చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

ఇక ‘మత్స్యకారుల సేవలో’..

మరో ఎన్నికల హామీని నెరవేర్చిన కూటమి సర్కారు

by చైతన్యరధం
April 26, 2025
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
ఇక ‘మత్స్యకారుల సేవలో’..
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ఇక ‘మత్స్యకారుల సేవలో’..
  • శ్రీకాకుళం జిల్లాలో కొత్త పథకానికి శ్రీకారం
  • సీఎం చంద్రబాబు చేతులమీదుగా ప్రారంభం
  • వేట విరామ సమయంలో మత్స్యకారులకు ఆర్ధిక సాయం
  • ఒక్కో మత్స్యకార కుటుంబానికి రూ.20,000 అందజేత
  • 1,29,178 కుటుంబాలకు రూ.258 కోట్ల లబ్ది
  • మరో ఎన్నికల హామీని నెరవేర్చిన కూటమి సర్కారు

అమరావతి (చైతన్య రథం) రాష్ట్రంలో సంక్షేమ పాలన సూపర్‌ స్పీడ్‌లో దూసుకుపోతోంది. కూటమి ప్రభుత్వం వచ్చిన 10 నెలల్లోనే ఎన్నికల హామీలు ఒకొక్కటి నెరవేరుస్తూ ఇది మంచి ప్రభుత్వం అనిపించుకుంటోంది. పింఛన్ల పెంపునుంచి అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభించడం వరకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది. ఇప్పుడు కొత్తగా మరో పథకానికి శ్రీకారం చుడుతోంది. మత్స్యకారులను ఆర్ధికంగా ఆదుకునేలా ‘మత్స్యకారుల సేవలో…’ పేరిట సాయం అందించనుంది. ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌ 14 వరకు 61 రోజులపాటు సముద్రంలో వేట నిషేధ సమయంలో మత్స్యకారులు ఇబ్బందులు పడకూడదని ఒక్కో మత్స్యకార కుటుంబానికి రూ.20,000 ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రేపు శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం బుడగట్లపాలెం గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ‘మత్స్యకారుల సేవలో…’ పథకాన్ని ప్రారంభించనున్నారు. దీంతో 12 తీర ప్రాంత జిల్లాల్లో సముద్ర వేటపై జీవిస్తున్న 1,29,178 కుటుంబాలకు ఆర్ధికంగా రూ.258 కోట్ల ప్రయోజనం చేకూరుతోంది. కూటమి ప్రభుత్వం మత్స్యకారులకు, ఆక్వా రంగానికి ఎప్పుడూ అండగా ఉంటుందన్న నమ్మకాన్ని ఈ పథకాన్ని తిరిగి ప్రవేశ పెట్టడం ద్వారా నిజం చేసింది.

ఇచ్చిన మాట నిలబెట్టుకుంది
వేట విరామ సమయంలో గత ప్రభుత్వం ఒక్కో మత్స్యకార కుటుంబానికి రూ.10,000 మాత్రమే ఇచ్చింది. ఎన్నికల ఏడాదిలో అది కూడా ఇవ్వలేదు. 2 నెలలపాటు సముద్రంలో వేటకు వెళ్లకుండా, విరామం ఇవ్వడంతో మత్స్యకార కుటుంబాలకు ఆర్ధికంగా ఇబ్బందికరమైన పరిస్థితి తలెత్తింది. దీనిని అర్థం చేసుకుని ఎన్నికలకు ముందే మత్స్యకారులకు ఆర్ధిక సాయాన్ని రూ.10,000 నుంచి రూ.20,000కు పెంచుతామని ఎన్డీఏ కూటమి మ్యానిఫెస్టోలో చెప్పింది. నాడు మాట ఇచ్చినట్టుగానే… నేడు దానిని నెరవేర్చింది.

