింది 316.75 శాతం.

315 కేవీ ట్రాన్స్‌ ఫార్మర్‌ ధర టీడీపీ హయాంలో రూ.5,71,252 ఉంటే, నేడు జగన్‌ రెడ్డి హయాంలో రూ.16,75,000 అయ్యింది. అప్పటికీ, ఇప్పటికీ పెరి గిన వ్యయం రూ.11,03,748. పెరుగుదల 293.22 శాతంగా ఉందని సోమిరెడ్డి వివరించారు.

 

తెలంగాణ ప్రభుత్వంతో పోలిస్తే ఏపీ ప్రభుత్వం 200` 300శాతం అధిక సొమ్ము  వెచ్చించింది:

నాలుగేళ్లలో ట్రాన్స్‌ఫార్మర్ల ధరలు పెరగవా అని జగన్‌ ప్రభుత్వం అడ్డగోలుగా వాదించవచ్చు. కానీ ఏపీ లో మాత్రమే దాదాపు 300శాతం వరకు ట్రాన్స్‌ఫార్మ ర్ల ధరలు పెరిగాయి. పక్కనే ఉన్న తెలంగాణ ప్రభుత్వం 2023లో కొనుగోలుచేసిన ట్రాన్స్‌ఫార్మర్ల ధరలతో,ఏపీ ప్రభుత్వ ధరలను పోలిస్తే ఎవరైనా అవాక్కవ్వాల్సిందే.

25 కేవీ ట్రాన్స్‌ఫార్మర్‌ ధర టీడీపీ ప్రభుత్వంలో రూ.58 వేలుంటే, ఈ సంవత్సరం తెలంగాణ సర్కార్‌ అదే ట్రాన్స్‌ ఫార్మర్లను ఒక్కోదాన్ని రూ.79,829కు కొనుగోలు చేసింది. అదే ట్రాన్స్‌ఫార్మర్‌ను జగన్మోహన్‌ రెడ్డి సర్కార్‌ మాత్రం ఈ సంవత్సరమే రూ.1,78, 800లకు కొనుగోలు చేసింది. తెలంగాణతో పోలిస్తే ఏపీ ప్రభుత్వం ఒక్కో ట్రాన్స్‌ఫార్మర్‌ కొనుగోలుకి రూ.98,971లు అదనంగా వెచ్చించింది. అంటే 223.98 శాతం అదనంగా ఖర్చుపెట్టింది.

అలానే 63 కేవీ ట్రాన్స్‌ ఫార్మర్‌ ను తెలంగాణ సర్కార్‌ 2023లో రూ.1,22,936లకు కొంటే, వైసీపీ ప్రభుత్వం మాత్రం ఒక్కో ట్రాన్స్‌ఫార్మర్‌ను రూ.2,81, 000లకు కొనుగోలు చేసింది. మొత్తంగా పక్క రాష్ట్రం తో పోలిస్తే ఒక్కో ట్రాన్స్‌ ఫార్మర్‌కు రూ.1,58,064 లు అదనంగా ఖర్చు పెట్టింది. అంటే 228.57శాతం అదనంగా వెచ్చించింది.

100 కేవీ ట్రాన్స్‌ ఫార్మర్‌ ను 2023లో తెలంగాణ  ప్రభుత్వం రూ.1,86,500లకు కొంటే, జగన్‌రెడ్డి ప్రభుత్వం రూ.3,58,000లకు కొనుగోలు చేసింది. రెండు ప్రభుత్వాలు వెచ్చించిన దాని మధ్య వ్యత్యాసం రూ.1,71,495లు. మొత్తంగా పెరిగిన ఖర్చుశాతం రూ.191.95 శాతం.

315 కేవీ ట్రాన్స్‌ఫార్మర్ని తెలంగాణ ప్రభుత్వం రూ.8,60,000లకు కొంటే, జగన్‌  ప్రభుత్వం మాత్రం అడ్డగోలుగా ఒక్కో ట్రాన్స్‌ ఫార్మర్‌కు రూ.16,75,000 లు చెల్లించింది. రెండు ప్రభుత్వాల మధ్య కొనుగోలు ధర తాలూకా వ్యత్యాసం రూ.8,14,000లు. మొత్తం గా పెరిగిన శాతం 194.70 శాతం.

ఒకే సంవత్సరం పొరుగున ఉన్న రెండురాష్ట్రాలు జరిపిన ట్రాన్స్‌ఫార్మర్ల కొనుగోళ్లలో ఇంత భారీవ్యత్యా సం ఏమిటి? జగన్‌సర్కార్‌ మాత్రమే దేశంలో ఏరాష్ట్రం చేయని విధంగా 200,300శాతం అధిక ధరకు ట్రాన్స్‌ ఫార్మర్లు ఎందుకుకొనుగోలు చేసింది? ట్రాన్స్‌ ఫార్మర్ల కోసం అధికంగా చెల్లించిన సొమ్ము ఎటు పోయింది?

