చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

రాష్ట్ర పునర్నిర్మాణం దిశగా అడుగులు

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పవన్‌కళ్యాణ్‌ సందేశం

by చైతన్యరధం
Aug 16, 2024 at 6:10am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
రాష్ట్ర పునర్నిర్మాణం దిశగా అడుగులు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ప్రజలు మెచ్చేలా..భావితరాలకు స్ఫూర్తిగా కూటమి పాలన
  • శాంతిభద్రతల పటిష్ట అమలుకు ఎక్కడా రాజీపడేది లేదు
  • మాదకద్రవ్య రహిత ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం
  • పంచాయతీరాజ్‌ వ్యవస్థను గాడిలో పెట్టేలా నిర్ణయాలు
  • లక్షమంది యువతను సేంద్రీయ రైతులుగా తయారుచేస్తాం
  • పెట్టుబడులకు వేదికగా పారిశ్రామికవేత్తలకు పూర్తి భరోసా
  • ఏపీని అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా నిలుపుతాం
  • గత ప్రభుత్వంలో ప్రజాధనం దోపిడీ చేసిన వారిపై చర్యలు
  • స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పవన్‌కళ్యాణ్‌ సందేశం

కాకినాడ(చైతన్యరథం): ఇంటి నుంచి నిర్భయంగా బయటకు వెళ్లిన ప్రతి ఆడబిడ్డ అంతే భద్రంగా ఇంటికి తిరిగిరావాలి.. దోపిడీలు, దౌర్జన్యాలు నశించే రోజులు సాకారం కావాలి.. రాజీ లేకుండా శాంతిభద్రతలు పటిష్టంగా అమలుజరగాలి.. యువశక్తిని నిర్వీర్యం చేస్తున్న మాదకద్రవ్య రహిత ఆంధ్రప్రదేశ్‌ ఆవిష్కృతం కావాలి.. ఒక్కరి వద్దే సంపద జమయ్యే పద్ధతి పోవాలి.. ప్రతిఒక్కరూ ఆర్థికంగా ఎదగాలి.. పెట్టుబడులకు రాష్ట్రం స్వర్గసీమగా విరజిల్లా లి..ప్రజలకు అభివృద్ధితో పాటు సంక్షేమం ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగా లి.. ఇవే కూటమి ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యాలు అని ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌ సందేశమిచ్చారు. కాకినాడలో 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పరేడ్‌ను తిలకించారు. వివిధ ప్రభుత్వ శాఖల శకటాల ప్రదర్శ న, చిన్నారుల నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, డాగ్‌స్క్వాడ్‌ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి పవన్‌కళ్యాణ్‌ మాట్లాడుతూ ఏపీని దేశంలోనే అభి వృద్ధికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా తీర్చిదిద్దేలా పాలనలో మార్పు తీసుకొస్తామని ఉద్ఘాటించారు. ప్రజలు మెచ్చేలా భావితరాలకు స్ఫూర్తి నింపేలా కూటమి పాలన సాగుతోందన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం అంటే చాక్లెట్లు పంచుకోవడానికో, సెలవు దినంగా ఎంజాయ్‌ చేయడానికో కాదని, దేశం కోసం పోరాడిన ఎందరో త్యాగధనుల పోరాటాలను గుర్తు చేసుకోవాల్సిన సమయమని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌కు పునరుజ్జీవం పోస్తాం
సూపర్‌సిక్స్‌ అమలుతో పాటు రాష్ట్ర పునర్నిర్మాణానికి షణ్ముఖ వ్యూహంతో ముందుకు వెళుతున్నాం. 28 కేటగిరీల్లో ప్రజలకు సామాజిక పింఛన్లను కూటమి ప్రభుత్వం పెంచింది. కాకినాడ జిల్లాలో 17 కేటగిరీల్లో 2,77,594 మంది లబ్ధిదారులకు పింఛన్లు అందిస్తున్నాం. ఆంధ్రుల అన్నపూర్ణగా భావించే డొక్కా సీతమ్మ పథకంతో జిల్లాలోని 1258 పాఠశాలల్లోని పిల్లలకు మధ్యాహ్న భోజనం అందజేస్తున్నాం. అన్న క్యాంటీన్లను రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభి స్తున్నాం. జిల్లాలో మొత్తం 11 క్యాంటీన్లు ప్రారంభం అవుతున్నాయని తెలిపారు. ఇసుక విధానంలో మార్పులు చేసి ప్రజలకు అందుబాటులో ఇసుక ఉండేలా చర్యలు తీసుకున్నాం. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన 2.0 పథకంలో భాగంగా యూనిట్‌కు రూ.4 లక్షలు అంద జేస్తాం. పెండిరగ్‌లో ఉన్న రూ.49 కోట్ల బిల్లులు చెల్లించే ఏర్పాటు చేస్తాం. జిల్లాలో 37 కౌంటర్లలో ప్రజలకు నిత్యావసర వస్తువులను తక్కువ ధరకే అందిస్తున్నామని తెలిపారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 15-05-2026

