చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

స్థానిక సంస్థల ఎన్నికల్లో 94 శాతాన్ని మించి గెలవాలి

స్వర్గీయ ఎన్టీఆర్, పరిటాల రవి విగ్రహావిష్కరణ సభలో మంత్రి లోకేష్

by చైతన్యరధం
September 23, 2026
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో 94 శాతాన్ని మించి గెలవాలి
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • మా ఉపాధ్యాయుల జోలికొస్తే.. దబిడి దిబిడే!
  • డీఎస్సీపై చర్చకు నేను సిద్ధం.. జగన్‌రెడ్డి సిద్ధమా?
  • నమ్మిన సిద్ధాంతం కోసం తుదివరకు పోరాడిన వ్యక్తి పరిటాల
  • స్వర్గీయ ఎన్టీఆర్, పరిటాల రవి విగ్రహాలను ఆవిష్కరించడం నా అదృష్టం
  • పాదయాత్రలో నాతో నడిచిన వారిని గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటా
  • స్వర్గీయ ఎన్టీఆర్, పరిటాల రవి విగ్రహావిష్కరణ సభలో మంత్రి లోకేష్

రాప్తాడు (చైతన్య రథం): మా ఉపాధ్యాయుల జోలికొస్తే.. దబిడి దిబిడే. ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. డీఎస్సీపై చర్చకు నేను సిద్ధం. జగన్ రెడ్డి సిద్ధమా అని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మరోసారి సవాల్ చేశారు. అనంతపురం జిల్లా రాప్తాడు కూడలిలో ఏర్పాటుచేసిన స్వర్గీయ అన్న నందమూరి తారకరామారావు, మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత స్వర్గీయ పరిటాల రవీంద్ర విగ్రహాలను మంత్రి లోకేష్ ఆవిష్కరించారు. ముందుగా భారతరత్న డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో మంత్రి మాట్లాడుతూ… ఈ రోజు మనం వేదికపై ఉన్నామంటే కారణం వేదిక కింద ఉన్న టీడీపీ కార్యకర్తల త్యాగం వల్లే. ఈ రోజు నేను స్వర్గీయ ఎన్టీఆర్ మనవడిగా, సీఎం చంద్రబాబు గారి తనయుడిగా, బాలయ్య మావయ్య అల్లుడిగా రాలేదు. ఎత్తిన పసుపు జెండా దించకుండా, మడమ తిప్పకుండా, టీడీపీకి కాపలాకాసిన కార్యకర్తగా ఇక్కడకు వచ్చాను. అన్న ఎన్టీఆర్ గారు ఏ ముహూర్తంలో పార్టీని స్థాపించారో తెలియదు. నాకు అక్కతమ్ముళ్లు, అన్నాచెల్లెళ్లు లేరు, కానీ కోటి మంది కుటుంబ సభ్యులను ఇచ్చారు. మీ పౌరుషమే వేరు. అన్న ఎన్టీఆర్ పార్టీని స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చారు. రాజకీయాల్లో, సినిమాల్లో స్వర్గీయ ఎన్టీఆర్ గారి స్టైలే వేరు. ఆనాడు యువగళంలో దారిపొడవునా ప్రజలు నాకు నీరాజనాలు పలికారు. పెద్దఎత్తున ఘనస్వాగతం పలికారు. ఆనాటి సంబరం మళ్లీ ఈనాడు చూస్తున్నా.

నమ్మిన సిద్ధాంతం కోసం తుదివరకు పోరాడిన వ్యక్తి పరిటాల రవి
నేను కూడా అన్న ఎన్టీఆర్ సీఎం అయిన తర్వాతనే పుట్టా. రూ.2కే కిలో బియ్యం, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, పటేల్, పట్వారీ వ్యవస్థ రద్దు వంటి ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఎన్టీఆర్ గారు చేపట్టారు. ఈ రోజు మనందరం అన్న ఎన్టీఆర్ గారి వారసులం. ఈ రోజు మనం ఎక్కడికి వెళ్లినా గర్వంగా చెప్పుకోవచ్చు.. నా పార్టీ తెలుగుదేశం, నా పార్టీ, నా అజెండా అన్న ఎన్టీఆర్ అని. చంద్రబాబు గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయినా అభివృద్ధి, సంక్షేమం చేశారు. పరిటాల రవి గారు కూడా ఎమ్మెల్యేగా, మంత్రిగా అనేక పనులు చేశారు. మన పార్టీ అధికారంలోకి రాకముందు రాయలసీమలో మహిళలు బయట తిరగాలంటే భయపడే పరిస్థితి. దానికి ఫుల్ స్టాప్ పెట్టిన నాయకుడు మన పరిటాల రవీంద్ర గారు. నమ్ముకున్న సిద్ధాంతం కోసం జీవితాంతం పనిచేశారు. ఆనాడు వందలాది మంది మన కార్యకర్తలను హత్య చేశారు. అయినా పరిటాల రవి గారు ఏనాడు భయపడలేదు. పార్టీ సమావేశానికి వెళ్తే చంపేశారు. అయినా ఆ కుటుంబం వెనక్కి తగ్గలేదు. పరిటాల సునీతమ్మ ముందుకు వచ్చారు. అసెంబ్లీలో బెదిరించినా ఆమె భయపడలేదు. పార్టీని ముందుకు తీసుకెళ్లారు. ఇప్పుడు పరిటాల శ్రీరామ్‌ని కూడా పార్టీకి అంకితం చేశారు.

