- ప్రైవేటీకరణ అంటూ దుష్ప్రచారం చేస్తున్నారు
- డాక్యుమెంట్ రైటర్లకు ఉపాధి మార్గాలు చూపిస్తాం
- దీనిపై వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలి
- దీపం-2.0 లబ్ధిదారులకు నిర్ధారిత తేదీల్లో నగదు
- సాంకేతిక అంశాలను పరిశీలించి అమలుచేయాలి
- జలధారకు వీబీజీ రామ్ జీని అనుసంధానించాలి
- లిటిగెంట్ పిటిషన్లను గుర్తించి కౌన్సెలింగ్ ఇవ్వాలి
- ఆర్టీజీఎస్ సమీక్షలో సీఎం చంద్రబాబు
అమరావతి (చైతన్యరథం): సబజిస్ట్రార్ కార్యాలయాలను ప్రైవేట కరిస్తున్నారంటూ కొందరు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నా రని.. దీనిపై వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ప్రజలకు మెరుగైన సేవలందిం చేందుకే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని వెల్ల డించారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ సెంటర్ సోమవారం వివిధ శాఖల పనితీరుపై సీఎం సమీక్షించారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ప్రైవేటీకరిస్తున్నారనే అంశం సమీక్షలో ప్రస్తావనకు వచ్చింది. ప్రజలకు మెరుగైన రిజిస్ట్రేషన్ సేవలందించేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. రిజిస్ట్రేషన్ సేవలను మరింత సులభతరం చేసేలా రిజిస్ట్రేషన్ సేవా కేంద్రం (ఆర్ఎస్కే)లను ఏర్పాటు చేస్తున్నాం. ఇది ప్రైవేటీకరణ ఎంత మాత్రమూ కాదు. పాస్పోర్టు సేవా కేంద్రాల తరహాలోనే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు పనిచేస్తాయి. పాస్పోర్టు సేవా కేంద్రాల పనితీరు ఏ విధంగా జరు గుతుందో.. ఆ తర్వాత ప్రక్రియ ఏ విధంగా జరుగుతుందో వివ రించండి.
పాస్పోర్టు సేవా కేంద్రాలు అందుబాటులోకి వచ్చాక పాస్పోర్టు ప్రాసెసింగ్ అనేది చాలా సులువైంది. ఇదే తరహాలో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల పనితీరు ఉంటుంది. అయితే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల విషయంలో కొందరు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రజలకు వాస్తవాలు వివరించే బాధ్యతను అధికారులు తీసుకోవాలి. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల వల్ల కలిగే లాభాలను వివరించాలి. డాక్యుమెంట్ రైటర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. డాక్యుమెంట్ రైటర్ల ఉపాధికి ఇబ్బంది లేని విధంగా మార్గాలు చూపెడతాం. దీపం-2.0 పథకం లబ్ధిదారు లకు ఇచ్చే సబ్సిడీని క్రమపద్ధతిలో ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ సబ్సిడీని నిర్ధారిత తేదీల్లో ఇచ్చే అంశాన్ని పరిశీలించాలి. ఈ అం శంపై పౌరసరఫరాల శాఖ-ఆర్థిక శాఖ అధికారులు సమన్వయం చేసుకోవాలి. దీనికి సంబంధించిన సాంకేతిక అంశాలను పరిశీ లించి అమలు చేయాలని ఆదేశించారు.
లిటిగెంట్ పిటిషనర్లకు కౌన్సెలింగ్
లిటిగెంట్ పిటిషనర్లను ఏ విధంగా కట్టడి చేయాలో ఆలోచించా లి. ఎలాంటి ప్రజా ప్రయోజనం లేకుండా చేసే ఫిర్యాదుదారులను గుర్తించి వారికి కౌన్సెలింగ్ ఇవ్వాలి. రాష్ట్రవ్యాప్తంగా 81 మంది లిటిగెంట్ పిటిషనర్లు ఉన్నట్టు గుర్తించాం. వీరు సరాసరి ఒక్కొక్కరు 246 పిటిషన్లు పెడుతున్నారు. వీరి వివరాలను జిల్లా కలెక్టర్లకు పంపించాలి. వారు పెట్టే ఆర్జీల్లో ప్రజా ప్రయోజనాలు ఉంటే వాటి ని పరిశీలించాలి. ప్రభుత్వాన్ని, అధికారులను బద్నాం చేసే ఉద్దే శంతో పిటిషన్లు పెట్టే వారిని గుర్తించాలి. ఫిర్యాదుల పరిష్కారంలో ఆర్థికేతర సమస్యలను వెంటనే పరిష్కరించాలి. ప్రాధాన్యతల వారీగా ఆర్థిక సమస్యలను పరిష్కరిద్దాం. ఈ ఏడాది ఎల్నినో ప్రభావం కారణంగా ప్రస్తుతం 49 శాతం లోటు వర్షపాతం ఉంది. ఈ ప్రభావం నుంచి బయటపడేసే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వే షించాలి. ఈ మేరకు రైతుల్లో అవగాహన కల్పించాలి. డ్రై క్రాప్స్ వేసేలా రైతులను ప్రొత్సహించండి.
ఇదే సమయంలో వీబీజీ రామ్ జీ పనులను పెద్దఎత్తున చేపట్టాలి. జలధార పనులకు వీబీజీ రామ్ జీ పనులను అనుసంధానం చేయాలి. ప్రజాభిప్రాయాలను ఎప్పటి కప్పుడు తెలుసుకుని పని విధానం మార్చుకోవాలి. పరిపాలనా విధానాలను మెరుగుపరుచుకోవాలి. సమస్యలు ఉత్పన్నమయ్యాక చర్యలు తీసుకోవడంతో పాటు. ముందుగానే ఏయే సమస్యలు వస్తా యనే విషయాన్ని అంచనా వేసి దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమీక్షలో సీఎస్ సాయిప్రసాద్ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.