రాష్ట్రంలోని మూడు డిస్కంల పరిధిలో జరిగిన స్మార్ట్‌ మీటర్లు, ట్రాన్స్‌ఫార్మర్ల కొనుగోళ్లకు సంబంధిం చిన సమాచారం కావాలని, సమాచారహక్కు చట్టం కింద కోరిన సమాచారం ఇవ్వాలని 4 నెలలుగా ఆయా డిస్కంల యాజమాన్యాలను కోరుతున్నాను. ఆఖరికి మూడు డిస్కంల సీఎండీలకు, విద్యుత్‌ శాఖ కార్యదర్శికి కూడా ఫోన్‌ చేశాను. ఎంత ప్రయత్నించినా, డిస్కంల అధికారులు అరకొర సమాచారం ఇచ్చి చేతులు దులు పుకున్నారు తప్ప వాస్తవాలు బయటపెట్టలేదు. తాను అడిగిన సమాచారం ఎందుకు ఇవ్వరని, అలా ఇవ్వక పోతే సమాచారహక్కు చట్టానికి విలువ  ఏముంటుం దని కూడా ప్రశ్నించాను. డిస్కంల పరిధిలో కూడా భారీ కుంభకోణాలు జరిగాయి కాబట్టే  సమాచారాన్ని తొక్కిపెట్టారని సోమిరెడ్డి ఆరోపించారు.

సీపీడీసీఎల్‌ పరిధిలో 62.16శాతం పనులు షిరిడీ సాయి సంస్థకే అప్పగించడం వెనకున్న మర్మమేమిటి? :

విజయవాడలోని సెంట్రల్‌ డిస్కం (సీపీడీసీఎల్‌)కు చెందిన రూ.611.40కోట్ల విలువైన టెండర్లలో ఒక్క షిరిడీసాయి ఎలక్ట్రికల్స్‌ సంస్థకే రూ.380 కోట్లకు పైగా పనులు అప్పగించారు. అంటే మొత్తం పనుల్లో 62.16 శాతం పనులు ఆసంస్థకే అప్పగించారు. గతంలో నాసి రకం ట్రాన్స్‌ఫార్మర్లు సరఫరాచేసినందుకు గాను టీడీపీ ప్రభుత్వం షిరిడీసాయి ఎలక్ట్రికల్స్‌ సంస్థకు రూ.178 కోట్ల జరిమానా విధించింది. టీడీపీ హయాంలో సదరు సంస్థకు వేసిన జరిమానాను, వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్ర ఇంధనశాఖ కార్యదర్శిగా ఉన్న ఐఏఎస్‌ అధికారి శ్రీకాం త్‌ రూ.40కోట్ల పెనాల్టీని మాఫీ చేశారు. అనర్హత వేటు వేసి, బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టాల్సిన షిరిడీసాయి సంస్థకు అన్ని కాంట్రాక్టులు ఎందుకు కట్టబెడుతున్నారో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. రైతుల మోటార్లకు బిగించే స్మార్ట్‌ మీటర్ల వ్యవహారంలో కూడా రూ.7వేలకోట్ల కుంభ కోణం జరిగిందని గతంలోనే ఆధారాలతో సహా మీడి యాకు వివరించాను. కానీ జగన్‌ ప్రభుత్వం స్పందించ లేదు. స్మార్ట్‌ మీటర్ల కుంభకోణంపై హైకోర్టులో ప్రజా ప్రయో జన వ్యాజ్యం(పిల్‌) వేశాను. అలానే ట్రాన్స్‌ ఫార్మర్ల కుంభకోణంపై కూడా న్యాయస్థానాల్ని ఆశ్రయి స్తాను. వైసీపీ ప్రభుత్వం నామినేషన్‌ పద్ధతిలో వేలకోట్ల విలువైన ప్రాజెక్టుల్ని ఎలాంటి అనుభవం లేని షిరిడీ సాయి సంస్థకు కట్టబెడుతోంది. టీడీపీ హయాంలో షిరిడీ సాయి సంస్థకు అదనంగా ఎలాంటి పనులు, టెండర్లు అప్పగించలేదు. ఆనాడు మా హయాంలో పనిచేసిన 6, 7 కంపెనీల్లో షిరిడీసాయి సంస్థ ఒకటి. అదికూడా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం తో జరిమా నాలు వేశాం. టీడీపీ ప్రభుత్వం వేసిన జరి మానాలను వైసీపీ ప్రభుత్వం నిస్సిగ్గుగా రద్దుచేసింది కాక, వేలకోట్ల విలువైన కాంట్రాక్టులు కట్టబెడతారా అని సోమిరెడ్డి ప్రశ్నించారు.