మత్స్యకారులకు ఆర్ధిక సాయం ప్రవేశ పెట్టింది చంద్రబాబే
రాష్ట్ర విభజన అనంతరం 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ ప్రభుత్వం వేట నిషేధ సమయంలో మత్స్యకార కుటుంబాలకు తొలిసారిగా భృతిని ప్రవేశ పెట్టింది. 2014-2019 మధ్య మత్స్యకారుల సంక్షేమం కోసం రూ.788 కోట్లు ఖర్చు పెట్టింది. అంతేకాకుండా వలలు, పడవలు, ఐస్‌ బాక్సులు అదనంగా ఇచ్చింది. మత్స్యకారుల పిల్లలకు ప్రత్యేకంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 6 రెసిడెన్షియల్‌ పాఠశాలు ఏర్పాటు చేసింది.
10 నెలల పాలనలో మరింత సాయం
2024లో మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఆక్వారంగం అభివృద్ధికి, మత్స్యకారుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ వచ్చింది. స్వర్ణాంధ్ర-2047 విజన్‌ లక్ష్యాన్ని చేరుకునేందుకు ఆక్వా రంగాన్ని గ్రోత్‌ ఇంజిన్‌గా ఎంచుకుంది. రాష్ట్రంలో 68,396 మంది మత్స్యకారులకు నెలనెలా పింఛన్లు ఇస్తోంది. 18నుంచి 60 ఏళ్లలోపు వయసున్న మత్స్యకారులు… చేపల వేట సమయంలో మరణిస్తే రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియో చెల్లిస్తోంది. ఇప్పటికే గతేడాది చనిపోయిన 63 మంది మత్స్యకారుల కుటుంబాలకు సాయం అందించింది. మరో 80 కుటుంబాలకు త్వరలోనే సాయం చేయనుంది. ఈ ఏడాది ఇందుకోసం రూ.8 కోట్లు కేటాయించింది.

డీజిల్‌పై రూ.9 సబ్సిడీ
వేటకు వెళ్లే బోట్లకు లీటర్‌ డీజిల్‌పై రూ.9 సబ్సిడీ ఇస్తోంది. మెకనైజ్డ్‌ బోట్లకు నెలకు 3,000 లీటర్లు, మోటరైజ్డ్‌ బోట్లకు నెలకు 300 లీటర్ల వరకు డీజిల్‌పై సబ్సిడీ అందిస్తోంది. ఈ ఏడాది అర్హత ఉన్న 23,062 బోట్లకు డీజిల్‌ సబ్సిడీ కోసం రూ.50 కోట్లు కేటాయించింది. మెకనైజ్డ్‌ బోట్లపై వేటకు వెళ్తున్న మత్స్య సోదరుల రక్షణ కోసం 3 నెలల్లో 4,484 బోట్లలో టూ వే కమ్యూనికేషన్‌ వ్యవస్థ తీసుకురానుంది. సాగర్‌మాల పథకం కింద రూ.97 కోట్లతో పులికాట్‌ సరస్సు దగ్గర చేపట్టే ప్రాజెక్టుతో ఆ ప్రాంతంలోని 20 వేల మత్య్సకార కుటుంబాలకు లబ్ది చేకూరనుంది.

కొత్తగా 9 ఫిషింగ్‌ హార్బర్లు.. 7 ఫిష్‌ ల్యాండిరగ్‌ సెంటర్లు..
రూ.1,961 కోట్లతో కొత్తగా 9 ఫిషింగ్‌ హార్బర్లను రెండు దశల్లో రాష్ట్రంలో నిర్మిస్తోంది. అలాగే, వీటికి అదనంగా రూ.199 కోట్లతో 7 ఫిష్‌ ల్యాండిరగ్‌ సెంటర్లు కూడా సిద్ధం చేస్తోంది. మత్స్యకార కుటుంబాలకు ఉపకరించేలా బాపట్ల జిల్లా నిజాంపట్నంలో ఆక్వా పార్క్‌ను రూ.88 కోట్లతో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఆక్వాకల్చర్‌కు యూనిట్‌ విద్యుత్‌కు రూ.1.50కే సరఫరా చేస్తోంది. 68,134 సర్వీస్‌ కనెక్షన్లకు రూ.1,187 కోట్లు ఖర్చు చేస్తోంది. ఇలా ఎన్నో కార్యక్రమాలు మత్స్యకారుల సంక్షేమం కోసం చేపడుతోంది.

10 నెలల్లో ఎన్నో మంచి కార్యక్రమాలు
పింఛన్ల మొత్తాన్ని రూ.3,000 నుంచి రూ.4,000కు పెంచడమే కాకుండా… దేశంలో అత్యధిక మందికి పింఛన్లు ఇస్తున్న రాష్ట్రంగా ఏపీ ఘనత సాధించింది. ప్రతీ నెలా 64 లక్షల మందికి పైగా పెన్షన్లు ఇస్తోంది. ఇందుకు నెలకు సుమారు రూ.2,700 కోట్లు ఖర్చు చేస్తోంది. పెన్షన్‌ తీసుకుంటూ భర్త చనిపోతే భార్యకు తక్షణం పెన్షన్‌ ఇవ్వాలని నిర్ణయం. ఇలా దాదాపు 90 వేలమందికి కొత్తగా పెన్షన్లు ఇచ్చేందుకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలైంది.
దీపం-2 కింద కోటికి పైగా మహిళలకు ఉచిత గ్యాస్‌ సిలిండర్ల సరఫరా.
ఉచిత ఇసుక సరఫరా వల్ల పేదలకు లబ్ది.., నిర్మాణ రంగానికి ఊతం…
ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతుల ఖాతాలో నగదు జమ.
16,347 ఉపాధ్యాయ నియామకాలకు డిఎస్సీ నోటిఫికేషన్‌ జారీ
డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంపు.
8,427 పాస్టర్లకు నెలకు రూ.5,000 చొప్పున గౌరవవేతనం.
అర్చకుల జీతాలు రూ.10,000 నుంచి రూ. 15,000కు పెంపు.
దూపదీప నైవేద్యం కింద ఆలయాలకు ఆర్ధిక సాయం రూ.5 వేల నుంచి రూ.10వేలకు పెంపు.
ఉపాధి కోసం చూస్తున్న వేద విద్యార్ధులకు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి.
రాష్ట్రంలోని దేవాలయాల్లో పనిచేస్తున్న నాయీ బ్రాహ్మణులకు గౌరవ వేతనాన్ని రూ.20,000 నుంచి రూ.25,000కు పెంపు.
దేవాలయ బోర్డుల్లో బ్రాహ్మణులు, నాయీబ్రాహ్మణులకు చోటు.
నూతన వక్ఫ్‌ బోర్డు ఏర్పాటు. ఇమామ్‌లకు రూ.10 వేలకు, మౌజన్‌లకు రూ.5 వేలకు గౌరవ వేతనాల పెంపు.
రాష్ట్రంలో 200కు పైగా అన్న క్యాంటీన్లు ఏర్పాటు.
చెత్త పన్ను రద్దు – చేనేతలకు జీఎస్టీ ఎత్తివేత.
గీత కార్మికులకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపు.
రూ.25 లక్షలతో ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమా
వాట్సప్‌ ద్వారా 250కి పైగా సేవలు.
ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా, బీసీలకు అదనంగా రూ.20 వేల సబ్సిడీతో సోలార్‌ రూఫ్‌టాప్‌
త్వరలో ఆదరణ-3, తల్లికి వందనం, అన్నదాత పథకాల అమలు.

Previous Post

దేశ భద్రతే లక్ష్యం!

Next Post

మత్స్యకార్లకు బతుకు భరోసా

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 02-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 02-11-2026

November 2, 2026
ప్రజాప్రభుత్వంలో పారదర్శకంగా స్థానిక ఎన్నికలు
ఆంధ్రప్రదేశ్

ప్రజాప్రభుత్వంలో పారదర్శకంగా స్థానిక ఎన్నికలు

November 2, 2026
విద్యార్థుల్లో మానసిక ధైర్యం నింపేందుకు చర్యలు
ఆంధ్రప్రదేశ్

విద్యార్థుల్లో మానసిక ధైర్యం నింపేందుకు చర్యలు

November 2, 2026
బాలికను సొంత కూతురిలా చూసుకుంటా
ఆంధ్రప్రదేశ్

బాలికను సొంత కూతురిలా చూసుకుంటా

November 2, 2026
తుఫాన్ సహాయక చర్యలకు సన్నద్ధం
ఆంధ్రప్రదేశ్

తుఫాన్ సహాయక చర్యలకు సన్నద్ధం

November 2, 2026
బీసీలకు 40% సీట్లు
ఆంధ్రప్రదేశ్

విద్యుత్ పునరుద్ధరణ పనులకు సిబ్బందిని పంపండి

November 2, 2026
Next Post
మత్స్యకార్లకు బతుకు భరోసా

మత్స్యకార్లకు బతుకు భరోసా

ముఖ్య వార్తలు

  • ముఖ్య వార్తలు
బాలికను సొంత కూతురిలా చూసుకుంటా

బాలికను సొంత కూతురిలా చూసుకుంటా

by చైతన్యరధం
November 2, 2026
0

ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది మరో 48 గంటలు కీలకం...సురక్షితంగా రావాలని ప్రార్థిద్దాం విద్యార్థుల రక్షణే మా మొదటి ప్రాధాన్యం దాడులు పునరావృతం కాకుండా...

తుఫాన్ సహాయక చర్యలకు సన్నద్ధం

తుఫాన్ సహాయక చర్యలకు సన్నద్ధం

by చైతన్యరధం
November 2, 2026
0

యంత్రాంగానికి సీఎం చంద్రబాబు ఆదేశం ఉన్నతాధికారులతో ముందస్తు కార్యాచరణపై సమీక్ష నేటి ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు వెల్లడి అమరావతి(చైతన్యరథం): రాష్ట్రానికి మరో తుఫాను ముప్పు పొంచి...

తుఫాను బాధితుల కష్టం తెలుసు…ఆదుకుంటాం

by చైతన్యరధం
October 31, 2026
0

సాధారణ స్థితికి తెచ్చేందుకు నిరంతరం శ్రమిస్తున్నాం పంటల బీమాతోనే ప్రతి రైతుకూ ధీమా డెల్టా కాలువల ఆధునికీకరణతో ముంపు తొలగిస్తాం తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు...

నేడు రాష్ట్రానికి కేంద్ర బృందాలు

నేడు రాష్ట్రానికి కేంద్ర బృందాలు

by చైతన్యరధం
October 30, 2026
0

క్షేత్రస్థాయి పరిశీలనతో వాస్తవ నష్టం అంచనా ప్రాథమికంగా రూ.4,600 కోట్ల నష్టం వాటిల్లింది ఆ నివేదికను ఇప్పటికే కేంద్రానికి కూడా పంపాం యంత్రాంగం అప్రమత్తంతో ప్రాణనష్టం తగ్గింది...

మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

by చైతన్యరధం
August 21, 2025
0

స్టార్టప్‌లకు ఊపిరి పోసేలా రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ అమరావతితోపాటు ఐదుచోట్ల ఆర్టీఐహెచ్‌ కేంద్రాలు రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఇన్నోవేషన్‌ బిజినెస్‌...

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

by చైతన్యరధం
October 12, 2026
0

గెలిచే అభ్యర్థులకే టికెట్లు మిత్రపక్షాలతో పక్కా సమన్వయం ఉండాలి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలతో ప్రత్యేక టెలీకాన్ఫరెన్స్ అమరావతి (చైతన్యరథం): స్థానిక సంస్థల...

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

by చైతన్యరధం
October 25, 2026
0

అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

సీట్ల సర్దుబాటుపై ఏకాభిప్రాయం

by చైతన్యరధం
October 15, 2026
0

సీఎం చంద్రబాబుతో కీలక సమావేశం రెండురోజుల్లో కూటమి అభ్యర్థులను ప్రకటిస్తామని జనసేన నాయకుల ప్రకటన అమరావతి(చైతన్యరథం): స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుకు సంబంధించి కూటమి నేతలు...

మరిన్ని

తాజా సంఘటనలు

చైతన్యరధం ఈ పేపర్ 02-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 02-11-2026

by కార్యకర్త
November 2, 2026
0

ప్రజాప్రభుత్వంలో పారదర్శకంగా స్థానిక ఎన్నికలు

ప్రజాప్రభుత్వంలో పారదర్శకంగా స్థానిక ఎన్నికలు

by చైతన్యరధం
November 2, 2026
0

ప్రజాస్వామ్యం గురించి జగన్‌రెడ్డి నీతులు చెబుతున్నారు పులివెందులలో ఉద్దేశపూర్వకంగానే సమస్య సృష్టించారు నాడు ఏకగ్రీవాలు ఎలా చేశారో అందరూ ప్రశ్నించాలి ఎన్నికల కోడ్ ఉండగా ర్యాలీ ఏ...

విద్యార్థుల్లో మానసిక ధైర్యం నింపేందుకు చర్యలు

విద్యార్థుల్లో మానసిక ధైర్యం నింపేందుకు చర్యలు

by చైతన్యరధం
November 2, 2026
0

రాప్తాడు ఘటన నేపథ్యంలో కౌన్సెలింగ్ 20 మందితో ప్రత్యేక బృందం ఏర్పాటు విద్యార్థుల ఇళ్లకు వెళ్లి మానసిక ధైర్యం, భద్రతపై భరోసా కల్పించేలా లోకేష్ చర్యలు అమరావతి(చైతన్యరథం):...

బాలికను సొంత కూతురిలా చూసుకుంటా

బాలికను సొంత కూతురిలా చూసుకుంటా

by చైతన్యరధం
November 2, 2026
0

ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది మరో 48 గంటలు కీలకం...సురక్షితంగా రావాలని ప్రార్థిద్దాం విద్యార్థుల రక్షణే మా మొదటి ప్రాధాన్యం దాడులు పునరావృతం కాకుండా...

మరిన్ని
[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook X-twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.