- పారిశ్రామిక పురోగతిపై డబ్ల్యూఈఎఫ్ సెషన్‌లో ప్రసంగించనున్న సీఎం
- పలువురు పారిశ్రామిక వేత్తలతో భేటీకానున్న ముఖ్యమంత్రి
దావోస్ (చైతన్యరథం): స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు (వరల్డ్ ఎకనమిక్ ఫోరం` డబ్ల్యూఈఎఫ్)లో తొలి రెండు రోజులపాటు పలు సమావేశాల్లో పాల్గొని, ప్రముఖ కంపెనీల చైర్మన్లు, సీఈఓలతో చర్చలు జరిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు మూడో రోజు బుధవారం కూడా కీలకమైన సమావేశాల్లో పాల్గొననున్నారు. ప్రముఖ కంపెనీల సీఈఓలతో ముఖాముఖి భేటీ కానున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం కాంగ్రెస్ సెంటర్‌లో పారిశ్రామిక పురోగతి అంశంపై నిర్వహించే సెషన్‌లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. హొరైసిస్ చైర్మన్ ఫ్రాంక్ రిచర్ తోనూ సీఎం భేటీ కానున్నారు. తమారా హాస్పిటాలిటీ సంస్థ ఫౌండర్ సృష్టి శిబులాల్, ఆ సంస్థ సీఓఓ కుష్భు అవస్థి, కాలిబో ఏఐ అకాడెమీ సీఈఓ రాజ్ వట్టికుట్టి, స్కాట్ శాండ్స్చెఫర్ లు ముఖ్యమంత్రితో సమావేశమై చర్చలు జరుపుతారు. అనంతరం ఏపీ సీఎనఎఫ్ నిర్వహించే..హీలింగ్ ప్లానెట్ త్రూ రీజెనరేటివ్ ఫుడ్ సిస్టమ్స్.. పేరిట జరిగే చర్చా కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరు కానున్నారు. ఆ తర్వాత.. ట్రిలియన్ డాలర్ పైవోట్ రీరైటింగ్ మార్కెట్ సిగ్నల్స్ ఫర్ నేచర్ పాజిటివ్ గ్రోత్.. అనే అంశంపై చర్చా కార్యక్రమంలోనూ సీఎం పాల్గొంటారు. బ్లూమ్ బెర్గ్ సంస్థ నిర్వహించనున్న.. ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఏఐ మూమెంట్ ట్రాన్సాఫార్మింగ్ గ్లోబల్ ఎకానమీ.. సెషన్‌లో ముఖ్య వక్తగా ప్రసంగించనున్నారు. ఏపీ లాంజ్‌లో నిర్వహించే బిల్డింగ్ ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్యక్రమానికి కేంద్ర మంత్రులతో కలిసి సీఎం హాజరు అవుతారు. వాతావరణ మార్పులపై ఫైనాన్సింగ్ రీజెనరేషన్ మొబిలైజింగ్ కేపిటల్ పేరిట నిర్వహించే మరో కార్యక్రమంలోనూ ముఖ్యమంత్రి పాల్గొంటారు.














