- జాయింట్ రీసెర్చి, కరిక్యులమ్ డెవలప్మెంట్పై సహకరించండి
- కేంబ్రిడ్జి యూనివర్సిటీ వీసీ డెబ్బీ ప్రెంటిస్ కు మంత్రి లోకేష్ వినతి
దావోస్/స్విట్జర్లాండ్ (చైతన్యరథం): ప్రపంచ ప్రఖ్యాతి చెందిన యూని వర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జి వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ డెబ్బీ ప్రెంటిస్తో రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ దావోస్లో భేటీ అయ్యారు. ఈ సంద ర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లలో 8-10 తరగతుల విద్యార్థు లకు కెపాసిటీ బిల్డింగ్లో భాగంగా వాతావరణ మార్పులపై అవగాహన, సుస్థిరత, భవిష్యత్ నైపుణ్యాలపై కేంబ్రిడ్జి సర్టిఫైడ్ ఆన్లైన్ కోర్సులను ప్రారంభించాలని కోరారు. ఏపీలోని యూనివర్సిటీలతో కలిసి జాయింట్ రీసెర్చి, కరిక్యులమ్ డెవలప్మెంట్, ఫ్యాకల్టీ ఎక్స్చేంజీలపై నిర్మాణాత్మక ఒప్పందానికి చొరవ చూపండి. సౌతాంప్టన్ – కేంబ్రిడ్జి మోడల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యాసంస్థల్లో ప్రతిభావంతులైన విద్యార్థులకు డెడికేటెడ్ స్కాలర్ షిప్లు, ఫాస్ట్ ట్రాక్ అడ్మిషన్ల ద్వారా ప్రోత్సాహం కల్పిం చండి. ఏఐ, డేటా సైన్స్ ఇంజనీరింగ్ వంటి అధునాతన సాంకేతికతలపై జాయింట్ రీసెర్చ్ ప్రోగ్రామ్ల కోసం ఆంధ్రా యూనివర్సిటీ, ఐఐటీ-తిరుపతి వంటి సంస్థలతో కేంబ్రిడ్జి వర్సిటీ కలిసి పనిచేసే అంశాన్ని పరిశీలించండి. భారత్లో కేంబ్రిడ్జి విద్యాసంస్కరణలకు అనుగుణంగా ఏపీ విశ్వవిద్యాలయాల కోసం ఫ్యాకల్టీ డెవలప్మెంట్, అధునాతన బోధనా పద్ధతులపై ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించాల్సిందిగా మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. దీనిపై కేంబ్రిడ్జి వైస్ ఛాన్సలర్ డెబ్బీ ప్రెంటిస్ స్పందిస్తూ… భారత్ లో సీఐఆర్ఎఫ్ ద్వారా తాము క్లైమెట్ ఎడ్యుకేషన్, బోధనా పద్ధతులు, డిజిటల్ స్కిల్స్, లాంగ్వేజ్ ప్రోగ్రామ్స్ పై దృష్టిసారించి నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని తెలిపారు.
















