- పాపాలు బట్టబయలవుతున్నాయనే డైవర్షన్ పాలిటిక్స్
- మిమ్మల్ని చూసి సభ్య సమాజం ఛీకొడుతోంది
- టీచర్లపై రౌడీలతో దాడి చేయించడానికి సిగ్గుండాలి
- అసభ్యకరమైన బూతులు..ఇదేనా మీ సంస్కృతి?
- వెళ్లి మీరు చేసిన అకృత్యాల గురించి చెబుతారా?
- మీ ప్రభుత్వంలో ఇచ్చిన సర్టిఫికెట్లు కూడా ఫేకేనా?
- రాష్ట్రాన్ని మరో బీహార్‌లా మార్చాలని చూస్తున్నారా?
- రాష్ట్ర ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి
- జగన్‌రెడ్డి, గొడ్డలి పార్టీపై ఎమ్మెల్యే సోమిరెడ్డి ధ్వజం
మంగళగిరి(చైతన్యరథం): రాష్ట్ర చరిత్రలోనే గురువులపై గొడ్డలిపార్టీ గూండాగిరి అత్యంత సిగ్గుచేటు, చీకటి రోజు అని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. మెరిట్, స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు సాధించిన గురువులపై వైసీపీ గూండాలు అమానుషంగా దాడి చేసి పైగా సిగ్గులేకుండా గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామనడం హాస్యాస్పదంగా ఉందని మండిపడ్డారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అనేక కేసుల్లో ముద్దాయిగా ఉన్న గొడ్డలి పార్టీ నేత జగన్‌రెడ్డి.. రాష్ట్ర ప్రథమ పౌరుడైన గవర్నర్ వద్దకు వెళ్లి ఏం ఫిర్యాదు చేస్తారు? పాఠశాల పిల్లలతో వెళుతున్న బస్సును అడ్డుకోవడం, ఉద్యోగాలు సాధించిన టీచర్లపై గూండాగిరి చేయడం, దౌర్జన్యాలకు పాల్పడటం మీ ఘన కార్యమా? ప్యాంట్ జిప్పులు విప్పడం, తొడలు కొట్టడం, కట్టెలతో దాడి చేయడం, ఆడవాళ్లు-మగవాళ్లు అని లేకుండా ఉపాధ్యాయు లను అసభ్యకరమైన బూతులు తిట్టడం.. ఇదేనా మీ సంస్కృతి? గవర్నర్ దగ్గరకు వెళ్లి ఈ అకృత్యాల గురించే చెబుతారా? మొగుణ్ని కొట్టి మొగసాలకు ఎక్కినట్టు’, ‘దొంగే దొంగ అన్నట్లు’ వైసీపీ తీరు ఉందని మండిపడ్డారు. తాడేపల్లి ప్యాలెస్‌లో కూర్చొని కళ్లు మూసుకుని అబద్ధాలు మాట్లాడటం కాదు.. జగన్‌రెడ్డికి నిజంగా దమ్ము, ధైర్యం ఉంటే నిన్న జరిగిన దాడి వీడియో ఫుటేజ్‌ను నేరుగా గవర్నర్ ముందు ఉంచాలి. గత ఐదేళ్లలో నిరుద్యోగులను మోసం చేసిన మీరు కూటమి ప్రభుత్వం రాగానే లోకేష్ చొరవతో 16 వేల మందికి పైగా డీఎస్సీ ద్వారా ఉద్యోగా లు వస్తే ఓర్వలేకపోతున్నారు. ఎంతో కష్టపడి మెరిట్ సాధించి, స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందిన యువతపై, లోకేష్‌కు మంచి పేరు వస్తుందనే అక్కసుతోనే ఈ దాడులకు పాల్పడుతున్నారు. నిన్న జరిగిన అమానుష ఘటనకు వైసీపీ నాయకత్వం సభ్య సమాజానికి, రాష్ట్ర ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసు కుంటామని హెచ్చరించారు.















