మంగళగిరి(చైతన్యరథం): మంగళగిరి నియోజకవర్గం తాడేప ల్లి పట్టణంలోని నులకపేటలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. శ్రీరంగం ఫౌండేషన్ సహకారంతో రూ.65 లక్షల సీఎసఆర్ నిధులు వెచ్చించి కమ్యూనిటీ హాల్‌ను నిర్మించారు. ముందుగా నులకపేటకు చేరుకున్న మంత్రి లోకేష్‌కు స్థానిక టీడీపీ నాయకు లు, కార్యకర్తలు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి కమ్యూనిటీ హాల్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం అందరితో కలిసి ఫోటోలు దిగారు. ఈ కార్యక్రమంలో శ్రీరంగం ఫౌండేషన్ వ్యవస్థాపకులు పి.చంద్రకిరణ్‌రెడ్డి, ఆంధ్రప్రదేశ్ పద్మ శాలీ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య, టీటీడీ బోర్డు మెంబర్ తమ్మిశెట్టి జానకీదేవి, గుంటూ రు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, తాడేపల్లి పట్టణ టీడీపీ అధ్యక్షుడు వల్లభనేని వెంక ట్రావు, కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా, ఎంటీఎంసీ కమిషనర్ షేక్ అలీమ్ బాషా తదితరులు పాల్గొన్నారు.














