సంతనూతలపాడు నియోజకవర్గం నాగులుప్పలపాడు మండలం చదలవాడ గ్రామంలో రూ.100 కోట్ల పెట్టుబడితో నిర్మించనున్న రాడిసన్ హోటల్ కు రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్, శాఖల మంత్రి నారా లోకేష్ భూమిపూజ, శంకుస్థాపన చేశారు.
సంతనూతలపాడు నియోజకవర్గం నాగులుప్పలపాడు మండలం చదలవాడ గ్రామంలో రూ.100 కోట్ల పెట్టుబడితో నిర్మించనున్న రాడిసన్ హోటల్ కు రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్, శాఖల మంత్రి నారా లోకేష్ భూమిపూజ, శంకుస్థాపన చేశారు. రవిశంకర్ గ్రూప్, రవిప్రియ హాస్పిటాలిటీస్ ఎల్‌ఎల్‌పీ సంయుక్త భాగస్వామ్యంతో అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ హోటల్ ను నిర్మించనున్నారు. ఒంగోలు పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు కానున్న తొలి 5-స్టార్ హోటల్‌గా ఇది నిలవనుంది. ఈ కార్యక్రమంలో రవిశంకర్ గ్రూప్ చైర్మన్ రవి శంకర్, మంత్రి బాల శ్రీ వీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యేలు విజయ్ కుమార్, ఏలూరి సాంబశివరావు, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఉగ్ర నరసింహారెడ్డి, ఇంటూరి నాగేశ్వరరావు, మద్దిపాటి వెంకటరాజు, ఎమ్మెల్సీ శ్రీకాంత్, కలెక్టర్ రాజాబాబు, టూరిజం ఏపీ కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ యాదవ్, 20 సూత్రాల కమిటీ చైర్మన్ లంకా దినకర్, ఏపీ కల్చరల్ కమిషన్ చైర్మన్ పొడపాటి తేజస్వి, ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యం, మాజీ ఎమ్మెల్సీ మంతెన వెంకట సత్యనారాయణ, రవిశంకర్ గ్రూప్ సిబ్బందిలు, తదితరులు పాల్గొన్నారు.