కేడర్‌ను గుండెల్లో పెట్టుకోవాల్సింది ఎమ్మెల్యేనే!

ఖనిజాలకు విలువ జోడింపుతో అదనపు ఆదాయం

పంచాయతీరాజ్‌ వ్యవస్థను బలోపేతం చేస్తున్నాం
పంచాయతీరాజ్‌ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు మూడు కీలక నిర్ణయాలు తీసుకున్నాం. గ్రామ పంచాయతీలకు ఆర్థిక పరిపుష్టి, సర్పంచుల వ్యవస్థకు గౌరవం తీసుకురావడం, నిధు ల కొరత నుంచి బయటపడేయడంపై దృష్టి సారించాం. గత 34 ఏళ్లుగా స్వాతంత్య్ర, గణ తంత్ర దినోత్సవాల నిర్వహణకు మైనర్‌ పంచాయతీలకు ఇస్తున్న రూ.100 నగదును రూ.10 వేలు చేశాం. మేజర్‌ పంచాయతీలకు ఇచ్చే రూ.250 నగదును రూ.25 వేలు చేశామని వివరించారు. ఉపాధి హామీ పథకాన్ని సమర్ధంగా వినియోగించుకునేలా రాష్ట్రం లోని 13,326 గ్రామ పంచాయతీల్లో ఒకేసారి సభలు నిర్వహించి తీర్మానాలు చేస్తామని తెలిపారు. ప్రతి ఇంటికీ కొళాయి ద్వారా రక్షిత తాగునీటి పథకం అమలుకు జల్‌జీవన్‌ మిషన్‌ నిధులను సమర్థ వంతంగా వినియోగించుకుంటామని చెప్పారు. గత ప్రభుత్వంలో రూ.4 వేల కోట్లు కేవలం పైపులైను పనులకే వినియోగించారు.. దీనివల్ల ఎవరికీ లాభం లేకుండా పోయిందన్నారు. నిధులను దుర్వినియోగం చేసే వారు చట్టం నుంచి తప్పిం చుకోలేరని స్పష్టం చేశారు. యువతకు నైపుణ్యాల అభివృద్ధి కోసం దృష్టి సారించి వారికి ఉపాధి అవకాశాలు సృష్టిస్తామని, 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలనేది లక్ష్యమన్నారు. దానికి అనుగుణంగా పెట్టుబడులు తీసుకొచ్చి పరిశ్రమలకు అనువుగా రాష్ట్రాన్ని తయారు చేస్తామని వెల్లడిరచారు.

పారిశ్రామిక వేత్తలకు భరోసా
రాష్ట్రంలో శాంతిభద్రతలు పటిష్టంగా ఉంటేనే పెట్టుబడులు వస్తాయని..ఇటీవల కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో శాంతిభద్రతల అమలులో ఎక్కడా రాజీపడొద్దని గట్టిగా చెప్పామని తెలిపారు. టూరిజం, వైద్యం, పరిశ్రమల రంగంపై దృష్టి పెట్టడం ద్వారా ఉపాధి అవకాశా లను పెంపొందించవచ్చన్నారు. పెట్టుబడులు పెట్టేలా పారిశ్రామిక వేత్తలకు పూర్తిస్థాయి భరోసాను కల్పిస్తామన్నారు. 972 కిలోమీటర్ల తీరప్రాంతం ఉన్న రాష్ట్రంలో బ్లూ ఎకానమీ సృష్టించే అవకాశాలను అందిపుచ్చుకుంటామని తెలిపారు. అన్ని రంగాలు అభివృద్ధి చెంద డంతో పాటు అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి బాటలో నడవాలన్నదే సంకల్పమని ఉద్ఘాటిం చారు. యువత భవిష్యత్తుకు గ్యారంటీ ఉండాలి..వారి ప్రతిభకు సరైన దారి చూపించాలి. లక్షమంది యువ సేంద్రీయ రైతులను తయారు చేయాలనే ఆలోచన ఉంది. వారు గ్రామా ల్లో వ్యవసాయం చేసే దిశగా ముందుకు తీసుకెళ్లాలని తెలిపారు.

సోషల్‌ మీడియాలో తప్పుగా మాట్లాడే వారిపై నిఘా పెడతాం
గత ప్రభుత్వంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని.. మాదక ద్రవ్యాలు, గంజాయి రాష్ట్రమంతటా పాకిందన్నారు. యువతను గంజాయి మత్తు నుంచి బయటకు తీసుకువచ్చి మాదకద్రవ్య రహిత రాష్ట్రాన్ని సాధించేలా చర్యలు చేపడుతున్నట్టు వివరించా రు. సోషల్‌ మీడియాలో మహిళలను, ఆడబిడ్డలను కించపరిచేలా అసభ్యంగా మాట్లాడే వారిపై నిఘాపెడతామని.. పోస్టుల దగ్గర నుంచి మెసేజ్‌ల వరకు ఆడబిడ్డలపై వేధింపులకు పాల్పడే వారిని వదిలే ప్రసక్తి లేదని తెలిపారు. మహిళలపై దాడులు, నేరాల నివారణకు కూటమి ప్రభుత్వం పూర్తిస్థాయి కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు. క్షేత్రస్థాయిలో అధికా రులు ఈ విషయంలో స్వేచ్ఛగా పనిచేసేలా చూస్తాం…ఆడబిడ్డల రక్షణకు, వారిపై నేరాలకు పాల్పడే వారిపై కఠినంగా ఉంటామని తెలిపారు.

ఏడీబీ నిర్మించలేదు కానీ రుషికొండ కోటకు రూ.650 కోట్లు
రాజమండ్రి నుంచి కాకినాడ వైపు వచ్చే ఏడీబీ రోడ్డు నిర్మాణానికి రూ.390 కోట్ల ఖర్చు అవుతుంది. దీనివల్ల ఎందరికో మేలు జరుగుతుంది. ప్రయాణ సమయం తగ్గుతుంది. ఈ పనులను వదిలేసి రూ.650 కోట్లు ఖర్చు చేసి రుషికొండలో కోటను నిర్మించారు. ఏడీబీ రోడ్డు సమస్యను పరిష్కరించేలా చొరవ తీసుకుంటాం. శేషాచలం నుంచి తరలిస్తుండగా కర్ణాటక పోలీసులు రూ.140 కోట్ల విలువైన ఎర్రచందనం పట్టుకున్నారు. కనీసం దానిని రాష్ట్రానికి తీసుకొచ్చే చర్యలు గత ప్రభుత్వంలో చేపట్టలేదు. దానిని తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇక జల్‌జీవన్‌ మిషన్‌ నిధుల్లో అపారమైన అవినీతి జరిగిం దని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి జేబులో వేసుకున్న వారిపై కచ్చితంగా చర్యలు ఉంటాయని చెప్పారు.

