విశాఖపట్నం(చైతన్యరథం): రిసాల్వెన్ సంస్థ సీఈవో మంత్రి నారా లోకేష్ విశాఖపట్నం సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్ ప్రాంగణం లో సమావేశమయ్యారు. 2025 పార్టనర్ షిప్ సమ్మిట్‌లో 1 గిగా వాట్ ఎంవోయూ నుంచి 180 మెగావాట్ల విండ్ ప్రాజెక్టు, నేటి ఎంవోయూ వరకు ఏపీలో రిసాల్వెన్ స్థిరంగా ఎదుగుతున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. సకాలంలో ప్రాజెక్టు అమలుకు పూర్తి మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు. రాయలసీమ పునరుత్పాదక ఇంధన జోన్ (అనంతపురం, కర్నూలు, కడప)లో రౌండ్-ది-క్లాక్ విండ్-సోలార్-బీఈఎసఎస్ ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని రిసాల్వెన్ సంస్థను కోరారు. ఏపీ ప్రభుత్వం ఇప్పటివరకు 12.62 జీడబ్ల్యూహెచ్ బ్యాటరీ స్టోరేజ్‌ను ఆమోదించింది. దాని 25 జీడబ్ల్యూహెచ్ లక్ష్యంలో సగం ఇంకా అందుబాటులో ఉందని చెప్పారు. రిసాల్వెన్ సీఈవో పరాగ్ శర్మ మాట్లాడుతూ ఆంధ్రప్ర దేశ్‌లో ఇప్పటికే తమ సంస్థ మూడు ప్రాజెక్టులను నిర్వహిస్తోందని తెలిపారు.
2025 పార్టనర్షిప్ సమ్మిట్ సందర్భంగా కర్నూలు, అనంతపురం, వైఎసఆర్ కడప జిల్లాల్లో 1 గిగా వాట్ పునరుత్పా దక ఇంధన ప్రాజెక్టుల అభివృద్ధి కోసం రిసాల్వెన్ ఏపీ ప్రభు త్వంతో ఎంవోయూ కుదుర్చుకుందని చెప్పారు. జెలెస్ట్రా ఎస్పీవీ అయిన గనేకో త్రీ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్‌కు 180 మెగావాట్ల విండ్, 120 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టుతో కూడిన 300 మెగావాట్ల విండ్ సోలార్ హైబ్రిడ్ ప్రాజెక్టును ప్రభుత్వం మంజూ రు చేసిందన్నారు. మెసర్స్ రిసాల్వెన్ టూ ఎనర్జీ అనే వారి ఎస్పీ వీకి 75 మెగావాట్ల విండ్, 75 మెగావాట్ల సోలార్ సామర్థ్యాలతో కూడిన 100 మెగావాట్ల విండ్ సోలార్ హైబ్రిడ్ ప్రాజెక్టును (రూ.980 కోట్లు) ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రాజెక్టు కోసం భూసేకరణ ప్రారంభించాల్సి ఉందని తెలిపారు. రిసాల్వె న్ సంస్థ ఆంధ్రాలో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ప్రాజెక్టు చేయడానికి ఆసక్తిగా ఉన్నట్లు చెప్పారు.


















