- లోకేష్ చేతుల ‘షైనింగ్ స్టార్స’ అందుకోవడం గర్వంగా ఉంది
- భవిష్యత్‌లోనూ షైనింగ్ స్టార్స్ అవార్డులు కొనసాగించాలి
- ప్రభుత్వ పాఠశాలల ద్వారానే విద్యార్థుల సమగ్ర వికాసం సాధ్యం
- ప్రభుత్వ పాఠశాలలంటే చిన్నచూపు పోయింది
- షైనింగ్ స్టార్స్ అవార్డుల ప్రదానోత్సవంలో విద్యార్థులు, తల్లిదండ్రుల భావోద్వేగం
తాడేపల్లి (చైతన్య రథం) ప్రైవేటు పాఠశాలలతో ప్రభుత్వ పాఠశాలలు పోటీ పడుతున్నాయని, ప్రభుత్వ పాఠశాలలంటే చిన్నచూపు పోయిందని, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా షైనింగ్ స్టార్స్ అవార్డులు అందుకోవడం గర్వంగా ఉందని విద్యార్థులు, తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు. మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లిలోని సీఎసఆర్ కల్యాణ మండపంలో పది, ఇంటర్ పరీక్షల్లో రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థినీ, విద్యార్థులకు మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా షైనింగ్ స్టార్స్ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులు, తల్లిదండ్రులు తమ అభిప్రాయాలు పంచుకున్నారు.
“ఈ మార్కులు నా ఘనత మాత్రమే కాదు.. నా తల్లిదండ్రులు, అధ్యాపకుల మార్గదర్శకంలోనే సాధించాను. ముఖ్యంగా మా జగదీష్ సార్, ప్రమీలా మేడమ్ ఎంతో ప్రోత్సహించారు. ఇందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు. షైనింగ్ స్టార్స్ కార్యక్రమం ద్వారా మమ్మల్ని గుర్తించిన విద్యా మంత్రి నారా లోకేష్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. ఒకేషనల్ కాలేజీల్లో అనేక వసతులు కల్పించారు. మధ్యాహ్న భోజన పథకంతోపాటు ఉచితంగా పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్ అందించారు. లోకేష్ చేతుల మీదుగా షైనింగ్ స్టార్ అవార్డు అందుకోవడం గర్వంగా ఉంది. సీఏ చదవడం, తల్లిదండ్రులను బాగా చూసుకోవడమే నా లక్ష్యం.
సి.అనూష, ఇంటర్ ఒకేషనల్ విద్యార్థిని
మార్కులు:988/1000 (ఆఫీస్ అసిస్టెంట్ షిప్)
గవర్నమెంట్ ఒకేషనల్ జూనియర్ కాలేజీ, కుప్పం, చిత్తూరు జిల్లా
మా కుమార్తె రూపాయి ఖర్చు లేకుండా చదువుకుంది. ప్రభుత్వం మధ్యాహ్న భోజనం అందిస్తోంది. విద్యకూడా బాగుంది. విద్యాశాఖ మంత్రి లోకేష్ చేతుల మీదుగా మా పాప అవార్డు అందుకోవడం ఆనందంగా ఉంది. మా అమ్మాయికి 988 మార్కులు వచ్చాయి. ఇందుకు చాలా గర్వంగా ఉంది. లోకేష్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
అరుణమ్మ, విద్యార్థిని అనూష తల్లి, కుప్పం, చిత్తూరు జిల్లా
ఇంటర్‌లో నాకు 991 మార్కులు వచ్చాయి. నారా లోకేష్ చేతుల మీదుగా షైనింగ్ స్టార్ అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా, గర్వంగా ఉంది. నేను పదో తరగతి రెడ్డిపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో చదివాను. నా తల్లిదండ్రుల సహకారంతోనే ఇన్ని మార్కులు వచ్చాయి. అదేవిధంగా ప్రభుత్వం అందిస్తున్న కార్యక్రమాలు కూడా కారణం. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థిమిత్ర, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం వల్లే మేం ఇంత ముందుకు రాగలిగాం. మా అధ్యాపకులు, ప్రధానోపాధ్యాయునికి ధన్యవాదాలు. మా నాన్న హార్ట్ పేషెంట్. అందుకే నేను కార్డియాలజిస్ట్ కావాలనుకుంటున్నా. నాకు లాంగ్ టర్మ్ కోచింగ్ అందించాలని నారా లోకేష్‌ని కోరుతున్నా.
షేక్.చాందిని, ఇంటర్ విద్యార్థిని
మార్కులు: 991/1000 (బైపీసీ)
గవర్నమెంట్ జూనియర్ గర్ల్స్ కాలేజీ, కదిరి, శ్రీసత్యసాయి జిల్లా
మా పాప మంచి మార్కులతో మాకు పేరు తెచ్చినందుకు సంతోషంగా ఉంది. ఇక్కడకు వచ్చి నారా లోకేష్ చేతులమీదుగా అవార్డు అందుకునే అవకాశం కల్పించినందుకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా.
షేక్ అమ్మజాన్, విద్యార్థిని చాందిని తల్లి, కదిరి, శ్రీసత్యసాయి జిల్లా
షైనింగ్ స్టార్స్ అవార్డుల కార్యక్రమం నిర్వహణపట్ల ముందుగా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నాకు ఇంటర్‌లో 990 మార్కులు వచ్చాయి. గవర్నమెంట్ సెక్టార్‌లో ఇదే అత్యధికం. మా తండ్రి కృష్ణారావు ప్రభుత్వ టీచర్. నా చదువు మొత్తం ప్రభుత్వ విద్యాసంస్థలోనే కొనసాగించాను. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర, 50 రోజుల సంకల్ప్ కార్యక్రమం బాగా దోహదపడ్డాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే వారికి ఓవరాల్ డెవలప్‌మెంట్ ఉంటుందనే నా అభిప్రాయం. మా కుటుంబంలో అందరూ ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకుని ప్రభుత్వ అధికారులయ్యారు. ఆ స్ఫూర్తితోనే నేను కూడా చదువుకున్నాను. సివిల్ సర్వెంట్ కావాలనేది నా లక్ష్యం. ప్రజలకు సేవ చేస్తాను. మా పాఠశాలకు ఇప్పటికే మూడుసార్లు స్టేట్ అవార్డు వచ్చింది. మంత్రి లోకేష్ ద్వారా ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం కావాలని కోరుకుంటున్నాను.
సీహెచ్ అనన్యశ్రీ, ఇంటర్ విద్యార్థిని
మార్కులు: 990/1000 (ఎంపీసీ)
ఏపీ మోడల్ స్కూల్ (ఓవీ పేట), టెక్కలి, శ్రీకాకుళం జిల్లా
నేను పనిచేస్తున్న పాఠశాలలోనే మా పాప చదువుకుంది. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ రావడం మంచి పరిణామం. లోకేష్ ఆలోచనలతో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నారు. ఇది చాలా ఆనందదాయకం. నేడు ప్రభుత్వ పాఠశాలల్లో మంచి ఫలితాలు వస్తున్నాయి. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, వంద రోజుల యాక్షన్ ప్లాన్, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర వంటి కార్యక్రమాలు ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం కావడానికి బాగా ఉపయోగపడ్డాయి. నారా లోకేష్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల ముందు నో వేకన్సీ బోర్డులు రావాలి. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న వారికి షైనింగ్ స్టార్స్ అవార్డులు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది.
సీహెచ్ కృష్ణారావు, అనన్యశ్రీ తండ్రి, టెక్కలి, శ్రీకాకుళం జిల్లా
ఇటీవల పదో తరగతి పరీక్షల్లో నాకు 593 మార్కులు వచ్చాయి. నారా లోకేష్ చేతులమీదుగా షైనింగ్ స్టార్ అవార్డు అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. భవిష్యత్‌లో కూడా ఈ అవార్డులు ఇవ్వాలి. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, తల్లికి వందనం కార్యక్రమాలు అమలుచేస్తున్న ప్రభుత్వానికి ధన్యవాదాలు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు విద్యార్థుల అభ్యున్నతికి ఎంతగానో సహకరిస్తారు.
ఎన్.చిద్విలాస్, టెన్త్ విద్యార్థి
మార్కులు: 593/600
మున్సిపల్ హైస్కూల్ (మెట్టెక్కివలస), ఆముదాలవలస, శ్రీకాకుళం జిల్లా
ప్రభుత్వ పాఠశాలల్లో వంద రోజుల యాక్షన్ ప్లాన్ చాలా బాగుంది. దీనిని కొనసాగించాలి. ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల సపోర్ట్ కూడా చాలా బాగుంది. ఇదేవిధంగా గవర్నమెంట్ స్కూల్స్‌ను ఇంప్రూవ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రైవేటు పాఠశాలలతో ప్రభుత్వ పాఠశాలలు పోటీ పడుతున్నాయి. గతంలో ప్రభుత్వ పాఠశాలలంటే చిన్న చూపు చూసేవారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలంటే గౌరవం పెరిగింది. ఇందుకు లోకేష్‌కు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.
దీప, చిద్విలాస్ బంధువు, ఆముదాలవలస, శ్రీకాకుళం జిల్లా
ఈ విజయం నాది మాత్రమే కాదు.. టీచర్లు, పేరెంట్స్, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఏమైనా చేయగలరని నమ్మే ప్రతి ఒక్కరిది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో.. పాఠశాలల బలోపేతానికి కృషి చేస్తున్న నారా లోకేష్‌కు ధన్యవాదాలు. పేద విద్యార్థులకు నాణ్యమైన యూనిఫాం, బుక్స్, మధ్యాహ్న భోజన పథకం అందిస్తున్నారు. ఎడ్యుకేషన్ పాలసీ ఈ రోజు షైనింగ్ స్టార్స్‌ను కాదు.. రేపు ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించే ఎంతోమంది ప్రతిభగల విద్యార్థులను తయారుచేస్తుంది. ఐఏఎస్ కావాలనేది నా కల. ఏపీ మాక్ అసెంబ్లీలో నేను స్పీకర్‌గా వ్యవహరించడం అదృష్టంగా భావిస్తున్నా. ఆ ఎక్స్‌పీరియన్స్ నాకు లీడర్‌షిప్ క్వాలిటీ, కమ్యూనికేషన్ స్కిల్స్, కాన్ఫిడెన్స్ మాత్రమే కాకుండా ఫ్యూచర్‌లో ఏం కావాలనేది క్లారిటీ ఇచ్చింది. కమిటెడ్ సివిల్ సర్వెంట్‌గా మీ ముందుకు తిరిగి వస్తాను. రాష్ట్రానికి, దేశానికి సేవ చేస్తాను.
ఎస్ స్వాతి, టెన్త్ విద్యార్థిని
మార్కులు: 594/600
ఏపీ మోడల్ స్కూల్, శంఖవరం, కాకినాడ జిల్లా
టీచర్లు, ప్రభుత్వ మద్దతు, తల్లిదండ్రుల ప్రోత్సాహంవల్లే ఇన్ని మార్కులు వచ్చాయి. 100 రోజుల యాక్షన్ ప్లాన్ చాలా ఉపయోగపడింది. మధ్యాహ్న భోజన పథకం బాగుంది. ఉపాధ్యాయులు బాగా ప్రోత్సహించడం వల్లే 591 మార్కులు వచ్చాయి.
పెద్దింటి భువనశ్రీ, టెన్త్ విద్యార్థిని
మార్కులు: 591/600
గవర్నమెంట్ హైస్కూల్, పాలకొండ, పార్వతీపురం మన్యం జిల్లా.














