- పోలింగ్ శాతం పెరిగేలా చూడాలి
- స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్నడూ లేని స్ఫూర్తి
- ముఖ్యనేతలతో టెలీ కాన్ఫరెన్స్లో సీఎం చంద్రబాబు
అమరావతి(చైతన్యరథం): ఎన్నికల నిబంధనలను పాటిస్తూనే పోలింగ్ శాతం పెరిగేలా చూడాలని సీఎం చంద్రబాబు కూటమి శ్రేణులను కోరారు. స్థానిక ఎన్నికలు జరుగుతున్న తీరు.. పోలింగ్ సరళిపై ముఖ్యనేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నా యి. గతంలో జరిగిన ఏ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఇంతటి స్ఫూర్తి కన్పించలేదు. కొన్ని మున్సిపాలిటీల్లో ప్రజలు ఓట్లు వేసేం దుకు బారులు తీరి ఓటుహక్కు వినియోగించుకుంటున్నారని తెలిపారు. ఓటర్లందరూ పోలింగ్ కేంద్రాలకు వచ్చేలా చూడాలని సూచించారు. కొంతమంది వృద్ధులు, వికలాంగులు పోలింగ్ కేంద్రాలకు వెళ్లలేకపోవచ్చు. అలాంటి వారిని పోలింగ్ కేంద్రాలకు వచ్చేలా సమన్వయం చేసుకోవాలి. ఎన్నికల నిబంధనలను పాటి స్తూనే పోలింగ్ శాతం పెరిగేలా చూడాలి. ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటే వెంటనే ఎన్నికల అధికారులు, పోలీసుల దృష్టికి తీసుకెళ్లాలని తెలిపారు. ప్రత్యర్థులు రెచ్చగొట్టేలా కుట్ర కోణంలో వ్యవహరిస్తారు… కూటమి శ్రేణులు సంయమనం పాటించాలని సూచించారు.