విద్యుత్‌ రంగంలో అవినీతిని ఆధారాలతో బయటపెడతాం :

ఇప్పటివరకు నేను సేకరించిన సమాచారాన్ని ప్రజ లు, మీడియా ముందు ఉంచాను. ఇంకా లోతుల్లోకి వెళ్లి మరింత సమాచారం సేకరించి, జగన్‌రెడ్డి హయా ంలో విద్యుత్‌ డిస్కంల పరిధిలో జరుగుతున్న చీకటి కోణాలను వెలికితీస్తాను.ఇప్పటికే రాష్ట్ర విద్యుత్‌ రంగం పూర్తిగా సర్వనాశనమైంది. విద్యుత్‌ కోతలతో వ్యవ సాయ, పారిశ్రామిక రంగాలు కుదేలయ్యాయి. విద్యుత్‌ శాఖలో భారీ అవినీతి జరుగుతోంది. అది మొత్తం ఆధారాలతో సహా బయటపెట్టి తీరతాం. తండ్రి అధికా రాన్ని అడ్డుపెట్టుకొని వేల కోట్లు సంపాదించిన వ్యక్తే ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే లక్షల కోట్లు సంపాదిం చకుండా ఉంటాడా? వైసీపీ ప్రభుత్వంలో ఏ స్కీమ్‌లో అయినా అవినీతి లేదని చెప్పగలరా? జరిగే దోపిడీ, కుంభకోణాలపై మాట్లాడకుండా, మంత్రులు.. వైసీపీ నేతలు టీడీపీపై విమర్శలు చేస్తూ, చంద్రబాబుపై నింద లేస్తున్నారు.ఈ ప్రభుత్వంలోని కుంభకోణాలన్నీ బయట కొస్తే.. ముఖ్యమంత్రి జీవితకాలం జైల్లోనే ఉంటారు. ప్రజలందరూ ఆధారపడే విద్యుత్‌ వ్యవహారంలో భారీ కుంభకోణాలు జరిగితే అంతిమంగా నష్టపోయేది ప్రజలే కదా! అరబిందో, షిరిడీసాయి సంస్థలు తప్ప ఇతర కంపెనీలు లేవా? త్వరలోనే మూడు డిస్కంల పరిధిలో జరిగిన ఊహించని వ్యవహారాలను బయట పెడతానని సోమిరెడ్డి తేల్చిచెప్పారు.

Tags: అరబిందో సంస్థఅవినీతిఇండోసోల్‌ సోలార్‌ సంస్థట్రాన్స్‌ఫార్మర్లుతెలంగాణతెలంగాణ ప్రభుత్వందోపీడిమీడియా సమావేశంవిద్యుత్త్షిరిడీ సాయి సంస్థసీపీడీసీఎల్‌సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిస్కామ్‌స్కీమ్
Previous Post

మళ్లీ మోసం చేసేందుకే బస్సు యాత్ర

Next Post

స్థాయి మరచి భువనేశ్వరిపై విమర్శలు

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 30-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 30-07-2026

కార్యకర్త
@ July 30, 2026
చైతన్యరధం ఈ పేపర్ 29-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 29-07-2026

కార్యకర్త
@ July 29, 2026
చైతన్యరధం ఈ పేపర్ 28-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 28-07-2026

కార్యకర్త
@ July 28, 2026
చైతన్యరధం ఈ పేపర్ 27-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 27-07-2026

కార్యకర్త
@ July 27, 2026
చైతన్యరధం ఈ పేపర్ 26-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 26-07-2026

కార్యకర్త
@ July 26, 2026
చైతన్యరధం ఈ పేపర్ 25-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 25-07-2026

కార్యకర్త
@ July 25, 2026
అతిపెద్ద ధింసా నృత్యంతో ప్రధానికి ఘనస్వాగతాంజలి
ఆంధ్రప్రదేశ్

అతిపెద్ద ధింసా నృత్యంతో ప్రధానికి ఘనస్వాగతాంజలి

చైతన్యరధం
@ July 25, 2026
ఆంధ్రప్రదేశ్

మీకోసం.. నేనున్నా!

చైతన్యరధం
@ July 25, 2026
Load More

ముఖ్య వార్తలు

క్వాంటం పరిశోధనలకు అమరావతి అత్యుత్తమం

క్వాంటం పరిశోధనలకు అమరావతి అత్యుత్తమం

చైతన్యరధం
@ July 24, 2026
భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీ

భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీ

చైతన్యరధం
@ July 24, 2026
50 ఏళ్ల లోపు బీపీఎల్ చేనేతలకు భరోసా

50 ఏళ్ల లోపు బీపీఎల్ చేనేతలకు భరోసా

చైతన్యరధం
@ July 24, 2026
ఉద్యోగుల కుటుంబాలకు కూటమి ఆర్థిక భద్రత

ఉద్యోగుల కుటుంబాలకు కూటమి ఆర్థిక భద్రత

చైతన్యరధం
@ July 20, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
మరిన్ని

తాజా సంఘటనలు

అతిపెద్ద ధింసా నృత్యంతో ప్రధానికి ఘనస్వాగతాంజలి

అతిపెద్ద ధింసా నృత్యంతో ప్రధానికి ఘనస్వాగతాంజలి

చైతన్యరధం
@ July 25, 2026

మీకోసం.. నేనున్నా!

చైతన్యరధం
@ July 25, 2026
మహిళలను అవమానిస్తే సహించను

మహిళలను అవమానిస్తే సహించను

చైతన్యరధం
@ July 25, 2026
ఏడాదిలో గిరిజన ప్రాంత స్కూళ్లకు సొంత భవనాలు

ఏడాదిలో గిరిజన ప్రాంత స్కూళ్లకు సొంత భవనాలు

చైతన్యరధం
@ July 25, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist