అమరావతి (చైతన్య రథం): అక్షయపాత్ర ఫౌండేషన్ సేవానరి అనన్య సామాన్యమని విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్ అభినందనలు తెలిపారు. పౌండేషన్‌కు కేంద్ర ప్రభుత్వం పరస్కారం లభించిన నేపథ్యంలో ఎక్స్ వేదికపై పోస్టుపెడుతూ.. “25 ఏళ్లలో దేశవ్యాప్తంగా పాఠశాలల విద్యార్థులకు 500 కోట్ల భోజనాలు అందించి అరుదైన ఘనత సాధించారు. కేంద్ర ప్రభుత్వం పీఎం పోషణ్ పథకం పురస్కారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు. అక్షయ పాత్ర ఛైర్మన్ మధు పండిత్ దాస, వైస్ ఛైర్మన్ చంచలపతి దాస, ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ రీజినల్ ప్రెసిడెంట్స్ వంశధార దాస, అక్షయపాత్ర యంత్రాంగం కృషికి తగిన గుర్తింపు లభించింది. పిల్లల ఆకలి తీర్చి పాఠశాలల్లో హాజరు పెంచేందుకు అక్షయపాత్ర ఫౌండేషన్ చేస్తున్న కృషి ఎనలేనిది” అని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.
















