చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ముఖ్య వార్తలు

జీవనశైలితోనే ఆరోగ్యం

గుంటూరులో కిమ్స్‌ శిఖర ఆస్పత్రి ప్రారంభించిన సీఎం

by చైతన్యరధం
Feb 13, 2025 at 6:00am
in ముఖ్య వార్తలు
జీవనశైలితోనే ఆరోగ్యం
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • జీవనశైలితోనే ఆరోగ్యం
  • ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవాలి
  • ప్రజారోగ్యానికి కూటమి అత్యంత ప్రాధాన్యం
  • ఆరోగ్యాంధ్ర సాధనకు ప్రత్యేక కార్యక్రమాలు
  • త్వరలో.. ప్రజలకు డిజిటల్‌ హెల్త్‌ కార్డులు
  • పేదలకు మెరుగైన వైద్యం కోసమే ‘ఎయిమ్స్‌’
  • వైద్య రంగంలో కిమ్స్‌దీ తిరుగులేని పాత్ర..
  • ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కితాబు
  • గుంటూరులో కిమ్స్‌ శిఖర ఆస్పత్రి ప్రారంభించిన సీఎం

గుంటూరు (చైతన్య రథం): రాష్ట్ర ప్రజల ఆరోగ్యంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించిందని, హెల్తీ, వెల్తీ, హ్యాపీ సమాజ నిర్మాణం నినాదంతో స్వర్ణాంధ్ర సాధన దిశగా అడుగులేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. గత పాలకుల నిర్వాకంతో రాష్ట్రం అన్నిరంగాల్లో వెనకబడిరదని, ముఖ్యంగా వైద్యరంగం కుదేలైందన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచడంతో పాటు పేదలకు మెరుగైన ఉచిత వైద్యం అందించే దిశగా కసరత్తు చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. గుంటూరులో కిమ్స్‌ శిఖర ఆస్పత్రి ప్రారంభోత్సవానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ… మంగళగిరి ఎయిమ్స్‌కు చుక్క నీరివ్వలేని వైసీపీ.. కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని ముఖ్యమంత్రి ఎద్దేవా చేశారు. అభివృద్ధి చూసి ఓర్వలేకపోతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వర్ణాంధ్ర విజన్‌ 2047తో 15శాతం వృద్ధి రేటు లక్ష్యంగా పెట్టుకుని ముందుకెళ్తున్నామని చంద్రబాబు వివరించారు.

వైద్యరంగంలో కిమ్స్‌ది ప్రత్యేక స్థానం
‘2000లో నెల్లూరులో నేను కిమ్స్‌ను ప్రారంభించాను. కిమ్స్‌ వ్యవస్థాపకులు బొల్లినేని భాస్కరరావు ఎదిగిన తీరు స్పూర్తి దాయకం. 25 ఏళ్లలో 5 వేల పడకలకు ఆసుపత్రులను విస్తరించారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళలో కిమ్స్‌ సేవలు అందుతున్నాయి. నెల్లూరు, రాజమండ్రి, విశాఖ, శ్రీకాకుళం, ఒంగోలు, అనంతపురం, కర్నూలులో కిమ్స్‌ ఏర్పాటు చేశారు. అలాగే రూ.25 వేల కోట్ల మార్కెట్‌ షేరు సాధించారు. చెప్పిన మాటలు చేసి చూపిస్తేనే విశ్వసనీయత వస్తుందనడానికి కిమ్స్‌ భాస్కరరావు నిలువెత్తు ఉదాహరణ. నేడు హెల్త్‌ కేర్‌లో దేశంలోనే కిమ్స్‌ మంచి చైన్‌గా తయారైంది. ఆస్పత్రిలో ప్రతి ఒక్కరికీ షేర్‌ ఇచ్చారు. 10 వేలమంది కిమ్స్‌లో పెట్టుబడులు పెట్టారు. సంస్థ బాగుండాలంటే అందులో పనిచేసే వ్యక్తుల భాగస్వామ్యం కూడా అవసరమే. తనతో పనిచేసే సిబ్బందిని కలుపుకుని ముందుకెళ్లబట్టే కిమ్స్‌ ప్రతిష్టాత్మకంగా మారింది. అధునాత సాంకేతికతో కార్డియాక్‌, ఆంకాలజీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ, అవయవ మార్పిడి సహా 25 సూపర్‌ స్పెషాలిటీ సేవలు అందిస్తున్నారు. మోకాలి మార్పిడి కోసం రోబోటిక్‌ సిస్టమ్‌ అందుబాటులోకి తెచ్చారు. అదనపు రేడియేషన్‌ ప్రమాదం లేకుండా మెడికల్‌ టెక్నాలజీ తెచ్చారు’ అంటూ కిమ్స్‌ సేవలను చంద్రబాబు ప్రశంసించారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 27-07-2026

చైతన్యరధం ఈ పేపర్ 26-07-2026

చైతన్యరధం ఈ పేపర్ 25-07-2026

ఆరోగ్యంపై అవగాహన పెరగాలి
‘ప్రతి ఒక్కరికీ ఆరోగ్యంపై అవగాహన పెరగాలి. జీవనశైలి మార్చుకోగలిగితే డాక్టర్‌ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. 1985లో గుండె ఆపరేషన్‌ కోసం ఎన్టీఆర్‌ అమెరికా వెళ్లారు. అత్త బసవతారకం క్యాన్సర్‌తో చనిపోయారు. క్యాన్సర్‌ బాధితులకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో బసవతారకం పేరిట క్యాన్సర్‌ ఆసుపత్రి ఏర్పాటు చేశారు. నందమూరి బాలకృష్ణ బసవతారకం ఆస్పత్రిని సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారు. రాబోయే రోజుల్లో డేటా కూడా చాలా ముఖ్యంగా మారుతోంది. మన దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయన్నదికాదు, ఎంత డేటా ఉందనేది ముఖ్యం. దేశంలో ఎవరి దగ్గరాలేని డేటా కిమ్స్‌ దగ్గరుంది. రాబోయే రోజుల్లో డేటానే ప్రపంచాన్ని ఏలబోతోంది. భవిష్యత్‌లో వైద్యరంగంలో డేటా కింగ్‌గా కిమ్స్‌ భాస్కరరావు మారబోతున్నారు. భారతీయులు అన్నిరంగాల్లో అద్భుతాలు సృష్టించబోతున్నారు. ఆయుష్మాన్‌ భారత్‌లో మేము భాగస్వాములమయ్యాము. రోగులకు డిజిటల్‌ హెల్త్‌ కార్డులిచ్చి మెరుగైన సేవలు అందిస్తాము. రాష్ట్రంలో 90శాతం వ్యాధులు ఎలాంటివి వస్తున్నాయి, వాటిని నివారణకు ఏంచేయాలనే దానిపై దృష్టి పెడుతున్నాం. ఈ క్రమంలోనే ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నాము. ఇందులో ఏపీని నెంబర్‌ వన్‌ చేస్తాం. ప్రధాని పిలుపుతో ఏపీని గ్రీన్‌ ఎనర్జీకి కేంద్రంగా మార్చబోతున్నాము. ఇళ్లపై సోలార్‌ ప్యానెళ్లు ఏర్పాటు చేస్తున్నాం. పట్టణాలు పరిశుభ్రంగా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నాము’ అని సీఎం చంద్రబాబు వివరించారు.

సుస్థిర పాలనతోనే అభివృద్ధి
‘ప్రతి ఒక్క కుటుంబంలో ఐటీ వ్యక్తి ఉండాలని 1995లోనే చెప్పాను. నా పిలుపును ఎందరో స్ఫూర్తిగా తీసుకున్నారు. నేడు ప్రపంచంలోనే ఎక్కువ ఆదాయం సంపాదించే వారిలో భారతీయులు ముందుతున్నారు. వీరిలో ఏపీ పౌరులకే ఎక్కువ ఆదాయం వస్తోంది. నాడు నేను ఐటీ… నేడు ఏఐని ప్రమోట్‌ చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఏఐ ఉపయోగించుకోవాలి. ప్రపంచాన్ని ఏఐనే శాసించబోతోంది. సమర్థవంతమైన నాయకుడు, సుస్థిర పాలన ఉన్న చోటే సంక్షేమం, అభివృద్ధి జరగుతాయి. అది మన ప్రధాని నరేంద్రమోదీ చేతల్లో చూపించారు. 2004లోనూ టీడీపీ అధికారంలోకి వచ్చి ఉండుంటే ఏపీ అగ్రభాగాన ఉండేది. 2019లో గెలిచినా ఇంతటి విధ్వంసం జరిగేది కాదు. విభజన హామీల్లో భాగంగా రాష్ట్రానికి కేంద్రం ఎయిమ్స్‌ కేటాయించింది. రూ.300 కోట్ల విలువ చేసే 183 ఎకరాల భూమిని ఎయిమ్స్‌కి కేటాయించాను. దేశంలో ఎక్కడా లేని వాతావరణం మంగళగిరి ఎయిమ్స్‌కి ఉంది. కేంద్రం రూ.1618 కోట్ల వ్యయంతో 960 బెడ్లతో ఆస్పత్రిని నిర్మించింది. ఆస్పత్రిలో నీళ్లు లేక 600 టిప్పర్లతో నీళ్లు తెప్పిస్తున్నామని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ నాకు చెప్పారు. పక్కనే కృష్ణా నదివున్నా ఎయిమ్స్‌కి నీరివ్వలేదంటే గత పాలకులను ఏమనాలి? అది ప్రభుత్వమేనా? ప్రాధాన్యతలు తెలియని వ్యక్తులు పాలన చేస్తే ఎలా ఉంటుందో గత ఐదేళ్ల కాలంలో చూశాం’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు వైసీపీ అసమర్థతపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

పీ4 విధానంతో పేదరిక నిర్మూలన
‘ఉగాది రోజున పీ4 ప్రారంభిస్తున్నాము. 1991లో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. సంపద పెరిగింది. ఆర్థిక సంస్కరణలపై ఎక్కువగా మట్లాడి ప్రమోట్‌ చేశా. పీ4 విధానం ద్వారా సమాజంలో ఆర్థికంగా అగ్రస్థానంలో ఉన్న 10 శాతం మంది… అట్టడుగున ఉన్న 20 శాతం మందికి చేయూతనివ్వడం ద్వారా మంచి ఫలితాలు సాధింవచ్చు. పబ్లిక్‌- ప్రైవేట్‌- పీపుల్స్‌- పార్టనర్‌ షిప్‌ విధానం అమలు ద్వారా పేదరిక నిర్మూలకు అడుగులేస్తాం. సంపద సృష్టించి పేదలకు అందిస్తాము. పెన్షన్‌ ఇచ్చినా, అన్నా క్యాంటీన్‌లో భోజనం పెట్టినా పేదల కోసమే. వాట్సాప్‌ గవర్నెన్స్‌ ద్వారా పౌర సేవలు అందిస్తున్నాం’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసానిచ్చారు.

Previous Post

చైతన్యరధం ఈ పేపర్ 12-02-2025

Next Post

‘సూపర్‌ సిక్స్‌’కు సన్నద్ధం!

మరిన్ని వార్తలు

క్వాంటం పరిశోధనలకు అమరావతి అత్యుత్తమం
ఆంధ్రప్రదేశ్

క్వాంటం పరిశోధనలకు అమరావతి అత్యుత్తమం

చైతన్యరధం
@ July 24, 2026
భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీ
ఆంధ్రప్రదేశ్

భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీ

చైతన్యరధం
@ July 24, 2026
50 ఏళ్ల లోపు బీపీఎల్ చేనేతలకు భరోసా
ఆంధ్రప్రదేశ్

50 ఏళ్ల లోపు బీపీఎల్ చేనేతలకు భరోసా

చైతన్యరధం
@ July 24, 2026
ఉద్యోగుల కుటుంబాలకు కూటమి ఆర్థిక భద్రత
ఆంధ్రప్రదేశ్

ఉద్యోగుల కుటుంబాలకు కూటమి ఆర్థిక భద్రత

చైతన్యరధం
@ July 20, 2026
ఆక్వా, పొగాకు రైతుల భారం తగ్గించండి
ఆంధ్రప్రదేశ్

ఆక్వా, పొగాకు రైతుల భారం తగ్గించండి

చైతన్యరధం
@ July 18, 2026
అభివృద్ధికి రుణహస్తం
ఆంధ్రప్రదేశ్

అభివృద్ధికి రుణహస్తం

చైతన్యరధం
@ July 18, 2026
పోలవరానికి పర్యాటక శోభ
ఆంధ్రప్రదేశ్

పోలవరానికి పర్యాటక శోభ

చైతన్యరధం
@ July 15, 2026
పాలనలో టెక్నాలజీ అనుసంధానం
ఆంధ్రప్రదేశ్

పాలనలో టెక్నాలజీ అనుసంధానం

చైతన్యరధం
@ July 15, 2026
Load More

ముఖ్య వార్తలు

క్వాంటం పరిశోధనలకు అమరావతి అత్యుత్తమం

క్వాంటం పరిశోధనలకు అమరావతి అత్యుత్తమం

చైతన్యరధం
@ July 24, 2026
భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీ

భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీ

చైతన్యరధం
@ July 24, 2026
50 ఏళ్ల లోపు బీపీఎల్ చేనేతలకు భరోసా

50 ఏళ్ల లోపు బీపీఎల్ చేనేతలకు భరోసా

చైతన్యరధం
@ July 24, 2026
ఉద్యోగుల కుటుంబాలకు కూటమి ఆర్థిక భద్రత

ఉద్యోగుల కుటుంబాలకు కూటమి ఆర్థిక భద్రత

చైతన్యరధం
@ July 20, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
మరిన్ని

తాజా సంఘటనలు

అతిపెద్ద ధింసా నృత్యంతో ప్రధానికి ఘనస్వాగతాంజలి

అతిపెద్ద ధింసా నృత్యంతో ప్రధానికి ఘనస్వాగతాంజలి

చైతన్యరధం
@ July 25, 2026

మీకోసం.. నేనున్నా!

చైతన్యరధం
@ July 25, 2026
మహిళలను అవమానిస్తే సహించను

మహిళలను అవమానిస్తే సహించను

చైతన్యరధం
@ July 25, 2026
ఏడాదిలో గిరిజన ప్రాంత స్కూళ్లకు సొంత భవనాలు

ఏడాదిలో గిరిజన ప్రాంత స్కూళ్లకు సొంత భవనాలు

చైతన్యరధం
@ July 25, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist