- అధికారంలో ఉన్న ఐదేళ్లు దమనకాండ
- నేడు కల్లబొల్లి మాటలతో కపట ప్రేమ
- దళిత పారిశ్రామికవేత్తలకు నాడు జగన్ ఇచ్చిందెంత.. నేడు చంద్రబాబు ఎంత ఇచ్చారు
- ఎవరి హయాంలో దళితులకు మేలు జరిగిందో చర్చిద్దాం రండి
- టీడీపీ పొలిట్యూరో సభ్యుడు వర్ల రామయ్య
అమరావతి (చైతన్యరథం దళితుల పట్ల మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కపట ప్రేమ చూపిస్తున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, పొలిట్బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో శు క్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వర్ల రామయ్య మట్లాడుతూ దళిత పారిశ్రామికవేత్తల గురించి గురువారం నాటి ప్రెస్ మీట్లో జగన్రెడ్డి మాట్లాడిన మాటలన్నీ అబద్ధాలేనని కొట్టిపారేశారు. జగన్ తన హయాంలో దళితుల కోసం చాలా చేశానని చెప్పుకోవడం హాస్యాస్పదమని, రికార్డులు వేరేలా ఉన్నాయని వివరించారు. జగన్ పాలన 5 ఏళ్లలో దళిత పారిశ్రామికవేత్తలకు ఇచ్చింది. కేవలం రూ.413.80 కోట్లు (అంటే సంవత్సరానికి సరాసరి రూ.80 కోట్లు మాత్రమే). కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన ఈ ఏడాదిన్నర కాలంలోనే రూ.267.69 కోట్లు విడుదల చేశారు. (అంటే సంవత్సరానికి సరాసరి రూ.178 కోట్లు), ఏడాదికి రూ. 80 కోట్లు ఇచ్చిన మీరు గొప్పా.. లేదా రూ.178 కోట్లు ఇస్తున్న చంద్రబాబు గొప్పా అని వర్ల ప్రశ్నించారు.
ఐదేళ్లలో అంతులేని అకృత్యాలు
గత ప్రభుత్వ హయాంలో దళితులపై జరిగిన అకృత్యాలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. కరోనా సమయంలో మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్ను వేధించి, ప్రాణం పోయేలా చేశారు. ఇసుక లారీల అక్రమాలను ప్రశ్నించినందుకు వరప్రసాద్ అనే యువకుడికి పోలీస్ స్టేషన్లో బోడిగుండు కొట్టించా రు. కిరణ్, ఓం ప్రతాప్ అనే దళిత యువకులు… పోలీసుల దెబ్బలకు, అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోతే జగన్ ఎందుకు సమీక్ష చేయలేదు? జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో దళిత మహిళపై అఘాయిత్యం జరిగితే కనీసం పరామర్శించ లేదని విమర్శించారు. చంద్రబాబు దళితుల అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టిన 27 ఎస్సీ, ఎస్టీ పథకాలను జగన్ ప్రభుత్వం రద్దు చేసిందని ధ్వజమెత్తారు. విదేశీ విద్య (రూ.15 లక్షల సాయం) పథకాన్ని ఆపేసి దళిత బిడ్డల భవిష్యత్తును దెబ్బతీశారన్నారు. ఎస్సీ సబ్ ప్లాన్కు చెందిన రూ.29,000 కోట్ల నిధులను వేరే పథకాలకు మళ్లించి దళితులకు అన్యాయం చేశారని ఆరోపించారు, దళితులను కేవలం ఓటు బ్యాంకుగా చూడ కుండా, వారిని యజమానులుగా మార్చేందుకు చంద్రబాబు గతంలో ఇన్నోవా కార్లు ఇచ్చారని గుర్తు చేశారు. వైసీపీ నేత జూపూడి ప్రభాకర్ను ఉద్దేశించి మాట్లాడుతూ… మీరు ఇప్పుడు జగన్ పక్కనే తిరుగుతున్నారు కదా.. ఒక్కసారి గతాన్ని గుర్తు చేసుకోండి.. గతంలో చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్నప్పుడు దళితులకు ఇన్నోవా కార్లు ఇచ్చి వారిని ఓనర్లను చేశారు. అప్పుడు ఆ కార్పొరేషన్ చైర్మన్ ఉన్నది మీరు కాదా అని వర్ల ప్రశ్నించారు. ఆనాడు చంద్రబాబు దళిత రైతుల కోసం వేలాది ఎకరాల భూమిని కొని పంపిణీ చేసిన మాట వాస్తవం కాదా? మీకు దమ్ముంటే, జగన్ పక్కన నిలబడి ‘చంద్రబాబు దళితులకు మేలు చేశారు’ అని నిజం చెప్పగలరా? అంటూ సవాల్ విసిరారు. జగన్ కానీ, ఆయన తండ్రి వైఎస్సార్ కానీ దళితులను కేవలం ‘ఓటు బ్యాంకు’ లాగే చూశారు తప్ప, వారిని ఆర్థికంగా ఎదగనివ్వలేదు. కేవలం ఎన్నికలప్పుడు ప్రేమ చూపించి, ఆ తర్వాత వారిని పట్టించుకోలేదని వర్ల రామయ్య విమర్శించారు.
చంద్రబాబు కృషితో దళితుల జీవితాల్లో వెలుగు
రాష్ట్రంలో దళితులు ఎదుర్కొంటున్న అంటరానితనం, వివక్ష వంటి సామాజిక సమస్యలను కూకటివేళ్లతో సహా పెకిలించి వేయాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. అందుకే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ‘జస్టిస్ పున్నయ్య కమిషన్’ వేశారు. పున్నయ్య కమిషన్ ఊరూరా తిరిగి, దళితులు పడుతున్న ఇబ్బందులను అధ్యయనం చేసి ప్రభుత్వానికి 42 కీలకమైన సూచనలు ఇచ్చింది. చంద్రబాబు ఆ సూచనలను కేవలం కాగితాలకే పరిమితం చేయలేదు. తన క్యాబినెట్ మీటింగ్లో ఆ 42 సూచనలను ఏకగ్రీవంగా ఆమోదించి, దళితుల సంక్షేమం కోసం విప్లవాత్మక మార్పులు తెచ్చారు. ఈ రోజు మనం చూస్తున్న ఎస్సీ, ఎస్టీ కమిషన్ కోవిడ్ ఏర్పడిందన్నా, వారికి ప్రత్యేక రక్షణ దొరుకుతుందన్నా అది ఆనాటి చంద్రబాబు కృషి ఫలితమే, దళితుల జీవితాల్లో వెలుగులు నింపేలా చట్టాలను, పథకాలను రూపొందించిన ఘనత కేవలం తెలుగుదేశం పార్టీకి,చంద్రబాబు నాయుడుకే దక్కుతుంది. మహమ్మారి సమయంలో పనులు లేక దళిత వర్గాలు ఆకలితో అలమటిస్తుంటే, కనీసం రెండు సంవత్సరాల పాటు కరెంట్ బిల్లులు మినహాయించాలని తాము కోరామని గుర్తు చేశారు. కానీ జగన్ ప్రభుత్వం దానికి ససేమిరా అంటూ నిరాకరించిందని, ఆనాడు కనికరం కాదు. చూపని వ్యక్తి ఈరోజు దళితుల కోసం మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. జగన్ ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడ దళితుల వైపు కన్నెత్తి కూడా చూడలేదు.
ఇప్పుడు అధికారం పోయి, కుర్చీ చేజారిపోయేసరికి ఆయనకు మళ్ళీ దళితులు గుర్తొస్తున్నారు. మీ ప్రేమ అంతా కేవలం అధికారం
కోసమే తప్పు దళితుల మీద పారిశ్రామికవేత్తలను, దళిత సంఘాలను రెచ్చగొట్టి ప్రభుత్వం మీదకు ఉసిగొల్పాలని చూస్తున్నారు. దళితులను కేవలం మీ రాజకీయ అవసరాల కోసం అడ్డం పెట్టుకోవడం మీకు అలవాటే. ఆందోళనలు చేయండి, ఉద్యమాలు చేయండి అని మీరు చెబుతుంటే.. అది దళితుల మీద ప్రేమతో కాదు. కూటమి ప్రభుత్వంపై ఉన్న కక్షతోనే అని అందరికీ అర్ధమవుతోంది. మీ ఐదేళ్ల పాలనలో దళితులకు మీరు చేసింది ఎంత? మా కూటమి ప్రభుత్వం ఈ కొద్ది. కాలంలోనే చేసింది ఎంత? ఎక్కడికి రమ్మన్నా మేము
సిద్ధం. మీరు ఇచ్చిన ఆ అరకొర నిధులు, మేము ఇస్తున్న భారీ ప్రోత్సాహకాలపై రికార్డులతో సహా చర్చిద్దామని వర్ల రామయ్య సవాల్ విసిరారు. జగన్ మోహన్ రెడ్డి కపట ప్రేమను, ఆయన వేసే మాయ వలలను దళిత వర్గాలు గుర్తించాలి. ఆయన మాటలు నమ్మి రాజకీయ క్రీడలో పావులుగా మారొద్దు. మన సంక్షేమం కోరే చంద్రబాబు ప్రభుత్వానికి అండగా ఉందామని వర్ల రామయ్య విజ్ఞప్తి చేశారు.














