చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చంద్రన్న చేయూతతో ఆర్థిక స్వావలంబన దిశగా మహిళాలోకం

by చైతన్యరధం
Mar 8, 2026 at 6:30am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, సంపాదకుని ఎంపిక
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…
Share on FacebookShare on TwitterShare on Whatsapp

“యత్ర నార్యస్తు పూజ్యతే రమంతే తత్ర దేవతా”
`ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ దైవత్వం వికసిస్తుందన్నది పురాణాల మాట. స్త్రీలను గౌరవించనిచోట చేసే ఏ పవిత్ర కార్యమైనా ఫలితమివ్వదు. మన భారతీయ సమాజంలో స్త్రీలకున్న ప్రత్యేక గౌరవం, స్థానం వేరు. మహిళా పురోగతితోనే సమాజాభివృద్ధి సాధ్యమన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు నమ్మిన సిద్ధాంతం. కూటమి ప్రభుత్వం అనుసరిస్తోన్న విధానం కూడా. అందుకే స్త్రీ అభ్యున్నతికి తోడ్పడే అనేక ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు చంద్రబాబు తీసుకొస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో అన్న నందమూరి తారక రామారావు మొదలుకొని నేడు చంద్రబాబునాయుడి వరకు `స్త్రీల అభ్యున్నతికి పెద్దపీట వేసిన దశ్యాలే కనిపిస్తాయి. మహిళల స్వావలంబనకు చేస్తోన్న కషే అగుపిస్తుంది. స్త్రీ సంక్షేమంతోపాటు.. మహిళల ఆర్థిక స్వయంసమృద్ధికి డ్వాక్రా సంఘాల బలోపేతం, వడ్డీలేని రుణాలు.. తాజాగా మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతోన్న విధానం.. ఇవన్నీ నవశకానికి నాంది పలికేవే!

బడ్జెట్‌లో నారీశక్తికే సింహభాగం
చంద్రబాబునాయుడు ఎప్పుడు ముఖ్యమంత్రిగావున్నా.. ఆ కాలం మహిళలకు స్వర్ణయుగం. ఇది కేవలం మాట కాదు. బడ్జెట్ కేటాయింపులు స్పష్టం చేస్తోన్న వాస్తవాలు. గత ప్రభుత్వాలు ఎన్నడూ కేటాయించని రీతిలో ఈసారి మహిళా సంక్షేమానికి బడ్జెట్‌లో ప్రాధాన్యతా స్థానమిచ్చారు. మహిళా` శిశు సంక్షేమానికి రూ.4,582 కోట్లు కేటాయించారు. మహిళలకు ఉచిత బస్సు పథకానికి రూ.1,420 కోట్లు పద్దు పెట్టారు. మహిళలకు గౌరవంతోపాటు.. అంతకుమించిన భద్రతకు ప్రాధాన్యమిచ్చారు. ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించే దీపం 2.0 పథకానికి రూ.2,601 కోట్లు కేటాయించారు. ఆరోగ్య భద్రతతోపాటు వంటింటి ఖర్చునూ తగ్గించారు. ‘తల్లికి వందనం’ పథకం కోసం రూ.9,668 కోట్లు వెచ్చించారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్లకు రూ.27,719 కోట్లు కేటాయించారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఆడబిడ్డ నిధి పథకాన్ని పీ-4 కిందికి తెచ్చారు. బడికి వెళ్లే ప్రతి బిడ్డడూ ‘తల్లికి వందనం’ ఇచ్చారు. ‘అక్షర ఆంధ్ర’ కార్యక్రమం ద్వారా అక్షరాస్యతను పెంచి స్వర్ణాంధ్ర సాకారం దిశగా అడుగులేస్తున్నారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 09-03-2026

మన ఎదుగుదలే ముఖ్యమంత్రి సంకల్పం

సాధికారతే లక్ష్యంగా సెర్ఫ్, మెప్మా ఒప్పందాలు

కూటమి ప్రభుత్వంతోనే మహిళా సాధికారిత
మహిళా సంక్షేమం, ఆర్థిక స్వాతంత్య్రం `ఇది కేవలం నినాదం కాదు. టీడీపీ ప్రభుత్వ సంకల్పం. స్వర్ణాంధ్ర విజన్-2047 లక్ష్యంగా పని చేస్తోన్న ప్రణాళికా విధానం. మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది కూటమి. సున్నావడ్డీ రుణాల పరిమితిని రూ.5 లక్షలకు పెంచి, మహిళలకు పెట్టుబడి అవకాశాలు పెంచింది. మహిళలకు పెట్టుబడి రాయితీని 35నుంచి 45 శాతానికి పెంచి వ్యాపారరంగంలో ప్రత్యేక స్థానం కల్పిస్తోంది. ఎస్సీ, ఎస్టీ మహిళలకు వడ్డీలేని రుణాలిచ్చి ఆర్థిక భరోసా కల్పించింది.

మహిళా భద్రతకు ప్రాధాన్యత
మహిళల భద్రత విషయంలో కూటమి చిత్తశుద్ధి, నిబద్ధత ఎన్నదగింది. ‘ఆడబిడ్డ జోలికొస్తే.. ఎంతటివాడికైనా అదే చివరి రోజు’ అని సాక్షాత్తూ ముఖ్యమంత్రే హెచ్చరించారంటే `మహిళా భద్రతపై కూటమి ప్రభుత్వ విధానాన్ని అంచనా వేయడం కష్టం కాదు. తప్పు చేసినవాళ్లకు శిక్షలు తప్పవన్న హెచ్చరిక `మహిళా లోకానికి పెద్ద భరోసా. మదనపల్లెల్లో జరిగిన ఘటనల్లో నిందితులు శిక్షలకు భయపడి ఆత్మహత్య చేసుకున్నారంటే.. కూటమి పాలనలో చట్టాలు ఎంత కఠినంగా అమలవుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. పాఠశాలలు, కళాశాలల్లో మహిళలకు ఆత్మరక్షణలో శిక్షణనిచ్చి “శక్తి వారియర్స”ను తయారు చేస్తోంది ప్రభుత్వం. అంగన్వాడీలు, ఆశా వర్కర్లకు గ్రాట్యుటీ అమలుచేసి మరింత గౌరవం పెంచింది. ‘చంద్రబాబు మహిళా పక్షపాతి’ అన్న ముద్ర పడటానికి కారణం `మహిళలపట్ల ఆయన చూపే ఆదరణే!

అన్న ఎన్టీఆర్‌నుంచే మహిళాభ్యున్నతికి పెద్దపీట
మహిళలకు అగ్ర తాంబూలం ఇచ్చిన ఎన్టీఆర్.. మహిళాలోకం గుండెల్లో ఆరాధ్యుడయ్యాడు. మహిళల సంక్షేమం, అభివృద్ధితోనే సమాజాభివద్ధి అని బలంగా నమ్మారు. అందుకు అనుగుణంగా ఆడపిల్లలకు తండ్రి ఆస్తిలో సమాన హక్కునిచ్చే చట్టం తెచ్చారు. ఇది దేశవ్యాప్తంగా మహిళల ఆస్తి హక్కులకు మార్గం సుగమం చేసింది. ఏపీలో మొదటి మహిళా విశ్వవిద్యాలయాన్ని తిరుపతిలో స్థాపించారు. మహిళలకు స్థానిక సంస్థల్లో 33 శాతం రిజర్వేషన్లు అమలు చేశారు. మంత్రి మండలిలో మహిళలకు పెద్దపీట వేసి రాజకీయాల్లో ప్రత్యేక స్థానం కల్పించారు. పేద మహిళలకు సబ్సిడీ రేటుతో చీరలు, వస్త్రాలు పంచిపెట్టారు. కిలో రూ.2 బియ్యం పథకాన్ని తీసుకొచ్చి పేదల ఆకలి తీర్చారు. గ్రామీణ మహిళల స్వయం సహాయక సమూహాలు ఏర్పాటు చేసి… ఆర్థిక స్వావలంబనకు శిక్షణ, రుణాలు, సబ్సిడీలు అందించారు. ‘నీడ’ పథకంకింద పేద కుటుంబాలకు పక్కా ఇళ్లు (మహిళలకు ప్రాధాన్యత) ఇచ్చి వారికి ఆసరా కల్పించారు.

రాజకీయాల్లో మహిళలకు పెద్దపీట
మహిళలు సమాజంలో గౌరవంగా బతకాలంటే `రాజకీయాల్లో రాణింపుతోనే సాధ్యమని తెలుగుదేశం పార్టీ బలంగా నమ్ముతుంది. అందుకు తగినట్టుగా పార్టీలో అధికారికంగా మహిళా విభాగం ఏర్పాటు చేసింది. ఇది మహిళలకు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా బలోపేతం చేయడానికి కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మహిళలు పార్టీలో నాయకత్వ పాత్రలు, కార్యకర్తలుగా, నిర్ణయాధికారాలుగా పాల్గొనే అవకాశాలు కల్పిస్తోంది. స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్ పెంచడం టీడీపీ హయాంలోనే జరిగింది. లోక్‌సభ నియోజకవర్గస్థాయి అధ్యక్ష పదవుల్లో ఐదుగురు మహిళలకు అవకాశం కల్పించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ మొదటి మహిళ స్పీకర్‌గా కావలి ప్రతిభా భారతిని నియమించి మహిళలపట్ల ఉన్న చిత్తశుద్ధిని నిరూపించుకున్నారు.

మహిళాశక్తిపై చంద్రన్న దూరదృష్టి
మహిళా దినోత్సవం అనేది కేవలం వేడుక మాత్రమే కాదు… సమాజాభివృద్ధిలో మహిళల పాత్రను గుర్తు చేసుకునే సుదినం. మహిళలను కుటుంబ పరిమితుల్లో మాత్రమే కాకుండా ఆర్థిక వ్యవస్థలో కీలక భాగస్వాములుగా చూడాలనే దూరదృష్టి కలిగిన నాయకుల్లో ప్రముఖుడు నారా చంద్రబాబునాయుడు. మహిళల సామర్థ్యాన్ని ముందుగానే గుర్తించి, వారిని ఆర్థికంగా బలపరిచే విధానాలను రూపొందించిన నాయకుడిగా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు. గ్రామీణ మహిళలు స్వయం సహాయక సంఘాలుగా ఏర్పడి ఆర్థికంగా ఎదగాలని ఆయన ఆలోచించిన సమయంలో అది సాధారణ ఆలోచన కాదు…. సమాజాన్ని మార్చే దూరదృష్టి. ఆ ఆలోచనకు ప్రతిరూపమే డ్వాక్రా ఉద్యమం. ఒక రాష్ట్రంలో ప్రారంభమైన ఈ కార్యక్రమం నేడు దేశవ్యాప్తంగా అమలవుతున్న మోడల్‌గా మారడం ఆయన నాయకత్వానికి నిదర్శనం.

గ్రామీణ మహిళలకు ఆలంబన
మన పూర్వీకులు చెప్పిన “ఒక్కడి చేత తాటికాయ కొట్టలేం” అనే సామెతలో ఉన్న భావనను చంద్రబాబునాయుడు గ్రామీణాభివృద్ధిలో వినూత్నంగా ఉపయోగించారు. మహిళలు ఒక్కొక్కరుగా కాకుండా సమూహాలుగా కలిసి పనిచేస్తే పెద్ద మార్పు సాధ్యమవుతుందని విశ్వసించారు. అదే ఆలోచనతో డ్వాక్రా సంఘాలు ఏర్పడ్డాయి. సాధారణంగా పదిమంది మహిళలు కలిసి ఒక సమూహంగా ఏర్పడి చిన్నచిన్న వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఆ వ్యాపారాలు క్రమంగా ఎదిగి కుటుంబాల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తాయి. కొన్నిసార్లు రెండు లేదా అంతకంటే ఎక్కువ గ్రూపులు కలిసి పెద్దస్థాయిలో వ్యాపారాలు నిర్వహించే స్థాయికీ ఎదుగుతాయి. ఈ మార్పు బయటకు పెద్దగా కనిపించకపోయినా, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో ఇది గొప్ప మార్పును తెచ్చింది. డ్వాక్రా ద్వారా అనేక మహిళలు చిన్న దుకాణాలు, ఉత్పత్తి యూనిట్లు, సేవా రంగ వ్యాపారాలు ప్రారంభించి తమ కుటుంబాల జీవన స్థితిని మార్చుకున్నారు. ఈ మార్పు కేవలం కుటుంబాలకే కాకుండా గ్రామాల ఆర్థిక వ్యవస్థకూ కొత్త బలాన్నిచ్చింది.

సాధికారతకు ప్రాధాన్యం
సాధారణంగా రాజకీయ నాయకులు పథకాల తాయిలాలిచ్చి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తారు. కానీ చంద్రబాబునాయుడు ఆలోచన వారికి ఆర్థిక స్వాతంత్య్రం కల్పించడం. మహిళలు ఏ పనిపై దృష్టిపెట్టినా దాన్ని బాధ్యతతో పూర్తి చేస్తారని ఆయన విశ్వాసం. పురుషాధిక్య సమాజంలో వ్యాపారాలను పురుషులే నిర్వహిస్తారని భావించిన సమయంలో, మహిళలు కూడా సమర్థంగా వ్యాపారాలను నడిపించగలరని ఆయన నమ్మారు. తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా మహిళల సంక్షేమం, సాధికారతకు చంద్రబాబునాయుడు ప్రత్యేక ప్రాధాన్యమిస్తూనే ఉన్నారు. డ్వాక్రా మహిళలకు పెరిగిన రుణ అవకాశాలు, తల్లులకు ఆర్థిక సహాయం, మహిళల స్వేచ్ఛకు దోహదపడే రవాణా సదుపాయాలువంటి చర్యలు మహిళల జీవితాల్లో కొత్త అవకాశాలను తెరిచాయి. అంగన్‌వాడీ కార్యకర్తలకు గౌరవప్రదమైన సహాయం, మహిళల పేరుపై గృహాల పంపిణీ, స్వయం ఉపాధి కార్యక్రమాలు… ఇవన్నీ మహిళలను ఆర్థికంగా బలపరచడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. మహిళల అభివృద్ధి ద్వారా సమాజాభివృద్ధి సాధ్యమని చంద్రబాబు ఆచరణలో చూపించారు. డ్వాక్రా ఉద్యమం ద్వారా ప్రారంభమైన మహిళల సాధికారత ప్రయాణం నేడు లక్షలాది కుటుంబాల జీవితాలను మార్చింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవంవేళ మహిళాశక్తికి వందనం! దూరదృష్టి చంద్రన్న నాయకత్వానికి అభివందనం!

Previous Post

ఆ పొరబాటు రిపీట్ కాదు!

Next Post

చైతన్యరధం ఈ పేపర్ 08-03-2026

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 09-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 09-03-2026

కార్యకర్త
@ March 9, 2026
మన ఎదుగుదలే ముఖ్యమంత్రి సంకల్పం
ఆంధ్రప్రదేశ్

మన ఎదుగుదలే ముఖ్యమంత్రి సంకల్పం

చైతన్యరధం
@ March 9, 2026
సాధికారతే లక్ష్యంగా సెర్ఫ్, మెప్మా ఒప్పందాలు
ఆంధ్రప్రదేశ్

సాధికారతే లక్ష్యంగా సెర్ఫ్, మెప్మా ఒప్పందాలు

చైతన్యరధం
@ March 9, 2026
స్వయం కు నేనే బ్రాండ్!
ఆంధ్రప్రదేశ్

స్వయం కు నేనే బ్రాండ్!

చైతన్యరధం
@ March 9, 2026
మీ చైతన్యం భేష్!
ఆంధ్రప్రదేశ్

మీ చైతన్యం భేష్!

చైతన్యరధం
@ March 9, 2026
చైతన్యరధం ఈ పేపర్ 08-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 08-03-2026

కార్యకర్త
@ March 8, 2026
ఆ పొరబాటు రిపీట్ కాదు!
ఆంధ్రప్రదేశ్

ఆ పొరబాటు రిపీట్ కాదు!

చైతన్యరధం
@ March 8, 2026
భారత్.. అవకాశాల గని
ఆంధ్రప్రదేశ్

భారత్.. అవకాశాల గని

చైతన్యరధం
@ March 8, 2026
Load More

ముఖ్య వార్తలు

సాధికారత నుంచి పారిశ్రామికవేత్తల వరకూ..

సాధికారత నుంచి పారిశ్రామికవేత్తల వరకూ..

చైతన్యరధం
@ March 9, 2026
స్వయం కు నేనే బ్రాండ్!

స్వయం కు నేనే బ్రాండ్!

చైతన్యరధం
@ March 9, 2026
మీ చైతన్యం భేష్!

మీ చైతన్యం భేష్!

చైతన్యరధం
@ March 9, 2026
భారత్.. అవకాశాల గని

భారత్.. అవకాశాల గని

చైతన్యరధం
@ March 8, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

మన ఎదుగుదలే ముఖ్యమంత్రి సంకల్పం

మన ఎదుగుదలే ముఖ్యమంత్రి సంకల్పం

చైతన్యరధం
@ March 9, 2026
సాధికారతే లక్ష్యంగా సెర్ఫ్, మెప్మా ఒప్పందాలు

సాధికారతే లక్ష్యంగా సెర్ఫ్, మెప్మా ఒప్పందాలు

చైతన్యరధం
@ March 9, 2026
స్వయం కు నేనే బ్రాండ్!

స్వయం కు నేనే బ్రాండ్!

చైతన్యరధం
@ March 9, 2026
మీ చైతన్యం భేష్!

మీ చైతన్యం భేష్!

చైతన్యరధం
@ March 9, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist