చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

మోదీని నమ్మారు..బీజేపీని గెలిపించారు

హస్తిన ఎన్నికల ఫలితాలపై సీఎం చంద్రబాబు వ్యాఖ్య

by చైతన్యరధం
Feb 9, 2025 at 6:35am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
నేరస్థుడికి మరణశిక్ష పడేలా చూడాలి
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ఢిల్లీ ప్రజల ఆకాంక్షలను ఆప్‌ ప్రభుత్వం విస్మరించింది
  • సంక్షేమం సాకుతో అవినీతి పాల్పడితే ప్రజాతిరస్కారమే
  • సమర్థ, సుస్థిర, విజనరీ పాలనతోనే సమాజంలో మార్పు
  • కంటిన్యుటీ ఆఫ్‌ గవర్నమెంట్‌తో తిరుగులేని విజయాలు
  • ఇది చరిత్ర చెప్తోన్న, నిరూపిస్తున్న సత్యం
  • ఒకే పార్టీ, ఒకే నేత సుదీర్ఘ అధికారంలోవున్న రాష్ట్రాల్లో ఉత్తమ ఫలితాలు
  • 2047నాటికి దేశంలో ఎక్కువ తలసరి ఆదాయం ఏపీలోనే..
  • విలువలు లేని వారు విలువల గురించి మాట్లాడటం సబబు కాదు
  • ప్రజా తీర్పును గౌరవించలేని జగన్‌ది అహంకార ధోరణి
  • ప్రజల సౌకర్యార్ధం తెచ్చిన వాట్సాప్‌ గవర్నెన్స్‌పైనా పిచ్చికూతలు
  • మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టీకరణ
  • ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ విజయంపై హర్షం వ్యక్తం చేసిన సీఎం

అమరావతి (చైతన్య రథం): ఢల్లీి ప్రజలు బీజేపీకి చారిత్రాత్మక విజయాన్ని అందించారు. ప్రధాని మోదీ సమర్థ నాయకత్వానికి, సుస్థిర పాలనకు పట్టంగట్టారు. ఇది దేశ ప్రజలందరి గెలుపు. గత ఐదేళ్లలో ఏపీలో, ఢల్లీిలోని ప్రభుత్వాలు ప్రజల ఆకాంక్షలను పట్టించుకోలేదు. ఓటేసిన పాపానికి ప్రజల భవిష్యత్‌పై కాటేశారు. అభివృద్ధి, సంక్షేమం సమపాళ్లలో అందిస్తూ ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఉండవల్లి నివాసంలో శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఢల్లీి ఎన్నికల్లో ఎన్డీఏ గెలుపుపై హర్షం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు సుస్థిర పాలన అందిస్తున్న ప్రధాని మోదీని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో మనదేశం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

పీపుల్స్‌ ఫస్ట్‌ నినాదానికి ఢల్లీి ఫలితాలు ఉదాహరణ
ప్రపంచంలో ఎక్కడికివెళ్లినా మనది భారతదేశం అంటాం. ఢల్లీి రాజధాని అని చెబుతాం. ఎవరైనా సరే మంచి భవిష్యత్‌, అవకాశాల కోసం రాష్ట్ర రాజధాని, దేశ రాజధానికి వెళ్లాలనుకుంటారు. కానీ వెదర్‌ పొల్యూషన్‌, పొలిటికల్‌ పొల్యూషన్‌ కారణంగా ప్రజలు ఢల్లీికి వెళ్లడం మానేసి ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. ఒకప్పుడు ప్రతిరోజూ బీహార్‌ నుంచి ఢల్లీికి కార్మికులు వెళ్లేందుకు ట్రైన్‌ ఉండేది. కొన్నేళ్లుగా వారు ఢల్లీికి రావడంలేదు. ఒక్కోసారి పరిస్థితులు తారుమారు అవుతాయి అనడానికి ఢల్లీినే ఉదాహరణ. ప్రపంచంలో ఎక్కడెనా పీపుల్స్‌ ఫస్ట్‌ నినాదమే పనిచేస్తుందనడానికి ఈ ఢల్లీి ఎన్నికలే ఉదాహరణ. అభివృద్ధి జరగితే సంపద సృష్టించవచ్చు. సంపద వస్తే ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది. ఆ ఆదాయం ఖర్చు పెడితే సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయవచ్చు. తలసరి ఆదాయం పెంచి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచవచ్చు. గుడ్‌ గవర్నెన్స్‌, గుడ్‌ పాలిటిక్స్‌ ఎంతో ముఖ్యం. మన దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రారంభించి 34 సంవత్సరాలు అయింది. అంతకుముందు ఢల్లీి రాజధానిగా బ్రిటీష్‌ పాలన అమలయ్యేది. మద్రాసు, కలకత్తా ఇలా ప్రెసిడెన్సీలు ఉండేవి. హైదరాబాద్‌లాంటి కొన్ని ప్రాంతాలుండేవి. 1991లో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. సంస్కరణలకు ముందు మన గ్రోత్‌ రేటుపై ప్రపంచం ఎగతాళి చేసేది. మన తెలుగుబిడ్డ పీవీ నరసింహరావు ఆర్థిక సంస్కరణలు తెచ్చారు. అందరికీ సమానావకాశాలు వచ్చాయి. 1995లో మహారాష్ట్ర స్థూల రాష్ట్ర ఉత్పత్తి 55 బిలియన్‌ యూస్‌ డాలర్లు. అది 2024నాటికి 490 బిలియన్‌ యూస్‌ డాలర్లు అయ్యింది. అంటే 9 రెట్లు వృద్ధి చెందింది. గుజరాత్‌… 24 బిలియన్‌ యూస్‌ డాలర్లు కాగా ఇప్పుడు 370 బిలియన్‌ యూస్‌ డాలర్లు . అంటే 15 రెట్లు పెరిగింది. 1995-2024 మధ్య మన తలసరి ఆదాయం 9రెట్లు పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో 3000 డాలర్ల తలసరి ఆదాయం ఉంది. 1995లో ఆర్థిక సంస్కరణలు రాగానే టెక్నాలజీని అందిపుచ్చుకుని ముందుకెళ్లాము. జనాభా నియంత్రణపైనా దృష్టి పెట్టాము. పబ్లిక్‌ పాలసీలు తెచ్చాము. పోటీ ప్రపంచాన్ని తట్టుకుని నిలబడ్డాము. ఐటీని ప్రమోట్‌ చేశాము. అదే సమయంలో సమర్థ నాయకత్వం, సుస్థిర పాలనతో అభివృద్ధి చేశాము. సుస్థిర పాలన, సమర్థ నాయకత్వంతోనే గుజరాత్‌లో వృద్ధి రేటు పెరిగింది.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 14-03-2026

మీ విజయగాథ స్ఫూర్తిదాయకం

విద్యుత్‌రంగ వెలుగులకు ఇదే సాక్ష్యం

1995 నుంచి 2024 వరకు సీఎం వివరించిన వివిధ రాష్ట్రాల జీఎస్డీపీ వివరాలు

దేశానికి సరైన నాయకుడు ప్రధాని మోదీ
మోదీ నాయకత్వంలో మన దేశం అభివృద్ధిలో నెంబర్‌ వన్‌ అవుతుంది. కొందరు సంక్షేమం ఇస్తున్నామని మాయమాటలు చెబుతూ అవినీతి చేస్తున్నారు. దీంతో ప్రజలు వారిని తిరస్కరిస్తున్నారు. ప్రశ్నిస్తే ఎదురుదాడులు చేయడం, సోషల్‌ మీడియాలో ఇష్టానుసారంగా అవమానించడం చేస్తున్నారు. దానికి ఏపీ, ఢల్లీినే ఉదాహరణ. ఢల్లీిలో సరైన విద్యావకాశాలు లేవు. ఆస్పత్రులు లేవు. మంచినీరు, డ్రెయినేజీ వాటర్‌ కలిసిపోయే పరిస్థితి. ఢల్లీి మొత్తం గార్భేజ్‌గా మారింది. యమునా పొల్యూషన్‌తో నిండిపోయింది. ప్రపంచంలోనే పొల్యూటెడ్‌ సిటీ ఢల్లీి. ఒకప్పుడు దేశానికి సైన్యమంతా పంజాబ్‌ నుంచే వచ్చేవారు. దేశానికి కావాల్సిన ధాన్యం, గోధుమలు సరఫరా చేసేవారు. ఆ రాష్ట్రంలో ఐదు నదులున్నాయి. కానీ నేడు పంజాబ్‌ డ్రగ్స్‌ మయమైంది. ప్రతిరోజూ పంజాబ్‌నుంచి ఢల్లీికి క్యాన్సర్‌ చికిత్స కోసం వచ్చే రోగుల కోసం ఒక రైలే వస్తోంది. 2047నాటికి రాష్ట్రంలో 2.4 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ ఉండాలి. 2047నాటికి రాష్ట్రంలో తలసరి ఆదాయం 42,000 డాలర్లుకు చేరాలి. మంచి నాయకత్వంతో ముందుకెళ్తే 2047నాటికి మన దేశమే నంబర్‌వన్‌గా నిలుస్తుంది. 2047నాటికి దేశంలో ఎక్కువ తలసరి ఆదాయం ఏపీలోనే ఉండాలన్నది మా లక్ష్యం. అలాగే రాష్ట్రంలో 15 శాతం వృద్ధిరేటు రావాలి.

సంపద సృష్టించలేనివారికి బటన్‌ నొక్కే అర్హత లేదు
ఢల్లీి ప్రజలు కొంత సమయం తీసుకున్నారు కానీ మన ఏపీ ప్రజలు బటన్‌ నొక్కే కార్యక్రమానికి విసుగొందారు. గత ఐదేళ్లలో పాలకులు చిన్న, పెద్దా లెక్కలేకుండా ఇష్టానుసారంగా మాట్లాడారు. లిక్కర్‌లో జోక్యం చేసుకున్న కుటుంబాలు బాగుపడవు. అది పాపిష్టి డబ్బు. పేదవారి ఆరోగ్యాన్ని నాశనం చేసి ఎంజాయ్‌ చేసే అధికారం పాలకులకు లేదు. లిక్కర్‌ మాఫియాను నడిపారు. వ్యవస్థలను నాశనం చేశారు. దేవతలు ద్యానం చేసిన రిషికొండ ప్రాంతంలో ప్యాలెస్‌ కట్టుకున్నారు. ఢల్లీిలోనూ శేష్‌మహల్‌ కట్టారు. అక్కడా, ఇక్కడా ప్యాలెస్‌లోకి వారు వెళ్లలేదు. రూ.10 లక్షల కోట్ల అప్పులు చేశారు. ఓటేసిన పాపానికి కాటేశారు. విధ్వంసం చాలా సులభం. నిర్మాణాత్మకంగా పనిచేయడం చాలా కష్టం. మొత్తం ప్రజల అవకాశాలను సర్వ నాశనం చేశారు. సంపద సృష్టించలేని వ్యక్తులు, ప్రభుత్వ ఆదాయం పెంచలేని వ్యక్తులకు బటన్‌ నొక్కే అర్హత లేదు. ప్రజలకు సంక్షేమం అందించి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. అదే సుస్థిర పాలన. బాధ్యత కలిగిన రాజకీయ పార్టీలుగా మనందరం ఎన్నికల మేనిఫెస్టో చెప్పాం కాబట్టి ఏం చేసినా పర్లేదు, ఇష్టానుసారంగా మాట్లాడతానంటే కుదరదు.

వాట్సాప్‌ గవర్నెన్స్‌పై అనవసర రాద్ధాంతం
మనందరిపై గురుతర బాధ్యత ఉంది. నేను వ్యక్తులను విమర్శించడం లేదు. వారు అవలంభించిన సిద్ధాంతాల వల్ల ప్రజలకు మేలు జరగలేదని చెబుతున్నాను. రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకు సేవ చేయడానికి అని నాయకులు గుర్తుంచుకోవాలి. జగన్‌ రెడ్డిని ప్రజలు ఎమ్మెల్యేగానే గెలిపించారు. ప్రతిపక్ష నేతగా కాదు. విలువలు లేని వారు విలువలపై మాట్లాడటం సబబు కాదు. నా అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ 60 దేశాల్లో నిరసనలు తెలిపారు. తెలంగాణలోనూ నిరసనలు జరిగాయి. వాటిని అణగదొక్కాలని చూశారు. కానీ ఏమైందో అందరం చూస్తున్నాం. ఒకప్పుడు కమ్యూనిస్టులు బలంగా ఉన్నారు. నేడు ఆదరణ కోల్పోయారు. 1995లో నేను ప్రజలను చైతన్య పరిచాను. నేడు నరేంద్రమోదీ అదే చేస్తున్నారు. నేడు ప్రజలకు సంతృప్తి కలిగే పాలన అందిస్తున్నాను. ఏ ఆఫీసర్‌, ఏ కార్యకర్త తప్పు చేసినా నాదే బాధ్యత. సాంకేతికత సాయంతో ఫైల్స్‌ ఎప్పటికప్పుడు క్లియర్‌ చేయాలని నేను మంత్రులకు చెబితే వక్రీకరించి రాస్తున్నారు. వాట్సాప్‌ గవర్నెన్స్‌ను కూడా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ప్రజలను మభ్యపెట్టి ఇష్టానుసారంగా పక్కదారి పట్టిస్తున్నారు’ అని సీఎం చంద్రబాబు అన్నారు.

Previous Post

ఎస్సై శ్రీహరి బెదిరించి రూ.లక్ష నొక్కాడు

Next Post

కోటప్పకొండలో మహాశివరాత్రి ఏర్పాట్లు

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 14-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 14-03-2026

కార్యకర్త
@ March 14, 2026
మీ విజయగాథ స్ఫూర్తిదాయకం
ఆంధ్రప్రదేశ్

మీ విజయగాథ స్ఫూర్తిదాయకం

చైతన్యరధం
@ March 14, 2026
శ్రీకాకుళం డయేరియా ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష
ఆంధ్రప్రదేశ్

విద్యుత్‌రంగ వెలుగులకు ఇదే సాక్ష్యం

చైతన్యరధం
@ March 14, 2026
రాష్ట్రానికే గర్వకారణం
ఆంధ్రప్రదేశ్

హెచ్‌సీలకు ప్రత్యేక పదోన్నతులు

చైతన్యరధం
@ March 14, 2026
ఇదీ.. బిట్స్ ప్లాన్!
ఆంధ్రప్రదేశ్

ఇదీ.. బిట్స్ ప్లాన్!

చైతన్యరధం
@ March 14, 2026
చైతన్యరధం ఈ పేపర్ 13-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 13-03-2026

కార్యకర్త
@ March 13, 2026
చైతన్యరధం ఈ పేపర్ 12-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 12-03-2026

కార్యకర్త
@ March 12, 2026
అమూల్ తరహాలో స్వయం బ్రాండ్
ఆంధ్రప్రదేశ్

అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

చైతన్యరధం
@ March 12, 2026
Load More

ముఖ్య వార్తలు

అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

చైతన్యరధం
@ March 12, 2026
సాగుకు మరింత సాయం

సాగుకు మరింత సాయం

చైతన్యరధం
@ March 12, 2026
మీ ప్రయోగాత్మక విధానాలు భవిష్యత్ మార్గదర్శకాలు

మీ ప్రయోగాత్మక విధానాలు భవిష్యత్ మార్గదర్శకాలు

చైతన్యరధం
@ March 12, 2026
‘మనమిత్ర’కు..ప్రజాకాంక్షే ప్రేరణ!

‘మనమిత్ర’కు..ప్రజాకాంక్షే ప్రేరణ!

చైతన్యరధం
@ March 12, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

మీ విజయగాథ స్ఫూర్తిదాయకం

మీ విజయగాథ స్ఫూర్తిదాయకం

చైతన్యరధం
@ March 14, 2026
శ్రీకాకుళం డయేరియా ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష

విద్యుత్‌రంగ వెలుగులకు ఇదే సాక్ష్యం

చైతన్యరధం
@ March 14, 2026
రాష్ట్రానికే గర్వకారణం

హెచ్‌సీలకు ప్రత్యేక పదోన్నతులు

చైతన్యరధం
@ March 14, 2026
ఇదీ.. బిట్స్ ప్లాన్!

ఇదీ.. బిట్స్ ప్లాన్!

చైతన్యరధం
@ March 14, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist