చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి వరం

కంకిపాడు పల్లెపండుగ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌

by చైతన్యరధం
Oct 15, 2024 at 6:34am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి వరం
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ఆయన పనితనం నాకు స్ఫూర్తి
  • పల్లె పండుగలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం కావాలి
  • ప్రజలతో, ప్రజలచే, ప్రజల కోసం చేస్తున్న గొప్ప అభివృద్ధి పండుగ
  • 30 వేల పనులు, రూ.4,500 కోట్ల నిధులతో ముందడుగు
  • సంక్రాంతి నాటికి పనులు పూర్తయ్యేలా ప్రణాళిక
  • అన్ని శాఖల సమన్వయంతో పనులు జరగాలి
  • గత ప్రభుత్వ హయాంలో పంచాయతీరాజ్‌ మంత్రి ఎవరో కూడా తెలియని దౌర్భాగ్యం
  • నిధుల మళ్లింపు ఎలా, ఎక్కడికి చేశారన్నది అంతు చిక్కని రహస్యం
  • కంకిపాడు పల్లెపండుగ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌

కంకిపాడు (చైతన్యరథం): ప్రజలందరి బాగు కోసం బలమైన నాయకత్వం, అనుభవపూర్వక నాయకత్వం కావాలన్నదే తన ఆకాంక్ష అని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి అన్నారు. 2014 నుంచి నేను చెబుతున్నది ఇదే. ముఖ్యమంత్రి చంద్రబాబు పరిపాలన అనుభవం రాష్ట్రానికి వరం అవుతుంది. అది రాష్ట్ర శ్రేయస్సుకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు జరుగుతున్న పనులను చూస్తే గతంలో కూటమి కోసం నేను తీసుకున్న నిర్ణయం సరైనదే అనిపిస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వారం రోజుల పాటు పల్లెల్లో నిర్వహించబోయే ‘పల్లె పండుగ’ కార్యక్రమాన్ని కంకిపాడులో ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ సోమవారం ప్రారంభించారు. కంకిపాడు, పునాదిపాడుల్లో తలపెట్టిన పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడుతూ… రాజకీయాల్లోకి వచ్చి ప్రజల ఆదరణ పొంది, వారి కోసం పాలకులతో పోరాడటం సులభమే కావొచ్చు కానీ, అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజల అభిమానం చూరగొంటూ, వారి సంక్షేమాన్ని, అభివృద్ధిని సమతుల్యం చేస్తూ జాగ్రత్తగా పాలన సాగించడంలోనే అసలైన నాయకత్వ పటిమ వెల్లడవుతుందన్నారు. గ్రామగ్రామాన వారం రోజులుపాటు సాగే పల్లె పండుగ కార్యక్రమం ఇంత నిండుగా జరుగుతుంటే ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఎన్నికల ముందు కూటమి జట్టుగా ముందుకు వెళితేనే రాష్ట్రాభివృద్ధి పరుగులు తీస్తుందని నమ్మి తాను తీసుకున్న నిర్ణయం సరైనదే అనిపిస్తోందన్నారు. ప్రజల కోసం తీసుకునే ఏ నిర్ణయం అయినా వారి మధ్యనే జరగాలి.. వారితోనే జరగాలి.. వారి వల్లనే జరగాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం అన్నారు. ఎలాంటి గుట్టుమట్లకు తావివ్వకుండా పారదర్శకంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. కేంద్రం సహకరించడం రాష్ట్రానికి అదనపు బలం. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దిశానిర్దేశం, కేంద్ర సహకారంతో ముందడుగు వేస్తున్నాం. పాలనలో చంద్రబాబు పనితనం నాకు స్ఫూర్తి. ఆయన క్యాబినెట్‌ సమావేశాల్లో లేవనెత్తే అంశాలు సీనియర్‌ బ్యూరోక్రాట్‌లు కూడా సమాధానం చెప్పలేనంత లోతుగా ఉంటాయి. పాలనలో ఆయన చూపించే చొరవ అద్భుతం. నిరంతరం ప్రజల గురించి ఆలోచించే తీరు, రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయనకున్న విజన్‌ కచ్చితంగా రాష్ట్రానికి మేలు చేస్తుందని భావిస్తున్నానని పవన్‌ అన్నారు.
ప్రజల తీర్మానం మేరకే..
రాష్ట్రవ్యాప్తంగా గత ఆగస్టు 23వ తేదీన నిర్వహించిన గ్రామ సభల్లో 30 వేల పనులకు తీర్మానాలు చేశారన్నారు. ప్రజలంతా కలిసి తమ గ్రామాల్లో కావల్సిన అభివృద్ధి పనులను వారే తీర్మానించుకున్నారు. దీనిలో ప్రజా ప్రతినిధుల ప్రమేయం లేదు. పూర్తిగా ప్రజలు తీసుకున్న నిర్ణయం మేరకు చేపడుతున్న అభివృద్ధి పనులకు సోమవారం నుంచి వారం రోజులపాటు శంకుస్థాపనలు జరగనున్నాయి. సంక్రాంతి నాటికి పనులు పూర్తి కావాలన్నదే లక్ష్యం. కీలకమైన పనులన్నీ ఇప్పటికే గుర్తించాం. దానికి కలెక్టర్లు పరిపాలన ఆమోదాలు సైతం ఇచ్చారు. దీంతో పనులన్నీ మొదలుకానున్నాయి. ప్రతి పనికి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకునేలా సమాచార బోర్టులు ఏర్పాటు చేయనున్నాం. శంకుస్థాపన చేసిన దగ్గరే ఆయా పనుల పూర్తి వివరాలు బోర్డులో ఉంటాయి. సామాన్యుడు సైతం సులభంగా పనులు, నిధులు, నాణ్యత తెలుసుకునేలా వీటిని ఏర్పాటు చేస్తున్నాం. ప్రజలంతా ఈ పనుల్లో భాగస్వామ్యం కావాలని పవన్‌ పిలుపు ఇచ్చారు.
గత ప్రభుత్వ హయాంలో పంచాయతీరాజ్‌ మంత్రి ఎవరో తెలీదు
ప్రతిసారీ గత ప్రభుత్వాన్ని విమర్శించాలని అనుకోను కానీ… గత ప్రభుత్వంలో జరిగిన విధ్వంసం మాత్రం కళ్ల ముందు కదలాడుతూనే ఉంటుంది. గత ప్రభుత్వంలో జరిగిన విధానం ఎలా ఉంది.. ఇప్పుడు జరుగుతున్న కూటమి ప్రభుత్వ విధానాలను ఎంత పారదర్శకతతో ఉన్నాయో ప్రజలకు చెప్పాలి. గత ప్రభుత్వంలో ప్రజలకు కనీసం పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎవరో కూడా తెలీని దౌర్భాగ్యం ఉండేది. అధికారులు, సిబ్బంది ఎవరనేది అసలు తెలీదు. ఇక గత ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో గ్రామ సభలు నిర్వహించిన దాఖలాలు లేవు. అసలు పంచాయతీరాజ్‌ నిధులు ఏమయ్యాయో కూడా తెలీదు. నేను ఈ శాఖ బాధ్యతలు తీసుకున్న తర్వాత అనేకసార్లు నిధుల మీద సమీక్షించినా గత ప్రభుత్వంలో నిధులు ఎలా, ఎటు వెళ్లాయనేది ఓ బ్రహ్మ పదార్థంలా కనిపించింది. కూటమి ప్రభుత్వంలో ప్రజలకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలనే నిర్ణయంతో గ్రామసభలను రికార్డు స్థాయిలో నిర్వహించాం. గ్రామాల్లో ప్రాధాన్యతలను బట్టి ఏం పనులు చేయాలో రాజకీయాలకు అతీతంగా ప్రజలు చేసిన తీర్మానాలతోనే ఇప్పుడు పనులు మొదలుపెడుతున్నామని పవన్‌ తెలిపారు
నిజాయతీగా పనిచేసే అధికారులకు ప్రొత్సాహం
ప్రజలు ఎన్నో ఆశలతో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకున్నారు. దీన్ని అంతే బాధ్యతగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కాకినాడలో ఓ అటవీ శాఖ అధికారి నా పేరు ఉపయోగించి చేస్తున్న కొన్ని పనులు నా దృష్టికి ప్రజలే తీసుకొచ్చారు. వెంటనే నేను స్పందించాను. అసలు జరిగిన విషయాన్ని విచారించాలని అటవీశాఖ ఉన్నతాధికారులను ఆదేశించాను. వచ్చిన ఆరోపణలు రుజువైతే సస్పెండ్‌ చేయడానికి కూడా వెనుకాడేది లేదు. మేమెంత నిజాయతీగా, నిబద్ధతతో ప్రజల కోసం పనిచేస్తున్నామో అధికారులు కూడా అలాగే పని చేయాలి. ప్రజల ఆకాంక్షలు, వారి అవసరాలు తీర్చడానికి అధికారాన్ని వినియోగించాలి. అధికారుల విషయంలో చిత్తశుద్ధితో ముందుకు వెళ్తాం. పని చేసిన వారికి తగిన ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు ఏమైనా తేడా వస్తే అంతే కఠినంగా వ్యవహరిస్తామని పవన్‌ స్పష్టం చేశారు.
సమన్వయంతో ముందుకు వెళ్లాలి
పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో జరిగే పనులను ఇతర శాఖలు సమన్వయం చేసుకొని ముందుకు వెళ్లాలి. దాదాపు 10 శాఖలను జాగ్రత్తగా సమన్వయం చేసుకొని ముందుకు వెళ్తేనే పనులన్నీ సకాలంలో పూర్తి అవుతాయి. ఉపాధి హామీ పథకం అనేది చాలా గొప్ప కార్యక్రమం. దానిని సరిగా వినియోగించుకుంటే గ్రామాల్లో చాలా పనులు చేసుకోవచ్చు. పెనమలూరు నియోజకవర్గం, కంకిపాడులో జరుగుతున్న ఈ ప్రారంభ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌.. కంకిపాడు ` రొయ్యూరు వయా గోడవరం రోడ్డును నవీకరణ చేయాలని కోరారు. వెంటనే దానిపై తగు చర్యలు తీసుకొని రోడ్డు వేసేలా ముందుకు వెళ్తాం. అలాగే కృష్ణా జిల్లా కలెక్టర్‌ డీకే బాలాజీ.. ఎదురుమొండి ` గొల్లమంద పరిధిలోని లంక గ్రామాల్లో అనుసంధాన రహదారులు కావాలని ప్రతిపాదించారు. వీటిని కూడా పూర్తి చేసేలా ఆదేశాలు ఇస్తున్నాను. గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము.. నందివాడ, గుడివాడ, గుడ్లవల్లేరు మండలాల్లోని 43 గ్రామాల్లో తాగునీటి సమస్య ఉందని, అక్కడ నీటిని ఓ బాటిల్‌ లో పట్టి మరీ సమస్య చెప్పారు. దీనిపై గ్రామీణ రక్షిత మంచినీటి సరఫరా శాఖ అధికారులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి అక్కడి సమస్యను తీర్చాలని ఆదేశిస్తున్నాను. దీనిపై వెంటనే చర్యలు తీసుకుంటాం. ఈ సందర్భంగా నేను ఒకటే చెప్పదల్చుకున్నాను. గత ప్రభుత్వంలో 151 మంది ఎమ్మెల్యేలను ప్రజలు గెలిపిస్తే ప్రజా సమస్యల కోసం ఇలా చెప్పిన దాఖలాలు లేవు. ఎప్పుడూ బూతులు, తిట్లు తప్ప గత ప్రభుత్వ ఎమ్మెల్యేలు చేసింది శూన్యం. కూటమి ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు బాధ్యతగా నడుచుకోవడం ముచ్చటగా ఉంది. ఎంతోకాలంగా పెండిరగ్‌లో ఉన్న మచిలీపట్నం ` రేపల్లె రైల్వే లైను విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్తానని పవన్‌ హామీ ఇచ్చారు.
సుందర గ్రామాలు సాకారం కావాలి
చిత్తశుద్ధి, పారదర్శకత, అభివృద్ధి కాంక్షతో పనులన్నీ చేస్తున్నాం. పనులతో గ్రామాలు సుందరంగా రూపొందాలి. రోడ్లు, గోకులాలు, పాఠశాలలకు ప్రహరీలు, ఉద్యానవనాలు, ట్రెంచ్‌లు, రూఫ్‌ టాప్‌ లు, పారిశుద్ధ్య పనులు ఇలా ప్రాధాన్యం ఉన్న పనులన్నీ తీసుకున్నాం. 2024 ` 25 ఆర్థిక సంవత్సరంలో 3 వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు, 500 కిలోమీటర్ల బీటీ రోడ్లు, 120 పాఠశాలలకు ప్రహరీలు, ప్రభుత్వ కార్యాలయ భవనాలకు రూఫ్‌ టాప్స్‌, సామాజిక భవనాలు రావాలని భావిస్తున్నాం.
అలాగే ఆర్థిక సంవత్సరంలో 25.50 కోట్ల పని దినాలు, 8 లక్షల కుటుంబాలకు 100 రోజుల పని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఊరి అభివృద్ధి కోసం జరుగుతున్న పల్లె పండుగలో గ్రామస్థులంతా ఉమ్మడిగా పాలు పంచుకోవాలి. దీనిలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరం. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ గ్రామం కోసం కదలిరండి. దేశంలో ఇప్పటి వరకు ఎక్కడా లేనంత అభివృద్ధిని గ్రామాల్లోకి తీసుకొస్తున్న ఈ శుభతరుణంలో ప్రజలందరి భాగస్వామ్యం అవసరం. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులంతా ఈ కార్యక్రమాన్ని వారం రోజుల పాటు ముందుండి నడిపించాలని పవన్‌ పిలుపు ఇచ్చారు.
సర్పంచులు రోడ్లపాలయ్యారు: మంత్రి కొల్లు రవీంద్ర
ఎక్సైజ్‌, గనుల శాఖల మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ గత ప్రభుత్వ హయంలో రోడ్లు వేసిన వారు రోడ్లు పాలయ్యారన్నారు. సకాలంలో బిల్లులు చెల్లించపోవడంతో సర్పంచులు ఆస్తులు అమ్ముకునే పరిస్థితిని తీసుకొచ్చారు. కేంద్రం విడుదల చేసిన రూ.12 వేల కోట్ల నిధులు కూడా సక్రమంగా ఖర్చు చేయలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే రూ.4,500 కోట్లతో 30 వేల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాం. 3 వేల కిలోమీటర్ల సిమెంట్‌ రోడ్లు, 500 కిలోమీటర్ల తారు రోడ్లు, 10వేల వాననీటి సంరక్షణ కందకాలు నిర్మిస్తున్నాం అంటే దానికి కారణం ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణే. గత ప్రభుత్వం పంచాయతీ కార్యాలయాలకు పార్టీ రంగులు వేసుకున్నారు తప్ప గ్రామాల్లో చేసిన పనులు అయితే ఏమీ లేవు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం దేశంలోనే నెంబర్‌ వన్‌ రాష్ట్రంగా మారుతోంది. గత ప్రభుత్వ హయాంలో కృష్ణా జిల్లా నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలుగా పదవులు వెలగబెట్టిన నాయకులు జిల్లాకు చేసింది ఏమీ లేకపోయినా… జిల్లా పరువు మాత్రం తీశారని దుయ్యబట్టారు
మహాత్ముడి మాటల స్ఫూర్తితోనే పల్లె పండుగ : ఎంపీ బాలశౌరి
మచిలీపట్నం పార్లమెంట్‌ సభ్యుడు వల్లభనేని బాలశౌరి మాట్లాడుతూ…గ్రామాలు సామాజికంగా, ఆర్థికంగా పరిపుష్టి చెందితేనే అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందుతాయన్న మహాత్మాగాంధీ మాటలను స్ఫూర్తిగా తీసుకొని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ పల్లె పండుగ వారోత్సవాలు నిర్వహిస్తున్నారన్నారు. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా ఒకే రోజు 13,326 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి రికార్డు సృష్టించాం. పవన్‌ కళ్యాణ్‌ వ్యక్తిత్వం తెలియాలంటే ఆయన తీసుకున్న శాఖలను చూస్తే సరిపోతుంది. గత ప్రభుత్వంలో దాదాపు 3వేల మంది కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే ఆ కుటుంబాలు రోడ్డున పడకూడదని భావించి ప్రతి కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున అందించారు. వరదల వల్ల 400 పంచాయతీలకు నష్టం జరిగితే … పంచాయతీకి రూ. లక్ష చొప్పున రూ. 4 కోట్లు అందించి దాతృత్వం అంటే ఏంటో చెప్పిన గొప్ప వ్యక్తి పవన్‌ కళ్యాణ్‌. కేంద్రం ఇచ్చిన జలజీవన్‌ మిషన్‌ నిధులు గత ప్రభుత్వం సక్రమంగా వినియోగించుకోలేకపోయింది. ఆ నిధులను సద్వినియోగం చేసుకొని మచిలీపట్నం, పెడన నియోజకవర్గాల్లో ప్రజల దాహార్తి తీరుస్తాం. ఈ ప్రాంత వాసుల చిరకాల వాంఛ మచిలీపట్నం- రేపల్లె రైల్వే లైన్‌. ఆ ప్రాజెక్ట్‌ అతి త్వరలోనే సాకారం చేస్తామని ఉద్ఘాటించారు.
గ్రామాలను స్వర్గసీమలుగా మారుస్తాం : ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌
పెనమలూరు శాసనసభ్యుడు బోడే ప్రసాద్‌ మాట్లాడుతూ…రాష్ట్రవ్యాప్తంగా ఈ రోజు రూ.4,500 కోట్లతో 30 వేల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు జరుగుతున్నాయన్నారు. సంక్రాంతి కల్లా పనులు పూర్తి చేసి గ్రామాలను స్వర్గసీమలుగా మారుస్తాం. పవన్‌ కళ్యాణ్‌ పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖలకు మంత్రిగా ఉన్నారు. ఆయన నాయకత్వంలో రాష్ట్రంలో దాదాపు 90 గ్రామాల్లో మౌలిక సదుపాయాలు పూర్తి చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము, కాగిత కృష్ణ ప్రసాద్‌, వర్ల కుమార్‌ రాజా, ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్‌, పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌, పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ కృష్ణ తేజ, తదితరులు పాల్గొన్నారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 18-03-2026

చైతన్యరధం ఈ పేపర్ 17-03-2026

తెలుగోడి సత్తా.. అమరజీవి

Previous Post

ఔను.. పల్లెపల్లెకూ పండగే!

Next Post

అత్తాకోడళ్లపై అత్యాచార ఘటనలో..48 గంటల్లో నిందితుల అరెస్ట్‌

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 18-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 18-03-2026

కార్యకర్త
@ March 18, 2026
చైతన్యరధం ఈ పేపర్ 17-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 17-03-2026

కార్యకర్త
@ March 17, 2026
తెలుగోడి సత్తా.. అమరజీవి
ఆంధ్రప్రదేశ్

తెలుగోడి సత్తా.. అమరజీవి

చైతన్యరధం
@ March 17, 2026
ఏపీకి గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్
ఆంధ్రప్రదేశ్

ఏపీకి గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్

చైతన్యరధం
@ March 17, 2026
ఆర్యవైశ్యులకు అన్నివిధాల మద్దతు
ఆంధ్రప్రదేశ్

ఆర్యవైశ్యులకు అన్నివిధాల మద్దతు

చైతన్యరధం
@ March 17, 2026
అమరావతిలో హజ్ హౌస్
ఆంధ్రప్రదేశ్

అమరావతిలో హజ్ హౌస్

చైతన్యరధం
@ March 17, 2026
చైతన్యరధం ఈ పేపర్ 16-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 16-03-2026

కార్యకర్త
@ March 16, 2026
ఘనంగా ఎన్టీఆర్ ట్రస్ట్ 29వ వార్షికోత్సవం
ఆంధ్రప్రదేశ్

ఘనంగా ఎన్టీఆర్ ట్రస్ట్ 29వ వార్షికోత్సవం

చైతన్యరధం
@ March 16, 2026
Load More

ముఖ్య వార్తలు

అమరావతిలో హజ్ హౌస్

అమరావతిలో హజ్ హౌస్

చైతన్యరధం
@ March 17, 2026
ఐటీనుంచి ఏటీవైపు..

ఐటీనుంచి ఏటీవైపు..

చైతన్యరధం
@ March 16, 2026
ఏపీలో త్వరలో బీసీ రక్షణ చట్టం

ఏపీలో త్వరలో బీసీ రక్షణ చట్టం

చైతన్యరధం
@ March 15, 2026
రూ.119 కోట్లతో టీసీసీ!

రూ.119 కోట్లతో టీసీసీ!

చైతన్యరధం
@ March 14, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

తెలుగోడి సత్తా.. అమరజీవి

తెలుగోడి సత్తా.. అమరజీవి

చైతన్యరధం
@ March 17, 2026
ఏపీకి గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్

ఏపీకి గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్

చైతన్యరధం
@ March 17, 2026
ఆర్యవైశ్యులకు అన్నివిధాల మద్దతు

ఆర్యవైశ్యులకు అన్నివిధాల మద్దతు

చైతన్యరధం
@ March 17, 2026
అమరావతిలో హజ్ హౌస్

అమరావతిలో హజ్ హౌస్

చైతన్యరధం
@ March 17, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist