- ప్రతీ మండలంలోనూ ‘నైబర్హుడ్ వర్క్ ప్లేస్’ ఏర్పాటు
- రైతన్నల పొలాల్లో సోలార్ యూనిట్లతో ఆదాయం
- గృహ నిర్మాణ, సమాచార మంత్రి కొలుసు పార్థసారథి
- మొర్సిపూడిలో ఫుడ్ పార్క్ పనులకు శంకుస్థాపన
ఏలూరు(చైతన్యరథం): రైతులు తాము పండిరచే పంటలకు మెరుగైన ధర కల్పించడమే ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ లక్ష్యమని గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. 60 పారిశ్రామిక ప్రాజెక్టులు, 51 ఎం ఎస్‌ఎంఈలు ప్రారంభోత్సవంలో భాగంగా ఏలూరు జిల్లా నూజి వీడు మండలం మొర్సిపూడిలో రూ.102 కోట్లతో ఏర్పాటు చేయనున్న రమణసింగ్ గ్లోబల్ ఫుడ్ పార్క్‌ను పనులను మంగళ వారం ముఖ్యమంత్రి కనిగిరిలో వర్చ్యువల్‌గా శంకుస్థాపన చేశా రు. నూజివీడు మండలం మొర్సిపూడిలో రమణసింగ్ గ్లోబల్ ఫుడ్ పార్క్ పరిశ్రమకు మంగళవారం మంత్రి కొలుసు పార్థసారథి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో రాష్ట్రాన్ని వ్యవసాయపరంగా, ఆర్థికంగా, పారిశ్రామికంగా దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిపేం దుకు విజన్ కలిగిన నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు అలు పెరగని కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు 20 కొత్త పారిశ్రామిక పాలసీలు తీసుకు వచ్చామని, అందులో ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ ఒకటన్నారు. వ్యవసాయ రంగాన్ని పారిశ్రామికరంగంతో సమ్మిళితం చేసి ఆహా ర ఉత్పత్తులతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుచేయడం ద్వారా రైతులకు వారు పండిరచే పంటలకు మరింత మెరుగైన ధర అందించేందుకు వీలు కలుగుతుందన్నారు.
రైతులకు తాము పండిరచిన పంటలకు గిట్టుబాటు లేని పరిస్థితిని ఎన్నటికీ రానివ్వ కుండా రైతుల అవసరాలను ముందుగానే తెలుసుకుని అందుకు అనుగుణంగా చర్యలు తీసుకునే ప్రభుత్వం తమదన్నారు. రమణ సింగ్ గ్లోబల్ ఫుడ్ పార్క్ ఏర్పాటుతో 700 మంది యువతకు ప్రత్యక్షంగా, 1500 మందికి పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశా లు కలుగుతాయన్నారు. సంక్షేమంతో తోపాటు అభివృద్ధికి సమాన ప్రాధాన్యతను ముఖ్యమంత్రి ఇస్తున్నారన్నారు. తమ ప్రభుత్వం గత ప్రభుత్వం కన్నా ఎక్కువగా సంక్షేమ లబ్దిని ప్రజలకు అంది స్తూనే, అభివృద్ధికి కృషిచేస్తున్నదన్నారు. ఈనాటి యువత ఉద్యోగం కోసం నిరీక్షించడం నుండి మరొకరికి ఉద్యోగం అందించే స్థాయికి తీసుకువెళ్లడమే స్వర్ణాంధ్ర-2047 విజన్ లక్ష్యమన్నారు. ప్రపం చంలో ఎక్కడా లేని విధంగా మనరాష్ట్రంలో నైపుణ్యం కలిగిన మానవవనరులు అధికంగా ఉన్నాయన్నారు. రాష్ట్రంలో ‘స్పీడ్ అఫ్ డూయింగ్ బిజినెస్’ విధానం ద్వారా పెద్దఎత్తున దేశ విదేశాలలోని పెట్టుబడిదారులు మనదేశంలో పరిశ్రమలు పెట్టేందుకు ఆహ్వాని స్తూ, వారికి అనుకూలమైన పరిస్థితులు కల్పిస్తున్నామని, దీనితో మన రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనకు కృషిచేస్తున్నా మన్నారు.
రాష్ట్రంలో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల కోసం ప్రతి మండలంలోనూ ‘నైబర్హుడ్ వర్క్ ప్లేస్’ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసే ఆలోచనలో ఉందన్నారు. పంటపొలాల్లో సాగుకు అడ్డులేకుండా సోలార్ విద్యుత్ ఏర్పాటు చేసి రైతులకు మరింత ఆదాయం అందించేలా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నదన్నారు. నూజివీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి విజన్ స్వర్ణాంధ్ర-2047 సాధనలో అందరూ భాగ స్వాములు కావాలన్నారు. రాష్ట్ర ఛాంబర్ అఫ్ కామర్స్ అధ్యక్షులు భాస్కరరావు, విజయ మిల్క్ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు, ఎంపిపి శిరీష, ప్రభృతులు ప్రసంగించారు. ఈ సందర్భంగా పారిశ్రామివేత్తకు ప్రభుత్వ ప్రోత్సాహకాల చెక్కును మంత్రి అందజే శారు. అనంతరం మంత్రిని రమణసింగ్ గ్లోబల్ ఫుడ్ పార్క్ యాజమాన్యం గోగినేని బాబు, గోగినేని పద్మావతి, బాలాజీలు దుశ్శాలువా, మెమెంటోతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈవో శ్రీహరి, గృహనిర్మాణ శాఖ పీడీ సత్యనారాయణ, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ బాబ్జి, తహసీల్దార్, ఎంపీడీవో, పాల్గొ న్నారు. ముఖ్యమంత్రి కనిగిరిలో పాల్గొన్న కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు.











