- ఒకేసారి 4 రాఫ్ట్‌లలో కాంక్రీట్ పనులు ప్రారంభం
- హైకోర్టు భవన ఫౌండేషన్ పనుల ప్రారంభం
- పాల్గొన్న పురపాలక మంత్రి పొంగూరు నారాయణ
అమరావతి(చైతన్యరథం): రాజధాని అమరావతి నిర్మాణ పను ల్లో భాగంగా హైకోర్టు భవన నిర్మాణ పనులు శరవేగంగా పుంజు కున్నాయి. శుక్రవారం హైకోర్టు నిర్మాణ ప్రాంగణంలో ఒకేసారి 4 రాఫ్ట్‌లలో కాంక్రీట్ పనులను మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అమరావతి డెవల ప్‌మెంట్ కార్పొరేషన్ (ఏజీఐసీఎల్) ఎండీ శ్రీనివాస్, ఇతర ఉన్న తాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ ఏకధాటిగా 15,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ స్లాబ్ (రాఫ్ట్) పనులను నేడు చేపట్టాం. మొత్తం నిర్మాణంలో 65,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వినియోగిస్తుండగా.. ఇప్పటికే 15,000 క్యూబిక్ మీటర్లు పూర్తయింది. నేటితో మరో 15,000 క్యూబిక్ మీటర్ల పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ఈ హైకో ర్టు భవనాన్ని దీంGం8 (బేస్‌మెంట్ ం గ్రౌండ్ ం 8 అంతస్తులు) విధానంలో 50.4 మీటర్ల ఎత్తుతో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మి స్తున్నామని వివరించారు.
మొత్తం 21 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఈ భవనంలో 52 కోర్టు హాళ్లు అందుబా టులోకి రానున్నాయి. నిర్మాణంలో అత్యంత కీలకమైన ‘రాఫ్ట్ ఫౌండేషన’ పనులు పూర్తయితే మిగిలిన భవన నిర్మాణం చాలా వేగంగా కొలిక్కి వస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. రాజధానిలో కేవలం కార్యాలయాలే కాకుండా.. పాలన సాగించే యంత్రాంగం కోసం నివాసాల నిర్మాణాన్ని కూడా ప్రభుత్వం ప్రాధాన్యతగా తీసుకుందని మంత్రి వివరించారు. అమరావతిలో అధికారులు, ఉద్యోగుల కోసం మొత్తం 4,026 ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. వీటిలో 3,500 ఇళ్లను ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి పూర్తి చేసి అప్పగిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా ఐఏఎస్ అధికారుల నివాస భవనాలు ఇప్పటికే దాదాపుగా పూర్తి కావచ్చాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యవేక్షణ లో అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో, నాణ్యతతో కూడిన పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తామని పునరుద్ఘాటించారు.
















