విజయవాడ(చైతన్యరథం): మన కోసం మనం సాధించేది విజయం.. సమాజం కోసం మనం చేసేది భావితరాలకు అందిం చే స్ఫూర్తి..అలాంటి స్ఫూర్తినిచ్చిన వ్యక్తి రామోజీరావు. ఆయన అడుగు జాడలు, స్ఫూర్తి ప్రతిఒక్కరిలో ఆదర్శం అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. విజయవాడలో నిర్వహించిన రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఒక వ్యక్తి తన జీవితంలో సాధించిన విజయం కంటే, తన వల్ల సమాజంలో వచ్చిన మార్పు చాలా గొప్పది. ప్రతిభ, పట్టుదల, సేవాభావంతో ఎన్నో జీవితాల్లో మార్పు తీసు కొస్తున్న వ్యక్తులను గుర్తించి గౌరవించడం చాలా గొప్ప విషయం. అలాంటి వ్యక్తులను ఒకే వేదికపై సత్కరిస్తున్నందుకు ఆనందంగా ఉందని అన్నారు. ప్రతిభామూర్తులకు, సమాజ హితమే లక్ష్యంగా పనిచేస్తున్న వారికి రామోజీ ఎక్సలెన్స్ అవార్డులు అర్థవంతమైన వేదిక.
ఈ ఆవార్డుల వెనుక గొప్ప ఆలోచనకు స్ఫూర్తినిచ్చిన రామోజీరావు గారిని మనస్ఫూర్తిగా స్మరించుకోవాలి. సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆయన తన కృషి పట్టుదలతో, ఈనాడు- ఈటీవీ వంటి సంస్థలను నిర్మించారు. ఆసియాలోనే ప్రముఖమైన సినీ నిర్మాణ. కేంద్రంగా రామోజీ ఫిల్మ్ సిటీని అభివృద్ధి చేశారు. తెలుగు పత్రికా రంగానికి, తెలుగు భాషకు చేసిన సేవలు గుర్తించుకోదగినవి. పని పట్ల ఆయన అంకితభా వం, క్రమశిక్షణ. కొత్తగా ఆలోచించేతత్వం నేటి తరానికి స్ఫూర్తి దాయకం. రెండు, మూడు సందర్భాల్లో రామోజీరావు గారిని ప్రత్యేకంగా కలిశాను. వారితో పాటు, వారి కుటుంబసభ్యులతో కలిసి ఆనాడు పంచుకున్న సందర్భాలు ఇప్పటికీ సజీవంగా ఉన్నా యి.
ముఖ్యంగా “ఈనాడు” దినపత్రిక’లో సామాజిక స్పృహ కలి గిన కార్యక్రమాలపై ప్రజలకు ఎలా అవగాహన కల్పించారో నాకు వివరించారు. ఆయన స్మారకార్ధం నిర్వహిస్తున్న ఈ అవార్డుల వేడుకలో పాల్గొనడం గర్వంగా భావిస్తున్నా అని తెలిపారు. ఆవార్డులు అందుకున్న ప్రతిఒక్కరికీ అభినందనలు తెలిపారు. ఈ పురస్కారం మీ కృషికి లభించిన గుర్తింపు మాత్రమే కాదు.. మీ ప్రయాణాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రోత్సాహం. మీ విజయాలు మరింత మందికి స్ఫూర్తినివ్వాలని ఆకాంక్షించారు.


