యువతకు రాజకీయ అవకాశాలు
ఇస్రో తన సిద్ధాంతాల్లో ఎప్పటికప్పుడు కొత్త నాయకత్వాన్ని తయారు చేయడం ఆనందం కలిగింది. రాజకీయాల్లోనూ కొత్త నాయకత్వం రావాలి. భవిష్యత్‌ తరానికి నాయకులను తయారు చేసే బాధ్యతను ఇప్పటి నాయకత్వం తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్‌ శ్రీనివాస్‌, ఎమ్మెల్యేలు వనమాడి కొండబాబు, పంతం నానాజీ, కలెక్టర్‌ షాన్‌మోహన్‌ సగిలి, ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ తదితరులు పాల్గొన్నారు.

Previous Post

ఎన్టీఆర్‌ ఆశయాలు, బాబు ఆలోచనలతో అభివృద్ధి పథం

Next Post

అర్థవంతమైన చర్చలతోనే చట్టసభలకు గౌరవం

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 15-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 15-05-2026

కార్యకర్త
@ May 15, 2026
కేడర్‌ను గుండెల్లో పెట్టుకోవాల్సింది ఎమ్మెల్యేనే!
ఆంధ్రప్రదేశ్

కేడర్‌ను గుండెల్లో పెట్టుకోవాల్సింది ఎమ్మెల్యేనే!

చైతన్యరధం
@ May 15, 2026
ఖనిజాలకు విలువ జోడింపుతో అదనపు ఆదాయం
ఆంధ్రప్రదేశ్

ఖనిజాలకు విలువ జోడింపుతో అదనపు ఆదాయం

చైతన్యరధం
@ May 15, 2026
ఆర్డీటీ.. మనందరి సంస్థ
ఆంధ్రప్రదేశ్

ఆర్డీటీ.. మనందరి సంస్థ

చైతన్యరధం
@ May 15, 2026
చైతన్యరధం ఈ పేపర్ 14-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 14-05-2026

కార్యకర్త
@ May 14, 2026
చైతన్యరధం ఈ పేపర్ 13-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 13-05-2026

కార్యకర్త
@ May 13, 2026
ఈ టేకాఫ్‌ను ఊహించగలరా?
ఆంధ్రప్రదేశ్

ఈ టేకాఫ్‌ను ఊహించగలరా?

చైతన్యరధం
@ May 13, 2026
ప్రతీ కుటుంబానికి సంక్షేమం
ఆంధ్రప్రదేశ్

ప్రతీ కుటుంబానికి సంక్షేమం

చైతన్యరధం
@ May 13, 2026
Load More

ముఖ్య వార్తలు

కేడర్‌ను గుండెల్లో పెట్టుకోవాల్సింది ఎమ్మెల్యేనే!

కేడర్‌ను గుండెల్లో పెట్టుకోవాల్సింది ఎమ్మెల్యేనే!

చైతన్యరధం
@ May 15, 2026
ఖనిజాలకు విలువ జోడింపుతో అదనపు ఆదాయం

ఖనిజాలకు విలువ జోడింపుతో అదనపు ఆదాయం

చైతన్యరధం
@ May 15, 2026
ప్రతీ కుటుంబానికి సంక్షేమం

ప్రతీ కుటుంబానికి సంక్షేమం

చైతన్యరధం
@ May 13, 2026

ఉత్తమ పాలసీలతోనే ఏపీకి పెట్టుబడులు

చైతన్యరధం
@ May 12, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

కేడర్‌ను గుండెల్లో పెట్టుకోవాల్సింది ఎమ్మెల్యేనే!

కేడర్‌ను గుండెల్లో పెట్టుకోవాల్సింది ఎమ్మెల్యేనే!

చైతన్యరధం
@ May 15, 2026
ఖనిజాలకు విలువ జోడింపుతో అదనపు ఆదాయం

ఖనిజాలకు విలువ జోడింపుతో అదనపు ఆదాయం

చైతన్యరధం
@ May 15, 2026
ఆర్డీటీ.. మనందరి సంస్థ

ఆర్డీటీ.. మనందరి సంస్థ

చైతన్యరధం
@ May 15, 2026
ఈ టేకాఫ్‌ను ఊహించగలరా?

ఈ టేకాఫ్‌ను ఊహించగలరా?

చైతన్యరధం
@ May 13, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist