- రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు.. పెట్టుబడులు, పరిశ్రమలు తెస్తున్నారు
- ఉత్తరాంధ్ర అభివృద్ధిలో రన్వేగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం
- స్వర్ణాంధ్ర విజన్ సాకారంలో కీలకమైన రోజు
- మూడేళ్ల పర్యటనల్లో రూ.2 లక్షల కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాం
- స్వర్ణాంధ్ర-వికసిత్ భారత్ కు గ్రోత్ ఇంజిన్ ఆంధ్రప్రదేశ్ పరుగులు పెడుతోంది
- భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ
భోగాపురం(చైతన్యరథం): ఏపీ అభివృద్ధి, స్వర్ణాంధ్ర విజన్-2047 సాకారానికి నేడు కీలకమైన రోజు అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. పేర్కొన్నారు. రూ.18 వేల కోట్లతో శనివారం పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. ఈ ప్రాజె క్టులు ఏపీని మరింత ముందుకు తీసుకెళతాయని చెప్పుకొచ్చారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి ప్రధాని మోదీ ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అనంతరం భారీ బహిరంగ సభలో మోదీ ప్రసంగించా రు. ‘సింహాచలం అప్పన్న, పైడితల్లి అమ్మవారికి ప్రణామాలు. 13,500 మంది గిరిజన మహిళల నృత్యం అద్భుతంగా ఉంది. అభివృద్ధితో పాటు థింసా నృత్యంలోనూ నేడు సరికొత్త చరిత్ర సృష్టించారు. ఇది చంద్రబాబు విజన్కు మరో సాక్ష్యం. చంద్రబా బు సారథ్యంలో ప్రపంచంలో అనేక ప్రముఖ కంపెనీల పెట్టుబడు లు రాష్ట్రానికి వస్తున్నాయి.. ఆయన సారథ్యంలో ఏపీ అభివృద్ధి వైపు పరుగులు పెడుతుందని ప్రశంసించారు. ఈరోజు రూ.18 వేల కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాం. ఈ ప్రాజెక్టులు ఏపీని మరింత ముందుకుతీసుకెళతాయి. కొత్త ప్రాజె క్టులు ఎయిర్, రోడ్ కనెక్టివిటీని పెంపొందిస్తాయి. చంద్రబాబు, పవన్ నేతృత్వంలో ఏపీలో డబుల్ అభివృద్ధి జరుగుతోంది. డబుల్ ఇంజిన్ సర్కార్ ఏపీ అభివృద్ధి వేగంగా కొనసాగుతోంది. దేశంలో 2014 కంటే ముందు 74 ఎయిర్పోర్ట్లు మాత్రమే ఉండేవి. ఆ తర్వాత ఎయిర్పోర్టుల సంఖ్య 166కి పెరిగిందని వివరించారు.
అల్లూరి నడయాడిన నేల ఇది
అల్లూరి సీతారామరాజు నడయాడిన నేల ఇది.. గిరిజనుల హక్కుల కోసం అల్లూరి తన ప్రాణాలను అర్పించారు. అల్లూరి పేరుతో భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభించడం సంతోషంగా ఉంది. ఉత్తరాంధ్ర యువత అభివృద్ధికి ఈ ఎయిర్పోర్టు ఓ రన్వేలా, ఓ లాంచ్ ప్యాడ్లా పనిచేస్తుంది. ఒకే కుటుంబానికి చెందిన పేర్లను విమానాశ్రయాలకు పెట్టలేదు. అయోధ్య ఎయిర్ పోర్ట్కు వాల్మీకి పేరు పెట్టాం. భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి పేరుపెట్టాం. చిన్న పట్టణాల నుంచి నగరాల వరకు ఎయిర్ సేవలు అందిస్తున్నాం. ఉడాన్ పథకం వల్ల ఎయిర్పోర్ట్ల సంఖ్య పెరగడమే కాదు.. విమాన ప్రయాణికుల సంఖ్యా పెరిగిం ది. ఈ పథకం ద్వారా తొలిసారి విమానం ఎక్కే అవకాశం చాలా మందికి లభించింది. పేదల కలలు సాకారం చేసేలా అభివృద్ధి చేస్తున్నాం. స్మోక్ ఎయిర్ పోర్టు మోడల్ కాశీ నుంచి అమృత్సర్ వరకు విస్తరించింది.. దీనివల్ల 25 దేశాలకు ఎయిర్ కనెక్టివిటీ సాధ్యమైందని తెలిపారు.
కోస్టల్ ఎకానమిక్ కారిడార్ అభివృద్ది
కోస్టల్ ఎకానమిక్ కారిడార్ అభివృద్ధి చేస్తూ బ్లూ ఎకానమీని బలోపేతం చేస్తున్నాం. విశాఖ నుంచి కృష్ణపట్నం వరకు పాత పోర్టుల అభివృద్ధి జరుగుతోంది. మూలపేట, రామాయపట్నంలో కొత్త పోర్టులను నిర్మిస్తున్నాం. ప్రధాన పారిశ్రామిక కారిడార్లనూ అనుసంధానం చేస్తున్నాం. విశాఖ-రాయపూర్ ఎక్స్ప్రెస్ వే ద్వారా అభివృద్ధి చేస్తున్నాం.. జాతీయ రహదారులతో వేగం పెంచుతున్నాం. రూ. లక్ష కోట్ల ఖర్చుతో రైల్వే కనెక్టివిటీ పనులు జరుగుతున్నాయి.. వివిధ పారిశ్రామిక ప్రాంతాలను అనుసంధా నం చేస్తున్నాం. 70కు పైగా రైల్వేస్టేషన్లను ఆధునికీకరిస్తున్నాం. పీఎం గతిశక్తితో రైల్, పోర్టు, ఎయిర్పోర్ట్ల అభివృద్ధి జరుగు తోంది. సాఫ్ట్వేర్, ఐటీ, టెక్ రంగాల్లో ఏపీ యువత దూసుకు పోతోంది. ప్రతిభ ఉన్న యువతకు అనేక అవకాశాలు కల్పిస్తు న్నాం. విశాఖలో సెమీ కండక్టర్ పరిశ్రమకు శంకుస్థాపన చేశాం. వికసిత్ భారత్కు గ్రోత్ ఇంజిన్గా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుంది. దేశంలో బ్లూ ఎకానమీ అభివృద్ధి చేస్తున్నాం. దేశానికి ఫార్మా హబ్ గా ఏపీ మారబోతోంది. నక్కపల్లిలో మరో ఫార్మా కంపెనీ రాబో తోంది. విశాఖ ఎకనమిక్ రీజియననన్ను ఆసియాలోనే గొప్ప పారి శ్రామిక కేంద్రంగా మారుస్తాం. రాయలసీమ ప్రాంతంలో రూ.5 లక్షల కోట్ల పెట్టుబడులు పెడుతున్నామని చెప్పుకొచ్చారు.
సీఎం చంద్రబాబు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు..
సీఎం చంద్రబాబు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు… ఆయన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్కు భారీ పరిశ్రమలు వస్తున్నాయి. ని సాఫ్ట్వేర్తో పాటు తయారీ రంగంలోనూ కొత్త అవకాశాలు సృష్టి స్తున్నారు. యువతకు ఉద్యోగాలు కల్పించే ఎకోసిస్టమ్ను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ప్రోత్సహిస్తోందని ప్రధాని మోదీ ప్రశంసిం చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కొత్త దశలోకి అడుగుపెట్టిందని పేర్కొన్నారు. సాఫ్ట్వేర్ రంగంలో ఇప్పటికే గుర్తింపు పొందిన రాష్ట్రం.. ఇప్పుడు తయారీ రంగంలోనూ జాతీయ స్థాయిలో ముందంజ వేస్తోందని పేర్కొన్నారు. సెమీకండక్టర్లు, కృత్రిమ మేధ (ఏఐ) మౌలిక సదుపా యాలు, డేటా సెంటర్లు, గూగుల్ వంటి అంతర్జాతీయ సంస్థల పెట్టుబడులు రాష్ట్రానికి వస్తుండటం పరిశ్రమలకు అనువైన వాతావరణాన్ని చంద్రబాబు ప్రభుత్వం కల్పిస్తుండటం వల్లనేనని ప్రధాని స్పష్టం చేశారు. ఈ పెట్టుబడులు కేవలం ఆర్థికాభివృద్ధినే కాకుండా రాష్ట్ర యువతకు భారీస్థాయిలో ఉద్యోగ అవకాశాలను కూడా తీసుకురానున్నాయని పేర్కొన్నారు.
పెట్టుబడులు పెరిగితే ఉద్యోగావకాశాలు
ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెరిగితే ఉత్పత్తి పెరుగుతుందని, ఉత్పత్తి పెరిగితే ఎగుమతులు పెరుగుతాయి. దాని ద్వారా ఉపాధి అవకాశాలు విస్తరిస్తాయి. ఇదే స్వర్ణాంధ్ర నిర్మాణానికి బలమైన మార్గమని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు నాయకత్వంలో రూపుదిద్దుకుంటున్న పరిశ్రమల ఎకోసిస్టమ్, భవిష్యత్ సాంకేతిక రంగాలపై దృష్టి, యువతకు ఉపాధి కల్పించే అభివృద్ధి నమూ నా..ఆంధ్రప్రదేశ్ను దేశ అభివృద్ధి పటంలో కీలక రాష్ట్రంగా నిల బెడుతోందని ప్రశంసించారు.
లాజిస్టిక్ నెట్వర్క్ మరింత మేలు
ఆధునిక లాజిస్టిక్ నెట్వర్క్ ద్వారా రైతులకు, పారిశ్రామిక వేత్తలకు మరింత ఉపయోగం ఉంటుంది. భవిష్యత్తును ఆలో చిం చి దానికి అనుగుణంగా ముందుకు సాగుతుంది. సాఫ్ట్వేర్, ఐటీ, టెక్ రంగాల్లో ఇక్కడి యువతకు మంచి టాలెంట్ ఉంది. ఏపీలో అభివృద్ధిలో చాలా వేగంగా పనిచేస్తుంది. గత మూడేళ్ల పర్యటనల్లో నేను రూ.2 లక్షల కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాను. ఏపీ అభివృద్ధి యాత్రలో ఉత్తరాంధ్ర ప్రాంతానికి విశాఖ ఎకనమిక్ రీజియన్ కీలకం కానుంది. విశాఖ ఎకనమిక్ రీజియన్ ఆసియా ఖండంలో అతి ముఖ్యమైన కేంద్రంగా మారబోతోంది… దీనికి అన్ని రకాల చర్యలు కేంద్రం తీసుకుంటోంది. పెట్టుబడుల నుంచి ఉపాధి అనేది ఎన్డీయే లక్ష్యం.
ప్రభుత్వపరంగా దీనికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇవాళ ఏపీలో శ్రీకారం చుట్టిన ప్రాజెక్టులన్నీ స్వర్ణాంధ్ర- వికసిత్ భారత్ సంకల్పాన్ని నెరవేరుస్తాయని ఆకాంక్షించారు.












