- సమాజంలో మార్పునకు విద్యే ప్రధానం
- యువగళం పాదయాత్రలో సమస్యలు చూశా
- ఎంతమంది పిల్లలున్నా తల్లికి వందనం
- వర్తింపజేయాలని నాడే సంకల్పించాం
- మంగళగిరిని నెం.1గా తీర్చిదిద్దుతాం
- రెండో విడతలో మూడు వేల పట్టాలు
- నియోజకవర్గంలో 10 వేల ఇళ్లు నిర్మిస్తాం
- తల్లికి వందనం లబ్ధిదారులతో ముఖాముఖిలో మంత్రి లోకేష్
మంగళగిరి (చైతన్యరథం): ప్రభుత్వ పాఠశాలలను చూసి అసూయపడేలా వాటిని తీర్చిదిద్దుతామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. మంగళగిరి నియోజకవర్గంలోని తల్లికి వందనం పథ కం లబ్దిదారులతో మంగళగిరి బైపాస్ కొండపనేని టౌన్షిప్ పార్క్ సోమవారం ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. తల్లికి వందనం పథకం అందుతున్న తీరు, తల్లికి వందనం కింద ప్రభుత్వం అందిస్తున్న ఆర్థికసాయం ఏ విధంగా ఉపయోగ పడు తుందన్న విషయాలపై ఆరా తీశారు. విద్యార్థుల తల్లుల నుంచి పలు సలహాలు, సూచనలు స్వీకరించారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యంగా ప్రజాప్రభుత్వం పనిచేస్తోంది. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల పెంపునకు కృషి చేస్తున్నాం. గతంలో ప్రైవేటు పాఠశాలలను చూసి అసూయపడే వాళ్లం. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలను చూసి ప్రైవేటు పాఠశాలలు అసూయపడేలా చేస్తాం. నిడమర్రు పాఠశాలలో ప్రవేశాల కోసం విపరీతమైన పోటీ ఉంది. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో లీప్ పాఠశా లలను తీర్చిదిద్దుతాం. ఈ రోజు నేను ఈ స్థాయికి వచ్చానంటే కారణం విద్య, సమాజంలో మార్పునకు, రాష్ట్ర అభివృద్ధికి విద్యే ప్రధానం. ప్రజాప్రభుత్వంలో 16 వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశాం. ఈ ఏడాది మరో 3 వేల పోస్టులు భర్తీ చేస్తాం. 10 వేలకు పైగా పాఠశాలల్లో వన్ క్లాస్-వన్ టీచర్ విధానం తీసుకువచ్చాం. ఈ ఏడాది ప్రైవేటు పాఠశాలల నుంచి 1,06,000 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు తరలివచ్చారని పేర్కొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల పనితీరు ఎలా ఉంది?
ప్రభుత్వ పాఠశాలల పనితీరు, బోధన ఎలా. ఉందని లోకేష్ వారిని ప్రశ్నించారు. తల్లికి వందనం. పథకం అందరికీ అందు తుందా అని ఆరా తీశారు. అందరికీ తల్లికి వందనం పథకం కింద ఆర్థికసాయం. అందిందని మహిళలు వివరించారు. ఒకటో తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు కూడా అంద రితో పాటు లబ్ధి చేకూర్చేలా తల్లికి వందనం పథకం జూలైలో అమలుకు నిర్ణయించినట్లు తెలిపారు. ఈ నెల 22 నుంచి 24వ తేదీలోగా ఆర్థికసాయం నిధులు తల్లుల ఖాతాల్లో జమ అవుతా యని వివరించారు. యువగళం పాదయాత్ర సమయంలో విద్యలో కర్నూలు వెనుకబడి ఉండటాన్ని గమనించానని, ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ తల్లికి వందనం పథకం వర్తింపజేసి అమలుచేయాలని అప్పుడే సంకల్పించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా మహిళలు మగ పిల్లలకు కూడా బ్యాడ్ టచ్ గురించి తరగతి గదిలో బోధించాలని, విద్యాసంవత్సరం పూర్తయిన తర్వా త పిల్లలకు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్లు నిర్వహించాలని కోరారు. ఇందుకు చర్యలు తీసుకుంటామని, స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్లకు లైబ్రరీలను వినియో గించుకునేలా చర్యలు తీసుకుంటామని లోకేష్ తెలిపారు. తల్లికి వందనం పథకం కింద అందే ఆర్థిక సాయాన్ని పిల్లల భవిష్యత్ అవసరాల కోసం ఆదా చేస్తున్నట్లు మహిళలు వివరించారు.
మార్పు మన ఇంటి నుంచే మొదలవ్వాలి
విద్యార్థులకు నైతిక విలువలతో కూడిన విద్యను అందిస్తున్నామని లోకేష్ చెప్పారు. ప్రముఖ ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావుతో నైతిక విలువలపై పుస్తకాలు రూపొందించి విద్యార్థులకు అందజే శాం. మార్పు మన ఇంటి నుంచే మొదలవ్వాలి. మహిళలను అందరూ గౌరవించాలి. టెక్నాలజీ వల్ల మంచి, చెడూ రెండూ ఉంటాయి. మనం ఏది ఎంచుకున్నామనేది ముఖ్యం. ప్రతి కుటుంబం ఏఐ వినియోగించి నేర్చుకోవాలనేది సీఎం చంద్రబాబు గారి ఆలోచన అని పేర్కొన్నారు.
నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం
మంగళగిరిలో 53 వేల ఓట్ల మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరాను. ప్రజలు 91 వేల భారీ మెజార్టీతో నన్ను గెలిపించారు. మంగళగిరి నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దు తాం. మంగళగిరికి పరిశ్రమలు తీసుకువచ్చి స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. ఇప్పటికే మొదటి విడత లో 3 వేల ఇళ్ల పట్టాలు అందజేశాం. రెండో విడతలో మరో 3 వేల పట్టాలు అందిస్తున్నాం. నియోజకవర్గంలో 10 వేల ఇళ్లు నిర్మిస్తామని తెలిపారు.
















