- మంత్రి పయ్యావుల కేశవ్ ఉద్ఘాటన
- శిక్షణలో భాగంగా క్యాడర్ తో ఉత్సాహంగా ‘కాఫీ కబుర్లు’
అమరావతి (చైతన్యరథం): తెలుగు దేశంపార్టీకి కార్యకర్తలే మూల స్తంభాలని రాష్ట్ర ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. మంగళగిరిలోని తెలుగు దేశం పార్టీ కేంద్ర కార్యాలయం వేదికగా పార్టీ క్యాడర్కు నిర్వహిస్తున్న శిక్షణా తరగతుల్లో భాగంగా గురువారం క్యాడర్తో నేరుగా ముచ్చటిం చేందుకు ‘కాఫీ కబుర్లు’ పేరుతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పా టు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్, ప్రభుత్వ విప్ వేపాడ చిరంజీవిరావు, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, మాజీ ఎమ్మెల్సీ పీ అశోక్ బాబు, తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్యాడర్తో మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ తెలుగు దేశం పార్టీతో తనకున్న దశాబ్దాల అను బంధాన్ని, తన రాజకీయ ప్రస్థానం లోని కీలక అనుభవాలను పంచుకున్నారు. క్రమ శిక్షణతో కూడిన శిక్షణా తరగతులు కార్యకర్తల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించడమే కాకుండా, రాజకీయంగా వారికి ఎంతో ప్రయోజనం చేకూరుస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. సంస్థా గతంగా తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే వెన్నెముక అని, వారి నిస్వార్థ సేవలే పార్టీని ఇన్నేళ్లుగా పటిష్టంగా ఉంచాయని ఆయన కొనియాడారు.
టీడీపీ క్యాడర్ను పార్టీకి కొండంత బలంగా అభివర్ణించిన మంత్రి, కార్యకర్తలే పార్టీకి వెలకట్టలేని సంపద అని పేర్కొన్నారు. కార్యకర్తలకు అత్యంత గౌరవం, సరైన గుర్తింపు ఇచ్చే సంస్కృతి కేవలం తెలుగుదేశం పార్టీలోనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. అధికారంలో ఉన్నా, లేకపోయినా ప్రజల పక్షాన నిలబడి పోరాడే కార్యకర్తలకు పార్టీ ఎల్లప్పు డూ అండగా ఉంటుందని భరోసాఇచ్చారు. రానున్న రోజుల్లో క్షేత్ర స్థాయిలో మరింత చైతన్య వంతంగా కృషి చేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజ ల్లోకి తీసుకెళ్తూ పార్టీని గ్రామస్థాయి నుండి మరింత బలోపేతం చేయాలని చెప్పారు. ఈ భేటీలో నేతలు, కార్యకర్తలు పలు రాజకీయ అంశాలపై చర్చించుక ోవడంతో పాటు, పార్టీ మరింత బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు.















