చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

వైసీపీ తొత్తులుగా మారిన అధికారులపై చర్యలు తీసుకోవాలి

సీఈఓకు టీడీపీ నేత వర్ల రామయ్య ఫిర్యాదు

by చైతన్యరధం
May 1, 2024 at 6:30am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  •  పెద్దిరెడ్డి అరాచక సామ్రాజ్యంగా పుంగనూరు
  • ప్రతిపక్ష ప్రచార వాహనాల ధ్వంసం, కార్యకర్తలపై దాడులు నిత్యకృత్యం
  • అక్కడి డీఎస్పీ రాజగోపాల్‌రెడ్డి పోలీసు అధికారిగా అనర్హుడు
  • టీడీపీ ఓటర్లను బెదిరిస్తున్న అర్మ్‌డ్‌ రిజర్వ్‌ డీఎస్పీ సుధాకర్‌
  • టీడీపీపై కక్ష కట్టినట్లుగా వ్యవహరిస్తున్న చిత్తూరు ఆర్వో అరుణ
  • ఇండిపెండెంట్లకు గాజుగ్లాసు గుర్తు కేటాయించకుండా రిజర్వ్‌ చేయాలి
  • సీఈఓకు టీడీపీ నేత వర్ల రామయ్య ఫిర్యాదు

అమరావతి(చైతన్యరథం): రాష్ట్రంలో, ముఖ్యంగా పుంగనూరు నియోజకవర్గంలో శాంతిభద్రతలు దారుణంగా దిగజారిపోయాయని, ప్రతిపక్షాలపై దాడులు, అరాచకాలు జరుగుతున్నా పోలీసు యంత్రాంగం మాత్రం చోద్యం చూస్తోందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) ముకేష్‌కుమార్‌ మీనాకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. అధికార పార్టీకి తొత్తుల్లా వ్యవహరిస్తున్న చిత్తూరు అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారిణి అరుణ, రాజ్‌భవన్‌ అర్మ్‌డ్‌ రిజర్వ్‌ డీఎస్పీలపై కూడా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. గాజు గ్లాసు గుర్తును ఎవరికి కేటాయించకుండా రిజర్వ్‌ చేయాలని సీఈఓను వర్ల రామయ్య కోరారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వర్ల రామయ్య మాట్లాడుతూ…రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను ఎన్నికల కమిషన్‌కు వివరించామన్నారు. ముఖ్యంగా శాంతిభద్రతలు నశించిపోయిన పుంగనూరు నియోజకవర్గ పరిస్థితులను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి తెలియపరిచాం. పరిస్థితులు కాస్త అటూ ఇటూ అయితే ముఖ్యమంత్రి అవుదామని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉబలాటపడుతున్నాడు. పుంగనూరును ప్రత్యేక సామ్రాజ్యంగా చేసుకున్నాడు. పుంగనూరు నియోజకవర్గానికి డీజీపీ, సీఎస్‌లకు సంబంధమే లేనట్లుగా ఉంది. కానిస్టేబుల్‌ దగ్గర నుంచి డీఎస్పీ వరకు అక్కడున్న అధికారులందరూ పెద్దిరెడ్డి మనుషులే. పెద్దిరెడ్డి ఏమి చెబితే వారు అదే చేస్తారు. శాంతిభద్రతలన్నీ కూడా పెద్ద్దిరెడ్డి ఆధీనంలోనే ఉన్నాయని మండిపడ్డారు.

పుంగనూరు డీఎస్పీని తొలగించాలి
పుంగనూరులో టీడీపీ, ప్రతిపక్ష ప్రచార రథాలు తిరగడానికి వీళ్లేదన్నట్లు పెద్దిరెడ్డి, అతని అనుచరులు వ్యవహరిస్తున్నారు. ప్రచార రథాలు తగలబెడుతున్నా, నాయకులు, కార్యకర్తలపై దాడులు చేస్తున్నా పోలీసులు మాత్రం చోద్యం చూస్తున్నారు. ఎన్నికల ప్రచారం చేస్తున్న బీసీవై పార్టీ అధినేత రామచంద్రయాదవ్‌పై దాడులు చేస్తే పోలీసులు మాత్రం తమాషా చూస్తున్నట్లు వ్యవహరించారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బీసీవై పార్టీ నాయకులు పారిపోయారు. ఇన్ని ఘోరాలు, అరాచకాలు జరుగుతుంటే ఎన్నికల కమిషన్‌, డీజీపీ, ఎస్పీ ఏమి చేస్తున్నారు? ఎన్నికల సజావుగా నిర్వహించాలనే ఆలోచన ఎన్నికల కమిషన్‌కు ఉంటే కానిస్టేబుల్‌ నుంచి డీఎస్పీ వరకు అందరినీ తీసేసి కేంద్రబలగాలను పెట్టాలి. రాష్ట్ర పోలీసు విభాగానికి సంబంధించిన అధికారులెవ్వరూ పుంగనూరు నియోజకవర్గంలో ఉండకూడదు. ఎన్నికలు అయ్యేంతవరకు కూడా వారిని వీఆర్‌లో పెట్టాలి. లేదంటే ఉత్తరాంధ్ర నుంచి పోలీసులను పుంగనూరుకు తీసుకువచ్చి ఈ 15 రోజులు బాధ్యతలు నిర్వర్తించేలా ఆదేశాలు ఇవ్వాలి. నాలుగు వాహనాలు ధ్వంసం చేస్తే పుంగనూరులో ఏమీ జరగలేదు, ఏదో రెండు రాళ్లు వేశారు అని వీడియో చూపిస్తూ అక్కడి డీఎస్పీ రాజగోపాల్‌ రెడ్డి చెప్పడం హాస్యాస్పదం. డీఎస్పీ ప్రదర్శించిన వీడియో కూడా ఎమ్మెల్యే ఫోన్‌ నుంచే మీడియాకు వెళ్ళింది. పెద్దిరెడ్డి ఏమి చెబితే అది చేయడానికే డీఎస్పీ ఉన్నాడు. ఇటువంటి డీఎస్పీ విధుల్లో ఉంటే పోలీసు వ్యవస్థకే సిగ్గు చేటు. కాబట్టి డీఎస్పీ రాజగోపాల్‌ రెడ్డిని సస్పెండ్‌ చేయాలని వర్ల డిమాండ్‌ చేశారు.
బెదిరిస్తున్న డీఎస్పీ

సంబంధితవార్తలు

పెద్దిరెడ్డి అనుచరులు భూమి లాగేసుకున్నారు.

ఆ అధికారుల పరిస్థితి గుణపాఠం కావాలి: వర్ల

అడ్డగోలు నిర్మాణాలను చట్టం చూస్తూ ఊరుకోవాలా?

రాజ్‌ భవన్‌లో విధులు నిర్వహిస్తున్న ఆర్మ్‌డ్‌ రిజర్వుడ్‌ డీఎస్పీ సుధాకర్‌, అతని తమ్ముడు పొన్నూరులో అరాచకాలు చేస్తున్నాడు. తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తే మా అన్న అధికారాన్ని ఉపయోగించుకొని మీ అంతు చూస్తానంటూ డీఎస్పీ తమ్ముడు పొన్నూరులో ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు. నా అధికారాన్ని ఉపయోగించి అక్రమ కేసులు బనాయిస్తానని డీఎస్పీ బెదిరిస్తున్నాడు. ఈ విషయాన్ని కూడా ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకువెళ్లి, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరాం.
రాజకీయాల్లోకి రాకమునుపు నుంచి చిత్తూరు నియోజకవర్గ ఎన్డీఏ అభ్యర్ధి గురజాల జగన్మోహన్‌ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే సేవా కార్యక్రమాలు చేయకూడదంటూ చిత్తూరు అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి అరుణ అడ్డు పడటంతో జగన్మోహన్‌ హైకోర్టుకు వెళ్ళారు. ప్రజాసేవ చేస్తుంటే తప్పేముందని అరుణను హైకోర్టు చివాట్లు పెట్టింది. ఆ విషయాన్ని మనస్సులో పెట్టుకొని నియోజకవర్గంలో టీడీపీ జెండానే కనపడకుండా ఉండేలా అరుణ వ్యవహరిస్తున్నారు. ఇటువంటి అధికారులు ఎన్నికల విధుల్లో ఉంటే ఎన్నికలు సజావుగా సాగవు. కనుక ఏకపక్షంగా వ్యవహరిస్తున్న అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి అరుణను ఎన్నికల విధులకు దూరంగా పెట్టాలని వర్ల అన్నారు.

గాజుగ్లాసు గుర్తును రిజర్వ్‌ చేయాలి
ఎన్డీఏ కూటమిలోని జనసేన పార్టీ ఎక్కడ పోటీ చేస్తే అక్కడ గాజుగ్లాసు గుర్తు కేటాయించాలని హైకోర్టు ఆదేశాలిచ్చిన విషయం తెలిసిందే. జనసేన పోటీ చేయని స్థానాల్లో కొంతమంది ఆర్వోలు పిలిచి మరీ గాజుగ్లాసు గుర్తును ఇండిపెండెంట్‌ అభ్యర్థులకు కేటాయిస్తున్నారు. దుర్మార్గపు బుద్ధులతో అడ్డదారులు తొక్కైనా అధికారం నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తున్న జగన్‌ రెడ్డి.. ఇండిపెండెంట్లకు గాజుగ్లాసు గుర్తు ఇప్పించేలా కుట్ర పన్నారు. ఆ కుట్రలో కొంతమంది ఆర్వోలు కూడా భాగస్వాములయ్యారు. గాజుగ్లాసును ఎవ్వరికీ కేటాయించవద్దని, గాజుగ్లాసు గుర్తును రిజర్వ్‌లో పెట్టాలని సీఈఓను కోరాం. నిజంగా జగన్‌ రెడ్డికి దమ్ముంటే శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలి. గెలుస్తామనే నమ్మకం ఉంటే గాజుగ్లాసు గుర్తుకు ఇంతలా భయపడాలా? ప్రజాక్షేత్రంలో ఎన్డీఏతో తలపడే ధైర్యం లేకనే జగన్‌రెడ్డి కుట్రలు పన్నుతున్నాడు. నుదిటికి దొంగ ప్లాస్టర్లు వేసుకొని గులకరాయి డ్రామా ఆడినంత మాత్రాన ప్రజలు జగన్‌ రెడ్డి మాయలో పడలేదు. ఎన్డీఏ కూటమిని ప్రజలు కోరుకుంటున్నారు. ఇకనైనా వైసీపీ నాయకులు మాయమాటలు చెబుతూ దొడ్డి దారులు తొక్కడం మానాలని వర్ల రామయ్య హెచ్చరించారు.
ఎన్నికల కమిషన్‌ను కలిసిన వారిలో వర్ల రామయ్యతో పాటు మాజీ ఎమ్మెల్సీ ఏఎస్‌ రామకృష్ణ, తెదెపా ఎస్సీ సెల్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోడూరి అఖిల్‌, గుంటూరు మిర్చి యార్డ్‌ మాజీ చైర్మన్‌ మన్నవ సుబ్బారావు, తదితరులు ఉన్నారు.

Tags: అరాచక సామ్రాజ్యంగాజుగ్లాసు గుర్తుడీఎస్పీతొలగించాలిధ్వంసంపుంగనూరుపెద్దిరెడ్డిఫిర్యాదువర్ల రామయ్యసీఈఓ
Previous Post

మంగళగిరిని గోల్డ్‌ హబ్‌ గా తయారుచేస్తాం

Next Post

ఆపన్నులకు దండిగా.. అభివృద్ధికి అండగా

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 18-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 18-03-2026

కార్యకర్త
@ March 18, 2026
చైతన్యరధం ఈ పేపర్ 17-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 17-03-2026

కార్యకర్త
@ March 17, 2026
తెలుగోడి సత్తా.. అమరజీవి
ఆంధ్రప్రదేశ్

తెలుగోడి సత్తా.. అమరజీవి

చైతన్యరధం
@ March 17, 2026
ఏపీకి గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్
ఆంధ్రప్రదేశ్

ఏపీకి గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్

చైతన్యరధం
@ March 17, 2026
ఆర్యవైశ్యులకు అన్నివిధాల మద్దతు
ఆంధ్రప్రదేశ్

ఆర్యవైశ్యులకు అన్నివిధాల మద్దతు

చైతన్యరధం
@ March 17, 2026
అమరావతిలో హజ్ హౌస్
ఆంధ్రప్రదేశ్

అమరావతిలో హజ్ హౌస్

చైతన్యరధం
@ March 17, 2026
చైతన్యరధం ఈ పేపర్ 16-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 16-03-2026

కార్యకర్త
@ March 16, 2026
ఘనంగా ఎన్టీఆర్ ట్రస్ట్ 29వ వార్షికోత్సవం
ఆంధ్రప్రదేశ్

ఘనంగా ఎన్టీఆర్ ట్రస్ట్ 29వ వార్షికోత్సవం

చైతన్యరధం
@ March 16, 2026
Load More

ముఖ్య వార్తలు

అమరావతిలో హజ్ హౌస్

అమరావతిలో హజ్ హౌస్

చైతన్యరధం
@ March 17, 2026
ఐటీనుంచి ఏటీవైపు..

ఐటీనుంచి ఏటీవైపు..

చైతన్యరధం
@ March 16, 2026
ఏపీలో త్వరలో బీసీ రక్షణ చట్టం

ఏపీలో త్వరలో బీసీ రక్షణ చట్టం

చైతన్యరధం
@ March 15, 2026
రూ.119 కోట్లతో టీసీసీ!

రూ.119 కోట్లతో టీసీసీ!

చైతన్యరధం
@ March 14, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

తెలుగోడి సత్తా.. అమరజీవి

తెలుగోడి సత్తా.. అమరజీవి

చైతన్యరధం
@ March 17, 2026
ఏపీకి గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్

ఏపీకి గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్

చైతన్యరధం
@ March 17, 2026
ఆర్యవైశ్యులకు అన్నివిధాల మద్దతు

ఆర్యవైశ్యులకు అన్నివిధాల మద్దతు

చైతన్యరధం
@ March 17, 2026
అమరావతిలో హజ్ హౌస్

అమరావతిలో హజ్ హౌస్

చైతన్యరధం
@ March 17, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist