- అధికారులకు పలు సూచనలు చేసిన మంత్రి
- కట్టుదిట్టంగా భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశం
విశాఖపట్నం/నక్కపల్లి(చైతన్యరథం): నక్కపల్లి ప్రాంత పారి శ్రామికాభివృద్ధిలో కీలక ఘట్టంగా నిలిచే స్టీల్ ప్లాంట్ శంకు స్థాపన కార్యక్రమానికి ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. ఈ నెల 23న నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబా బు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ మంత్రి నారా లోకేష్ హాజరుకానున్నారు. స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన చేయనున్న ప్రాంతాన్ని హోంమంత్రి వంగలపూడి అనిత శనివారం పరిశీలిం చారు. అధికారులతో కలిసి వేదికను, పరిసర ప్రాంతాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. భారీ సంఖ్యలో ప్రజలు, విద్యార్థులు, అతిథులు తరలివచ్చే అవకాశముండటంతో భద్రతా చర్యలు కట్టుదిట్టంగా చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ ఏర్పాట్లు సమర్థవంతంగా ఉండే లా ముందస్తు ప్రణాళిక రూపొందించాలని సూచించారు. కార్యక్రమానికి వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగ కుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని పేర్కొన్నా రు. అదేవిధంగా శంకుస్థాపన వేదికను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని, కార్యక్రమం సజావుగా జరిగేలా అన్ని శాఖలు సమన్వ యంతో పనిచేయాలని మంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు.














