చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

ఏపీ పారిశ్రామిక ప్రగతికి నూతన దశదిశ

నవంబరు 12నుంచి విశాఖ వేదికగా 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు

by చైతన్యరధం
November 10, 2026
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
ఏపీ పారిశ్రామిక ప్రగతికి నూతన దశదిశ
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • నేవిగేటింగ్ న్యూవరల్డ్ ఆర్డర్ థీమ్‌తో సీఐఐ సమ్మిట్
  • వాణిజ్యం నుంచి క్వాంటం వరకూ ఆరు అంశాలపై చర్చ
  • 58 దేశాల నుంచి ప్రభుత్వ, పారిశ్రామిక ప్రతినిధుల హాజరు
  • ఇప్పటికే 6 ప్రాంతీయ సదస్సుల్లో రూ.86వేల కోట్ల ఒప్పందాలు
  • నవంబరు 12నుంచి విశాఖ వేదికగా 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు
  • ముఖ్య అతిథులుగా సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులు అమిత్ షా, పీయూష్ గోయెల్
  • హాజరుకానున్న దిగ్గజ కంపెనీల చైర్మన్‌లు, సీఈఓలు

అమరావతి (చైతన్య రథం): నేవిగేటింగ్ న్యూ వరల్డ్ ఆర్డర్ థీమ్‌తో విశాఖ వేదికగా ఈనెల 12, 13 తేదీల్లో రెండు రోజుల పాటు 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు జరుగనుంది. మారుతున్న ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలకు నూతన దశాదిశ అందించేలా పెట్టుబడుల సదస్సు విశాఖలో ఆవిష్కృతం కానుంది. కేవలం పెట్టుబడుల ఆకర్షణకు మాత్రమే పరిమితం కాకుండా వాణిజ్యం నుంచి క్వాంటం వరకూ వివిధ అంశాలపై మేథోమథనం నిర్వహించి.. ఫలితాలను ముందుకు తీసుకెళ్లేలా భాగస్వామ్య సదస్సులో చర్చలు జరుగనున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా కేంద్రమంత్రులు, అంతర్జాతీయ పారిశ్రామిక, వాణిజ్య దిగ్గజ కంపెనీల ప్రతినిధులు సీఐఐ భాగస్వామ్య సదస్సుకు హాజరు కానున్నారు. దాదాపు 58 దేశాలకు చెందిన ప్రభుత్వ, పారిశ్రామిక ప్రతినిధులు కూడా సదస్సుకు హాజరయ్యేందుకు ఇప్పటికే నమోదు చేసుకున్నారు.

ప్రపంచ మార్కెట్లతో ఏపీ పరిశ్రమల్ని అనుసంధానించటమే లక్ష్యంగా భాగస్వామ్య సదస్సు నిర్వహిస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రపంచ పెట్టుబడులు, అంతర్జాతీయ వాణిజ్యం, సాంకేతిక భాగస్వామ్యాలకు ఆంధ్రప్రదేశ్‌ను కీలక కేంద్రంగా నిలిచేలా సదస్సులో చర్చలు, ఒప్పందాలు జరుగనున్నాయి. మారుతున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వాణిజ్యం, సాంకేతికత, పరస్పర విశ్వాసం, నిపుణుల దార్శనిక ఆలోచనలకు ప్రాధాన్యమిస్తూ చర్చలు సాగనున్నాయి. ప్రపంచ దేశాలతో భారత ఆర్థిక భాగస్వామ్యానికి ప్రధాన వేదికగా సదస్సును 1995నుంచి ఏటా నిర్వహిస్తున్నారు. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని డీపీఐఐటీతో కలిసి భారత పరిశ్రమల సమాఖ్య సీఐఐ సదస్సును నిర్వహిస్తోంది.

ఈ పెట్టుబడుల సదస్సుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆతిథ్యమిస్తోంది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ సమ్మిట్‌కు అధ్యక్షత వహించనున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహాధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. 58 దేశాల ప్రాతినిధ్యం, 16మంది విదేశీ మంత్రులు, 40మంది అంతర్జాతీయ స్థాయి ప్రతినిధులు సమ్మిట్‌కు హాజరు కానున్నారు. సింగపూర్, నేపాల్, కంబోడియా, మయన్మార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కెనడా, స్లోవాక్ రిపబ్లిక్, మారిషస్, మొజాంబిక్, ఈజిప్ట్, అల్జీరియా, టాంజానియా, గ్వాటెమాలా తదితర దేశాల ప్రభుత్వ ప్రతినిధులు సదస్సులో పాల్గొననున్నారు. వివిధ దేశాల రాయబారులు, పారిశ్రామిక ప్రముఖులు, సాంకేతిక నిపుణులతోపాటు వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్, ఏడీబీ, యునెప్‌లాంటి సంస్థల ప్రతినిధులు కూడా సదస్సుకు హాజరు కానున్నారు. సదస్సులో భాగంగా 400 పైచిలుకు బిజినెస్ టు బిజినెస్ సమావేశాలు నిర్వహించనున్నారు. దీంతోపాటు ప్రభుత్వాలతో పరిశ్రమల సంప్రదింపుల కోసం బీ టూ జీ సమావేశాలు జరుగనున్నాయి.

ఏపీ ఉమెన్ గ్రోత్ సమ్మిట్ `2026
పెట్టుబడుల సదస్సులో భాగంగా ఈనెల 11న పారిశ్రామిక ప్రతినిధుల మధ్య ముందస్తు సమావేశాలు జరుగనున్నాయి. అదే రోజు రాత్రి 8 గంటలకు ముఖ్యమంత్రి అధికారిక విందు ఇవ్వనున్నారు. విశాఖలోని ఆంధ్రా వర్శిటీ ఇంజనీరింగ్ కాలేజి గ్రౌండ్స్‌లో 12, 13 తేదీల్లో ప్రధాన సమావేశం నిర్వహించనున్నారు. దీనికి సమాంతరంగా ఏపీ ఉమెన్ అండ్ గ్రోత్ సమ్మిట్ 2026 నిర్వహిస్తారు. 12వ తేదీ ఉదయం 9.30కు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పీయూష్ గోయెల్, సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, మంత్రి నారా లోకేష్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రతినిధి రాబర్టో తదితరులు సీఐఐ భాగస్వామ్య సదస్సును ప్రారంభించనున్నారు. ఇక నవంబర్ 13, సాయంత్రం 4 గంటలకు సదస్సు ముగింపు కార్యక్రమంలో భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి చంద్రబాబు తదితరులు పాల్గొనున్నారు.

వాణిజ్యం, పెట్టుబడులు, వాల్యుచైన్, క్వాంటం టెక్నాలజీ, సెమీ కండక్టర్ సహా నూతన సాంకేతికతలు, అంతర్జాతీయ సహకారం, నైపుణ్యాలు, గ్రీన్ ఎనర్జీ, సుస్థిర పారిశ్రామిక అభివృద్ధి, వ్యవసాయం, ఆహార భద్రత, జీవ ఆధారిత ఆర్ధిక వ్యవస్థ తదితర అంశాలపై సుదీర్ఘ చర్చలు జరగనున్నాయి. గత పెట్టుబడుల సదస్సు సహా వివిధ సందర్భాల్లో ఒప్పందాలను పారిశ్రామిక ప్రాజెక్టులుగా మలిచేందుకు మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో మంత్రులు, అధికారుల కమిటీని నియమించింది. ఈ కమిటీ ఎప్పటికప్పుడు ప్రాజెక్టుల గ్రౌండింగ్‌ను పర్యవేక్షిస్తోంది. ఇప్పటికే రూ.6 లక్షల కోట్ల విలువైన 272 ప్రాజెక్టులు రాష్ట్రంలో ప్రారంభమయ్యాయి. మరో రూ.17 లక్షల కోట్ల ప్రాజెక్టులకు ప్రభుత్వం ఆమోదం ఇచ్చింది. 2025-26లో దేశంలోనికి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో 25.6 శాతం ఏపీ దక్కించుకుంది. సీఐఐ భాగస్వామ్య సదస్సులో భాగంగా నిర్వహించిన 6 సన్నాహక ప్రాంతీయ సదస్సుల ద్వారా 194 ఎంఓయూల ద్వారా రూ.86,522 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయి. తద్వారా 1.47 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది.

Previous Post

సామాజిక, ఆర్థిక భద్రతలో ఏపీ ఫ్రంట్ రన్నర్

Next Post

చైతన్యరధం ఈ పేపర్ 10-11-2026

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 10-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 10-11-2026

November 10, 2026
సామాజిక, ఆర్థిక భద్రతలో ఏపీ ఫ్రంట్ రన్నర్
ఆంధ్రప్రదేశ్

సామాజిక, ఆర్థిక భద్రతలో ఏపీ ఫ్రంట్ రన్నర్

November 10, 2026
కూటమి ప్రభంజనం
ఆంధ్రప్రదేశ్

కూటమి ప్రభంజనం

November 10, 2026
చైతన్యరధం ఈ పేపర్ 08-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 08-11-2026

November 8, 2026
ప్రజాస్వామ్యంపై గౌరవం లేని వైసీపీ
ఆంధ్రప్రదేశ్

ప్రజాస్వామ్యంపై గౌరవం లేని వైసీపీ

November 8, 2026
జగన్ రెడ్డి అరాచకాల వారసుడే లేళ్ల అప్పిరెడ్డి
ఆంధ్రప్రదేశ్

జగన్ రెడ్డి అరాచకాల వారసుడే లేళ్ల అప్పిరెడ్డి

November 8, 2026
Next Post
చైతన్యరధం ఈ పేపర్ 10-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 10-11-2026

ముఖ్య వార్తలు

సామాజిక, ఆర్థిక భద్రతలో ఏపీ ఫ్రంట్ రన్నర్

సామాజిక, ఆర్థిక భద్రతలో ఏపీ ఫ్రంట్ రన్నర్

by చైతన్యరధం
November 10, 2026

యాక్సెస్ ఈక్వాలిటీ ఇండెక్స్‌లో ఆంధ్రప్రదేశ్‌కు రెండో స్థానం తలసరి ఆదాయంలో 13వ స్థానం... అయినా అవకాశాల కల్పనలో రెండో స్థానం ఆదాయానికి మించి ప్రజలకు సేవలు, సౌకర్యాలు...

కూటమి ప్రభంజనం

కూటమి ప్రభంజనం

by చైతన్యరధం
November 10, 2026

స్థానిక ఎన్నికల్లో కూటమి ప్రభంజనం 58.9 శాతం ఓట్లతో ఘన విజయం (దీన్ని కూడా హైలెట్ చేసుకోవాలి) 2024 ఎన్నికలతో పోలిస్తే 3.6 శాతం పెరిగిన ఓట్ల...

చివరి బాధితుడికీ సాయం అందేలా చూస్తాం

చివరి బాధితుడికీ సాయం అందేలా చూస్తాం

by చైతన్యరధం
November 7, 2026

అన్నదాతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా గుంటూరు, బాపట్ల జిల్లాల్లో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన పొలం గట్లు, పంట బోదెలపై వెళ్తూ దెబ్బతిన్న పంటల పరిశీలన జిల్లెళ్లమూడి...

ప్రతి అడుగులోనూ భరోసా!

ప్రతి అడుగులోనూ భరోసా!

by చైతన్యరధం
November 7, 2026

రైతు కష్టం తెలిసిన నాయకుడిగా... తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన అటు సమీక్షలు, ఇటు పర్యటనలతో నిరంతరం సమన్వయం అమరావతి (చైతన్యరథం): సచివాలయంలో సమీక్షలే...

మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

by చైతన్యరధం
November 4, 2026

అన్నదాతలు ముందుకొచ్చేలా వ్యవసాయ శాఖ చొరవ చూపాలి అధికారులతో టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి (చైతన్యరథం): భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏ ఒక్క రైతు, కౌలుదారు...

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

by చైతన్యరధం
August 21, 2025

స్టార్టప్‌లకు ఊపిరి పోసేలా రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ అమరావతితోపాటు ఐదుచోట్ల ఆర్టీఐహెచ్‌ కేంద్రాలు రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఇన్నోవేషన్‌ బిజినెస్‌...

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

by చైతన్యరధం
October 12, 2026

గెలిచే అభ్యర్థులకే టికెట్లు మిత్రపక్షాలతో పక్కా సమన్వయం ఉండాలి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలతో ప్రత్యేక టెలీకాన్ఫరెన్స్ అమరావతి (చైతన్యరథం): స్థానిక సంస్థల...

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

by చైతన్యరధం
October 25, 2026

అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...

మరిన్ని

తాజా సంఘటనలు

చైతన్యరధం ఈ పేపర్ 10-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 10-11-2026

by కార్యకర్త
November 10, 2026

ఏపీ పారిశ్రామిక ప్రగతికి నూతన దశదిశ

ఏపీ పారిశ్రామిక ప్రగతికి నూతన దశదిశ

by చైతన్యరధం
November 10, 2026

నేవిగేటింగ్ న్యూవరల్డ్ ఆర్డర్ థీమ్‌తో సీఐఐ సమ్మిట్ వాణిజ్యం నుంచి క్వాంటం వరకూ ఆరు అంశాలపై చర్చ 58 దేశాల నుంచి ప్రభుత్వ, పారిశ్రామిక ప్రతినిధుల హాజరు...

సామాజిక, ఆర్థిక భద్రతలో ఏపీ ఫ్రంట్ రన్నర్

సామాజిక, ఆర్థిక భద్రతలో ఏపీ ఫ్రంట్ రన్నర్

by చైతన్యరధం
November 10, 2026

యాక్సెస్ ఈక్వాలిటీ ఇండెక్స్‌లో ఆంధ్రప్రదేశ్‌కు రెండో స్థానం తలసరి ఆదాయంలో 13వ స్థానం... అయినా అవకాశాల కల్పనలో రెండో స్థానం ఆదాయానికి మించి ప్రజలకు సేవలు, సౌకర్యాలు...

కూటమి ప్రభంజనం

కూటమి ప్రభంజనం

by చైతన్యరధం
November 10, 2026

స్థానిక ఎన్నికల్లో కూటమి ప్రభంజనం 58.9 శాతం ఓట్లతో ఘన విజయం (దీన్ని కూడా హైలెట్ చేసుకోవాలి) 2024 ఎన్నికలతో పోలిస్తే 3.6 శాతం పెరిగిన ఓట్ల...

మరిన్ని
[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.
Telegram Whatsapp Facebook X-twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.