చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

రౌడీలకు రాష్ట్ర బహిష్కరణే!

ఎస్పీలు, కలెక్టర్లకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

by చైతన్యరధం
Dec 19, 2025 at 6:25am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
రౌడీలకు రాష్ట్ర బహిష్కరణే!
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • శాంతిభద్రతల విషయంలో రాజీపడేది లేదు
  • రాష్ట్రంలో శాంతిభద్రతలే ప్రభుత్వానికి ముఖ్యం
  • నేరాలకు పడే శిక్షలపై విస్తృత ప్రచారం చేపట్టండి
  • మహిళా భద్రతా విభాగంతో సెల్ఫ్‌ డిఫెన్సుపై శిక్షణ
  • సున్నిత గ్రామాల్లో నిరంతర తనిఖీలు పెంచాలి..
  • ఎస్పీలు, కలెక్టర్లకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం
  • రాష్ట్రంలో శాంతిభద్రతలపై లోతైన సమీక్ష

అమరావతి (చైతన్య రథం): రాష్ట్రంలో శాంతిభద్రతలే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యతాంశమని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రాభివృద్ధి, పారిశ్రామికాభివృద్ధికి కీలకమైన శాంతి భద్రతల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని సీఎం చంద్రబాబు నొక్కిచెప్పారు. కలెక్టర్ల సదస్సులో శాంతిభద్రతలపై జిల్లా ఎస్పీలు, కలెక్టర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ‘‘రౌడీలనేవారు రాష్ట్రంలో ఉండేందుకు వీల్లేదు. నటోరియస్‌ రౌడీలను రాష్ట్ర బహిష్కరణ చేద్దాం. రౌడీల విషయంలో కఠినంగా ఉండాల్సిందే. అప్పుడే పరిస్థితి నియంత్రణలోకి వస్తుంది. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తే రాష్ట్ర బహిష్కరణే. జిల్లాల్లో ప్రొఫెషనల్‌ రౌడీలను గుర్తించి హెచ్చరించండి. లొంగకపోతే పీడీ యాక్టుతో రాష్ట్ర బహిష్కరణ చేయండి. నెల్లూరులో లేడీడాన్స్‌, గంజాయి వ్యాపారం, అడ్డంవస్తే చంపేయటం లాంటి ఘటనలతో.. శాంతి భద్రతలు ప్రశ్నార్థకమవుతుంది. సినిమాల్లోనే ఈ తరహా వ్యవహారాలుంటాయి. ఈ విషయంలో ఎస్పీ, కలెక్టర్లు కఠినంగా వ్యవహరించాలి. శాంతిభద్రతల విషయంలో రాష్ట్రాన్ని జీరో టాలరెన్సుకు తీసుకురావాలి’’ అని సీఎం చంద్రబాబు గట్టిగా చెప్పారు. తొలుత శాంతిభద్రతలపై డీజీపీ హరీష్‌ కుమార్‌ గుప్తా పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. రాష్ట్రంలో గతంతో పోలిస్తే 5.5 శాతంమేర నేరాల రేటు తగ్గిందని వెల్లడిరచారు. ‘‘మహిళలపై నేరాలు గణనీయంగా తగ్గాయి. 16 జిల్లాల్లో నేరాలు బాగా నియంత్రణకు వచ్చాయి.

కొన్ని జిల్లాల్లో వేర్వేరు కారణాలవల్ల క్రైమ్‌ ట్రెండ్‌ పెరుగుతోంది’’ అని డీజీపీ వివరించారు. అన్నమయ్యలాంటి జిల్లాలో మైగ్రేషన్‌ లేబర్‌ కారణంగా నేరాలు జరుగుతున్నాయని డీజీపీ అన్నారు. కిడ్నాపింగ్‌లాంటి కేసులు తగ్గుముఖం పట్టాయన్న డీజీపీ.. 56 శాతంమేర డిటెక్షన్‌ రేట్‌, 55 శాతంమేర రికవరీ రేటు ఉందన్నారు. ఎన్టీఆర్‌, పశ్చిమగోదావరి జిల్లాలు సహా ఐదు జిల్లాల్లో సీసీటీవీల అనుసంధానంతో నేరాలు క్రమంగా తగ్గుముఖం పట్టాయని వెల్లడిరచారు. డీహెచ్‌ఎంఎస్‌ అనే ఆధునిక సాంకేతికత ద్వారా సీసీ కెమెరాల హెల్త్‌ను నమోదు చేస్తున్నామన్న విజయవాడ సీపీ రాజశేఖర బాబు.. నగరంలో నిఘా కోసం 10 వేల సీసీ కెమెరాల డ్యాష్‌ బోర్డును కమ్యూనిటీ సహకారంతో రూపొందించామని చెప్పారు. ఫేస్‌ రికగ్నిషన్‌ కెమెరాల ద్వారా నిందితుల్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నామని రాజశేఖర్‌ బాబు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందిస్తూ.. ‘‘కొన్ని జిల్లాల్లో క్రైమ్‌ రేటు ఎక్కువగా ఉంది. మరికొన్నిచోట్ల తక్కువగా ఉంది. రాష్ట్రంలో శాంతిభద్రతలే ప్రభుత్వానికి ముఖ్యం. కడప, అల్లూరి, ఏలూరు జిల్లాల్లో ప్రాపర్టీ సంబంధిత కేసులు ఎక్కువగా ఉండటానికి కారణం ఏమిటో విశ్లేషించండి. పోలీసింగ్‌ అంటే భయం ఉండాలి. రాష్ట్రంలో 5.5 శాతంమేర నేరాల రేటు తగ్గింది. కానీ జిల్లాల మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉంది. అన్నమయ్య, కోనసీమ, నెల్లూరు, గుంటూరు, తిరుపతి జిల్లాల్లో ఎందుకు నేరాలు పెరిగాయో విశ్లేషించండి’’ అని సీఎం చంద్రబాబు ఎస్పీలు, కలెక్టర్లను ఆదేశించారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 23-06-2026

స్వర్ణాంధ్ర లక్ష్యాలపై ప్రణాళికా విభాగం ఎంఓయూ

మానవీయ కోణంలో పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారం

రాష్ట్రంలో రౌడీల కట్టడి, ట్రాఫిక్‌ క్రమబద్దీకరణ, మతపరమైన గొడవలువంటి అంశాలపై సదస్సులో చర్చించారు. సమీక్షలు మొక్కుబడి వ్యవహారం కాదని, శాంతి భద్రతల విషయంలో సీరియస్సుగానే ఉంటామని చంద్రబాబు హెచ్చరించారు. ‘‘తప్పు చేసిన వాళ్లకి పోలీసంటే భయం ఏర్పడేలా చేయండి. అప్పుడు తప్పులు చేయడానికి వెనుకాడతారు. రాష్ట్రంలో మహిళలపై నేరాలు అదుపులోకి రావాలి. రాష్ట్రంలో రౌడీలుండేందుకు వీల్లేదు. శాంతిభద్రతల విషయంలో రాజీ లేదు’’ అని సీఎం తీవ్రస్వరంతో ఆదేశించారు. ‘‘ఆర్ధిక నేరాల విషయంలో పోలీసు శాఖ అప్రమత్తంగా ఉండాలి. అన్ని జిల్లాల్లో సైబర్‌ క్రైమ్‌ పోలీసు స్టేషన్లను ఏర్పాటు చేయండి. ఫోరెన్సిక్‌ రంగంలో ఆల్‌ ఇండియా ప్రమాణాల ప్రకారం కార్యాచరణ ఉండాలి. తీరప్రాంత భద్రతకు బోట్స్‌ తక్షణం కొనుగోలు చేయండి. డ్రోన్ల వినియోగం బాగా పెరగాలి. ఆర్టీజీఎస్‌ విభాగంతో అనుసంధానించాలి. ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ సిస్టం 15 నిముషాల్లోపుగా బాధితుల్ని చేరేలా బలోపేతం చేయండి. ప్రతీ రహదారి ప్రమాదంపైనా సమీక్షించండి. బ్లాక్‌ స్పాట్స్‌ కరెక్షన్‌ జరగాలి. టాప్‌ -3 నేరాలను నియంత్రించిన బెస్ట్‌ ప్రాక్టీసెస్‌ను వచ్చే కాన్ఫరెన్సులో చర్చిద్దాం. సైబర్‌ నేరాల ద్వారా జరిగే ఆర్ధిక నష్టంపై అధ్యయనం చేయండి. సామాజిక మాధ్యమాల్లో జరిగే దుష్ప్రచారంపై మంత్రుల కమిటీ అధ్యయనం చేయాలి. ఫేక్‌ ఖాతాలు తయారు చేసి వ్యక్తిత్వ హననానికి పాల్పడే వారిని శిక్షించాలి’’ అని సీఎం చంద్రబాబు ఎస్పీలు, కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు.

Previous Post

పప్పుదినుసుల కొనుగోలుకు కేంద్రం ఆమోదం

Next Post

జలమే.. జయం!

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 23-06-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 23-06-2026

కార్యకర్త
@ June 23, 2026
స్వర్ణాంధ్ర లక్ష్యాలపై ప్రణాళికా విభాగం ఎంఓయూ
ఆంధ్రప్రదేశ్

స్వర్ణాంధ్ర లక్ష్యాలపై ప్రణాళికా విభాగం ఎంఓయూ

చైతన్యరధం
@ June 23, 2026
మానవీయ కోణంలో పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారం
ఆంధ్రప్రదేశ్

మానవీయ కోణంలో పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారం

చైతన్యరధం
@ June 23, 2026
చైతన్యరధం ఈ పేపర్ 22-06-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 22-06-2026

కార్యకర్త
@ June 22, 2026
‘ఈగల్- 1972’ పోస్టర్ల ఆవిష్కరణ
ఆంధ్రప్రదేశ్

‘ఈగల్- 1972’ పోస్టర్ల ఆవిష్కరణ

చైతన్యరధం
@ June 22, 2026
క్యాన్సర్ బాధితులకు దేవాలయం..బసవతారకం ఆస్పత్రి
ఆంధ్రప్రదేశ్

క్యాన్సర్ బాధితులకు దేవాలయం..బసవతారకం ఆస్పత్రి

చైతన్యరధం
@ June 22, 2026
యోగాంధ్ర 2026’కు లండన్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తింపు
ఆంధ్రప్రదేశ్

యోగాంధ్ర 2026’కు లండన్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తింపు

చైతన్యరధం
@ June 22, 2026
ఇక ప్రోగ్రెస్ రిపోర్టులు!
ఆంధ్రప్రదేశ్

ఇక ప్రోగ్రెస్ రిపోర్టులు!

చైతన్యరధం
@ June 22, 2026
Load More

ముఖ్య వార్తలు

ఇక ప్రోగ్రెస్ రిపోర్టులు!

ఇక ప్రోగ్రెస్ రిపోర్టులు!

చైతన్యరధం
@ June 22, 2026
అంగన్వాడీ కేంద్రానికి ఇండక్షన్ స్టవ్ లు

అంగన్వాడీ కేంద్రానికి ఇండక్షన్ స్టవ్ లు

చైతన్యరధం
@ June 21, 2026

రైతుకు ప్రజాప్రభుత్వం అభయం 

చైతన్యరధం
@ June 21, 2026
అన్నదాతల ఖాతాల్లోకి ‘సుఖీభవ’

అన్నదాతల ఖాతాల్లోకి ‘సుఖీభవ’

చైతన్యరధం
@ June 20, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

స్వర్ణాంధ్ర లక్ష్యాలపై ప్రణాళికా విభాగం ఎంఓయూ

స్వర్ణాంధ్ర లక్ష్యాలపై ప్రణాళికా విభాగం ఎంఓయూ

చైతన్యరధం
@ June 23, 2026
మానవీయ కోణంలో పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారం

మానవీయ కోణంలో పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారం

చైతన్యరధం
@ June 23, 2026
‘ఈగల్- 1972’ పోస్టర్ల ఆవిష్కరణ

‘ఈగల్- 1972’ పోస్టర్ల ఆవిష్కరణ

చైతన్యరధం
@ June 22, 2026
క్యాన్సర్ బాధితులకు దేవాలయం..బసవతారకం ఆస్పత్రి

క్యాన్సర్ బాధితులకు దేవాలయం..బసవతారకం ఆస్పత్రి

చైతన్యరధం
@ June 22, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist