- కేంద్ర నిధులతో నియోజకవర్గాలపై దృష్టి పెట్టండి
- బడ్జెట్ వేళ ఏపీ ప్రాజెక్టులకు నిధులు రాబట్టేలా చూడాలి
- ఏపీ ప్రగతిపథానికి నల్లమలసాగర్, పూర్వోదయ ముఖ్యం
- పొరుగు రాష్ట్రాలతో వివాదాలు అవసరం లేదు..
- ప్రస్తావనకు వస్తే గట్టిగా వాదనలు వినిపించాలి
- ఈ సెషన్లోనే అమరావతి రాజధానిగా రాజముద్ర
- ఫిబ్రవరిలో కలెక్టర్ల సదస్సులో వర్చువల్గా పాల్గొనాలి
- టీడీపీపీ సమావేశంలో ఎంపీలకు సీఎం చంద్రబాబు నిర్దేశం
అమరావతి(చైతన్యరథం): రాష్ట్రాభివృద్ధిలో ఎంపీల భాగస్వా మ్యం కీలకంగా ఉండాలని, మన రాష్ట్రానికి ఇంకేం సాధించవచ్చ నే దానిపై ఆలోచించి నిధులను రాబట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టీడీపీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. తమ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అభివృద్ధికి అవకాశాలు, సమస్యల పరిష్కారాలపై దృష్టి పెట్టాలని సూచించారు. ఆదివారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన టీడీపీపీ సమావేశం జరిగింది. జనవరి 28 నుంచి ఏప్రిల్ 2 వరకు జరిగే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రస్తావించాల్సిన అంశాలు… కేంద్రంతో జరపాల్సిన సంప్రదింపులు వంటి అంశాలపై ఎంపీల కు దిశా నిర్దేశం చేశారు.! ఈ సమావేశానికి టీడీపీ లోక్సభ, రాజ్యసభఎంపీలు, మంత్రి లోకేష్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు హాజరయ్యారు. కేంద్రంలోని వివిధ మంత్రిత్వ శాఖలతో సంప్రదింపులు జరపడానికి ఎంపీలకు కొన్ని శాఖలను అప్ప జెప్పామని.. ఆయా శాఖలకు సంబంధించి ఏపీలో జరుగుతున్న కార్యక్రమాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలని సూచిం చారు. ఈ మేరకు మంత్రులు, సెక్రటరీలతో మాట్లాడాలని తెలిపారు.
కేంద్రంతో సంప్రదింపులు జరపాల్సిన సమయాల్లో ఆయా శాఖలకు సంబంధించి కేంద్రంలో ఉన్న ప్రతినిధులతో మాట్లాడి.. రాష్ట్రానికి మేలు జరిగేలా పనులను, నిధులను సాధించాల్సిన బాధ్యతను ఎంపీలు తీసుకోవాలని చెప్పారు. రాష్ట్ర అంశాలపై అవ గాహన పెంచుకునేందుకు ఫిబ్రవరిలో జరిగే కలెక్టర్ల సదస్సులో ఎంపీలు అందరూ వర్చువల్గా పాల్గొనాలని స్పష్టం చేశారు. వెనకబడిన ఉత్తరాంధ్ర-రాయలసీమ ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజ్, పూర్వోదయ పథకం, పోలవరం నల్లమల సాగర్… ఈ మూడిం దీని ప్రాధాన్యతాంశాలుగా తీసుకోవాలన్నారు. అలాగే ఏపీ రాజ ధానిగా అమరావతికి చట్టబద్దత కల్పిస్తూ ఈ సెషన్లోనే బిల్లు పెట్టనున్నారని.. దీనిపై కేంద్రంలోని సంబంధిత మంత్రి, అధికాయలతో టచ్లో ఉండాలని సీఎం సూచించారు. వీటితో పాటు.. ఎన్డీఏ ప్రభుత్వం ఏపీలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేప డుతోందనే అంశాలను పార్లమెంటులో వివిధ సందర్భాల్లో ప్రస్తా వించాలని సూచించారు. సభలో టీడీపీకి చెందిన ఎంపీలందరూ మాట్లాడాలని, సమస్యలు ఉత్పన్నమైనా పట్టు వదలకుండా ప్రయ త్నించాలని ముఖ్యమంత్రి సూచించారు.
వివాదాలు వద్దు… నీళ్లు కావాలి
కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెడుతున్న క్రమంలో ఏపీ ప్రాజెక్టులకు నిధులు కేటాయించేలా చూడాలని ఎంపీలకు సీఎం సూచించారు. పోలవరం ప్రాజెక్టుకు తాజా అంచనాలు ఇచ్చామని సీఎం సమా వేశంలో ప్రస్తావించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో పాటు… ఆర్ అండ్ ఆర్ పూర్తి చేయాలని… దీనికి సంబంధించి రూ.12,000 కోట్లు ఇంకా కేంద్రం నుంచి రావాలని చెప్పారు. 2027 జూన్లో జరిగే గోదావరి పుష్కరాల లోపు పోలవరం నిర్మాణం పూర్తి చేయగలిగితే బాగుంటుంది. రాష్ట్రంలో నిర్మించ తలపెట్టిన జలవనరుల ప్రాజెక్టులపై పొరుగు రాష్ట్రాలతో వివాదా లు అవసరం లేదని తెలిపారు. నల్లమల సాగర్ వంటి అంశాలు పార్లమెంటులో ప్రత్యక్షంగానైనా.. పరోక్షంగానైనా ప్రస్తావనకు వస్తే ఏపీ వాదనలు గట్టిగా వినిపించాలని సూచించారు.. తెలంగాణ కాళేశ్వరం నిర్మించి… మంజీరాకు నీళ్లను తరలించినా ఏపీ అభ్యంతరం చెప్పలేదన్న విషయాన్ని కేంద్రానికి అర్థమయ్యేలా చెప్పాలన్నారు. ఇదే సందర్భంలో నల్లమల సాగర్ ప్రాజెక్టుకు అను మతుల విషయంలో తెలంగాణ అభ్యంతరం చెప్పడం కరెక్ట్ కాదనే అంశాన్ని వివరించాలని ఎంపీలకు స్పష్టం చేశారు. ఇక అమరా వతి నిర్మాణ పనులు వేగవంతం అయ్యాయని, రెండో దశ అమ రావతి కూడా ప్రారంభం కానుందని వెల్లడించారు.
ఎక్కువ నిధులు రాబట్టడమే లక్ష్యం
పూర్వోదయ ప్రాజెక్టు కింద రూ.40 వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టేలా ప్రణాళికలు రూపొందించామని సీఎం చంద్రబా బు ఎంపీలకు వివరించారు. ఇచ్చాపురం నుంచి తడ వరకు నాలుగు లేన్ల రైల్వేట్రాక్ వేసేలా చూడాలని చెప్పారు. ముఖ్యంగా రైల్వే శాఖలో ఎక్కువగా నిధులు ఉంటాయని.. వాటిని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు. ఫ్లైఓవర్లు, రోడ్ ఓవర్ బ్రిడ్జిలను రైల్వే శాఖ పెద్దఎత్తున చేపట్టేందుకు సిద్ధంగా ఉందని… పార్లమెంట్ నియోజకవర్గాల్లో అలాంటివి ఏమైనా ఉంటే ఆ పనులను గుర్తించి నిధులను తెచ్చుకుని పనులు చేపట్టా లని సూచించారు. వైద్య రంగంలో ప్రస్తుతం రెండో స్థానంలో ఏపీ ఉందని… పీపీపీ పద్ధతుల్లో ఆస్పత్రుల నిర్మాణం చేపట్టేం దుకు, వీజీఎఫ్ కూడా ఇచ్చేందుకు కేంద్రం సుముఖంగా ఉందని చెప్పారు. దీన్ని ప్రతి ఎంపీ దృష్టిలో పెట్టుకుని దానికి అనుగు ణంగా వ్యవహరించాలని కోరారు. సభలో కానీ… క్షేత్రస్థాయిలో కానీ కూటమి లక్ష్యాలకు విఘాతం కలిగించేలా ఎట్టి పరిస్థి తుల్లోనూ వ్యవహరించవద్దని సీఎం ఆదేశించారు.
జాతీయ అంశాలపైనా మాట్లాడండి
విభజన సమస్యలు, జాతీయ రహదారుల విస్తరణ, సాగర మాల ప్రాజెక్టుల్లో చేపడుతున్న పనుల పురోగతిని తెలుసుకోవా లని సూచించారు. కేంద్రం నుంచి ఏ మేరకు నిధులు రాబట్టవచ్చో చూడాలని పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి అంశాలే కాకుండా జాతీయ స్థాయిలో ఎన్డీఏ చేపడుతున్న వివిధ కార్యక్రమాలపై అవగాహన పెంచుకోవడంతో పాటు…ప్రతిపక్షాలు బీజేపీపై విమర్శలు చేస్తున్న సమయంలో ధీటుగా సమాధానం చెప్పేందుకు చొరవ చూపాలని సూచించారు. మరోవైపు ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుని ప్రజా సమస్యల పరిష్కారానికి ఎంపీలు కృషి చేయాలని మంత్రి లోకేష్ సూచించారు. ఎంపీలు కూడా పార్టీ కార్యాలయానికి తరచూ వస్తుండాలని చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్ర ప్రదేశ్లో జరుగుతున్న పారిశ్రామిక అభివృద్ధిపై చర్చ జరుగు తోందని వెల్లడించారు. దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో ఈ విషయం స్పష్టంగా కనిపించిందని చెప్పారు. దావోస్లో తాను వివిధ సెషన్లలో జాతీయ, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు, ప్రముఖులతో సమావేశమయ్యాయని… వారంతా ఇండియా సరైన మార్గంలో వెళుతోందని చెప్పడంతో పాటు ఏపీ అభివృద్ధి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారని లోకేష్ వివరించారు.