ఫైటర్ జెట్ తయారీ ఏఎంసీఏ ప్రాజెక్ట్‌ను అనంత గడ్డకు తీసుకువచ్చాం
రాప్తాడు ప్రజలు చాలా మంచివారు. ప్రజలను కలిసినప్పుడు ఇప్పుడు ఎవరూ నా చేతులను గీరలేదు. ధర్మవరంలో అయితే మొత్తం గీరేశారు. కార్యకర్తలు, నాయకులు 2019-24 మధ్య పడిన కష్టాలను గుర్తుచేసుకోవాలి. జీవో 1 ద్వారా యువగళం పాదయాత్రను అడ్డుకోవాలని చూశారు. స్టూల్, మైక్ లాక్కున్నారు. అయినా ఎక్కడా తగ్గలేదు. వేదిక ముందున్న నాయకులు, కార్యకర్తల ప్రోత్సాహంతో ఆనాడు ఉమ్మడి అనంతపురం జిల్లాలో యువగళం పాదయాత్ర చేశా. ఇక్కడి ప్రజల కష్టాలను చూశా. అందుకే దేశంలో ఎక్కడా లేనివిధంగా ఫైటర్ జెట్‌లు తయారుచేసే ఏఎంసీఏ ప్రాజెక్ట్‌ను మన అనంతపురం గడ్డకు తీసుకువచ్చా. సాగు, తాగునీరు, పరిశ్రమలను తీసుకురావాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ప్రత్యేకంగా నాపై బాధ్యత ఉంది. ఎందుకంటే అన్న ఎన్టీఆర్‌ను, హరి మావయ్య, బాలయ్య మామను గెలిపించి శాసనసభకు పంపించిన అద్భుతమైన నేల ఇది. తాగునీరు, సాగునీరు అందిస్తాం.

కలిసికట్టుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం
త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. ఎన్నికలు.. ఎన్నికలే.. తగ్గేదేలే. కష్టపడాలి, పనిచేయాలి. మనది పెద్ద కుటుంబం. కోటి ఆరు లక్షల మంది సభ్యులు ఉన్నారు. మన కుటుంబం పెద్దదైంది. ఇప్పుడు పవనన్న కూడా మన కుటుంబ సభ్యుడు అయ్యారు. బీజేపీ కూడా మన కుటుంబంలో చేరింది. మూడు పార్టీలు ఏపీని ముందుకు తీసుకెళ్తున్నాయి. సమస్యలు ఏవైనా ఉంటే నాలుగు గోడల మధ్య కూర్చొని పరిష్కరించుకుందాం. నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి అందరూ కట్టుబడి ఉండాలి. కష్టపడి పనిచేసే వారిని గుర్తించి గౌరవిస్తాం. మన రాష్ట్రాన్ని మనందరం కలిసికట్టుగా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. మూడు పార్టీలు కలిసికట్టుగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది.

మా ఉపాధ్యాయుల జోలికొస్తే.. దబిడి దిబిడే!
గొడ్డలితో బతికినవాళ్లు గొడ్డలితోనే పోతారు. పాఠాలు చెప్పే టీచర్లపై ఎలా దాడి చేశారో చూశాం. అయ్యా జగన్.. ఎందుకు మా ఉపాధ్యాయులంటే నీకు అంత కక్ష. డీఎస్సీపై చర్చకు సిద్ధమని నేను ఎన్నోసార్లు చెప్పా. నేను సిద్ధం.. నువ్వు సిద్ధమా? జగన్ రెడ్డి మాదిరిగా ఇతర దేశాలు, రాష్ట్రాలకు వెళ్లాలంటే మాకు కోర్టు అనుమతి అవసరం లేదు. నీతి, నిజాయతీతో బతికినవాళ్లం. జగన్ రెడ్డి పెట్టిన కేసులు దొంగ కేసులని ఏకంగా సుప్రీంకోర్టే తేల్చిన పరిస్థితి. జగన్ రెడ్డి జాగ్రత్తగా ఉండు.. మా ఉపాధ్యాయుల జోలికొస్తే.. దబిడి దిబిడే. ఎవరినీ వదిలిపెట్టేది లేదు. ఉపాధ్యాయులపై దాడికి రౌడీమూకలను పంపారు. మొన్నటివరకు మన పార్టీలో వంగి, వంగి ఉన్నారు. ఇప్పుడు అక్కడకు వెళ్లి కాలరెగరేస్తున్నారు. వదిలిపెట్టను భయ్యా! అన్నీ చూస్తున్నా. ఉపాధ్యాయులపై కోడిగుడ్లు వేస్తారా? అసభ్యంగా మాట్లాడతారా? అసలు మీరెక్కడ చదివారు? ఎవరు చదివించారు? ఇదేనా ఇంట్లో మీ తల్లిదండ్రులు నేర్పించిన సంస్కృతి? ఇదేనా ఉపాధ్యాయులకు మీరిచ్చే గౌరవం. నేను వదిలిపెట్టను. చట్టాన్ని ఉల్లంఘించిన వారిని వదిలిపెట్టేది లేదు. రెడ్ బుక్‌కు కట్టుబడి ఉన్నా. ప్రజలకు కూడా చెప్పా. వారి ఆశీస్సులతో 94 శాతం స్థానాలు కైవసం చేసుకున్నాం. ఇక్కడున్న కార్యకర్తలకు ఒకటే చెబుతున్నా.. కష్టపడదాం, ప్రజలకు సేవచేద్దాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో 94 శాతం కంటే ఎక్కువ గెలవాలి. ఈగో వద్దు, ప్రజల్లో ఉందాం.

పాదయాత్రలో నాతో నడిచిన వారిని గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటా
రాప్తాడులో స్వర్గీయ ఎన్టీఆర్, పరిటాల రవి గారి విగ్రహాలను ఆవిష్కరించే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నా. ఈ రోజు నా తమ్ముడు పరిటాల శ్రీరామ్ పుట్టిన రోజు. నా తమ్ముడు పుట్టినరోజు నాడు విగ్రహాలను ఆవిష్కరించడం నా అదృష్టంగా భావిస్తున్నా. శ్రీరామ్‌కు ఉదయం లేచిన వెంటనే పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ మొదటి మెసేజ్ పెట్టింది నేనే. ఒక్కసారి నమ్మితే నేను వదిలిపెట్టను. ఆనాడు పాదయాత్రలో నాతో నడిచిన వారు, ఆనాడు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మీరు నన్ను నడిపించారు. నా జీవితాంతం మిమ్మల్ని నా గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటానని చెప్పారు. తనకు ఘనస్వాగతం పలికిన రాప్తాడు ప్రజలకు ఈ సందర్భంగా మంత్రి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఎంపీ బీకే పార్థసారథి, మంత్రి ఎస్. సవిత, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ పరిటాల శ్రీరామ్, ఎమ్మెల్యే, హిందూపురం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు ఎం.ఎస్. రాజు, ఎమ్మెల్యేలు పల్లె సింధూర రెడ్డి, బండారు శ్రావణి, దగ్గుపాటి వెంకట ప్రసాద్, మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి, జోనల్ కోఆర్డినేటర్ రెడ్డప్పగారి శ్రీనివాస రెడ్డి, హిందూపురం పార్లమెంట్ టీడీపీ ప్రధాన కార్యదర్శి హనుమప్ప తదితరులు పాల్గొన్నారు.

Previous Post

పారిశ్రామికవేత్తలుగా పౌల్ట్రీ రైతులు

Next Post

పట్టణాలే గ్రోత్ ఇంజిన్లు

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 08-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 08-11-2026

November 8, 2026
చైతన్యరధం ఈ పేపర్ 07-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 07-11-2026

November 7, 2026
చెప్పిన అబద్ధమే వంద సార్లు.. అదే జగన్ నైజం
ఆంధ్రప్రదేశ్

చెప్పిన అబద్ధమే వంద సార్లు.. అదే జగన్ నైజం

November 7, 2026
బోటు మునిగి తమిళ జాలర్లు మృతి
ఆంధ్రప్రదేశ్

వారం వ్యవధిలోనే రెండు తుఫాన్లతో తీవ్రంగా నష్టపోయాం

November 7, 2026
చివరి బాధితుడికీ సాయం అందేలా చూస్తాం
ఆంధ్రప్రదేశ్

చివరి బాధితుడికీ సాయం అందేలా చూస్తాం

November 7, 2026
ప్రతి అడుగులోనూ భరోసా!
ఆంధ్రప్రదేశ్

ప్రతి అడుగులోనూ భరోసా!

November 7, 2026
Next Post
పట్టణాలే గ్రోత్ ఇంజిన్లు

పట్టణాలే గ్రోత్ ఇంజిన్లు

ముఖ్య వార్తలు

చివరి బాధితుడికీ సాయం అందేలా చూస్తాం

చివరి బాధితుడికీ సాయం అందేలా చూస్తాం

by చైతన్యరధం
November 7, 2026

అన్నదాతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా గుంటూరు, బాపట్ల జిల్లాల్లో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన పొలం గట్లు, పంట బోదెలపై వెళ్తూ దెబ్బతిన్న పంటల పరిశీలన జిల్లెళ్లమూడి...

ప్రతి అడుగులోనూ భరోసా!

ప్రతి అడుగులోనూ భరోసా!

by చైతన్యరధం
November 7, 2026

రైతు కష్టం తెలిసిన నాయకుడిగా... తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన అటు సమీక్షలు, ఇటు పర్యటనలతో నిరంతరం సమన్వయం అమరావతి (చైతన్యరథం): సచివాలయంలో సమీక్షలే...

వాగులు, వంకలు పొంగుతున్నాయి..అప్రమత్తంగా ఉండండి

వాగులు, వంకలు పొంగుతున్నాయి..అప్రమత్తంగా ఉండండి

by చైతన్యరధం
November 5, 2026

లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించండి ముంపు ప్రాంతాల్లో తక్షణ సహాయ చర్యలు చేపట్టండి అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం అమరావతి (చైతన్యరథం): ఏలూరు జిల్లాలో...

మున్సిపోల్స్ లో  కూటమికే పట్టం

మున్సిపోల్స్ లో కూటమికే పట్టం

by చైతన్యరధం
November 4, 2026

కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో కూటమి అభ్యర్థుల విజయకేతనం సంబరాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు అమరావతి (చైతన్యరథం): పురపాలక సంస్థల ఎన్నికల ఫలితాలు కూటమి ప్రభుత్వంపై ప్రజలకున్న అచంచలమైన...

మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

by చైతన్యరధం
November 4, 2026

అన్నదాతలు ముందుకొచ్చేలా వ్యవసాయ శాఖ చొరవ చూపాలి అధికారులతో టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి (చైతన్యరథం): భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏ ఒక్క రైతు, కౌలుదారు...

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

by చైతన్యరధం
August 21, 2025

స్టార్టప్‌లకు ఊపిరి పోసేలా రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ అమరావతితోపాటు ఐదుచోట్ల ఆర్టీఐహెచ్‌ కేంద్రాలు రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఇన్నోవేషన్‌ బిజినెస్‌...

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

by చైతన్యరధం
October 12, 2026

గెలిచే అభ్యర్థులకే టికెట్లు మిత్రపక్షాలతో పక్కా సమన్వయం ఉండాలి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలతో ప్రత్యేక టెలీకాన్ఫరెన్స్ అమరావతి (చైతన్యరథం): స్థానిక సంస్థల...

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

by చైతన్యరధం
October 25, 2026

అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...

మరిన్ని

తాజా సంఘటనలు

చైతన్యరధం ఈ పేపర్ 08-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 08-11-2026

by కార్యకర్త
November 8, 2026

చైతన్యరధం ఈ పేపర్ 07-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 07-11-2026

by కార్యకర్త
November 7, 2026

చెప్పిన అబద్ధమే వంద సార్లు.. అదే జగన్ నైజం

చెప్పిన అబద్ధమే వంద సార్లు.. అదే జగన్ నైజం

by చైతన్యరధం
November 7, 2026

2019లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదు ఉద్యోగులకు కనీసం ఒక్క డీఏ కూడా ఇవ్వకుండా రివర్స్ పీఆర్సీతో దగా చేసిన ఘనుడు ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసే...

బోటు మునిగి తమిళ జాలర్లు మృతి

వారం వ్యవధిలోనే రెండు తుఫాన్లతో తీవ్రంగా నష్టపోయాం

by చైతన్యరధం
November 7, 2026

ఉపశమనం కోసం తక్షణ సాయం అందించండి కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు సీఎం చంద్రబాబు లేఖ అమరావతి (చైతన్యరథం): వరుస తుఫాన్లతో ఆంధ్రప్రదేశ్‌కు భారీ నష్టం...

మరిన్ని
[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.
Telegram Whatsapp Facebook X-twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.